మన రాష్ట్రానికి జరిగిన అన్ని అవమానాలకంటే, ఇది ఎంతో దారుణమైనది. డబ్బులు మన ఎకౌంటులో వేసి మరీ వెనక్కు తీసుకున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని ఈ సంఘటన గురించి, చంద్రబాబు నేషనల్ మీడియాతో చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వెనుకబడిన జిల్లాలకు రావలసిన 350 కోట్ల నిధులు గురించి పార్లమెంట్ లో నిలదీశారు తెలుగుదేశం ఎంపీలు. వెనుకబడిన జిల్లాల కోసం గతంలో విడుదల చేసిన రూ.350 కోట్లకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు రాలేదని, అందుకే ఆ సొమ్మును వెనక్కు తీసుకున్నామని కేంద్రం చెప్తుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా 350 కోట్లు ఇవ్వటం లేదు. ఇప్పటికి 700 కోట్లు బాకీ పడింది కేంద్రం.

గత సంవత్సరం ఫిబ్రవరి 4 నుంచి మన ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన మొదలు పెట్టారు... మోడీ పై తిరుగుబాటుకి అదే నాంది. ఫిబ్రవరి 9న వెనుకబడిన ప్రాంతాలకి, కేంద్రం 350 కోట్లు ఇచ్చింది... ఇది తెలుసుకున్న ప్రధాని కార్యాలయం, ఫిబ్రవరి 15న RBIతో చెప్పి, వేసిన డబ్బులు వెనక్కు తీసుకున్నారు... ఇలా డబ్బులు వేసి మరీ, వెనక్కు తీసుకోవటం ఎక్కడన్నా చూసారా ? ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది... అయితే మోడీ ఈ డబ్బులు ఇవ్వకపోవటంతో, మన రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల్లో పనులు ఆగిపోకుండా, చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్నారు.

మన విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన హక్కు, మోడీ ఇవ్వకపోయినా, చంద్రబాబు మాత్రం చూస్తూ కూర్చోలేదు. వెనుకబడిన 7 జిల్లాలకు 350 కోట్లు, రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చారు. ఆ జిల్లాలలో మొదలు పెట్టిన పనులు ఆగిపోకుండా, ఈ డబ్బులు ఇచ్చి, వెనుకబడిన 7 జిల్లాలకు సపోర్ట్ ఇచ్చారు. ఏడు వెనుకబడిన జిల్లాల్లో అయిదో ఏడాది పనులు చేపట్టేందుకు రూ.350 కోట్లకు రాష్ట్ర సర్కారు పరిపాలన పరమైన ఆమోదం ఇచ్చింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతోపాటు రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్కోదానికి రూ.50 కోట్లు చొప్పున పనులు చేపట్టేందుకు కలెక్టర్లు ఇచ్చిన కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా నిధులు మంజూరు చేసింది.

14వ ఆర్థికసంఘం నిర్దేశితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018-19 సంవత్సరంలో షరతులను పూర్తి చేయలేదని, అందువల్ల అదనపు రుణాలు పొందేందుకు ఏపీ ప్రభుత్వానికి అర్హత లేదని కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ ఈ విషయం వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం ఏపీ, తెలంగాణ రెండింటికీ జీఎస్డీపీలో మూడు శాతం మేరకు ఆర్థికలోటుకు పరిమితి విధించిందని పేర్కొన్నారు. అయితే, రుణ జీఎస్డీపీ నిష్పత్తి 25 శాతం దాటకుండా, వడ్డీ చెల్లింపులు-ఆదాయ వసూళ్ల నిష్పత్తి 10 శాతం మించకుండా ఉంటే ఈ ఆర్థికలోటు పరిమితిలో కూడా సడలించవచ్చని ఆర్థికసంఘం సిఫారసు చేసిందని తెలిపారు.

