గుంటూరు జిల్లాలో పర్యటించిన టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి అడుగడుగునా అఖండ స్వాగతం లభించింది. పెదకాకాని నుంచి ఆరంభమైన టీడీపీ కార్యకర్తల బైక్ ర్యాలీ బుడంపాడు, నారా కోడూరు, చేబ్రోలు మీదుగా పొన్నూరు వరకు సాగింది. రహదారులన్నీ పసుపుమయమయ్యాయి. జనసంద్రంని తలపించిన అభిమానుల్ని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. తన సభలకు జనం స్వచ్ఛందంగా వస్తున్నారని, బలవంతంగా తరలిస్తూ..నిర్బంచినా జగన్ సభల నుంచి జనం పారిపోతున్నారని పేర్కొన్నారు. సభలకి రాకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూన్న జగన్ పవర్ తొందరలోనే కట్ చేస్తామన్నారు.  రాజకీయంగా ఎదుర్కోలేక ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేయించారన్నారు. అమూల్ బేబీ జగన్ రెడ్డి గుజరాత్ అమూల్ మనకు వద్దు, రైతుల సంఘం సంగం మనకి ముద్దు అన్నారు. సైకో పాలన అంతమొందించి, సైకిల్ పాలన తీసుకురావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

భయమో తెలియదు. ముందు జాగ్రత్తో తెలియదు. తన కోటరీలోనూ, సీఎంవోలోనూ పనిచేసి రిటైరైన ప్రతీ అధికారి తన చుట్టూనే వుండేలా చూసుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా తన సర్కారు తీసుకున్న నిర్ణయాలకు గంగిరెద్దులా తలూపిన అందరికీ అందలం ఎక్కించిన సీఎం, వారు పదవీ విరమణ చేసినా ఏదో ఒక కీలక పదవి కట్టబెట్టి తన వద్దే ఉంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర కీలక పదవులు నిర్వహించిన బ్యూరోక్రాట్లు అంతా రిటైర్ అయ్యాక మరో కీ పొజిషన్లో కూర్చుంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పదవీ విరమణ తరువాత అవకాశం వున్నంతవరకూ ఎక్స్ టెన్షన్ ఇవ్వడం, సాధ్యం కాకపోతే వారి కోసం కొత్త పోస్టు సృష్టించడం, లేదంటే ఏదో ఒక విభాగానికి సలహాదారులుగా నియమిస్తున్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీలుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక్కొక్కరికీ ఒక్కో అందలం అందుతోంది. టిడిపి ప్రభుత్వంలో సీఎస్ గా పనిచేసిన అజయ్ కల్లం జగన్ ప్రభుత్వం రాగానే సలహాదారుడు పోస్టు దక్కించుకున్నారు. నీలం సహాని చీఫ్ సెక్రటరీ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విధుల్లో చేరిపోయారు.

