ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరితో అమరావతి రైతులు పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ఎదురు భుములిచ్చిన రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఇప్పటి వరకు ఎంత పోరాడినా , కాళ్ళు అరిగేలాగా పాదయాత్రలు చేసినా ప్రభుత్వం మాత్రం తమ మొండి వైఖరిని వదులుకోవడం లేదు. ప్రభుత్వ పని తీరుకు నిరసనగా, దేశ రాజధానిలో తమ గళం విప్పాలని అమరావతి రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న ఢిల్లీలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్టు అమరావతి జేఏసి తెలిపింది. డిసంబర్ 15కి అమరావతి రైతులు ఉద్యమం మొదలుపెట్టి మూడు సంవత్సరాలు పూర్తి కావడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విస్తృత స్థాయిలో నిరసనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో పోరాడిన రైతులు , ఈ సారి కేంద్రం దగ్గర తమ నిరసన గళం వినిపిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. దీని కోసం ప్రత్యేక రైలులో విజయవాడ నుంచి 1700 మంది వెళ్తున్నామని తెలిపారు. డిసంబర్ 17 న జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ తరువాత రోజు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ఎంపీలకు వినతిపత్రాలు అందచేస్తామని తెలిపారు. రైతుల చేస్తున్న ఈ న్యాయపోరాటం లో ఈ సారైనా రాష్ట్రం ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి..
news
అమరావతి పై రాజ్యసభలో సంచలన ప్రకటన చేసిన కేంద్రం...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక్కటే అంటూ, మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభ సాక్షిగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక్కటే అని, అమరావతి మాత్రమే అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని గుర్తించి, దానికి ఇప్పటికే రూ.2500 కోట్లు ఇచ్చినట్టు కేంద్రం రాజ్యసభలో తెలిపింది. అమరావతి మాత్రమే రాజధాని అని కేంద్రం చెప్పటం ఇది మొదటి సారి మాత్రమే కాడు. ఈ రోజు రాజ్యసభలో కానీ, గతంలో హోంశాఖ సమావేశంలో కూడా ఏపి మూడు రాజధానులు అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. కేవలం ఒక్క రాజధాని మాత్రమే అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అములు, దీనికి కేంద్రం అందిస్తున్న సాయం పై, రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. దీనికి కేంద్రం సమాధానం చెప్తూ, విభజన హామీ చట్టంలోని నిబంధనలు, నీతి ఆయోగ్ సిపార్సుల మేరకు ఏపీకి సాయం అందిస్తున్నామని చెప్పింది.
రీసోర్స్ ఫండింగ్ గ్యాప్ కింద రూ.5,617.89 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కింద రూ.1750 కోట్లు, నూత రాజధాని నిర్మాణం కోసం రూ.2500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.13,226 కోట్లు, విదేశీ సాయం కింద చేపట్టిన ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలు, వడ్డీల కింద రూ.15.81 కోట్లు, ఇలా ఇప్పటి వరకు మొత్తం 23,110.472 కోట్లు సాయం అందించామన్న కేంద్రం చెప్పింది. రాజ్యసభలో కేంద్రమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే ఇచ్చినవి చెప్పారు కానీ, ఇంకా ఇవ్వనవి చాలానే ఉన్నాయి. పదేళ్ళ కాల పరిమితితో విభజన చట్టం ఉండగా, ఇప్పటికే 9 ఏళ్ళు అయిపోయాయి. మరో ఏడాది మాత్రమే మిగిలి ఉంది. రాబోయే బడ్జెట్ చివరి బడ్జెట్. మరి కేంద్రం ఎంత మేరకు ఆ విషయాలు అని నెరవేరుస్తుందో చూడాలి. మెడలు వంచి తెస్తాం అని వైసీపీ ఎంపీలు మౌనంగా ఉండి పోయారు. ఇక రాష్ట్రంలో ప్రజలు కూడా విభజన హామీల పైన పెద్దగా పట్టించుకోవటం లేదు. ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి మరి..
ఇంత స్కాం చేసారా ? మరో బాంబు పేల్చిన పయ్యావుల కేశవ్..
