దమ్ముంటే పెట్టండి రాష్ట్రపతి పాలన. చూస్తాం!! ఖామోష్. ఎన్ని అన్నా మీకు నామోషీ లేదా? పిడి వాదం పీడీ వాదం మానవా మానవా? ఎందుకు రాష్ట్రపతి పాలన పెడతావు ఉత్తర కుమారా? అరే భయ్యా! ఆంధ్రులు ఏం పాపం చేశారు? రాష్ట్రపతి పాలన పెట్టి రిగ్గింగ్ చేద్దామనుకుంటున్నారా మీ కమల్స్? జాగ్రత్త.. చాలా చూశాం. తరిమికొడతారు ఆంధ్రులు. ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్యం పొందారు. నరేంద్రమోడీని నమ్మిన నరుడా? ఇదీ ఆపరేషన్ గరుడాయేనా? కోడి కత్తులతో ఆడుకునే మీకు సింహంతో, నారా..సింహంతో చెలగాటాలేమిటీ? అనవసరంగా కదలించారు కదా? మీ పీఠాలు కదిలిపోయాయి కదా? ఔనా? కాదా? నేతాజీని కన్న బెంగాల్ లో నేడు కాబోయే దేశ్ కీ నేతాజీని నిర్ణయించడానికి సమావేశమయ్యాయి పార్టీలు. వందేమాతరం నినాదం మోగిన వంగభూమిలో నిన్నమోగిన రణనినాదాలు వినపడలేదా? మీదసలే ధృతరాష్ట్రపాలన. రాష్ట్రపతిపాలన ఎందుకు? ఔనూ.. రాష్ట్రపతిపాలన ఎందుకు పెడతారో తెలుసా? పొలిటికల్ సైన్స్ చదివారా? సైన్స్ చదివారా? కసిగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకుంటున్న నవ్యాంధ్రులము, ‘నారాం‘ధ్రులము మేము. మాతో గిల్లి కజ్జాలెందుకు? మీ అధినేతకు కృతజ్ఞతగా ఇటువంటి సంధి ప్రేలాపనలా? మోదీకి థ్యాంక్స్ గివింగా? ఎందుకు రాష్ట్రపతి పాలన పెడతారండీ? పోలవరాన్ని మా నారా..సింహం సింగిల్ గా హ్యాండిల్ చేసి పూర్తిచేస్తున్నందుకు అక్కసుగా ఉందా? అందుకా? ప్రతి పేదరాలికి పెద్దకొడుకుగా వచ్చి చంద్రన్న 54.61 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నందుకా? పెన్షన్లు రెట్టింపు చేసినందుకా? రిపబ్లిక్ డే నాడు డ్వాక్రా ఆడపడుచులకు పసుపు కుంకుమలు ఇవ్వనున్నందుకా? మీరు చెంబెడు నీరు, చారెడు మట్టి తెచ్చి ఇచ్చేశాం రాజధాని కట్టుకోండని మన్నుగొట్టలేదా మా కళ్లలో?
రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్తును నాశనం చేయాలనేగా? గుజరాత్ ను మించిపోకూడదనేగా? అమరావతి బాండ్లతో గ్రాండుగా రాజధాని నిర్మిస్తూ తనో బ్రాండ్ అంబాసిడర్ అయినందుకా? మీ సాయం లేకున్నా 24,500 వేల కోట్ల రుణమాఫీ చేశారనా? ఇరవై లక్షల ఇళ్లు నిర్మించినందుకా? ఎందుకు? ఎందుకు రాష్ట్రపతి పాలన? పట్టిసీమ తెచ్చినందుకా? డెల్టా రైతు పట్టిందల్లా బంగారం చేసినందుకా? మోడీ చిల్లిగవ్వ ఇవ్వకున్నా రాజధాని అమరావతి నిర్మిస్తున్నందుకా? ఎందుకు రాష్ట్రపతి పాలన? పోలవరం