ఏపీలో ఒంటరిగానే పోటీచేస్తామన్న కాంగ్రెస్ ప్రకటనతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట. తమ ఓటుబ్యాంకును కాంగ్రెస్ కొల్లగొడుతుందని అంచనా వేస్తూ కలవరపడుతున్నారట. ఏ మేరకు ఓట్లు చీలుతాయోనని లెక్కలు వేస్తున్నారట. ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఓటుబ్యాంక్ గతంలో కాంగ్రెస్ పార్టీది కావడమే ఈ పరిణామానికి కారణం. రాష్ట్ర విభజన విషయంలో ఏపీ ప్రజలు కాంగ్రెస్‌పార్టీపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. తమ మనోభావాలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించారన్న కసిని గత ఎన్నికల్లో ఓట్లరూపంలో చూపించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక్కరంటే ఒక్కరిని కూడా చట్టసభలకు పంపలేదు. అసలు రాష్ట్రంలో చాలాచోట్ల హస్తంపార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇదే సమయంలో వైసీపీకి కాంగ్రెస్ నుంచి గణనీయంగా ఓటుబ్యాంక్ బదిలీ అయింది.

ysr 09022019

నాలుగేళ్లు తిరిగే సరికి సీన్‌ మారిపోయింది. టీడీపీ, బీజేపీల మధ్య మైత్రీబంధం తెగిపోయింది. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చంద్రబాబు వ్యూహం మార్చారు. కాంగ్రెస్‌కి దగ్గరయ్యారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారు. అయితే ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో కూడా టీడీపీ- కాంగ్రెస్‌పార్టీల పొత్తు కొనసాగుతుందనీ, అదే జరిగితే తాము లాభపడతామనీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తూ వచ్చారు. కానీ ఏపీలో ఒంటరిగానే పోటీచేస్తామని కాంగ్రెస్‌పార్టీ తాజాగా ప్రకటించింది. దీంతో వైకాపా నేతలు, కార్యకర్తలు డీలాపడ్డారు. ఇదిలా ఉంటే, తాము అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలు కూడా అమలుచేస్తామని రాహుల్ పునరుద్ఘాటించారు.

ysr 09022019

దీంతో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల తమ ఓటుబ్యాంకుకి గండి పడుతుందని విశాఖ వైసీపీ నేతలు భయపడిపోతున్నారు. కాంగ్రెస్‌లో జరిగే పరిణామాలు వైసీపీ వారిని తెగ కలవరపెడుతున్నాయి. తాజాగా ప్రియాంకగాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ పరిణామం హస్తంపార్టీకి కలిసివస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ విభజనను గతంలో ఇందిరాగాంధీ వ్యతిరేకించారు. అందుకే ఇందిర పట్ల ఏపీ ప్రజల గుండెల్లో ఎంతో ప్రేమ గూడుకట్టుకుంది. అచ్చం నాయనమ్మ పోలికలతో ఉండే ప్రియాంక రాజకీయాల్లోకి రావడాన్ని ఏపీలో కాంగ్రెస్ శ్రేణులు సహా అభిమానులంతా నిండు మనసుతో స్వాగతిస్తున్నారు. ఇదే సమయంలో.. ఎన్నికల ప్రచారం కోసం ఏపీలో ప్రియాంక పర్యటిస్తే తమ ఓటుబ్యాంక్‌పై ప్రభావం పడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళల ఓట్లకు గండిపడుతుందనే భావన వారిలో బలంగా ఉంది. చూద్దాం ఈ పరిణామాలు అంతిమంగా ఎవరికి ప్రయోజనం చేకూరుస్తాయో!

దశాబ్ద కాలం నాటి ఎదురుచూపులకు తెరపడింది. జీతాల కోసం పడిగాపులకు కాలం చెల్లింది. పన్ను వసూళ్ల కోసం కాచుక్కూర్చునే రోజులకు తెర పడింది. ఏటా రూ.130 కోట్ల జీతాల చెల్లింపులతో పాటు ఆదాయ మార్గాలను అభివృద్ధికి మరల్చలేక నిస్సత్తువుగా చూస్తోన్న వీఎంసీకి మంత్రి మండలి నిర్ణయం రూపంలో శుభవార్త వచ్చింది. సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో వీఎంసీతో పాటు గ్రేటర్‌ విశాఖపట్టణానికి కూడా 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు ప్రక్రియకు ఆమోదం తెలుపుతూ నిర్ణయించారు. వారంలో అధికారిక ఉత్తర్వులను ట్రెజరీకి ఇచ్చి ఏప్రిల్‌ నుంచి జీతాల చెల్లింపునకు రంగం సిద్ధమవుతోంది. దీంతో వీఎంసీలోని 3,732 మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు.

vij 09022019

అధికారంలోకి వచ్చింది మొదలు మేయర్‌ కోనేరు శ్రీధర్‌ 010 కోసం విశ్వ ప్రయత్నం చేశారు. గత రెండు కౌన్సిల్‌ సమావేశాల్లో ఆయన 010 పద్దుపై ధీమా వ్యక్తం చేశారు. దీనిపై విశ్వసించని వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో 010 అంశాన్ని పొందుపరచలేదని, అమలు అసాధ్యమని మాట్లాడారు. వారికి సమాధానమిస్తూ మంత్రి మండలి వీఎంసీకి 010 పద్దును అమలుచేయడాన్ని తీర్మానిస్తూ నిర్ణయించింది. ప్రతి నెలా వచ్చే జీతాలే తప్ప డీఏ అరియర్స్‌, పీఆర్సీ (పాతవి, కొత్తవి), సరెండర్‌ లీవ్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ వంటి భత్యాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో వీఎంసీకి పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.180 కోట్లు, నెట్‌ భత్యాలు రూ.48కోట్ల 79లక్షలకు పైగా ఉండగా, రికవరీలు రూ.7కోట్ల 92వేలకు పైగా ఉన్నాయి.

