టీడీపీ అధినేత చంద్రబాబు తనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాలల్లో దూకుడు పెంచుతున్నారు. పెన్షన్‌ను రెట్టింపు చేశారు. మహిళలకు పదివేల రూపాయలిస్తున్నారు. రైతులకు నగదు బదిలీ చేస్తున్నారు. ఇలా సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూల ఓటుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబును ఓడించడానికి అన్ని శక్తులు ఏకమవుతున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్‌, జనసేనాని పవన్‌ను కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అందుకు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 25 సీట్ల కన్నా ఎక్కువ రానివ్వబోమన్న ఛాలెంజ్ చేస్తున్నారు. పదేపదే చంద్రబాబు మళ్లీ సీఎం కాకూదని కోరుకుంటున్న బీజేపీ.. ఈ విషయంలో ముందడుగు వేస్తోన్నట్లు తెలుస్తోంది. పవన్, జగన్ కలిస్తే ఓట్ల లెక్కల ప్రకారం టీడీపీకి ఇబ్బంది కలుగుతుందనే అంచనాలున్నాయి.

jagan 02022019

2014లో పవన్, చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు. 2017 వరకు ఇలాగే ఉన్నారు. అయితే 2018లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పవన్, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత ఎన్నికల నాటికి ఈ ఎన్నికల నాటికి స్పష్టమైన మార్పున్నట్లే లెక్క. అది టీడీపీని ఓడించడానికి సరిపోతుందని, ఆ పార్టీని ఓడించాలని అనుకుంటున్న వాళ్లు అంచనా వేయలేదు. జగన్, పవన్‌ను కలపడం వల్ల మాత్రమే లక్ష్యాన్ని సాధించగలమని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు ఓడిపోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు పవన్ కలవాలని కోరుకుంటున్నారు. అందులో బీజేపీ, టీఆర్‌ఎస్ కూడా ఉంది. అయితే ఏపీ బయట నుంచి చంద్రబాబును ఓడించాలని ప్రయత్నిస్తున్నవారికి జగన్, పవన్‌ను కలపాలని ఉన్నా.. జగన్ మాత్ర దానికి విరుద్ధంగా ఉన్నారు. ఆయన ఎవరినీ కలుపుకుని వెళ్లే పరిస్థితిలో లేరు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు పొత్తులకు సిద్ధంగా ఉన్నాయి. అయినా వారికి ఆరేడు సీట్లు ఇచ్చినా వృథా అనుకున్నారేమో... అందువల్ల పొత్తులు పెట్టుకోలేదు. ఒంటిరిగా పోటీ చేశారు.

jagan 02022019

ఫలితాలొచ్చిన తర్వాత చంద్రబాబు రెండు శాతం మాత్రం ఓట్లతోనే గెలిచారని పదేపదే చెప్పుకుని బాధపడ్డారు. కానీ ఆ రెండు శాతం ఓట్లు కమ్యూనిస్టుల పొత్తు పెట్టుకుంటే వచ్చేవనే విషయాన్ని మాత్రం గుర్తించడానికి సిద్ధపడలేదు. ఆ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని కలిసి పోటీ చేయడం అంటే అప్పనంగా ఇతర పార్టీలకు సీట్లివ్వడమని జగన్ భావిస్తున్నారు. అందుకు పవన్‌ను కలుపుకుంటే అవకాశాలు మెరుగుపడుతాయని ముక్తకంఠంతో అందరూ చెబుతున్నా జగన్ మాత్రం కావాలనే పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసి దూరం చేసుకుంటున్నారు. బయటి నుంచి శ్రేయోభిలాషులు ఎంతగా ఒత్తిడి చేస్తున్న ఆయన మాత్రం ఒంటరి పోటీకే మొగ్గు చూపుతున్నారు.

