వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఓ సిద్ధాంతం అనేదే లేదని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. పింఛన్లపై జగన్ ప్రకటనను తెదేపా నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో జగన్‌కు దిక్కుతోచడం లేదన్నారు. ప్రభుత్వం వృద్ధాప్య పింఛను రూ.2 వేలు ఇస్తుంటే.. తాను రూ.3వేలు ఇస్తానంటూ జగన్ ప్రకటించారని మండిపడ్డారు. ఈనెల 11వ తేదీన దిల్లీలో ధర్మపోరాట దీక్ష పెద్ద ఎత్తున చేస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి దీనికి మద్దతు పలకాలన్నారు. 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి నిరసన తెలుపుదామన్నారు.

cbn 07022019

సమష్టి కృషి తో ఎన్నో విజయాలు అందుకున్నామని, ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సాధించాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 80శాతం ఓటు బ్యాంకు సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్ల బందరు పోర్టు కల నేడు సాకారం చేస్తున్నట్లు సీఎం వివరించారు. అన్న వస్తున్నాడంటూ వైకాపా చేస్తోన్న ప్రచారంపై టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ప్రస్తావించారు. నేరస్థుడైన జగన్‌ను మహిళలు అన్నగా అంగీకరించరని ఆయన విమర్శించారు. నేరస్థుడు ఎలా ఉండాలో తెలుసు కానీ.. అన్నగా ఎలా ఉండాలో జగన్‌కు తెలుసా? చంద్రబాబు వ్యాఖ్యానించారు. మైలవరం నియోజకవర్గంలో ఎస్ఐలకు డబ్బులిస్తూ వైసీపీ నేతలు పట్టుపడ్డారన్నారు.

cbn 07022019

వైసీపీ నేతలు ఈ తరహా ప్రలోభాలకు గురి చేసేందుకు సిద్ధమవుతారని, వీరి వ్యవహరంపై నిఘా పెట్టాలని నేతలకు ఆయన సూచించారు. ప్రతి వర్గాన్ని ఆదుకునేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షం ఎన్ని ప్రకటనలు చేసినా ఇబ్బందేం ఉండదని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్ధంగా తీసుకెళ్లాలని సూచించారు. పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీనే కాకుండా.. చెక్కులు బ్యాంకుల్లో వేస్తే డబ్బులు ఇప్పించే బాధ్యతనూ నేతలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల ఊసే లేదని, బడ్జెట్‌లో రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకోలేదని ఎంపీ గల్లా జయదేవ్‌ ధ్వజమెత్తారు. ఏపీకిచ్చిన హామీలు, నెరవేర్చిన వాటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిందని జయదేవ్‌ అన్నారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కచ్చితత్వం, జవాబుదారీతనం లోపించిందని ఎద్దేవాచేశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని 29 అంశాల్లో ఏపీకి న్యాయం జరగలేదన్నారు.

galla 07022019

దిల్లీని మించి రాజధాని కడతామని శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోదీ చెప్పారని, తిరుపతి, నెల్లూరు సభల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. రైతులను ఆదుకుంటామంటూ చెప్పి రోజుకు రూ.17 ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని గల్లా విమర్శించారు. ఈ నాలుగేళ్లలో ఏపీలో సీఎం చంద్రబాబు రైతుల ఆదాయం రెట్టింపు చేశారన్నారు. రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. జీఎస్టీ, నోట్ల రద్దుతో ఉన్న ఉద్యోగాలను పోగొట్టారని అన్నారు. ఐదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చివరి బడ్జెట్‌లో ఏవో తాయిలాలు ప్రకటించారని విమర్శించారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు.

galla 07022019

రోజుకు రూ. 17 ఇవ్వడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులను అవమానించారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ విమర్శించారు. గురువారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో ఏపీ విభజన హామీల గురించి ఊసే లేదని ఆరోపించారు. ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. కానీ ఉన్నవి ఊడగొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు తిరుపతి, నెల్లూరు సభల్లో ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని గల్లా జయదేవ్‌ అన్నారు. ఢిల్లీని మించిన రాజధాని కడతామని చెప్పి.. పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, పద్దతి లేని జీఎస్టీ కారణంగా మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని జయదేవ్ అభిప్రాయపడ్డారు.దేశ ఆర్థిక వ్యవస్థకు లైఫ్ సర్జరీ చేయాల్సిన సమయంలో కేంద్రం బ్యాండ్ ఎయిడ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు.

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మంగ‌ళ‌గిరి అభివృద్ధి సోపానంలో మ‌రో మ‌ణిహారం చేరింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న సంస్థ (ఏపీఐఐసీ) మంగ‌ళ‌గిరిలో ఏపీఐఐసీ ట‌వ‌ర్స్ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల్లో ట‌వ‌ర్‌-1ప్రారంభానికి సిద్ధ‌మైంది. అత్యంత ఎత్తైన బ‌హుళ అంత‌స్తులు క‌లిగిన ఈ ట‌వ‌ర్స్ మంగ‌ళ‌గిరికే త‌ల‌మానికంగా నిలుస్తోంది. 2.26 ఎక‌రాల విస్తీర్ణంలో రూ.110 కోట్ల వ్య‌యంతో 11 అంత‌స్తుల స‌ర్వాంగ సుంద‌ర‌మైన భ‌వ‌నాన్ని అనేక ప్ర‌త్యేక‌త‌ల మేళ‌వింపుతో ఏపీఐఐసీ ఈ ట‌వ‌ర్స్‌ను అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసింది. పారిశ్రామిక విభాగాల‌న్నీ ఒకే చోట‌... మంగ‌ళగిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌-1 భ‌వ‌నం నిర్మాణం పూర్తి కావ‌డంతో ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డుల విభాగాల‌కు సంబంధించిన కార్యాల‌యాల‌న్నీ ఒకే గొడుకు కింద‌కు రానున్నాయి.

