దేశంలోనే ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని సంఘటన. ఇప్పటి వరకూ ఎక్కడా జరగని యుద్ధం! బెంగాల్‌ నడి వీధుల్లో కోల్‌కతా సిటీ పోలీసులు, సీబీఐ అధికారులు ఘర్షణ పడ్డారు. బాహాబాహీ తలపడ్డారు. సీబీఐ అధికారులను కోల్‌కతా సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు జీపుల్లో ఎత్తి పడేశారు. జీపులు ఎక్కడానికి నిరాకరిస్తే లోపలికి తోసేశారు. పోలీసు స్టేషన్లకు తరలించారు. కోల్‌కతాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న హైటెన్షన్‌ హైడ్రామా ఇది. దీని పై చంద్రబాబు స్పందించారు. రాష్ట్రాల్లోని రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాల ద్వయం రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కోల్‌కతా ఘటనే దీనికి తాజా నిదర్శనమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇలా చేస్తుండటం దేశంలో విపరిణామాలకు దారితీస్తుందన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విటర్‌లో స్పందించారు.

cbn tweet 04022019 1

‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడుతున్న సందర్భంలో మోదీ నేతృత్వంలోని భాజపా గెలుపుపై అన్ని ఆశలను కోల్పోయింది. అందుకే రాజ్యాంగ బద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులను తారస్థాయికి చేర్చింది. రాజ్యాంగాన్ని, దాని స్ఫూర్తిని, దేశంలో సమాఖ్య వ్యవస్థను కాపాడేందుకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి వెన్నంటే మేముంటాం’’ అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. అంతకు ముందు కోల్‌కతాలో సీబీఐ అధికారులు అక్కడి పోలీసులకు మధ్య నెలకొన్న వివాద ఘటనపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చంద్రబాబు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ఆమెకు సంఘీభావం ప్రకటించారు.

cbn tweet 04022019 1

దేశంలో బీజేపీ ఆశలు సన్నగిల్లటం ప్రారంభమయ్యాయని చెప్పారు. కేంద్ర సంస్థలతో రాష్ట్రాలను భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం చర్యలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రాజకీయ ప్రత్యర్థులను వేధించడం సరికాదని సూచించారు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశంలో ఇలాంటి పరిస్థితులు అశాంతి సృష్టిస్తాయని వెల్లడించారు. మమతా బెనర్జీకి అండగా ఉంటామని, సమాఖ్య స్ఫూర్తి, రాజ్యాంగాన్ని రక్షించేందుకు మద్దతు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ, షా ద్వయం వ్యవస్థలను ధ్వంసం చేస్తుందనేందుకు కోల్‌కతా పరిణామాలే నిదర్శనమని ఆయన మండిపడ్డారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏకమవుతున్నాయని చంద్రబాబు అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అద్యక్షుడు అమిత్ షాల పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కన్నా దయనీయంగా పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు ఆదేశాలిచ్చి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు శారద చిట్ ఫండ్ కుంభకోణంలో సంబంధించి ఆయనను ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐ అధికారులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో మమత మీడియాతో మాట్లాడారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సీబీఐకి ఆదేశాలిచ్చి, పశ్చిమ బెంగాల్‌కు పంపించారన్నారు.

mamata 04022019

పోలీసులపై చర్యలకు తెగబడటం దారుణమన్నారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇది రాజ్యాంగం పై దాడి అని పేర్కొన్నారు. తాను రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తక్షణమే ధర్నా చేస్తానని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌ను ధర్నా ప్రదేశం నుంచే ప్రవేశపెడతానని చెప్పారు. రాజీవ్ కుమార్ నివాసం నుంచి మమత బెనర్జీ మీడియాతో మాట్లాడారు, ఆయనను గట్టిగా సమర్థించారు. తనకు బాబా సాహెబ్ అంబేద్కర్‌ పై విశ్వాసం ఉందన్నారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసు దర్యాప్తు సమయంలో కీలక ఆధారాలను కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ మాయం చేశారని సీబీఐ ఆరోపిస్తోంది.

 

mamata 04022019

చిట్‌ఫండ్‌ స్కామ్‌ల కేసుల్లో విచారించడానికి ఏకంగా 40 మందికిపైగా సీబీఐ అధికారులు ఆదివారం కోల్‌కతాలోని రాజీవ్‌ కుమార్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా కొనసాగింది. సీబీఐ అధికారులను సీపీ ఇంటి వద్ద ఉన్న సెంట్రీలు అడ్డుకున్నారు. వారిని లోపలికి వెళ్లనివ్వలేదు. అంతలోనే, వివిధ పోలీసు స్టేషన్ల నుంచి సీనియర్‌ పోలీసు అధికారులు పెద్దఎత్తున తరలి వచ్చారు. వారంట్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. సీపీని విచారించడానికి మీ వద్ద ఉన్న కాగితాలు ఏమిటని నిలదీశారు. సీబీఐ అధికారులు ఎటువంటి వారంట్లు చూపించలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు, సిటీ పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ముఖాముఖి తలపడ్డారు. కొంతమంది సీబీఐ అధికారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పార్క్‌ స్ట్రీట్‌, షేక్‌ స్పియర్‌ పోలీసు స్టేషన్లకు తరలించారు.