 

ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చండ్రనిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం మీద తనకున్న అగహాన్ని సభలో బీజేపీ నేతల మీద వెళ్లగక్కారు. ఎప్పుడూ ఆలోచనతో మాట్లాడే సీఎం ఈరోజు ఆవేదనతో మాట్లాడారు. అసెంబ్లీలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న వేళ బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుపడటంతో ఒకసారి గుజరాత్ కు వెళ్లి చూడవయ్యా, కంపేర్ చెయ్యి, కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసిది పోయి, సిగ్గు వదిలిపెట్టి, మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ కూర్చోవాలా? రోషం లేదా మాకు అంటూ మండిపడ్డారు. ఇక ఆ సమయంలో ‘అబ్జెక్షన్’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనగా చంద్రబాబులో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. ఏం అబ్జెక్షన్ నీది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? యూ ఆర్ అన్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే, తమాషాగా ఉందా? నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? అబ్జెక్షనా? న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టను. తిరగనివ్వను మిమ్మల్ని. వినేవాళ్లుంటే చెవుల్లో పూలు పెడతారండీ వీళ్లు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

gvl 020222019

కేంద్రం రాష్ట్రంమీద సవతిప్రేమ చూపిస్తుందంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం కేంద్రాన్ని ఎంతగా వెనకేసుకురావాలో అంతగా మోసేస్తున్నారు. అసలు కేంద్రం ఇస్తామన్నవాటితో పాటు అదనంగా కూడా ఇచ్చిందంటూ ఎక్కడలేని క్రెడిట్స్ కూడా ఇస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను చంద్రబాబు ప్రభుత్వం మింగేస్తుందనడం రాజకీయ విమర్శ, అది ప్రజలుకు అనవసరం. అసలు కేంద్రం ఏపీకి నిజంగానే అన్నీ ఇచ్చిందా? బీజేపీ నేతలు మైకుల ముందు చెప్పే వాటిలో నిజముందా? దాడికి ఎదురుదాడి పనిగా పెట్టుకొని బీజేపీ కాలం గడిపేస్తుందా? అంటే ఏపీ సామాన్య ప్రజలలో అవుననే అంటున్నారు.

gvl 020222019

ప్రజలు ఏమనకుంటున్నారో, ఈ రోజు అలాగే ప్రవర్తించారు జీవీఎల్. అసెంబ్లీలో సీఎం చంద్రబాబునాయుడు ప్రజలు బాధని వ్యక్త పరిస్తే, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాత్రం, సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజుతో చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని, సీఎం ప్రవర్తన చూస్తే పిచ్చి పీక్స్ కు చేరినట్లు తెలుస్తుందని తన ట్విట్లర్ లో పేర్కొన్నారు. మహా ఫ్రస్టేషన్ లో ఉన్న సీఎం అసెంబ్లీ రౌడీ లా ప్రవర్తించారంటూ ఫైర్ అయ్యారు. సీఎం తీరుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నట్లు జీవీఎల్ తెలిపారు. అయితే జీవీఎల్ తీరు పై ప్రజలు మండిపడుతున్నారు.

రాష్ట్రం కోసమే విష్ణుకుమార్‌ రాజును నిన్న అసెంబ్లీలో హెచ్చరించానని సీఎం చంద్రబాబు అన్నారు. మనం ఇంత ఆవేదన పడుతుంటే, ఆయాన మోడీ అన్నీ ఇచ్చేసారు అని చెప్తుంటే బాధ అనిపించి, అలా ఖటువుగా మాట్లాడానని చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకరించి ఉంటే రాష్ట్రంలో అద్భుతాలు చేసేవాడినని చెప్పారు. రోషం, కోపం ఉన్న బీజేపీకి పుట్టగతులుండవని, జనం చాటిచెప్పాలని సీఎం పిలుపునిచ్చారు. ఎన్‌ఐఏ రిపోర్ట్‌పై కేంద్రం మొహం ఎక్కడ పెట్టుకుంటుందని సీఎం ప్రశ్నించారు. కొందరు సర్వేలు చూసి తెగ సంబరపడిపోతున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోదని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ‘తెదేపా ఓడిపోతే పరిస్థితి ఏంటి’ అని అడిగిన వ్యాపారులకు కూడా తాను అదే సమాధానం చెప్పానని అన్నారు. శనివారం కృష్ణాజిల్లా కేసరపల్లిలో నిర్వహించిన సంక్షేమ పండగ కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

