రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి మరో పారిశ్రామిక దిగ్గజం ముందుకొచ్చింది. ఉక్కు, ఇంధన, సిమెంట్‌, మౌలిక సదుపాయాలు, క్రీడా రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాత జిందాల్‌ గ్రూపు రూ.3,500 కోట్లతో ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టులో రెండు జెట్టీల అభివృద్ధి, పైపులైన్‌ ప్రాజెక్టులు చేపట్టేందుకు దావోస్‌ వేదికగా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ప్రపంచ ఆర్థిక వేదికలో ఐటీ, ఎలక్ట్రానిక్‌ శాఖల మంత్రి లోకేశ్‌ సమక్షంలో జిందాల్‌ గ్రూపు జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్‌ సజ్జస్‌ జిందాల్‌...రాష్ట్ర మౌలిక సదుపాయాల (పోర్టులు)శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), మారిటైం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నారు. రామాయపట్నం పోర్టులో స్టాక్‌ యార్డు, పోర్టు కార్యకలాపాలకు సంబంధించి సుమారు 200 ఎకరాల్లో రూ.1,000 కోట్లతో రెండు జెట్టీలు నిర్మిస్తారు. మరో రూ.2,500 కోట్లతో పైపులైను ఏర్పాటు చేస్తారు.

zindal 24012019 1

ఈ రెండు ప్రాజెక్టులతో 40 మందికి ప్రత్యక్షంగా, మరో 175 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రామాయపట్నం పోర్టు దగ్గర ఉక్కు పరిశ్రమ, రాష్ట్రంలో విద్యుత్తు వాహనాల పరిశ్రమ, అపెరల్‌ పార్కు ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామని ఈ సందర్భంగా సజ్జస్‌ జిందాల్‌ మంత్రి లోకేశ్‌కు హామీ ఇచ్చారు. తమ బృందం ఇప్పటికే అనేకసార్లు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిందని, అభివృద్ధిని స్వయంగా చూడాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు. సాంకేతికతను సంపూర్ణంగా వినియోగించుకునే నేతగా చంద్రబాబు దేశానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. విమానాశ్రయాలు, ఓడరేవులు అభివృద్ధి చేస్తున్నామని, మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు.

zindal 24012019 1

ఒప్పంద పత్రాలపై ఈడీబీ తరఫున సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌, పోర్టుల సంచాలకులు డాక్టర్‌ కె.ప్రవీణ్‌, జేఎస్‌డబ్ల్యూ నుంచి సంస్థ జేఎండీ, సీఈవో బీవీజీకే శర్మ సంతకాలు చేశారు. సమావేశంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరక్టర్‌ అహ్మద్‌ బాబు, సమాచారశాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు పాల్గొన్నారు. విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొని అభివృద్ధి పథంలో పయనిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ లాంజ్‌లో ‘రేపటి కోసం సాంకేతికం’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సమావేశంలో లోకేశ్‌ అన్నారు. 15 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రపంచ ఆర్థికవేదిక కాంగ్రెస్‌ సెంటర్‌లో మేకింగ్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌ వర్క్‌, భారత్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవం, అందరికీ సాంకేతికత అనేఅంశాలపై జరిగిన చర్చల్లోనూ లోకేశ్‌ మాట్లాడారు. నాలుగో పారిశ్రామిక విప్లవంతో ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమేనన్నారు.

ఆంధ్రా వాళ్ళను కుక్కలు, రాక్షసులు అంటారు... మీరు తినేది పెంట అంటారు.. ఇవన్నీ ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్రేకంలో అన్నం అంటారు... మరి రెండు రాష్ట్రాలు అయిన తరువాత కూడా వీళ్ళు ఆంధ్రా పై ఎలాంటి ద్వేషం చిమ్మరో ప్రజలు చూడలేదా ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని థర్డ్ క్లాస్ స్టేట్ అని, అలాంటి రాష్ట్రాన్ని మా తెలంగాణాతో పోల్చకండి అని కేసీఆర్ అన్న మాటలు మర్చిపోతామా ? తాజాగా నిన్న కేటీఆర్ మాట్లాడుతూ, మరోసారి ఆంధ్రా పై వారికున్న ద్వేషాన్ని మరోసారి కక్కాడు. అసలు ఆంధ్రా వార్తలు, అమరావతి వార్తాలు మా తెలంగాణాలో ఎందుకు వస్తున్నాయి, అంటూ అక్కడ న్యూస్ పేపర్ వాళ్ళకి, మీడియాకి వార్నింగ్ ఇచ్చాడు. ఆంధ్ర పై ప్రేమతో, కొన్ని మీడియా సంస్థలు, పత్రికల ధోరణి మాత్రం ఇంకా మారలేదంటూ హెచ్చరికలు చేసాడు కేటీఆర్.