ప్రాజెక్టలులో గిన్నిస్ రికార్డులు లో జూన్ లో మట్టికట్ట నుంచి మళ్లించే పోలవరం నీటినిస్తాను అని చెప్పినందుకా? చరిత్ర తెలుసా? మీది పొలిటికల్ సైన్సా? ఆనాడు గుజరాత్ లోని గోధ్రాలో నరమేధం జరిగింది. మోడీ హయాంలోనే స్వామీ. గుజరాత్ లో రైలుబోగీకి దుండగులు నిప్పు పెడితే అమాయకులు కాలి బూడిదయ్యారు. అమాయకులు, పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు మంటల్లో హాహాకారాలు చేస్తుంటే మీరు చలికాచుకోలేదా? చెరిపినా చెరగని చరిత్ర. ఘోరం. అంత్యంత దారుణం. అయినా గుజరాత్ ముఖ్యమంత్రి ది గ్రేట్ నరేంద్రమోడీజీ రాజీనామా చేశారా? లేదే? నిస్సిగ్గుగా పదవిని పట్టుకుని వ్రేలాడింది నిజం కాదా? కోర్టు నిర్దోషిగా ప్రకటించిందని ఇఫ్పుడు చెప్పటం కాదు. కోర్టు తీర్పు వచ్చేదాకా అయినా కుర్చీని వదిలారా? లేదే? గుజరాత్ లో రాష్ట్రపతిపాలన పెట్టారా?ఆనాడు మోడీని ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనివ్వను అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గర్జించారు గుర్తుందా? ఆ మాటలు మనసులో పెట్టుకునేగా నేడు చంద్రబాబును, ఆంధ్రప్రదేశ్ ను వేధిస్తున్నారు? ఈ సాధింపులేమిటి? బెదిరింపులేమిటి? ఏమిచ్చారని లెక్కలు చెప్పాలి? మోడీ ఏమిచ్చారు చారెడు మట్టి. చెంబెడు నీళ్లూ తప్ప? కన్నాకు, చిన్నాకు, మోడీకి సన్నాయి పాడే ప్రతి తిమ్మాయికీ లెక్కలు చెప్పాలా? కేవలం చంద్రబాబు విశ్వసనీయతను, పరిపాలనా దక్షతను నమ్మి రైతులు ఆయాన మాటలు ఒప్పుకుని భైమిని సమీకరణకిచ్చారు. కుళ్లుబోతుతనంతో అంత భూమి ఎందుకు అని ఎందరో వదరుబోతులు నోరు పారేసుకోలేదా? రైతులు 50 వేల కోట్ల విలువైన భూములిచ్చారు. ఈ పని నరేంద్రమోడీ చేయగలిగేవారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సాధిస్తున్న విజయాలనే మోడీ జపాన్ లో చెప్పుకున్నారు. అనేక దేశాల్లో తన ఘనతగా చాటుకున్నారు. విశాఖపట్నం విదేశమా? స్వదేశమా? అక్కడ ప్రజలు ఎయిర్ షో చూడటానికి ఎంతో ఉత్సాహంగా కూర్చుంటే ఎయిర్ షో రద్దు చేయించింది మీరు, మోడీ కారా? నాడు మిత్రధర్మంతో తెలుగుదేశం బలపరిచిన మీ కంభంపాటి హరిబాబే కదా అక్కడ ఎంపీ? ఈ ఎంపీ గారు ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించలేదో? మళ్లీ ఆయనకు, ఆయన పార్టీకి ఓట్లేయాలట? పిచ్చివాళ్లా ఆంధ్రులు. తేనెపూసిన కత్తులా? విషం పూసిన విచ్చుకత్తులా? , మీ కోడికత్తులతో మా మెడలు కోసుకోవాలా?
