ఏడ్చేవాడు ఒకడు, కూల్చేవాడు ఒకడు... ఇద్దరూ కలిసారు. ఆంధ్రప్రదేశ్ నాశనం కోరుతున్నారు. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు భేటీ గురించి తెలిసిందే. అయితే కొంత మంది జగన్ అభిమానులు గుడ్డిగా, రాష్ట్రాన్ని కాకుండా, కేవలం జగన్ అనే వాడిని సమర్ధిస్తూ ఉండటం, ప్రజల్లో కూడా ఏమైనా అపోహలు ఉంటే అవి పటా పంచలు చెయ్యటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎంపీ కవిత వేసిన కేసు ప్రతిని విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై స్టే ఇవ్వాలంటూ గతంలో కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మన జీవనాడి పై మొదటి నుంచి కేసీఆర్ కు అక్కసు ఉండి.

jagan ktr 16012019

ఇదే విషయం దేవినేని ఉమా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు ఒరిస్సా ప్రభుత్వంతో కెసీఆర్ చేతులు కలిపారని సుప్రీంకోర్టులో ఎన్జీటిలో కేసులు వేయించారని ఆస్తులు విభజనపై పేచీలు పెడుతూ ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన కెసిఆర్ జగన్ పక్షాన చేరి పండగ రోజు కుట్రలు చేశారని మంత్రి అన్నారు. 42 ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టిన కేసీఆర్ తో కలిసి జగన్ సంఖ్యా బలం గురించి మాట్లాడుతున్నారని ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే వైసీపీ సీటు అని 20 కోట్లు ఇస్తే రజినీలు అభ్యర్థులవుతారని, 33 కోట్లు ఇస్తే రమేష్ లు పోయి కృష్ణ ప్రసాద్ లు వస్తారని ఎద్దేవా చేశారు. దమ్ము గా ధైర్యంగా రాజకీయం చేస్తూ సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు వెళ్తున్నామని ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోతుందని చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచితే మాకు ముందే సంక్రాంతి వచ్చిందని ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి 72 గంటల నుంచి జగన్ కు నిద్ర పట్టడం లేదని నిద్రలేమితో నేడు ఆంధ్రప్రదేశ్ బయట ఆంధ్ర ప్రదేశ్ పై పండగపూట కుట్ర రాజకీయాలకు తెరలేపారని మంత్రి దేవినేని అన్నారు.

jagan ktr 16012019

ఏపీ ఎదగకూడదని ఏడ్చేవాడితో, కూల్చాలనుకునేవాడి భేటీ అడుక్కునే వాడికి అరవై కూరలన్న ట్లు...ఆంధ్రాలో అవినీతితో దోచుకున్న సొమ్ముతో నగిషీ కుర్చీలు, టేబుళ్ళూ, టీపాయిలు, కుషన్ సీట్లపై కూర్చుని ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎలా దెబ్బ తీయాలి...ఏపీ అభివృద్ధిని ఏమేరకు నాశనం చేయాలి...ఆంధ్రా ఉన్నతిని ఎలా అడ్డుకోవాలన్న కుట్ర రాజకీయాలు, కుతంత్రాలు...ఇవేకదా కేటీఆర్, జగన్ ల దుష్టరాజకీయం...మరో సెల్ఫ్ గోల్ కి రెడీ అవుతున్న జగన్ ...చెడే వాడిని ఎవరూ బాగు చేయలేరంటే ఇదే...తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు...ఆంధ్రులను ఛీకొట్టిన అవమానకరంగా ధూషించిన కేసీఆర్ తో అంటకాగుతూ బీజేపీకి తోడ్పడాలని చూస్తున్న జగన్ ను ఆంధ్రులు ఛీకొట్టక మానరు...ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా ఓడించక మానరు...

ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు పేరుతో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి మార్కులే తెచ్చుకుంది. బాలయ్య నటనకు విమర్శకుల ప్రసంశలు సైతం దక్కాయి. ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా విషయంలో రాజకీయాలు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ విపక్ష పార్టీలు. ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్ వేసిన పాత్రల విషయంలో బాలకృష్ణను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. బాలకృష్ణ అచ్చం మాయవతిలా ఉన్నారని ఎవరికి తోచిన కుళ్ళు జోకులు వాళ్ళు వేస్తున్నారు. ఇక చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా ఇలాంటి పోస్టులే సోషల్ మీడియాలో పెడుతున్నారు. వీళ్ళకి తోడుగా, అప్పటి విలన్ నాదేండ్ల బాస్క‌రావు కూడా లైన్ లోకి వచ్చాడు. పనిగట్టుకుని, యుట్యూబ్ లో ఇంటర్వ్యూ లు ఇచ్చి, చంద్రబాబుని, ఎన్టీఆర్ ని తిడుతూ, అవాస్తవాలు చెప్తూ విష ప్రచారం చేసాడు.

nadendla 16012019

అయితే చిత్తూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు మీడియా సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా విలేకరులు, నాదేండ్ల బాస్క‌రావు ఇటీవల చేసిన వ్యాఖ్యల పై చంద్రబాబుని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు మాత్రం, ఆయన ఏమి మాట్లాడారో నాకు తెలియదని, ఆయన ఏమి మాట్లాడారని అడిగారు. దీనికి బదులు ఇస్తూ, మీతో సాన్నిహిత్యం, మీ గురించి గతంలో తిరుపతిలో జరిగిన విషయాలు, ఇలా అన్ని విషయాలు సోషల్ మీడియాలో విరల అవుతున్నాయని అన్నారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ, నేను ఇక్కడే పుట్టాను, పెరిగాను, నేనేంటో మీకు తెలియదా అని విలేఖరులని అడిగారు. 40 ఏళ్ళు నుంచి ప్రజల్లోనే ఉన్నానని, నా గురించి ప్రజలకు తెలియదా అని అన్నారు. అసలు ఆయనకు నాకు సాన్నిహిత్యం ఎప్పుడు ఉందని అన్నారు.

nadendla 16012019

తిరుపతిలో చూసారు, 40 ఏళ్ళు తెలుగు ప్రజలు చూసారు, ఇప్పటి వరకు ఎవరూ నా పై ఒక్క ఆరోపణ అయినా నిరూపించారా అని అన్నారు. నేను ఎప్పుడూ హుందా తనం తప్పలేదని, క్యారక్టర్ మైంటైన్ చేసాను అని, అది ప్రజలందరికీ తెలుసని అన్నారు. చివరగా దీని పై స్పందిస్తూ, అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఈ 40 ఏళ్ళలో, నా క్యారక్టర్ దెబ్బతియ్యటానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేసారని, కాని ఆకాశం మీద ఉమ్మితే, వచ్చి వాళ్ళ మోఖానే పడుతుందని, నాకు ఇలాంటి వాళ్ళ ఆరోపణలు ఎప్పుడూ లెక్క లేదని, ప్రజలే తేల్చారని, తేలుస్తారని అన్నారు. అలాగే షర్మిల చేసిన వ్యాఖ్యలను కూడా చంద్రబాబు ఖండించారు. ఆ వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/OEsuY_N3IcA

ఏపీకి సీఎం కేసీఆర్‌ రావొచ్చని, వస్తే తాము డబుల్ గిఫ్ట్‌లు ఇస్తామని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. ఏడాదిగా సీఎం చంద్రబాబు చెబుతున్న విషయాలు నిజమయ్యాయని, ప్రధాని మోదీ డైరక్షన్‌లో కేసీఆర్‌, జగన్‌ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పదవులు, ఆస్తుల పరిరక్షణ కోసం ఏమైనా చేస్తారని తేలిపోయిందని, వైసీపీకి అంతిమ ఘడియలు వచ్చాయని జోస్యం చెప్పారు. జగన్‌ తీరును చూసి ప్రజలు ఛీకొడుతున్నారని, ఏపీలో కేసీఆర్‌ విష రాజకీయాలు చేస్తున్నారని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని, కేసీఆర్‌ మాదిరిగా ఇక్కడికి.. అక్కడికి ఎవరూ రావొద్దని తాము చెప్పబోమని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