vishnu 02022019

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘పట్టిసీమ వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు ఇచ్చాం. చంద్రన్నబాట పథకం కింద ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేశాం. రూ.83వేల కోట్ల ఖర్చుతో 23లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. కాపులకు రిజర్వేషన్లు కల్పించి ఎవ్వరూ చేయని సాహసం చేశాను. రూ.50వేల కోట్ల విలువైన 34 ఎకరాల భూమి రైతులు ఉచితంగా ఇచ్చారు. నాపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు అంత భూమిని ఉచితంగా ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భూములు అభివృద్ధి చేసి ఇచ్చాం.’’ ‘‘ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. ‘తెదేపా ఓడిపోతే మా పరిస్థితి ఏంటి’ అని కొందరు పెట్టుబడిదారులు అడిగారు. ‘తెదేపా ఓడిపోదు, మీ పెట్టుబడులు ఎక్కడికీ పోవు’ అని వ్యాపారులతో చెప్పాను. "

vishnu 02022019

"కొందరు సర్వేలు చూసి సంబరపడిపోతున్నారు. కేంద్రానికి ఎవ్వరూ సహకరించవద్దని కోరుతున్నా. కేంద్రం సహకరించి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి జరిగేది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.80వేల కోట్లు రావాల్సి ఉందని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. మనకు అన్యాయం చేసిన పార్టీకి పుట్టగతులు లేకుండా చేయాలి. కేసీఆర్‌ జగన్‌ కలిసి నాటకం ఆడుతున్నారు. కోడికత్తి కేసు ద్వారా ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి నెలకొంది. కుట్రలు కుతంత్రాలు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలి. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఐదేళ్లు శ్రమించాను. తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్య పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆనాడు చేసినతప్పును కాంగ్రెస్‌ పార్టీ గ్రహించింది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.’’ అని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన విపక్ష కూటమిలో అనేక పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎవరిదారిన వారు పోటీ చేస్తున్న విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏపీలో కూడా తాము కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేయడం లేదని, కాంగ్రెస్‌ నేతలే ఈ విషయాన్ని ఇప్పటికే వెల్లడించారని బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లేదిలేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈవీఎంలపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయని చెప్పారు. బీజేపీయేతర నేతల సమావేశంలో ఈవీఎంలపై చర్చించామని తెలిపారు. ప్రజస్వామ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనే అంశం పై చర్చ జరిగిందన్నారు. సబ్ కమిటీ రిపోర్ట్‌పై చర్చించి, ఆమోదించామన్నారు.

congress 02022019

ఈవీఎంల వల్ల ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్‌ను కలుస్తున్నట్లు వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బట్టి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చిస్తామని స్పష్టం చేశారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య రైతుల సమస్య అన్నారు. 4 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వం ఎక్కడ కూడా చేయలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ వృద్ధి కేవలం 2.4 శాతం మాత్రమేనన్నారు. రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని పెద్ద ఎత్తున పీడిస్తున్న మరో సమస్య ఉపాధి లేక పోవడం, నిరుద్యోగ సమస్య అని వివరించారు.

congress 02022019

ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తూ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తుందని ధ్వజమెత్తారు. ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టంచేశారు. దేశాన్ని కాపాడుకోవాలని, అందుకు అందరం కలవాల్సి ఉందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లాలని సూచించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో రైతాంగం ఒకటని, నాలుగేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న బీజేపీ, కనీస మద్ధతు ధర కూడా కల్పించలేకపోతోందని విమర్శించారు. మరో తీవ్రమైన సమస్య నిరుద్యోగమని, ఈ విషయంలో ఎన్డిdయే సర్కారు ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.మరోవైపు ప్రజాస్వామ్య వ్యవస్థలను రాజకీయ కక్షసాధింపు కోసం ఉపయోగిస్తూ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నారని ప్రధాని మోడీపై ఆరోపణలు సంధించారు. అందుకే తాము సేవ్‌ నేషన్‌ – సేవ్‌ డెమోక్రసీ నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.

 

Advertisements

Latest Articles

Most Read