అరే భయ్యా? ఇంతగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుకోయాలని మీకెలా అన్పిస్తోంది? చంద్రబాబు దావోస్ వెళతానంటే ముందు వద్దన్నారు. తర్వాత రోజులు కుదించారు. దుష్టులారా? భ్రష్టులారా? ఏం విధానాలు మీవి? ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా మేం? ఇవ్వాల్సింది గట్టిగా అడిగితే ఫాసిస్టు దాడులా? ఐటీవాళ్లు, ఈడీ వాళ్లు వచ్చిఒక్కసారిగా మూకుమ్మడిగా వాలిపోవడం చరిత్రలో చూశామా? తిత్లి తుఫానొచ్చి శ్రీకాకుళం ఉత్థానం కన్నీరు మున్నీరైతే ఎవరు తుడిచారు కన్నీళ్లు పక్కజిల్లాలో పాదయాత్ర చేసిన ప్రతిపక్షనేత రాలేదు. ఆ పక్కజిల్లాలో సభకు వచ్చిన కేంద్ర హోంమంత్రీ రాలేదు. అక్కడే ఉండి వాళ్ల బాధల్లో పాలుపంచుకొంది చంద్రబాబు కాదా? అరే భయ్యా! ఆంధ్ర చేపలు, రొయ్యలు మందువేసి పెంచుతున్నారని, మంచివి కావనీ విష ప్రచారాలా? త్రాష్టులా? ధృతరాష్ట్రులా మీరు? ఆంధ్రప్రదేశ్ ను సాధించడానికి ఇంత నీచమా? చేపలు, రొయ్యల రంగంలో ఏపీ దేశంలో అగ్రగామి. నీలివిప్లవ రాస్తా మా కోస్తా. డాలర్ల పంట పండించి మీసం మెలేసింది. మా నెత్తినెక్కి మూతి మీద మీసాలు పీకాలని అనుకోవడం మూర్ఖత్వం మా అధిపత్యాన్ని ఆదాయాన్ని దెబ్బతీయడానికి ఇన్ని కుట్రలు? కుతంత్రాలు. మహా నియంతగా ఇచ్చేది ఇవ్వకుండా ఆదాయానికి గండికొడతారా? సిగ్గుగా లేదా? విషం కలిపి చంపడానికీ విష ప్రచారానికీ తేడా ఏముంది? రెండూ ఒక్కటే. 29 సార్లు ఢిల్లీ వెళ్లి, తాను సీనియర్ అయివుండీ, అంతకుముందే సీఎంగా పదేళ్లు, ప్రతిపక్షనేతగా పదేళ్లు పనిచేశారే? కేంద్రంలో మూడు ప్రతిపక్ష ప్రభుత్వాల ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించారే? రాష్ట్రపతిగా అభ్యర్ధిగా అందరికీ ఆమోదంగా ఒకరిని సూచించాలని ప్రధాని వాజపేయి గారడిగితే 24 గంటల్లో కలాంపేరును తెరమీదికి తెచ్చి ఒప్పించి రాష్ట్రపతిని చేసిందెవరు? పేడ ఫ్రంటుల స్టంటులు కొడుతున్నవాళ్లు, కోడికత్తులూ అందరూ మోడీ తానులో ముక్కలే అరే భయ్యా! ఆంధ్రులకు ఆమాత్రం తెలియదా? రాష్ట్రపతి పాలన ఎందుకు పెడతారు?
అరే భయ్యా! మిమ్మల్ని ఓడించడానికి మా గండికోట వీరులు చాలు. మగువ మాంచాల తెగువ చూపిన నేల ఆంధ్రం. తొడగొట్టి మీసం మెలేసిన పల్నాటి పౌరుష రాష్ట్రం. ఉరికొయ్యను ముద్దాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రోషం మాది అగ్గిపిడుగులు కురపించిన అల్లూరి శౌర్యం, కన్నెగంటి హనుమంతు పరాక్రమం రండి. రాష్ట్రపతి పాలన విధిస్తే ఏం చేస్తారో చూపిస్తాం. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే బ్యాంకులో దాచుకున్న సొమ్ము తీయడానికి వీలేదీ? ఏటీఎంలను ఏటీ యములుగా మార్చిన మోడీ..జనం నెత్తిన బండలు మోదీ మోదీ..