నేరాలు, ఘోరాలలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ మరో  ఆందోళనకర అంశంలో మొదటి స్థానంలోకి వచ్చింది. అభివ్రుద్ధిలో అథమస్థానంలో కొనసాగుతూ అన్నదాతల ఆత్మహ-త్యల్లో అగ్రస్థానంలోకి ఎగబాకింది. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రైతుల బలవన్మరణాలు రెండింతలు పెరిగాయని పార్లమెంటు సాక్షిగా గణాంకాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా రైతులు ఆత్మహ-త్య చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో వుండటం ఆందోళన కలిగిస్తోంది.  టిడిపి పాలనలో 2017లో 375 మంది, 2018లో 365 మంది రైతుల ఆత్మహ-త్యలు చేసుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతుల ఆత్మహ-త్యలకు పాల్పడ్డారు. ఇది ఇలా ఉంటే, జగన్ గారి సాక్షి మాత్రం, చంద్రబాబు హయాంలోనే మా పాలన కంటే ఎక్కువ ఆత్మహ-త్యలు అంటూ, పార్లమెంట్ లో చెప్పిన దాన్నే ఫేక్ చేసి పడేసారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ1గా వున్న నిందితుడు ఎర్ర గంగిరెడ్ది బెయిల్ రద్దుపై విచారణను జనవరి 3కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ హత్యకేసు విచారణని తెలంగాణ రాష్ట్రానికి మార్చుతూ ఇటీవల అత్యున్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం వెలువరించడంతో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు కీలకం కానుంది. సిబిఐ దర్యాప్తునకు ముందే ప్రధాన నిందితుడు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సిబిఐ సవాలు చేయగా, బెయిల్ ఇవ్వడాన్ని కోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంలో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ ఎం ఆర్ షా,జస్టిస్ సిటి రవికుమార్  ధర్మాసనం.. ఈ కేసులో వాదనలు మరింతగా వింటామని జనవరి 3కి వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి మరింత దూరం కానుంది. పోలవరాన్ని సోమవారంగా మార్చి 70 శాతం పనులు పూర్తి చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోగానే పోలవరానికి ఆటంకాలు మొదలయ్యాయి. వైసీపీ సర్కారు తెచ్చిపెట్టిన వివాదాలు, రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టుకి గ్రహణం పట్టింది. వైసీపీ ఇరిగేషన్ మంత్రులు మాత్రం 2020,2021,2022లో పోలవరం పూర్తి చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అయితే పోలవరం ఇప్పట్లో పూర్తి కావడం అసాధ్యం అంటూ కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. లోక్‌సభలో ఏపీకి చెందిన ఎంపీలు కేశినేని నాని, లావు కృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్‌లు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు, కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి భిశ్వేశ్వర్ జవాబు ఇస్తూ..పోలవరం నిర్మాణం 2024 లోపు పూర్తి కాదని తేల్చేశారు. 2024కి పోలవరం పూర్తి చేయాలనుకున్నామని.. అయితే వరసగా వచ్చిన భారీ వరదలలో పనులు ముందుకు సాగలేదని ఆ సమాధానంలో కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read