vij 09022019

గ్రాస్‌ను చూస్తే రూ.56కోట్లకు పైమాటే అందుకోవాల్సి ఉంది. వాటితో పాటు ఏటా చెల్లించే రూ.130కోట్ల జీతాలు అదనం. ఈ పద్దు ఆమోదంతో ఆయా ఆదాయాలన్నీ నగరాభివృద్ధికి మరల్చే అవకాశముంది. మేయర్ మాట్లాడుతూ "ఆనందంలో మాటలు రావడంలేదు. నా హయాంలో సాధించాను అని గర్వంగా చెప్పుకునే అంశాల్లో 010 పద్దు ఓ ఆణిముత్యం. అసాధ్యమన్న పదాన్ని సుసాధ్యం చేసి వీఎంసీకి 010 పద్దును అమలుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి ధన్యవాదాలు. ఇది కచ్చితంగా టీడీపీ విజయం. బడ్జెట్లో పొందుపరచలేదని, అమలు అసాధ్యమని అన్న వారి మాటలకు మంత్రి మండలి నిర్ణయమే సమాధానం."

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాని పర్యటించనున్న గుంటూరు నియోజకవర్గంలో నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోదీ ఏపీలో అడుగు పెట్టవద్దని తెదేపా నేతలు స్పష్టం చేశారు. మోదీని ప్రజలు స్వాగతించరని తెలుగు యువత నేతలు ఆగ్రం వ్యక్తంచేశారు. విజయవాడ లెనిన్‌ కూడలిలో వామపక్ష నేతలు నిరసనకు దిగారు.

moidi 09022019 2

రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ రాష్ట్ర పర్యటనకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మోదీ పర్యటనను అడ్డుకుని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. మోదీ పర్యటనను నిరసిస్తూ కడప జిల్లాలో మట్టి, నీళ్ల కుండలతో వామపక్షాలు వినూత్నంగా నిరసన తెలిపాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో తెదేపా, వామపక్షాల నేతలు కలిసి ఆందోళనలు చేపట్టారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై పెద్ద ఎత్తున మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి మోదీ పర్యటన పట్ల శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

moidi 09022019 3

మరో పక్క, ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారనే సమాచారం నేపథ్యంలో ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక నిరసనకు పూనుకుంది. గో బ్యాక్ మోదీ అంటూ యూనివర్శిటీ పరిపాలన భవనం ముందు అన్ని పార్టీల విద్యార్థినీ, విద్యార్థులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల ముందు ఎస్వీ యూనివర్శిటీ క్రీడా మైదానంలో జరిగిన సభలో శ్రీవారి పాదాల సాక్షిగా ఇచ్చిన మాటను తప్పిన మోదీ.. ఎలా మళ్లీ ఏపీకి వస్తారని ప్రశ్నించారు. తమ నిరసనను శనివారం నుంచి విన్నూత్న రీతిలో కొనసాగిస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

కడప జిల్లాలో వైరి వర్గాల మధ్య రాజీ కుదిర్చే దిశగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అనుసరించిన వ్యూహం ఫలించింది. తదనుగుణంగా కడప ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మార్కెటింగ్‌ మంత్రి ఆదినారాయణరెడ్డి.. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. చంద్రబాబు ప్రతిపాదించిన రాజీ ఫార్ములాకు వీరిద్దరూ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి రామసుబ్బారెడ్డి అంగీకరించారు. ఆ ప్రకారం ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయంలో అందజేశారు.

cbnvuham 09022019

ఆయన రాజీనామా వల్ల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆదినారాయణరెడ్డి వర్గానికి ఇవ్వనున్నారు. ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు సుబ్బరామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు ఎంపీ స్థానానికి పోటీ చేస్తే వారి అనుచరులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగే కోరుకుని దానికి బదులుగా తన ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసి తన ఆమోదం తెలిపారు. ఏ సమస్య వచ్చినా తానున్నానని చంద్రబాబు ఆయనకు భరోసా ఇచ్చారు.

cbnvuham 09022019

ఆదినారాయణరెడ్డి కూడా సీఎంను కలిశారు. కడప ఎంపీ సీటును ఈసారి టీడీపీ గెలవాలని, దానికి అవసరమైన వ్యూహ రచనతో ముందుకెళ్లాలని ఆయనకు చంద్రబాబు సూచించారు. అనంతరం ఆది, రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... జిల్లాలో టీడీపీ గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. అదే జరిగితే టీడీపీకి తిరుగుండదని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. పులివెందులలో వైసీపీకి వచ్చే మెజారిటీని జమ్మలమడుగులో సమానం చేయగలిగితే కడప ఎంపీ సీటును గెలుచుకోవచ్చన్నది టీడీపీ వ్యూహం.

Advertisements

Latest Articles

Most Read