ap 06022019

ఈ ప్రాతిపదిక ప్రకారం తెలంగాణకు మాత్రమే రూ.2052 కోట్ల మేరకు అదనపు రుణాలు చేసేందుకు అర్హత లభించిందని స్పష్టం చేశారు. 2018-19లో జీఎస్డీపీలో 0.25 శాతానికి సమానంగా ఈ మొత్తం ఉంటుందని, అది మూడు శాతం సాధారణ పరిమితికి అదనంగా లభిస్తుందని ఆయన చెప్పారు. కాగా, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 0.5 శాతం పెంచాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని, కానీ షరతులు పూర్తిచేయనందున రాష్ట్రానికి అర్హత లేదన్నారు. అలాగే, ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఈఏపీల ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీని చెల్లించేందుకు రూ.15.81 కోట్లు విడుదల చేశామని మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానంగా చెప్పారు. కాగా, వెనుకబడిన జిల్లాల నిధులపై గల్లా జయదేవ్‌ ప్రశ్నించగా.. రూ.350 కోట్లు విడుదల చేసి, ప్రక్రియలో లోపాల వల్ల తిరిగి వెనక్కి తీసుకున్నామని హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ లోక్‌సభలో తెలిపారు.

 

ap 06022019

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లను విధానపరమైన లోపాలతోనే ఉపసంహరించుకున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ తెలిపారు. పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపుపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధులివ్వాలనే నిబంధన విభజన చట్టంలో ఉందని తెలిపారు. రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలకు ప్రత్యేకాభివృద్ధి ప్యాకేజీని బిల్లులో పొందుపర్చినట్లు నాటి ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించారని పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ సూచనల మేరకు 2014-15, 15-16 ఆర్థిక సంవత్సరాల్లో రూ.700 కోట్ల గ్రాంటు సహా ఆ ఏడు జిల్లాలకు మొత్తంగా రూ.2100 కోట్లు కేటాయించామని తెలిపారు.

‘పసుపు-కుంకుమ’ సొమ్ము మహిళల చేతికి చేరింది. సోమవారంతో మూడు రోజుల సంక్షేమ పండగ ఉత్సాహపూరిత వాతావరణంలో పూర్తి కాగా, తొలి విడత చెక్కులను డ్రా చేసుకొనే ప్రక్రియ ఆ వెంటనే మొదలయింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల డ్వాక్రా సంఘాలు తమకిచ్చిన చెక్‌లను డ్రా చేసుకున్నాయి. తొలివిడతలో ఒక్కో సభ్యురాలికి రూ.2,500చొప్పున ఆ సంఘంలో ఎంతమంది ఉంటే అంతమందికీ చెక్‌లు మారాయి. ఇప్పటికి 66,574 డ్వాక్రా సంఘాలు, అంటే సుమారుగా 6,65,740 మంది డ్వాక్రా మహిళల చేతికి సొమ్ము చేరింది. సంక్షేమ పండగలో భాగంగా ఈ మూడు రోజుల్లో ‘పసుపు-కుంకుమ’ కింద 94లక్షల మందికి, పింఛన్‌ పెంపు సొమ్ము లబ్ధిని 54లక్షల మందికి అందించారు. ఈ రెండు పథకాల్లోనూ లబ్ధి పొందినవారు 15.51 లక్షల మంది ఉన్నారు.

dwacra 05022019

అంటే, వీరందరికీ డబుల్‌ ధమాకా అందిందన్నమాట! ప్రభుత్వం ద్వారా ‘పసుపు-కుంకుమ’ అందుకున్నవారంతా తమకు అందించిన చెక్‌ల ద్వారా తొలుత తమ పొదుపు ఖాతాల్లోకి సొమ్మును తీసుకుని, అక్కడినుంచి వ్యక్తిగతంగా డ్రా చేసుకున్నారు. మొదటి విడత చెక్‌లను ఫిబ్రవరి ఒకటో తేదీ వేసి ఇచ్చారు. మొత్తం సుమారు 92లక్షల మంది మహిళలకు ఇచ్చిన తొలి విడత మొత్తానికి సరిపడా సొమ్మును ఆయా బ్యాంకు ఖాతాలకు అదే తేదీనాటికి ప్రభుత్వం జమ చేసేసింది. చెక్‌లు ఇచ్చిన అనంతరం ఆదివారం కావడంతో సోమవారం చెక్‌ల ద్వారా డబ్బు తీసుకోవడం పెద్దఎత్తున ప్రారంభమైంది. అదేవిధంగా మార్చి 8వ తేదీతో రెండోవిడతగా రూ.3,500, ఏప్రిల్‌ ఐదో తేదీ వేసి మూడో విడతగా రూ.4వేలు చొప్పున ఆయా సంఘాలకు చెక్‌లు ఇచ్చింది.