ktr 24012019

కేటీఆర్ గారూ.... తెల్లారగానే లేచి పేపర్లలో అమరావతి గురించి చదవగలగటం శుభం అనుకోండి. అమరావతిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. ఒక నాయకుడి మీద, అతని శక్తి, చిత్తశుద్ధి మీద ఎంత నమ్మకం ఉంటే తప్ప మీరనే “తెలివైన చైతన్యవంతులైన ఆంధ్రాప్రజలు” 33 వేల ఎకరాలు రాజధానికి ఇస్తారు అనే పాజిటివ్ యాంగిల్ లో ఆలోచించండి. తెలంగాణా ఎడిషన్లలో అమరావతి గురించి రాస్తన్నారంటే కారణం హైదరాబాద్ లో, మిగిలిన తెలంగాణా జిల్లాలలో ఉన్న లక్షలాది మంది ఆంధ్రోళ్ళకు అమరావతి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం మూలానే.. వాళ్ళు ఆంధ్రా పార్టీకి ఓటు వేయటం వేయనంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ లేదనుకోవద్దు. ఇకపోతే తెలంగాణా గురించి వార్తలు ఆంధ్రా ఎడిషన్లలో అంటారా , అమరావతి , పోలవరం లాంటి అద్భుతమైన కార్యక్రమాలు అక్కడ కూడా జరుగుతుంటే ఇక్కడి పేపర్లలో రాస్తారు , మేం కూడా చదువుతాం.. . ఏమీ లేకపోతే ఏముంటది? ఏముండదు ..!!

ktr 24012019

ఇలాంటి ఆంధ్రా ద్వేషితో, మన ఖర్మకు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి, చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతాడు. ఆంధ్రా ప్రజలని, ఆంధ్ర రాష్ట్రాన్ని అడుగడుగునా అవమానాలు చేస్తుంటే, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా, అనుకుండా, ఆ మాటలు సమర్ధిస్తున్నా అన్నట్టు, అతనితోనే కలుస్తూ, ఏపిలోకి వచ్చి రాజకీయం చేస్తున్నా అని బహిరంగంగా ప్రకటిస్తాడు. ప్రతివ విషయంలో వాళ్ళు ఆంధ్రా ప్రజలను అవమానిస్తూ, మా తెలంగాణా గొప్పది అంటూ వాళ్ళ రాష్ట్రాన్ని పొగుడుతూ, మన రాష్ట్రాన్ని హేళన చేస్తుంటే, వారికే భజన చేస్తాడు. రాజకీయాలు వేరు, రాష్ట్రం వేరు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఆంధ్రులకు ఆత్మాభిమానం ఉండి, ఆత్మ గౌరవం ఉంటుంది. అవి, వారిని అవమానించిన వారి కాళ్ళ దగ్గరే తాకట్టు పెడితే, ఆంధ్రుడు చూస్తూ ఊరుకోడు జగన్.. రాజకీయాలు పక్కన పెట్టి మా ఆంధ్రుల ఆత్మగౌరవానికి కొంచెం అయిన విలువ ఇవ్వు.

