వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావదం ఏపీ రాజకీయాల్లో వేడిని పుట్టించింది. ఎన్నికలకు షెడ్యూల్‌ కూడ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాజకీయగా తమకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గాను టీడీపీ కూడ వైసీపీపై వ్యూహత్మకంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన టీఆర్ఎస్‌తో జగన్ జత కడుతున్నారంటూ టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దమౌతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వేలు పెట్టినందుకు గాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ గిఫ్ట్ తీసుకొనేందుకు తాను సిద్దంగా కూడ ఉన్నానని బాబు కూడ ప్రకటించిన విషయం తెలిసిందే.

tdpcounter 16012019

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కేసీఆర్ టచ్‌లోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే చలా కాలంగా టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న వైఎస్ జగన్‌తో హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. జగన్ తో కేసీఆర్ కూడ త్వరలోనే సమావేశం కానున్నారు. ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్‌తో వైసీపీ జతకట్టడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. ఇదే విషయాన్ని ప్రజల్లో ప్రచార అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దమైంది. ఏపీ ప్రజలకు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రయత్నాలను టీడీపీ నేతలు ఎత్తిచూపుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 2017లో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడ టీడీపీ విడుదల చేసింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ కుమ్మక్కైందని కూడ టీడీపీ ఆరోపణలు చేసింది. పోలవరం ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకొనేందుకు పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ సభ్యులు అడ్డుకొన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

tdpcounter 16012019

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకుండా టీఆర్ఎస్ అడ్డుపడుతున్నా ఈ విషయాలపై వైసీపీ ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలని టీడీపీ ప్రస్తావిస్తోంది. విద్యుత్ ఉద్యోగుల విభజన, ఏపీ రాష్ట్రం ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఉపయోగించుకొని డబ్బులివ్వమని తెలంగాణ చేతులు ఎత్తేసిందని మంత్రి దేవినేని ఉమ మహేశ్వర్ రావు గుర్తు చేశారు. కేటీఆర్ తో భేటీ సందర్భంగా ఈ విషయాన్ని జగన్ ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అయితే తెలుగుదేశం దూకుడు చూసి, జగన్ మోహన్ రెడ్డి రాత్రికి రాత్రి ప్లాన్ మార్చారని తెలుస్తుంది. ఇంతే దూకుడుగా, చంద్రబాబు గతంలో కాంగ్రెస్ పై చేసిన విమర్శలతో ప్రచారం చెయ్యాలని, చంద్రబాబు చేసింది కరెక్ట్ అయినప్పుడు, మనం చేసిందీ కరెక్ట్ అనే అభిప్రాయం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు చెప్పారు. అయితే చంద్రబాబు, కాంగ్రెస్ ఎప్పుడూ రాజకీయ విమర్శలే చేసుకునే వారు, కాని కేసీఆర్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, తన రాజకీయ పునాది, ఆంధ్రా ప్రాంతం పై, రాష్ట్రం పై ద్వేషంతో, హేళనతోనే చేస్తాడు, ఇది ఆంధ్రా ప్రజలకు బాగా గుర్తుంది. జగన్, ఈ లాజిక్ మర్చిపోయారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు జంపింగ్‌‌లు షురూ చేశారు. ఓ వైపు అధికార పార్టీ.. మరోవైపు ప్రతిపక్ష పార్టీ రెండూ కూడా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి కండువా కప్పుకునేందుకు ఎవరొచ్చినా కాదనకుండా సాదరంగా ఆహ్వానించేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇన్నాళ్లు ఆయా పార్టీలకు దూరంగా ఉంటున్న నేతలు సైతం 2019 ఎన్నికలతో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు అధికార, ప్రతిపక్ష పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ బలంగా ఉంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇలా అన్నీ అలోచించి, అడుగులు వేస్తున్నారు.

ahmadulla 16012019 2

తాజాగా.. మాజీ మంత్రి, కడప జిల్లా కీలక నేత హాజీ అహ్మదుల్లా కాంగ్రెస్‌‌కు బైబై చెప్పి సైకిలెక్కిందుకు సిద్ధమయ్యారు. గురువారం నాడు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో అహ్మదుల్లా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. రాష్ట్ర విభజనాంతరం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. టీడీపీ నేతలకు టచ్‌‌లో ఉన్నారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన టీడీపీతోనే రీ-ఎంట్రీ ఇవ్వాలని భావించి కీలక నేతలతో చర్చించిన అనంతరం సైకిలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈయన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఒకసారి భేటీ అయిన విషయం విదితమే. ఈ భేటీలోనే టికెట్ వ్యవహారంపై చర్చించారని.. కడప అసెంబ్లీ ఫిక్స్ చేశారని సమాచారం.

