కుల గొడవలు రేపుదాం అనుకున్నారు, ఫెయిల్ అయ్యారు... శబరిమల లాగా, తిరుమల విషయంలో కూడా అశాంతి రేకెత్తించాలి అనుకున్నారు, ఫెయిల్ అయ్యారు... జగన్, పవన్ ను కలిపి చంద్రబాబు మీదకు వదిలారు, ఫెయిల్ అయ్యారు.. కోడి కత్తి డ్రామా ఆడారు, ఫెయిల్ అయ్యారు.. చంద్రబాబు పై అవినీతి మరకలు వేద్దామనుకున్నారు, ఫెయిల్ అయ్యారు... చివరకు కేసీఆర్ ను తీసుకువచ్చారు, ఫెయిల్ అయ్యారు... ఎలా ఫెయిల్ అయ్యారు అంటారా ? చంద్రబాబు చేసే పోజిటివ్ వేవ్ కు దెబ్బైపోతున్నారు.. ఏపి ప్రజల ముందు అన్నీ వాస్తవాలు కనిపిస్తున్నాయి, చంద్రబాబు కష్టం కనిపిస్తుంది, అభివృద్ధి కనిపిస్తుంది, సృష్టించిన సంపదతో పేదలకే మరిన్ని పధకాలు పెడుతున్నారు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు..

jd 23012019

అందుకే పస లేని ఆరోపణలకు ఇక్కడ విలువ లేదు. ఎంత మంది వచ్చి ఏపి పై దాడి చేసినా, చంద్రబాబు తన పోజిటివ్ వేవ్ తో, ప్రజల సహకారంతో తిప్పి కొడుతున్నారు. అందుకే జగన్, పవన్, కేసీఆర్, మోడీ, ఎవరూ నిలబడటం లేదు. అడ్డ్రెస్ కూడా లేకుండా పోతున్నారు. ఈ పరిణామాలతో, ఢిల్లీ పెద్దలు మరో కుట్రకు తెరలేపుతున్నారు. ఈ సారి, ఇలాంటి అవినీతి జగన్, అసమర్ధ పవన్, అహంకారి కేసీఆర్ కాకుండా, ఫ్రెష్ ఫేస్ తో చంద్రబాబు పై యుద్ధానికి కొత్త ప్లాన్ వేస్తున్నారు. ఆ కొత్త ఫేస్ పేరే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తకు బలం చేకూరుస్తూ, లక్ష్మీనారయణ ఈ రోజు గోవర్నర్ నరసిహంన్ ను కలిసారు. మీడియా కంట పడకుండా, ఈ భీటీ జరిగింది. మీడియాకు తెలిసేలోపే, భేటీ జరిగిపోయి, అక్కడ నుంచి లక్ష్మీనారయణ వెళ్ళిపోయారు.

jd 23012019

ముఖ్యంగా, గత కొన్ని రోజులగా జరుగుతున్న పరిణామాలతో, కాపు సామాజిక వర్గం, తెలుగుదేశం వైపు పూర్తిగా తిరిగిపోయిందనే వాతావరణం రాష్ట్రంలో వచ్చింది. పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోవటం, అతని మీద పూర్తిగా నమ్మకం పోవటం, రాధా తెలుగుదేశంలో చేరటం, ఇదే సమయంలో ఈబీసీ రిజర్వేషన్ లలో, 5శాతం కాపులకు అని చంద్రబాబు చెప్పటంతో, మొత్తం ఇటు వైపు తిరిగిపోయారు. కాపు రిజర్వేషన్ అంశం, కేంద్రం నాన్చుతూ ఉంచటంతో, కేంద్రమే ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్ ని చంద్రబాబు అస్త్రంగా మలుచుకుని, తన చిత్తసుద్ధి నిరూపించారు. దీంతో ఈ వాతావరణం చెడగొట్టి, మళ్ళీ ఎదో ఒక కన్ఫ్యూషన్ తీసుకు రావటానికి, లక్ష్మీనారయణను రంగంలోకి దించుతున్నారని, ఆయన మరో వారం రోజుల్లో జనసేన పార్టీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే, ఈ రోజు గవర్నర్ ను కలిసినట్టు తెలుస్తుంది.

ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జనసేనతో పొత్తులపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాము-ముంగీసలా ఉండే ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ- జనసేన పొత్తు తప్పుకాదని ఆయన అభిప్రాయపడిన విషయం తెలిసిందే. టీజీ ప్రకటన సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని, ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురిచేయొద్దని, పార్టీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు నేతలు సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు. ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో గందరగోళం సృష్టిస్తే ఎవరికీ మంచిది కాదని చంద్రబాబు హెచ్చరించారు.

tg 23012019

ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ వెంకటేష్‌ ప్రశ్నించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగే అవకాశం ఉందని వెంకటేష్‌ చెప్పారు. ఇటీవల టీడీపీతో జనసేన కలుస్తుందన్న వార్తలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు స్పందించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం, కేంద్రంతో పోరాటం కోసం, తమతో పవన్ కలిసివస్తే స్వాగతిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌కు ఓటేస్తే నరేంద్రమోదీకి వేసినట్టేనని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పొలిటీషియన్ కాదని, నేరస్ధుడని మండిపడ్డారు. ప్రజా సమస్యల కంటే కేసులు నుంచి ఎలా తప్పించుకోవాలన్నదే ప్రతిపక్ష నేత ఆలోచన అని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ, కేసీఆర్‌లు కలిసి ఏపీ ప్రజలకు అన్యాయం చేయాలని కుట్రలు పన్నుతున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు.

 

tg 23012019

అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మోడీ పై పోరాటానికి కలిసి రాలేదు. చంద్రబాబు పదే పదే, పవన్ చెప్పిన ఫాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ పై స్పందించి, మోడీ పై పోరాటం చెయ్యమని కోరినా, గత సంవత్సర కాలం నుంచి, పవన్ కళ్యాణ్, మోడీ పై మౌనంగానే ఉన్నారు.మొన్నటి దాకా కేసీఆర్ భజన చేసిన పవన్, కేసీఆర్ తనను కరివేపాకు లాగా పక్కన పడేసి, జగన్ ను దగ్గర తియ్యటంతో, పవన్ ఇగో దెబ్బతింది. దీంతో, మొన్న మొదటి సారి, కేసీఆర్, జగన్ కలయిక పై విమర్శలు చేసారు పవన్. ఇప్పటి వరకు మోడీ పై పోరాటం లేదు, కేసీఆర్ మనలను అవమానించిన దాని పై పోరాటం లేదు, అలా టైం పాస్ చేస్తున్న పవన్, ఇప్పటికైనా, ఒక నిర్ణయం తీసుకొంటారో, మోడీ భక్తుడిగానే మిగిలిపోతారో చూడాలి..

ఈవీఎం హ్యాకింగ్‌పై సయ్యద్ సుజా మరో సారి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి బావమరిది కాకిరెడ్డి గెస్ట్‌హౌస్‌లో తమపై కాల్పులు జరిపారని ఆరోపించారు. 2014 మే13 తెల్లవారుజామున 13 మందితో గెస్ట్‌హౌస్‌కు వెళ్లామని సుజా తెలిపారు. అక్కడే ఉన్న కిషన్ రెడ్డి.. మమ్మల్ని చంపేయమంటూ గన్‌మెన్లకు ఆదేశించారని చెప్పారు. వాళ్లు జరిపిన కాల్పుల్లో తమ వాళ్లు 11 మంది చనిపోయారని సయ్యద్ సుజా వెల్లడించారు. మృతుల్లో సమావేశం నిర్వహించిన కమల్‌రావు కూడా ఉన్నారని, తాను తప్పించుకుని అమెరికా వెళ్లిపోయానని సుజా తెలిపారు. ఆ తర్వాత వాటిని మతకలహాల మరణాలుగా మార్చారని, ‌ఉప్పల్ లిటిల్‌ ఫ్లవర్‌ కాలేజి దగ్గర కాకిరెడ్డి గెస్ట్‌హౌస్ ఉందని సయ్యద్‌ సుజా తెలిపారు.

evm 23012019

విన్‌ సొల్యూషన్స్‌ ద్వారా ఈసీఐఎల్‌కు టెక్నికల్ సహకారం అందించామని సయ్యద్‌ సుజా చెప్పారు. విన్‌ సొల్యూషన్స్‌లో దర్యాప్తు చేస్తే అంతా తెలుస్తుందని ఆయన అన్నారు. అమెరికాలో తనను మనీష్‌ సిసోడియా, అర్ణబ్‌ గోస్వామి, వంశీరెడ్డి కలిశారని, ఈసీఐఎల్‌లో పనిచేస్తున్న సమయంలో కూడా వంశీరెడ్డి కలిశారని సుజా చెప్పారు. వీవీప్యాట్‌లో బగ్‌ ఫిట్‌ చేయమని తనను వంశీరెడ్డి అడిగారని తెలిపారు. తర్వాత వంశీరెడ్డిని బస్సు ప్రమాదం పేరుతో చంపేశారని, ఈ నిజాలు వెలికితీస్తారా అంటూ కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. జేఎన్‌టీయూలో తాను ఆర్‌ఎఫ్ ఇంజినీరింగ్ చేశానని, షాదాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజిలో బీటెక్‌ చేశానని సయ్యద్‌ సుజా పేర్కొన్నారు. అయితే ఆయన తన కుటుంబ నేపథ్యం గురించి వివరాలు వెల్లడించలేదు.