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను తెదేపా ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, టి.డి.జనార్దన్‌ కలిశారు. ఈరోజు సాయంత్రం రాధాకృష్ణ కార్యాలయానికి వెళ్లిన తెదేపా నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. భేటీ అనంతరం జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సందేశాన్ని రాధాకు అందజేశామని.. అలాగే ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించామని వెల్లడించారు. దీనిపై తన నిర్ణయాన్ని రాధా రేపు వెల్లడిస్తానన్నారని పేర్కొన్నారు. ఈనెల 25న రాధా తెదేపాలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ ఇటీవలే వైకాపాను వీడిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో కృష్ణా జిల్లాలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాధాకృష్ణ చేరికతో విజయవాడ నగరంలో తెదేపా మరింత బలపడుతుందని తెదేపా నేతలు భావిస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన రాధా టీడీపీలో చేరడం ఖాయమైంది. ఈ నెల 21న రాధా తన అనుచరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

cbn 22012019

ఈ సమావేశంలో రాధా తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించినట్లు సమాచారం. అత్యధికులు టీడీపీలో చేరడమే మంచిదని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని జనసేనలో చేరితే బాగుంటుందన్న సూచనలు కూడా వచ్చినట్లు వినికిడి. మరోవైపు రాధా టచ్‌లో ఉన్న టీడీపీ నేతలు మాత్రం ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. రాధా మాత్రం టీడీపీకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి రాధా టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే రాధా టీడీపీలోకి 25వ తేదీన టీడీపీలోకి వస్తారని సీఎం చంద్రబాబు ధ్రువీకరించారు.

cbn 22012019

21న జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రాధా టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రయోజనాల కోసమే రాధాను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాధాను కలుపుకుని వెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం రాధా రంగ మిత్ర మండలి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంగవీటి రాధా ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సీట్లు అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. "మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా?" అంటూ మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధా రంగా అభిమానులెవరూ వైసీపీకి ఓటు వేయొద్దని ఈ సందర్భంగా విజయవాడతో పాటు రాష్ట్ర ప్రజలకు రాధా రంగ మిత్ర మండలి సభ్యులు పిలుపునిచ్చారు. అయితే ఈ ఆరోపణలపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ టీజీ వెంకటేష్ స్పందించారు. అంతేకాదు పవన్‌కు ఆయన పలు సూచనలు చేశారు. పవన్‌ ఆవేశంతోకాదని, ఆలోచించి మాట్లాడాలని టీజీ సూచించారు. తాను ఏం మాట్లాడానో విని స్పందించి ఉంటే బాగుండేదన్నారు. కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చు కానీ లీడర్లకు ఆవేశం ఉండకూడదని సలహా ఇచ్చారు. తాము టీడీపీలో కార్యకర్తలం మాత్రమేనని, పొత్తులను నిర్ణయించేది కార్యకర్తలు కాదని, పార్టీల అధినేతలేనని టీజీ వెంకటేష్‌ చెప్పారు. పొత్తులపై ఆయా పార్టీల అధినేతలే నిర్ణయిస్తారని చెప్పాను. పొత్తులు ఖరారైతే మార్చిలో చర్చలు ఉంటాయనే చెప్పాను అని టీజీ వెంకటేశ్‌ వివరించారు.

tg ven 23012019

జనసేనతో పొత్తులపై టీడీపీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అమరావతిలో విలేకర్లతో మాట్లాడారు. తెదేపా, జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవని అన్నారు. కేవలం కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే రెండు పార్టీలకు అభిప్రాయ భేదాలున్నాయని వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీపై ఆశ లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గతంలో చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు ఏపీలో తెదేపా, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ ప్రశ్నించారు. తెదేపాతో జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

 

tg ven 23012019

అయితే టీజీ వ్యాఖ్యలపై జనసేనాని మండిపడ్డారు. ‘‘టీజీ వెంకటేష్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదు. జనసేన వద్దనుకుంటే టీజీకి రాజ్యసభ సీటు ఇచ్చారు. టీజీ వెంకటేష్‌...పెద్దమనిషిగా మాట్లాడు. లేదంటే నేను నోరు అదుపు తప్పి మాట్లాడుతా. నేను నోరు విప్పితే మీరు ఏమవుతారో?’’ అని పవన్ ప్రశ్నించారు. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. విశాఖ జిల్లా పర్యటనలో పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read