jagan 08122022 2

చీఫ్ సెక్రటరీ పదవీ కాలం ముగియగానే ఆదిత్యనాథ్ దాస్ న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే రెండుసార్లు ఎక్స్ టెన్షన్ లభించిన సమీర్ శర్మ సీఎస్ గా పదవీ విరమణ చేశారు. కాలుష్యనియంత్రణ మండలి చైర్మన్ గానూ, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మను నియమించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రణాళికా విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా రిటైరైన జీఎస్ఆర్ కేఆర్ విజయకుమార్ ని స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. డిజిపిగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ ని ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారు. రిటైరైన ఉన్నతాధికారులు తన సర్కారు గుట్టుమట్లు బయటపెట్టకుండా, తనకు విధేయులుగా పడి వుంటారనే ఇలా పదవులు కట్టబెడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్ర విభజనపై అభ్యంతరంలేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాయర్ సుప్రీంకోర్టులో చెప్పడం ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతితో పాటు ఏపీ విభజనపై సుప్రీంకోర్టులో దాఖలైన  22 మంది పిటిషన్ల విచారణ సందర్భంగా రాష్ట్ర విభజనకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టులో చెప్పడాన్ని ఉండవల్లి తప్పుబట్టారు. ఇదంతా జగన్కు  తెలిసే జరిగితే.. ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టేనన్నారు. రాష్ట్ర విభజన సమయంలో విభజనకు తాను వ్యతిరేకమని.. విభజన జరగనివ్వమని జగన్ చెప్పారని ఉండవల్లి గుర్తు చేశారు. ఆ సందర్భంలో పార్లమెంట్ బహిష్కరించిన 16 మందిలో జగన్ మోహన్ రెడ్డి కూడా వున్నారని తెలిపారు. విభజనలో ఏపీకి జరిగిన  అన్యాయాన్ని ప్రభుత్వం తరపున జగన్ సుప్రీం కోర్టుకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.  విభజనతో ఏపీకి జరిగిన నష్టంపై జగన్ మాట్లాడకుంటే రాజకీయ భవిష్యత్ లేనట్టేనని కుండబద్దలు కొట్టారు ఉండవల్లి అరుణ్ కుమార్.

వైసీపీ అంటే బీజేపీ బ్రాంచి ఆఫీసు అన్నంతగా తెరవెనుక సహకారాలు, బహిరంగంగా కారాలు మిరియాలు ఏపీ ప్రజలకి చూసీ అలవాటైపోయింది. దేశంలో ఏపీ ఇతర రాష్ట్రాలు పరిమితి దాటి అప్పుచేయకపోయినా కేంద్రం రుణ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఏపీ మాత్రం ఏడాదిలో చేయాల్సిన రుణం నెలలో చేసేసినా ఆంక్షలు లేవు. అప్పుల అనుమతులు ఆగడంలేదు. చివరికి వేలకోట్లు ఏమయ్యాయో కాగ్ నిలదీసిన కేంద్రం ఆశీస్సులతో నడిపించేస్తుంది వైసీపీ సర్కారు. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐని బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనుకాడలేదు వైసీపీ పెద్దలు. అయినా కేంద్రం కరుణాకటాక్షానికి లోటు లేదు. వైసీపీ సర్కారు ఏర్పడి నాలుగేళ్ల పూర్తి కావొచ్చే తరుణంలో రాష్ట్రంలో స్పష్టమవుతోన్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ఢిల్లీలో ఫ్యాన్ స్పీడుకు బీజేపీ రెగ్యులేటర్ బిగించింది. జనం జగన్ రెడ్డికి దూరం అవుతున్నారంటేనే, కొత్త సమీకరణాలకు బీజేపీ పెద్దలు సరికొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నారన్న మాటే.

delhi 08122022 2

విజయసాయిరెడ్డి కోరిందే పదవిలా కేంద్రం లెక్కకు మించి కమిటీల్లో సాయిరెడ్డిని అందలం ఎక్కించింది. తాజాగా ప్యానల్ స్పీకర్ నియమించిన రోజుల్లోనే తొలగించింది. సాయిరెడ్డి అల్లుడు అన్న అరబిందో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు కావడం నుంచి ఢిల్లీలో వైసీపీ ప్రభ మరింత తగ్గిపోవడం మొదలు అయ్యిందని విశ్లేషకుల మాట. ఏపీ చేస్తున్న ఎడాపెడా రుణాలపై కూడా ఆంక్షలు మొదలయ్యాయి. ఇటీవల వెయ్యి కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి, కేంద్రం తిరిగి లాగేసింది. ఢిల్లీకి వచ్చిన జగన్ రెడ్డిని చెల్లెలు షర్మిల అరెస్టు విషయంలో పట్టించుకోలేదు ఎందుకని నిలదీయడం, వెనువెంటనే షర్మిలకి ప్రధాని మోదీయే నేరుగా ఫోన్ చేయడంతో వైసీపీకి ఎదురు దెబ్బ.

Advertisements

Latest Articles

Most Read