నవ్యాంధ్ర అభివృద్ధి కోసం తీరికలేకుండా గడుపుతున్న చంద్రబాబు స్వగ్రామంలో సంక్రాంతిని కుటుంబంతో గడిపారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో నారా వారి కుటుంబసభ్యులందరూ రెండు రోజుల పాటు సందడి చేశారు. గత కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న ఆనవాయితీ ప్రకారం భోగి పండుగ రోజు సాయంత్రమే గ్రామానికి చేరుకున్న చంద్రబాబునాయుడు ఆ రాత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో గడిపారు. సంక్రాంతి పండగ రోజున ఉదయం కుటుంబసభ్యులతో కలిసి గ్రామదేవత అయిన నాగాలమ్మ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ పై తన తల్లదండ్రుల సమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.

nara 15012019 2

ఇంటి వద్ద చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో, బంధువులతో సన్నిహితులు, పార్టీ నాయకులతో కలసి విందును స్వీకరించారు. పంచెకట్టుతో క‌నిపించిన సీఎం, మనవడ్ని కూడా పంచె కట్టులో చూసి మురిసిపోయారు. ఇది ఇలా ఉంటే, ఆరు పదుల వయసులో కూడా, కుటుంబానికి దూరంగా, రాష్ట్రం కోసం అనునిత్యం కష్టపడుతున్న చంద్రబాబు, ఒక రెండు రోజులు అన్నీ పక్కన పెట్టి, కుటుంబ సభ్యులతో గడపటంతో, ఆయన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. ఎప్పుడూ పనిలోనే నిమగ్నమయ్యే చంద్రబాబుకు, ఎట్టకేలకు రెస్ట్ దొరికింది అంటూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

nara 15012019 3

ఈ సందర్భంగా చంద్రబాబు కూడా సరదాగా కనిపించారు. ఆదునిక యుగంలో టెక్నాలజి ఆవశ్యకత ఉన్నదని దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా జీవితం ఆనందమయంగా ఉంటుందన్నరు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఆనంద రాష్ట్రంగా నిలుపుకుందామన్నారు. అత్యంత పవిత్రంగా జరుపుకునే సంక్రాంతి విశిష్టతను మరింత పెంచే విధంగా రాష్ట్రపండుగగా నిర్వహిస్తున్నామన్నారు. మన సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వెలుగులోనికి తీసుకు వచ్చేవిధంగా అందుకు అనుగుణంగా నిర్ణయాలు చేస్తున్నామన్నారు. జన్మభూమి, తల్లితండ్రులు, పెద్దలను మరిచిపోరాదని, పాత గుర్తులను నెమరు వేసుకోవాలన్నారు. రాష్ట్రం బాగుంటే, దేశం బాగుంటుందని నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ముహర్తం వలన చేపట్టిన ప్రతికార్యక్రమము త్వరితగతిన పూర్తి కావడం శుభసూచికమన్నారు.

దేశ చరిత్రలోనే అతి దరిద్రమైన ఆట, కర్ణాటకలో ఆడింది బీజేపీ. కబురులు చెప్పే మోడీ, అమిత్ షా ఆడిన ఆట ఇంకా అందరికీ గుర్తుంది. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడిని చేరదీసి, పక్కన పెట్టుకుని, నిస్సిగ్గుగా ప్రచారం చేసారు... మెజారిటీ రాకపోయినా, గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు... చివరకు 150 కోట్లు ఆఫర్ చేసారు... ఆడియో టేప్ లు బయటపడ్డాయి. అర్ధరాత్రి సుప్రీం కోర్ట్ తలుపులు తెరుచుకున్నాయి.. దేశంలో ఎంత దౌర్భాగ్యం లేకపోతే, అర్ధరాత్రి తలుపులు తెరుచుకుంటాయి ? అమిత్ షా, మోడీ కుట్రలని తిప్పి కొడుతూ, సుప్రీం కోర్ట్ ఒక్క రోజే బల నిరూపణకు టైం ఇచ్చింది... దీంతో బేర సరాలకు టైం సరిపోలేదు... చివరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజులు ఉన్న బీఎస్ యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. అమిత్ షా, మోడీ కుట్రలని తట్టుకుని, దేశం గెలిచింది... అప్పటి నుంచి కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

amitshah 15012019 2

అయితే, అప్పటి నుంచి బీజేపీ, ఎప్పుడెప్పుడు కర్ణాటక ప్రభుత్వాన్ని పడేద్దామా అని ప్లాన్లు వేస్తూ వస్తుంది. తాజాగా, కర్ణాటకలో మరోసారి రిసార్ట్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. కూటమి సర్కార్‌ను కూలదోసేందుకు తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, బేజీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. సొంత పార్టీకి చెంది 102 మంది ఎమ్మెల్యేలను బీజేపీ గురుగావ్ తరలించింది. అక్కడి ఫైస్ స్టార్ హోటల్‌లో వారిని ఉంచినట్టు తెలుస్తోంది. మరోవైపు, తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ముంబైకి తరలించిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

amitshah 15012019 3

అమిత్ షా డైరెక్ట్ గా రంగంలోకి దిగి, ఒక్కో ఎమ్మెల్యేకి 30 కోట్లు ఆఫర్ చేసినట్టు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు తమతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారంటూ ఆయా పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలతో కర్ణాటక రాజకీయాల్లో అయోమయం నెలకొంది. బీజేపీకి చెందిన 4 నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు సాగిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ మీడియాకు తెలిపారు. కాగా, కాంగ్రెస్ నుంచి 10 మంది, జేడీఎస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ క్లెయిమ్ చేస్తోంది. మీరు బేరసారాలు జరుపుతున్నారంటే మీరు బేరసారాలు జరుపుతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు గుప్పించుకోవడంతో రిసార్ట్ రాజకీయాలకు తెరలేచింది. ప్రశాంతంగా సాగుతున్న కర్ణాటకలో, బీజేపీ చిచ్చు పెట్టి, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో అనిశ్చితికి కారణం అయ్యింది. తనకు అనుకూలంగా ఉన్న కేసీఆర్ మినహా, దక్షిణ భారత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, బీజేపీ ఇదే ఆట ఆడుతుంది.