ktre 16012019

జగన్, కేటీఆర్ ల భేటీపై ఏపీ మంత్రి నారాయణ స్పందించారు. ఇంతవరకు తెరవెనుక ఉన్న కుట్ర... ఇప్పుడిప్పుడే బయటకు వస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పిందే జరుగుతోందని అన్నారు. జగన్, కేటీఆర్ ల మధ్య చర్చలతో ఆ విషయం బట్టబయలైందని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీని వదిలేని... రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న చంద్రబాబుపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం మోదీతో జగన్ లాలూచి పడ్డారని ఆరోపించారు. బీజేపీ లేని కేంద్ర ప్రభుత్వం ఏర్పడితేనే ఏపీకి మంచి జరుగుతుందని అన్నారు. మోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకే కేసీఆర్ మూడో ఫ్రంట్ ను తెర మీదకు తెస్తున్నారని చెప్పారు. ముగ్గురు మోదీల డ్రామా ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తోందని ఎద్దేవా చేశారు.

ktre 16012019

మరో పక్క మంత్రి దేవినేని ఉమ స్పందించారు. ఫెడరల్ ఫ్రంట్‌ కాదని, మోదీ ఫ్రంట్‌ అని ఎద్దేవాచేశారు. ముగ్గురు మోదీల జగన్నాటకమని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ దూషణలను ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, ఏపీ ప్రజలను తిట్టిన కేసీఆర్‌తో కలవడానికి జగన్‌కు సిగ్గుండాలన్నారు. హైదరాబాద్‌లో ఏపీ వాళ్లు కిరాయిదారులే అన్నారని, ఏపీ బ్రాహ్మణులకు మంత్రాలు కూడా రావని తిట్టారని దేవినేని ఈ సందర్భగా గుర్తుచేశారు. లంకలో పుట్టినవాళ్లు అందరూ రాక్షసులేనని కేసీఆర్‌ తిట్టలేదా అని ప్రశ్నించారు. తెలుగు తల్లి అంటే దెయ్యమని కేసీఆర్‌ దూషించారని, ఆంధ్రావాళ్ల బిర్యాని పేడలా ఉంటుందని కేసీఆర్‌ అనలేదా అని మరోసారి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై కక్షతో కేసీఆర్‌ నీచరాజకీయాలు చేస్తున్నారని దేవినేని ఉమ దుయ్యబట్టారు.

తన పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందంటూ.. వైఎస్ షర్మిల చేసిన ఆరోపణల గురించి తెలిసిందే. తనకు, సినీ హీరో ప్రభాస్‌కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ షర్మిల.. హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందంటూ.. ఫిర్యాదు సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఆయన కొట్టిపారేశారు.

sharmila 116012019

హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసి.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. ఇతర టీడీపీ నేతలు సైతం షర్మిల తీరును తప్పుబట్టారు. ఇదంతా వైసీపీ ఎన్నికల స్టంటని కొట్టిపారేశారు. తాజాగా, షర్మిల వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. షర్మిల తనకు కూతురులాంటిదని స్పష్టం చేశారు. ఆమెను తానెప్పుడూ విమర్శించలేదని చెప్పారు. గతంలో కులాంతర వివాహం జరిపించినందుకు వైఎస్ కుటుంబాన్ని తాను అభినందించానని గుర్తు చేశారు. వైఎస్ కుటుంబం కులాలను రెచ్చగొట్టడంపైనే తాను విమర్శలు చేశాను తప్ప.. ఇతరత్రా విషయాలేవీ ఇంతవరకూ ప్రస్తావించలేదన్నారు. షర్మిలను విమర్శించిన ఉంటే తనకు పాపం తగులుతుందని స్పష్టం చేశారు.

sharmila 116012019

తెలంగాణ నుంచి వచ్చి బురద చల్లడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఎవరు ఎంత మందిని కలిసినా టీడీపీ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. వైసీపీ, టీఆర్ఎస్ దోస్తీ గురించి తమకు ముందే తెలుసన్నారు. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు కలవడం ఏంటి.. ఏడాది నుంచే కలిసి పనిచేస్తున్నాయని జేసీ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నారు. దేశంలో ఎవరు ఎక్కడికైనా రావొచ్చని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ లేదు.. పాడు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కోసారి ఒక్కొక్కరికి కోపం వస్తుందని, ఇప్పుడు కేసీఆర్‌కు వచ్చిందని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read