మోదీ రైతు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు అంటే పైసా డబ్బివ్వలేదు మోడీ. ఇవ్వాళ దేశమంతా రుణమాఫీ చేస్తాడంట మోడీ- అమిత్ షా జోడీ . చెవిలో క్యాలీ ఫ్లవర్స్.. క్యాలీ ఫ్లవర్స్. ఈ ఐదేళ్లుగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటూ మీరు అధికారంలోనే ఉన్నారుగా? ఎందుకు రుణమాఫీలు చేయలేదు? ఎందుకు రైతులకు బ్యాంకుల్లో డబ్బులు వేయలేదు? పైగా దాచుకున్న డబ్బులు వెనక్కి తీసుకుందామన్నా ఖాళీగా ఉంచారు ఏటీఎంలు. పెట్రోలు, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెరుగుతుంటే కనీసం మీవంతుగా పన్నులు రద్దుచేసి ఆదుకున్నారా? అణాపైసలు పద్దులు రాసుకుని గోళ్లూడదీసి వసూళ్లు చేసే బ్యాంకులు.. మా డబ్బులు మాకివ్వవా? ఎందుకీ శిక్ష? ఖాతాకు 15 లక్షలు వేస్తానని కమలం ఫ్లవర్స్ పెట్టారు చెవుల్లో. నల్లడబ్బు విదేశాలనుంచి తెస్తామన్నారు. కానీ ఏం చేశారు. అరే భయ్యా? ప్రజాధనం లూటీ చేసిన మల్యాలు, నీరవ మోడీలను దేశం దాటించారు? ఎవరిది ద్రోహం? ఎవరిది దేశద్రోహం? రాఫెల్ స్కాంలో వేలాది కోట్ల దేశ సంపదను భోంచేయలేదా? దొంగలు పడింది ఢిల్లీలో. కోల్ కతాలో సమావేశమైన ప్రతిపక్షనేతలు దొంగలెలా అవుతారు? లూటీ కోరులెలా అవుతారు. కుక్షింభరులు. లక్షలకోట్లు దిగమింగి బ్యాంకులకు టోపీ వేసి కొల్లగొట్టిన దేశ సంపదను బ్యాంకుల్లో దాయడానికి విదేశాలు వెళ్లారే? వాళ్లూ లూటీ దార్లు. అడ్డదారులు. గడ్డి దారులు. దొంగలను దేశం దాటించి రహస్యంగా దాక్కోబెట్టిన వాళ్లే దొంగలు. దొంగే దొంగ దొంగ అని అరిస్తే ఎలా? యే క్యాహై మోదీజీ? క్యా బోల్ తా హై? ‘దూతావాస్’ దగ్గర మీరో ‘ఝూటా’వాస్ లా మాట్లాడారే? ఆప్ ఝూట్ బోల్ రహే హై? ఉత్తర కుమారా మళ్లీ మీ దగ్గరికి వచ్చా. అవును ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి? మీరు ఎవడబ్బ సొమ్ము ఇచ్చారని? ఏం తెచ్చారని? చెంబెడు నీళ్లు, చారెడు మట్టి తెచ్చిచ్చి లక్షల కోట్ల కుంభకోణాలంటారా?
యువతను పకోడీ ఫ్యాక్టరీలు పెట్టుకోవాలని దిక్కుమాలిన సలహా ఇచ్చిన మోడీ-షా జోడీ? చంద్రబాబు ముఖ్యమంత్రి యువనేస్తంతో 6 లక్షల మంది యువకులకు పెన్షన్లిస్తున్నారు. అరే భయ్యా! సంస్కారం ఎవరిస్తేనో రాదు. కనీసం మీ పార్టీలోనే అద్వానీగారినో, మురళీమనోహర్ జోషీ గారినో, అంతెందుకు ఆంధ్రప్రదేశ్ కే చెందిన వెంకయ్యనాయుడుగారినో అడగండి. వాళ్లెంత సంస్కారంతో మాట్లాడతారో నేర్చుకోండి. వరుస ఉప ఎన్నికల్లో ఓడారు. ఐదు రాష్ట్రాల్లో ఓడారు. ఎక్కడ తలపెట్టుకుంటారయ్యా? పాఠాలు నేర్చుకోరూ. మీరు తలపడతాం అంటే మేం బలపడతాం. రాఫెల్ అవినీతి అనకొండల్లారా మా చంద్రబాబు బంగారు కొండ. దయచేసి కొండ ఢీకొనాలనుకోవద్దు. నందీహిల్స్ తెలుసా? మళ్లీ కర్ణాటకలో కుట్రలు, ఇక్కడ నారా..