గన్నవరం నుంచి దుబాయ్ కి డైరెక్ట్ ఫ్లైట్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అంటూ అధికారులు కొన్ని రోజుల క్రిందట ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఒక బహిరంగ ప్రకటన కూడా ఇచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ ఎయిర్ పోర్ట్ కి విమానాలను ప్రారంభించే సాధ్యాసాద్యాలను పరీక్షించే ప్రతిపాదన పై, ప్రజల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అంటూ, ఒక ప్రకటన జారీ చేసింది. అయితే, ఇదేదో ఫోర్మలిటీగా చేసారు. ప్రజల నుంచి ఎదో రెస్పాన్స్ వస్తుందిలే అనుకున్నారు కాని, ప్రజాలు మాత్రం అనూహ్యంగా రెస్పాన్స్ ఇచ్చారు.

gannavaram 14012019 2

సింగపూర్‌కు విమాన సర్వీస్‌ ప్రవేశపెట్టే ముందు కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. అప్పట్లో 60 వేల మందికిపైగా ఆన్‌లైన్‌లో సానుకూలతను వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి లోటు భర్తీ నిధి (వీజీఎఫ్‌) సమకూర్చే అవకాశం లేకుండానే గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడుస్తోంది. దుబాయ్‌కు ప్రవేశపెట్టే సర్వీసుపైనా ఆన్‌లైన్‌లో ఇప్పటికే లక్ష మందికిపైగా అనుకూలతను వ్యక్తం చేశారు. అంటే సింగపూర్ ఫ్లైట్ కి వచ్చిన రెస్పాన్స్ కంటే డబల్.. విజయవాడ నుంచి దుబాయ్‌ వెళ్లే వారు హైదరాబాద్‌ వెళ్లి ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చాక ఇక్కడి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు.

gannavaram 14012019 3

సింగపూర్‌ విమాన సర్వీసు విజయవంతం కావడంతో ఇప్పుడు దుబాయ్‌ కోసం ఏపీఏడీసీఎల్‌ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల నుంచి అనతి కాలంలో మంచి స్పందన రావడంతో తదుపరి చర్యలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. లోటు భర్తీ నిధి విధానంలో గన్నవరం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడిపేందుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ నెలాఖరులో విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలవనుంది. ఈ సేవల ప్రారంభానికి భారత విమానయాన సంస్థ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల అనుమతుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు https://www.apadcl.com/ అనే వెబ్సైటులో, 1,02,710 మంది తమ ఇష్టాన్ని తెలియచేసారు.

తెరాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడలో తలపెట్టాలనుకున్న ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. సోమవారం ఉదయం విజయడవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆర్కే కాలేజీలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళ కార్యక్రమానికి విచ్చేసిన తలసానికి ఆర్కే కాలేజ్‌ ఛైర్మన్‌ ఎం.కొండయ్య, ఇతర యాదవ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆర్కే కాలేజ్ నుంచి కనక దుర్గ ఆలయం వరకు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. ర్యాలీకి సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకోకపోవడంతో నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎలాంటి ఆర్భాటం లేకుండా కేవలం ఐదు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు.

talasani 14012019 2

తరువాత, బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఇంద్రకీలాద్రి పై మీడియాతో మాట్లాడిన తలసాని... రాజకీయ వ్యాఖ్యలు చేడం వివాదంగా మారుతోంది. దుర్గమ్మ సన్నిధిలో ఇంద్రకీలాద్రి పై తలసాని రాజకీయాలు మాట్లాడడాన్ని దుర్గగుడి పాలక మండలి సభ్యులు తప్పుపడుతున్నారు. తలసాని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు పాలక మండలి సభ్యులు.. తలసాని రాజకీయాలు మాట్లాడుతుంటే వారించలేకపోయారంటూ ఆలయ సిబ్బందిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామంటున్నారు సభ్యులు.

talasani 14012019 3

దుర్గమ్మ ఆలయంలో తలసాని రాజకీయాలు మాట్లాడతారా..? అంటూ మండిపడ్డారు పాలక మండలి సభ్యులు పెంచలయ్య... ఆలయ పవిత్రత దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించిన ఆయన... తలసాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భీమవరంలో కోడిపందాలు ఆడటానికి వెళ్తూ దుర్గమ్మ ఆలయంలో అడ్డమైన ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... రాజకీయలు మాట్లాడుతున్నా ఆలయ అధికారులు అడ్డుకొకపోవటం సరికాదన్నారు. తలసాని క్షమాపణలు చెప్పకపోతే పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు పెంచలయ్య.

Advertisements

Latest Articles

Most Read