ప్రతి ఆక్షన్ కి, ఒక రియాక్షన్ ఉంటుంది.. మనది ఫెడరల్ దేశం... కేంద్రానికి ఏ అధికారాలు ఉంటాయో, రాష్ట్రానికి అవే అధికారాలు ఉంటాయి. నాకు నచ్చలేదు అంటూ కేంద్రం వచ్చి, రాష్ట్రం చేసే పరిపాలనలో వేలు పెట్టి, ఇబ్బంది పెడితే, అది రాష్ట్రాలకి, కేంద్రానికి ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తుంది. ముఖ్యమంత్రిగా పని చేసిన మోడీ గారికి, ఇవన్నీ తెలిసి కూడా, అవే ఆటలు ఆడుతున్నారు. అయితే, చంద్రబాబు, మమత లాంటి నేతలు, తీవ్రంగా మోడీని ప్రతిఘటిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో హై డ్రామా నడుస్తోంది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ప్రమేయముందన్న ఆరోపణలపై కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన సీబీఐ అధికారులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

cbi 03022019

సీబీఐ కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు, సీబీఐ మధ్య ఇటువంటి ఘర్షణ వాతావరణం నెలకొనడం బహుశా ఇదే ప్రథమం. సీబీఐ అధికారులను ఉంచిన పోలీస్ స్టేషన్ తలుపులను మూసివేశారు. మీడియాను కూడా అనుమతించడం లేదు. ఓ సీబీఐ ఉన్నతాధికారిని పోలీసులు బలంగా లాక్కొని వెళ్ళారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఈ సీబీఐ అధికారులు వచ్చారు. తమకు వారంట్ చూపించాలని పోలీసులు నిలదీశారు. అయితే రాజీవ్ కుమార్ తన నివాసంలో సీబీఐ అధికారులు పరిశీలించారు, కానీ వారికి ఆయన కనిపించలేదు. ఆయన గుర్తు తెలియని ప్రాంతానికి తరలిపోయినట్లు తెలుస్తోంది.

cbi 03022019

ముఖ్యమంత్రి మమత బెనర్జీ కీలక అధికారులు, మంత్రులతో ఆదివారం సాయంత్రం ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. సీబీఐ అధికార వర్గాల సమాచారం ప్రకారం ముగ్గురు సీబీఐ ఉన్నతాధికారులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిపై పోలీసులు కౌంటర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆదివారం ముగ్గురు సీబీఐ అధికారులను అరెస్టు చేయడంతో సీబీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినట్లు చెప్తూ జోక్యం చేసుకోవాలని కోరేందుకు గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలవబోతున్నట్లు సమాచారం.

వైసీపీ నేత, జగన్ ప్రియ శిష్యుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని , ఈ రోజు మహిళలు నిజంగానే కొట్టారా ? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా ? జరుగుతున్న పనులు చూస్తుంటే, నిజంగా మహిళలు కొట్టే ఉంటారానే అభిప్రాయం జరుగుతుంది. నిన్న కూడా మహిళలకు ఇచ్చే పసుపు-కుంకుమ చెక్కులు అడ్డుకుని, నానా రచ్చ చేసారు. అయితే నిన్నే ఈ దెబ్బలు పడాల్సింది, అక్కడ మహిళలకు మంచి వాళ్ళు కాబట్టి వదిలేసారు. అయితే ఈ రోజు కూడా చెవిరెడ్డి పై దాడి జరిగింది. సోషల్ మీడియా మొత్తం, మహిళలే దాడి చేసారని, వారికి ఇచ్చే పసుపు -కుంకుమ అడ్డుకుంటే, ఇలాగే వారి రియాక్షన్ ఉంటుంది అంటూ, సోషల్ మీడియా మొత్తం పోస్ట్లు పడుతున్నాయి. అయితే మహిళలు కొట్టారో, ఇంకా ఎవరైనా కొట్టారో, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి చెప్తే కాని తెలియదు. వివరాలు ఇలా ఉన్నాయి.

chevireddy 03022019

చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణం మండలం వేదాంతపురంలో నిర్వహించిన పింఛన్లు, పసుపు-కుంకుమ సాయం కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఈ రోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైకాపాకు చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి హాజరయ్యారు. జగన్ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ. 2000, దివ్యాంగులకు రూ. 3000 ఇస్తారని చెప్పారు. అక్కడే ఉన్న తెదేపా గ్రామీణ మండల అధ్యక్షుడు జనార్దన్‌ యాదవ్‌ కలగజేసుకొని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గురించి మాట్లాడకుండా వైకాపా గురించి మాట్లాడటం ఏమిటని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో స్థానికులు గో బ్యాక్‌ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు.

chevireddy 03022019

స్థానికులు వేదికను చుట్టుముట్టడంతో పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కలుగజేసుకొని నాపై దాడి చేయడానికి వస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వేదిక పక్కనే నిరసనకు దిగారు. దీంతో పోలీసులు అతన్ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో చెవిరెడ్డి కింద జారిపడి అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఎమ్మెల్యేను పోలీసు వాహనంలో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పింఛన్లు, పసుపు కుంకుమ సాయం పంపిణీ చేశారు. అయితే తోపులాట జరిగిన సమయంలో మహిళలు చితకొట్టారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది నిజమో కాదో, చెవిరెడ్డి చెప్తే కాని తెలియదు.

Advertisements

Latest Articles

Most Read