ahmadulla 16012019 3

కాగా.. 2004, 2009 ఎన్నికల్లో అహ్మదుల్లా ఇదే కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసి రెండుసార్లూ గెలుపొందారు. అప్పట్లో ఒక దఫా ఏపీ కేబినెట్‌‌లో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2014 ఎన్నికలకు పూర్తిగా దూరమైన అహ్మదుల్లా తాజాగా టీడీపీతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి అంజద్ భాషా 45వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. గత ఏడాది నవంబర్ 27వ తేదీన అహ్మదుల్లా తన కొడుకు అష్రఫ్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. వచ్చే ఎన్నికల్లో అహ్మదుల్లా టీడీపీ అభ్యర్థిగా కడప నుండి పోటీ చేయనున్నారు.రేపు చంద్రబాబునాయుడు సమక్షంలో అహ్మదుల్లా ఆయన తనయుడు ఆష్రఫ్ టీడీపీలో చేరనున్నారు.

 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, చెలరేగిపోయారు. ఎప్పుడూ ఎన్నికలు ముందు వచ్చే పాల్, ఈ సారి కూడా ఎన్నికల ముందు ఎంట్రీ ఇచ్చారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మరింత డోస్ పెంచిన పాల్.. అసలు టీడీపీ, వైసీపీలకు డిపాజిట్లు రావని ఏపీకి కాబోయే సీఎంను తానేనని ఆయనకు ఆయనే జోస్యం చెప్పుకున్న సందర్భాలు గత నెల రోజులుగా కోకొల్లలు. అంతటితో ఆగని ఆయన ఏపీలో తమ పార్టీ ఎవ్వరికీ మద్దతివ్వదని.. మాతో కలసి పనిచేయాలనుకున్న పార్టీకి ఐదో, పదో సీట్లిస్తామని కూడా చెప్పుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల భేటీ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై తాజాగా కేఏ పాల్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

kapaul 16012019

టీఆర్‌ఎస్ నేత కేటీఆర్, వైసీపీ అధినేత జగన్ భేటీతో ఏపీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ గెలుపు ఖాయమైందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. జగన్‌కు సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తే డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. " వైఎస్ జగన్- కేటీఆర్ కలిసినందుకు ధన్యవాదాలు. వైఎస్ జగన్‌‌ తరఫున టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేయాలని కోరుతున్నాను. సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తే జగన్ పార్టీకి డిపాజిట్లు దక్కవు. తెలంగాణలో కూటమి తరపున చంద్రబాబు ప్రచారం చేసినందుకే అక్కడ కూటమికి డిపాజిట్లు కూడా రాలేదు. చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలిచేది ప్రజాశాంతి పార్టీనే. జగన్ లక్ష కోట్లు దోచుకున్నట్లు రుజువైంది. జగన్‌పై 12 ఈడీ కేసులు ఉన్నాయి. కేసీఆర్‌కు నేను ఆంటే చాలా అభిమానం" అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

kapaul 16012019

అంతటితో ఆగని పాల్ బీజేపీకి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. "కన్నా లక్ష్మీనారాయణను నేను కలిసిన సమయంలో టీఆర్ఎస్‌కు మద్దతు ఇమ్మని అడిగారని.. ఆయన ఎందుకిలా అన్నారో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చాలా క్లారిటీగా అర్థం అయింది. వైఎస్ జగన్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మూడు ఒక్కటే. నా మీద అవినీతి ఫైల్స్ ఉంటే కేసులు వేసుకోండి.. ఇది బీజేపీకి నా ఓపెన్ ఛాలెంజ్. ప్రధాని మోదీకి నాకంటే గతంలో సన్నిహితులు ఎవరూ లేరు. గత ఎన్నికలకు ముందు బీజేపీకి నేను మద్దతు ఇస్తుంటే ఎల్‌కే అద్వానీ వద్దు అన్నారు. మోడీ మోసగాడు నన్నే మోసం చేశారు.. ఆయన్ను నమ్మొద్దు అని అద్వానీ నాతో స్వయంగా అన్నారు. ఇప్పుడు అదే మోసపూరిత రాజకీయాలు ఏపీలో కూడా మోడీ చేస్తున్నారు" అని పాల్ సంచలన ఆరోపణలు చేశారు.