సింహాంతో గిల్లికజ్లాలు.. అరే భయ్యా! నరసింహా.. మీకు నందీ హిల్స్ తెలుసా? ఇప్పుడు కర్నాటకలో పిచ్చివేషాలు వేస్తున్నారు. అదే కర్నాటకలో నంది హిల్స్‌లో 1984లో అలనాడు ఆంధ్రప్రదేశ్ పదవీచ్యుత ముఖ్యమంత్రి ఎన్టీరామారావుగారికి మద్దతు పలికిన శాసనసభ్యులు విడిది చేశారు. ఆ విడిదిని నిర్వహించిందీ? నడిపించిందీ, మళ్లీ ఎన్టీరామారావుగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేలా మార్గం వేసిందీ ఎవరో తెలుసా? దక్షిణాది చరిత్ర తెలుసుకోండయ్యా? నందీహిల్స్ లో నక్కజిత్తుల నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ ను కూలదోస్తే చక్రం తిప్పిందీ, మళ్లీ శ్రీరామ పట్టాభిషేకం జరిగిందీ ఈ చంద్రబాబు వల్లనే. ఎనీ డౌట్? ఈ చంద్రబాబే ఆ చంద్రబాబు. ఆ క్యాంపు నడిపిందీ, నాడు ఇందిరా గాంధీ దారికి వచ్చేలా చేసిందీ ఈ చంద్రబాబు నాయుడు గారే? మళ్లీ చెబుతున్నాం. మళ్లీ మళ్లీ చెబుతున్నాం. ఆ చంద్రుడే ఈ చంద్రుడు. ఆ చంద్రబాబే ఈ చంద్రబాబు. మళ్లీ మీరు పళ్లికిలిస్తూ రాష్ట్రపతిపాలన అంటూ బెదిరిస్తారా? మీ బెదిరింపులకు ఆంధ్రలో బొడ్డూడని బుడ్డోడు కూడా బెదరడు. మీ నోటికి అడ్డూ అదుపూ లేదే? ఖామోష్. మీకు నామోషీ ఏముంది? ఔను నాడు దుష్ట కాంగ్రెస్ అన్నాం. నేడు భ్రష్ట బీజేపీ అంటాం. మీరు శిష్టులా? వశిష్టులా? విశిష్టులా? దుష్టులా నాలుగునెలల్లోనో, మూడు నెలల్లోనో చెబుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. పీడీ అక్కౌంట్ల కుంభకోణం, పీడీ అక్కౌంట్ల కుంభకోణం అన్నారు. అదేదో అంటారే... ఒట్టి.......అరుపులు ఎక్కువని. తెలుగులో ఓ సామెత ఉంది. ఎందుకు మా నోటితో చెప్పిస్తారు? మీకు జవాబివ్వటానికి చంద్రబాబు రావాలా?
లాస్ట్.. బట్ నాట్ లీస్ట్.. అరే భయ్యా! రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరించిన ఉత్తర కుమారా? మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ మధ్య ఆ మధ్య మీ సొంతూరు ప్రకాశం జిల్లా బల్లికురవలో స్థానిక ప్రముఖులు, ఈ ఊరుకు పేరుతెచ్చిన ప్రముఖులందరినీ సన్మానించారటగదా? మీ పేరూ చేర్చాలని కొందరు ప్రయత్నిస్తే గ్రామస్తులు అగ్గిరాముళ్లై ఆగ్రహించారట కదా? మీ సొంతూరులో అదీ మీ పలుకుబడి. వార్డుమెంబరుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడో కాదు. మీ సొంతూరులో నిలబడి, అదే ఎన్నికల్లో నిలబడి 100 ఓట్లు తెచ్చుకోండి. ఛాలెంజ్ చేస్తున్నాం. మిమ్మల్ని సన్మానిస్తాం. మామూలుగా కాదు. ఘనంగా. ఇంకెప్పుడూ మాట్లాడకండి చంద్రబాబు గారి గురించి నీచంగా. నికృష్టంగా. అథమంగా. అడ్డదిడ్డంగా. ఆయన వరల్డ్ క్లాస్ లీడర్. చెవిలో జోరీగల్లా మా సింహానికి కోపం తెప్పించవద్చు. మీ స్థాయి ఏమిటి? చంద్రబాబు స్థాయి ఏమిటి? సమ ఉజ్జీలతో పోరాడాలి. ఎపుడో అన్న భక్తవత్సల నాయుడు భాషలో చెప్పాలంటే గల్లీ లీడరు ఢిల్లీ నుంచి వచ్చి సిల్లీ మాటలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరసింహాలై, నారా..సింహాలై గర్జిస్తారు. ఐదుకోట్లమంది ఒక్కసారి మీ నెత్తిన మోదితే మోదీ ఎక్కడుంటారు? మీరెక్కడుంటారు? -పారుపల్లి శ్రీధర్