apiic 07022019 1

ఇప్ప‌టిర‌కు ఈ విభాగాల కార్యాల‌యాల‌కు సొంత భ‌వ‌నాలు లేక విజ‌య‌వాడ‌లో ప‌లు ప్రాంతాల్లో ఉండేవి. ఇప్పుడు ఏపీఐఐసీ ట‌వ‌ర్స్ - భ‌వ‌నం పూర్తి కావ‌డంతో ఇవ‌న్నీ ఈ భ‌వ‌నంలోకి మార‌నున్నాయి. దీనివ‌ల్ల ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి, పెట్ట‌బడుల‌కు సంబంధించి అన్ని కార్యాల‌యాలు ఒకే చోట ఉండ‌టంతో ప్ర‌జ‌ల‌కు ఎంతో సౌల‌భ్యం క‌ల‌గ‌నుంది. పెట్టుబుడులు పెట్ట‌డానికి ముందుకు వ‌చ్చేవారికి స‌ర్వేస‌మ‌స్త స‌మాచారం ఈ కార్యాల‌యంలో ల‌భించేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఏపీఐఐసీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ క‌మిష‌న‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థికాభివృద్ధి మండ‌లి (ఏపీఈడీబీ), ఏపీఐడీసీ మ‌రియు ఏపీ ఫైబ‌ర్‌నెట్ సంస్థ కార్యాల‌యాలు కూడా ఇందులో కొలువుదీర‌నున్నాయి.

apiic 07022019 1

దీంతో పాటు ఈ భ‌వ‌నంలో ఐఓటీ ఎగ్జిబిష‌న్ కేంద్రాన్ని కూడా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకొచ్చేవారి కోసం స‌ర్వే స‌మ‌స్త స‌మాచారం క్ష‌ణాల్లో ల‌భించేలా ఒక అంత‌స్తు మొత్తం దీనికే కేటాయించారు. ఈ అంత‌స్తులోకి అడుగు పెట్ట‌గానే రాష్ట్రంలో పెట్ట‌బుడులు పెట్ట‌డానికి ఎలాంటి అనుకూల వాతావ‌ర‌ణం ఉంది, పెట్ట‌బుడుల ప్ర‌గ‌తి ఎలా ఉంది త‌దిత‌ర అనేక అంశాలు సంద‌ర్శ‌కుల‌కు తెలిసేలా అత్యాధునిక సాంకేతిక‌త‌ల మేళ‌వింపుతో ఏర్పాటు చేశారు. ఈ 11 అంత‌స్థుల భ‌వంతిలో ప్ర‌తి అంత‌స్తులోనూ ప్ర‌త్యేక‌త‌లు మేళ‌వించేలా నిర్మాణం చేప‌ట్టారు. ఏపీఐఐసీ మంగ‌ళ‌గిరిలో నూత‌నంగా నిర్మించిన ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌-1 భ‌వంతిని రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడుగారు శుక్ర‌వారం ప్రారంభించ‌నున్నారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం 3.00 గంట‌ల‌కు ఈ భ‌వ‌నం ప్రాంగ‌ణంలో భ‌వ‌న ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు.

ఇటీవల పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇవ్వనుందా? వారికి బహూకరించిన పతకాలను సైతం వెనక్కి తీసుకోనుందా? అవుననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు... సీబీఐ విచారణ పేరుతో కేంద్రం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందటూ మూడురోజుల పాటు సీఎం మమత కోల్‌కతా వేదికగా భారీ ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాలో పశ్చిమ బెంగాల్ డీజీపీ వీరేంద్ర సహా పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.

modi 07022019

యూనీఫామ్‌ సర్వీసుల్లో సేవలు అందిస్తున్న అధికారులు ఓ రాజకీయ పార్టీ నిర్వహించే ధర్నాలో పాల్గొనడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.. మమత ధర్నాలో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. సదరు ఐపీఎస్ అధికారులకు ప్రదానం చేసిన పతకాలను ఉపసంహరించుకోవడంతో పాటు కేంద్ర డిప్యూటేషన్ నుంచి కూడా వీరిని దూరంపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.

modi 07022019

పశ్చిమ బెంగాల్ డీజీపీ వీరేంద్రతో పాటు వినీత్ కుమార్ గోయల్ (ఏడీజీ, డైరెక్టర్, సెక్యూరిటీ), అనూజ్ శర్మ (ఏడీజీ లా అండ్ ఆర్డర్), గ్యాన్‌వంత్ సింగ్ (సీపీ, విధాన్ నగర్), సుప్రతిమ్ సర్కార్ (సీపీ) తదితరులపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్టు వినిపిస్తోంది. కాగా కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్ అఖిల భారత సర్వీసు (ప్రవర్తనావళి) నిబంధనలు ఉల్లంఘించారనీ.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఇంతకు ముందే లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. అయితే కేంద్రం నుంచి తనకు ఎలాంటి అభ్యర్థన రాలేదంటూ సీఎం మమత తోసిపుచ్చారు. చిట్‌ఫండ్ కుంభకోణం కేసుల్లో సిట్ బృందానికి సారథ్యం వహిస్తున్న సీపీ... కీలక సాక్ష్యాధారాలు మాయం చేశారని సీబీఐ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే..

 

 

Advertisements

Latest Articles

Most Read