 

dwacra 05022019

వీటిని కూడా ఆయా తేదీలనాటికి మారేలా బ్యాంకుల్లో సొమ్ము జమచేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాగా, కొత్తగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేసుకున్నవారు, కొత్తగా ఆ సంఘాల్లోకి చేరినవారికి కూడా పసుపు-కుంకుమ చెక్‌లను ప్రభుత్వం సిద్ధం చేసింది. జనవరి 18 వరకు డ్వాక్రా సంఘాల్లో చేరినవారందరికీ ఈ లబ్ధిని వర్తింపచేయాలని నిర్ణయించారు. కొత్తగా చేరిన సంఘాలు 33,322 ఉన్నాయి. ఇందులో 2.95 లక్షల మంది మహిళలు సభ్యురాళ్లుగా ఉన్నారు. ఈ సంఘాలన్నింటికీ తొలి విడత పసుపు-కుంకుమ మొత్తాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ నెల 8న మండల సమాఖ్యల సమావేశంలో ఈ చెక్‌లను అందిస్తామని సెర్ప్‌ సీఈవో కృష్ణమోహన్‌ తెలిపారు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను జీవీఎల్ ను హెచ్చరించడానికో, బెదిరించడానికో తాను ఈ వ్యాఖ్యలు చేయడంలేదని, రాజకీయ నాయకుల నోటికి హద్దు, పద్దు ఉండాలంటూ, జీవీఎల్‌కు దేహశుద్ధి తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. జీవీఎల్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. జీవీఎల్ పిచ్చోడని.. ప్రధాని మోదీ పిచ్చోడు చేతికి రాయి ఇచ్చారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడానికే జీవీఎల్‌కు ఎంపీ పదవి ఇచ్చారని వెంకన్న విమర్శించారు. మొన్నటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే పిచ్చోళ్లు ఉన్నారని అనుకున్నామని, ఇప్పుడు బీజేపీలో కూడా ఉన్నారని ఆయన అన్నారు.

buddha 05022019

జీవీఎల్‌ను బెదిరించడానికో లేక హెచ్చరించడానికో కాదని.. నోటీకి హద్దు.. పద్దు ఉండాలని, బీజేపీ, వైసీపీ పార్టీలకు రోజులు దగ్గరపడ్డాయని బుద్దా వెంకన్న అన్నారు. ఎన్నికల సంఘం ముసుగులో కేసుల మాఫీ కోసమే వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన అని బుద్దా వెంకన్న అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఓట్ల తొలగింపు అనేది ఎన్నికల సంఘం పరిధిలోని అంశమన్నారు. ఓట్లు తొలగించేది ఎవరన్నది జగన్ కు తెలియకపోవడం దారుణమన్నారు. జగన్ కు పక్క రాష్ట్రం నుంచి వేల కోట్లు ముడుపుతు అందుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని జగన్ చూస్తున్నారన్నారు. ఎక్కడైనా 60 లక్షలు దొంగ ఓట్లు ఉంటాయా అంటూ ప్రశ్నించారు.

buddha 05022019

మరో పక్క, డ్వాక్రా మహిళలకు మూడు చెక్కులిచ్చేసి పండగ చేసుకోండని చంద్రబాబు అంటున్నారంటూ వైసీపీ నేత రోజా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటు కౌంటర్ ఇచ్చారు. రోజా ఎప్పుడైనా నిజం చెప్పారా? ఈ చెక్కులు తీసుకున్న వారెవరైనా చెల్లలేదని చెప్పారా? అని ప్రశ్నించారు. చెల్లని చెక్కులు ఇచ్చే అలవాటు రోజాకే ఉంది కనుక, ఈ చెక్కులు కూడా చెల్లనివని ఆమె అనుకుంటోందని సెటైర్లు విసిరారు. సినీ రంగంలో ఉన్నప్పుడు చెల్లని చెక్కులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసని రోజాపై ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read