evm 23012019

రెండు రోజుల క్రితం, లండన్‌లో జరిగిన ఈవీఎం హ్యాకథాన్‌లో అమెరికా సైబర్ నిపుణులు సయ్యద్ సుజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వెల్లడించారు. రిలయెన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ సాయంతో ఫ్రీక్వెన్సీ తగ్గించి ఈవీఎంలను హ్యాక్ చేశారని సుజా ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే మరణానికి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు లింక్ ఉందని ఆరోపించారు. భారతదేశంలో 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అమెరికా సైబర్ నిపుణులు సయ్యద్ సుజా ఆరోపించారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్,రాజస్థాన్, చత్తీస్ గడ్, ఢిల్లీ ఫలితాలను రిగ్గింగ్ చేయడం జరిగిందని సుజా తెలిపారు. మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీని విడుదల చేసి మాడ్యులేటర్‌తో ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని లండన్‌లో జరిగిన ఈవీఎం హ్యాకథాన్‌లో సయ్యద్ సుజా తెలిపారు.

ప్ర‌ధాని మోదీ వ్య‌తిరేక ప‌క్షాల స‌భ అమ‌రావ‌తిలో నిర్వ‌హ‌ణకు ముహూర్తం ఖ‌రారైంది. ఫిబ్ర‌వ‌రి 13న అమ‌రావ‌తి స‌భ నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యించిన బాబు ఆహ్వానాలు పంపుతున్నారు. క‌ల‌క‌త్తాలో తృణ‌మూల్ అధినేత్రి ..ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నిర్వ‌హించిన స‌భ‌కు ధీటుగా అమ‌రావ‌తిలో భారీ స‌భ ను నిర్వ‌హించాల‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇందు కోసం అమ‌రావ‌తి స‌భ‌ను ఫిబ్ర‌వ‌రి 13న ముహూర్తంగా ఖ‌రారు చేసారు. ఇందులో భగంగా, చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై లోక్‌సభ ఎన్నికలకు మహాకూటమిని సిద్ధం చేయటం గురించి చర్చించారు. కోల్‌కత్తాలాంటి ర్యాలీని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిర్వహించటం గురించి వారు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

amaravati 23012019

తెలుగుదేశం పార్టీ ఫిబ్రవరి 13న అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ధర్మపోరాట సమావేశానికి రాహుల్ గాంధీని చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు రాహుల్ అంగీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన అనంతరం విమానాశ్రయం నుండే దావోస్‌లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసిన సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఆ తరువాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను కలిసి ఫిబ్రవరి ఒకటో తేదీన ఏపీ హైకోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావల్సిందిగా ఆహ్వానించారు. న్యాయమూర్తులు సుభాషిణీ రెడ్డి, రావు నాగేశ్వరరావు తదితరులను కలిసి హైకోర్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాలను అందజేశారు. తదనంతరం రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి మహాకూటమిపై చర్చించారు.

amaravati 23012019

ఆంధ్రప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో మహాకూటమి ర్యాలీలు, బహిరంగ సభలు ఏర్పాటు చేయటం, మహాకూటమి ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేయటం, ఎన్నికల ప్రచార సరళి తదితర అంశాలపై ఆయన రాహుల్ గాంధీతో సమాలోచనలు జరిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత వారం కోల్‌కత్తాలో నిర్వహించిన భారీర్యాలీ, ఆ తరువాత ప్రతిపక్ష నాయకులు జరిపిన చర్చల వివరాలను ఆయన రాహుల్ గాంధీకి వివరించారని అంటున్నారు. రాహుల్ నాయకత్వాన్ని మమత వ్యతిరేకించటం తెలిసిందే. ప్రధాన మంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించకుండా ఎన్నికల అనంతరం ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావచ్చునని మమతా బెనర్జీ చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు, రాహుల్ చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు నాయకులు ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలను వివాదాస్పదం చేయటం తదితర అంశాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. కోల్‌కత్తా లాంటి ర్యాలీలను ఇతర రాష్ట్రాల్లో నిర్వహించటం ద్వారా మహాకూటమిని పటిష్టం చేయాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read