కెసిఆర్ జగన్ దగ్గరకు వచ్చాడు.... జగన్ కెసిఆర్ దగ్గరికి వెళ్ళలేదు! కాంక్రీట్ పనుల్లో పోలవరం ప్రాజెక్ట్ గిన్నిస్ రికార్డు స్థాపించటం, పోలవరం విషయములో ప్రజల్లో ఒక స్పష్టత రావటానికి దోహదపడింది. దేశవ్యాప్తంగా మీడియాలో చర్చకు దారి తీసింది. అసలు గిన్నీస్ బుక్ వాళ్ల్లు ఆంధ్ర ఎందుకు వచ్చారో అర్ధం చేసుకునే లోపే పెన్షన్లు డబల్ అవ్వటం. పెన్షన్లు విషయములో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామాల్లో ఒక రకమైన సునామీని సృష్టించింది. ఎక్కడ చూసిన దీనిపైనే చర్చ. దీన్ని ఎలా తట్టుకోవాలో, ఎలా ప్రజలను ఈ చర్చలనుండి డైవర్ట్ చెయ్యాలో ఆలోచిస్తూ అప్పిరితిప్పిరి అయ్యి తీసుకుంటున్న నిర్ణయాలు పాపం ఫ్యాన్ పార్టీకి, ఇటు కార్ పార్టీకి మంచికంటే చెడె ఎక్కువ చేస్తున్నాయి.

jagankcr 16012019

ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల క్రితం సామజిక మీడియా వేదికగా జరిగిన విషయం పైన అప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు కంప్లైంట్ చెయ్యటంతో ... ఇన్ని రోజులు సామజిక మీడియాకే పరిమితమైన అంశం ఇప్పుడు ప్రైమ్ మీడియా (ఎలక్ట్రానిక్, ప్రింట్) లోకి వచ్చి, రాష్ట్రములో ప్రతి ఒక్కరు దీని పై చర్చించటంతో ఈ విషయముతో సంబంధం ఉన్న ఇద్దరి వ్యక్తిత్వాలపైనా మరక పడే పరిస్థితి. ఆ పార్టీని అభిమానించే మహిళలలో అనేకమంది .. 'ఛీ... ఏంటిది' అంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు. ఇక, జగన్-కే.టి.ఆర్. భేటీ కేవలం ఫ్యాన్ పార్టీ క్యాడర్ లో దిగజారిపోతున్న నమ్మకాన్ని, ధైర్యాన్ని నిలబెట్టటం కోసం తప్ప మరిదేనికి కాదు. ఫెడరల్ ఫ్రంట్ లోకి ఎప్పుడైతే జగన్ ను కెసిఆర్ ఆహ్వానిస్తాడో, ఆ ఫ్రంట్ గురించి ఇప్పటివరకు అంతో, ఇంతో ఆలోచిస్తున్న ఇతర పార్టీలు కూడా జంప్ జిలాని అంటాయి.

jagankcr 16012019

తమకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని వదిలి, ఆ పార్టీ పైనే దాడి చేస్తున్న జగన్, తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో కలుపుతాను అని హామీ ఇచ్చి, తెలంగాణ ఇచ్చాక, కాంగ్రెస్ పార్టీ నుండీ గెలిచిన వారిని కూడా తమలో కలిపేసుకుని తెలంగాణ క్రెడిట్ ఆ పార్టీకి ఏ మాత్రం దక్కకుండా చేసిన కెసిఆర్. మరో ముఖ్యమైన విషయం... ఈ ఫ్రంట్ భాజపాకు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడుతుంది అని కెసిఆర్ చెబుతున్న మాటలను నమ్మేవారు ఎవరు లేరు. కెసిఆర్ కు తెలంగాణాలో 17 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ టి.ఆర్.ఎస్. 17 గెలిచాడు అనుకున్నా, ఆ సీట్లు కేంద్రంలో తాను పెత్తనం చెయ్యటానికి ఉపయోగపడతాయో లేదో తెలియని పరిస్థితి. అందువలన ఇప్పుడు జగన్ అవసరమయ్యాడు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను, ఇతర నాయకులను కలిసినా పెద్ద ఉపయోగం కనపడలేదు. ఈ మాట ఎందుకంటున్నాను అంటే "కమాండ్ చేసే స్థాయిలో కెసిఆర్ అనే, ఈ రోజు జగన్ ప్రగతి భవన్ కు వెళ్ళేవాడు, కెసిఆర్ లోటస్ పాండ్ కు వచ్చేవాడు కాదు.

Advertisements

Latest Articles

Most Read