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ నిర్ణయాల వల్ల విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని, మరో సంచలన విషయం బయట పెట్టారు. అన్ని రాష్ట్రాలు తిరస్కరించిన సెకీ టెండర్లను ఏపీ మాత్రమే ఖరారు చేసిందని, ఇందులో మతలబు ఏంటో జగన్ చెప్పాలని పయ్యావుల అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జరగలేదని కమిటీలు తేల్చాయని, జగన్ మాత్రం ఏదో అవినీతి జరిగిందని ప్రచారం చేశారని పయ్యావుల అన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల పై ఎన్నో విచారణలు వేసి ఏమీ తేల్చలేకపోయారని పయ్యావుల గుర్తు చేసారు. ఇక పోతే ప్రైవేటు సంస్థల్లో తయారయ్యే విద్యుత్ ను ఏపీలో అందుబాటులో ఉన్న విండ్ ఎనర్జీని నిలిపివేసి ప్రైవేట్ సంస్థల దగ్గర అధిక రేటుకు విద్యుత్ కొన్నారని, పయ్యావుల సంచలన ఆరోపణలు చేసారు. జగన్ తప్పుడు నిర్ణయంతో ప్రజలు అధిక బిల్లులు చెల్లించాల్సి వచ్చిందని, దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు.
జగన్ సన్నిహితులకు పంప్డ్ స్టోరేజ్ విధానంలో ఆస్తులు కట్టబెట్టారని, కేంద్రం ఆదేశాలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా పంప్డ్ స్టోరేజ్ ఒప్పందాలు, కేటాయింపులున్నాయిని పయ్యావుల చేసిన ప్రకటనతో, ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కి పడింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడతారా? అని పయ్యావుల ప్రశ్నించారు. ప్రజా ఆస్తులు ఏకపక్షంగా మీవాళ్లకు కట్టబెడతారా? అని నిలదీశారు. టెండర్లు పిలవకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో కట్టబెడతారా?, డబ్బులేమో ప్రజలు చెల్లించాలి.. ఆదాయం మీకు కావాల్సిన వ్యక్తులకా? అంటూ పయ్యావుల విరుచుకు పడ్డారు. విద్యుత్ రంగంలో మేము లేవనెత్తిన ఒక్క అంశంపైనైనా స్పందించారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు జగన్ చెబుతున్నది వాస్తవమైతే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నిలదీశారు. మరి దీని పై జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
ఒక్క దెబ్బతో వైసీపీ బండారం మొత్తం బయట పెట్టిన కేశినేని నాని...
లోకసభలో మరోసారి జగన్ మెడలు వంచుడు కార్యక్రమం బట్టబయలు అయ్యింది. ఈ రోజు లోకసభలో ఏపీకి ప్రత్యేక హోదా లేదని పరోక్షంగా కేంద్రం తేల్చి చెప్పింది. 14, 15 ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు నిధులు అందిస్తున్నామన్న కేంద్రం చెప్పింది. ఇక ప్రత్యేక హోదా సహా ఏపీకి సంబంధించిన అంశాలపై పార్లమెంటులో టీడీపీ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. వివిధ అంశాలపై టీడీపీ ఎంపీలు సభలో ప్రస్తావించగా, జగన్ భాగోతం మొత్తం బయట అపడింది. లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రస్తావించారు. విభజన చట్టంలోని హామీల అమలుపై రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ లేవనెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయా అని కేంద్రాన్ని కేశినేని నాని ప్రశ్నించారు. విభజన కారణంగా ఏపీ ఆర్థికంగా చాలా నష్టపోయిందన్న కేశినేని నాని, హోదా అంశాన్ని లేవనెత్తారు.
విభజన నష్టాన్ని పూరించేందుకు తీసుకున్న చర్యలపై కేంద్రాన్ని కేశినేని నాని ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేర్చేందుకు సాయం చేస్తున్నారా అని ఎంపీ కనకమేడల కేంద్రాన్ని ప్రశ్నించ్గారి, హామీల అమలు కోసం అందిస్తున్న నిధుల వివరాలపై ఎంపీ కనకమేడల కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే దీని పై కేంద్రం పాత పాడే పాడింది. కేంద్రాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అని చెప్పిన వైసీపీ ఎంపీలు, కనీసం చిన్న చిన్న పనులు కూడా చేయటం లేదు. కనీసం నిరసన కూడా తెలపటం లేదు. దాదాపుగా రెండు సభల్లో 28 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై కేంద్రాన్ని కనీసం ప్రశ్నించటం లేదు. మరో ఏడాదిలో విభజన బిల్లు గడువు కూడా ముగిసిపోతుంది. ఈ తరుణంలోనే టిడిపి ఎంపీలు, కేంద్రాన్ని నిలదీస్తున్నారు. వైసీపీ ఎంపీలు మత్రం, ఎందుకో మరి, ఈ అంశాల పై నిలదీయటానికి భయ పడుతున్నారు. ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం వరుకే మనం చేయగలిగింది అని ఇప్పటికే జగన్ గారు చెప్పిన విషయం తెలిసిందే.