వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిళకు- టాలీవుడ్ హీరో ప్రభాస్‌‌కు సంబంధం ఉందని గత ఐదేళ్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్య జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పై మాట్లాడుతూ, నలుగురు నలుగురు పెళ్ళాలు, కార్లు మార్చినట్టు మారుస్తాడు అని చెప్పగానే, సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, షర్మిల పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, అప్పుదేప్పుడు బయటకు రాని షర్మిల ఇప్పుడు బయటకు వచ్చు, సరిగ్గా ఎన్నికల ముందు, బయటకు వచ్చి, ఈ ప్రచారం అంతటికీ కారణం చంద్రబాబు అంటూ, ఆయన పై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పై నమ్మకం లేదు, అంటూ హైదరాబాద్ లో కంప్లైంట్ చేసింది షర్మిల..

sharmila 14012019

అయినా చంద్రబాబు మరీ ఇంత ఖాళీగా కనిపిస్తున్నారా వీళ్ళకి ? అప్పట్లో పవన్ పై, శ్రీరెడ్డి ఎదో వ్యాఖ్యలు చేసిందని, దాని పై చంద్రబాబు ఉన్నారంటూ, చంద్రబాబు పుట్టిన రోజునాడే, పెద్ద గేమ్ మొదలు పెట్టాడు పవన్. చంద్రబాబుకి శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్ ను తిట్టించటం, సోషల్ మీడియాలో షర్మిల ను తిట్టించటమేనా పని ? సోషల్ మీడియా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికీ, చంద్రబాబు, లోకేష్ పై, వైసీపీ, జనసేన ఎలా ట్రోలింగ్ చేస్తారో, ఎంత జుబుక్సాకరంగా చేస్తారో అందరికీ తెలుసు. అప్పుడు మాత్రం, మహదానందం పొంది, ఇప్పుడు వచ్చి సూక్తులు చెప్తున్నారు. అయినా, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికీ, షర్మిల పై దారుణంగా పోస్ట్ లు పెడుతుంది ఎవరో , ఇట్టే తెలిసిపోతుంది.

sharmila 14012019

సింపుల్ గా సెర్చ్ చేస్తే, ఆ పోస్టింగ్ లు తెలుగుదేశం పెట్టినియ్యో, జనసేన పెట్టినియ్యో అర్ధమవుతుంది. ఇలాంటి పనులు ఎవరు చేసినా ఖండించాలి. కాని, చేసింది ఒకరు అయితే, నెపం మరొకరి మీదకు నెట్టి, అన్నీ చంద్రబాబు చేపిస్తున్నాడు అనటం ఎంత వరకు సమంజసం. తెలుగుదేశం వాళ్ళు పలానా పోస్టింగ్ పెట్టారు అని చూపించవచ్చు కదా. జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ను పట్టుకుని, నలుగురు నలుగురు పెళ్ళాలు అంటే, షర్మిల గారికి అది తప్పు అనిపించలేదా ? తమ్ముడ్ని ఖండించవచ్చు కదా ? మరో పక్క A2 రెడ్డి, ప్రతి రోజు ఎలా జుబుక్సాకరంగా పోస్ట్ లు పెడుతున్నాడో షర్మిల గారికి కనిపించటం లేదా ? మీరు మీరు కొట్టుకుని, దాన్ని చంద్రబాబు మీదకు నెట్టేస్తే ఎలా షర్మిల గారు ? జగన్ గారు, ఇలాంటి నీచమైన రాజకీయాలు తప్ప, మీకు వేరేవి తెలియవా ?

విజయవాడ సబ్‌ కలెక్టరు మిషాసింగ్‌, కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మధ్య వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సబ్‌ కలెక్టరు మిషాసింగ్‌ కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చి ఫిర్యాదు చేశారు. నిన్న సబ్‌ కలెక్టర్‌తో జరిగిన వివాదంపై ముఖ్యమంత్రి సూచన మేరకు ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్రకు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ రైతుల తరఫున రూ.లక్ష జరిమానా చెల్లించడంతోపాటు పొక్లెయినర్‌ను కూడా అధికారులకు అప్పగించడంతో వివాదం పరిష్కారమైందని చెబుతున్నారు. పుల్లేరు వివాదంపై మీడియాలో వార్తలు రావడంతో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి వివాదాలేమిటంటూ సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదివారం ఉదయం ఆయన నివాసంలో కలుసుకున్నారు. సీఎం బిజీగా ఉండటంతో ఆయన కార్యదర్శి రాజమౌళిని కలిసి వివరించారు. ఈ వివాదానికి ఇక్కడితో పుల్‌స్టాప్‌ పెట్టాలని ఎమ్మెల్యేకు, సబ్‌ కలెక్టర్‌ మిషాసింగ్‌కు కూడా ఆయన సూచించినట్లు తెలిసింది.

పుల్లేరు వాగులో మట్టి తవ్వడంపై తలెత్తిన వివాదాన్ని కొనసాగించడం ఇష్టంలేకే రైతుల తరఫున జరిమానా చెల్లించానని ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ చెప్పారు. ముఖ్యమంత్రి కార్యదర్శి రాజమౌళిని కలిసిన అనంతరం నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివాదం గురించి రెండు, మూడు రోజుల్లో సీఎంను కలిసి వివరిస్తానని చెప్పారు. పుల్లేరులో మట్టి తీసి రైతులు తమ పొలంగట్లకు తన్నుడు వేసుకుంటున్నారని, అక్కడ ఎలాంటి ఆక్రమణలు జరగడం లేదని పునరుద్ఘాటించారు. రైతులు తప్పు చేసినట్లు నిరూపిస్తే తాను జరిమానా చెల్లిస్తానని సబ్‌ కలెక్టరుకు చెప్పినా వినిపించుకోలేదని, శనివారం రాత్రి 50 మంది పోలీసులతో వచ్చి ఒక హంతకుడి ఇంట్లో తనిఖీలు చేసినట్టుగా తన కార్యాలయంలో సోదాలు నిర్వహించడం వల్లే తాను తీవ్రంగా స్పందించానని చెప్పారు. రైతులు మట్టి పనిచేస్తున్న యంత్రాన్ని రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారన్న విషయం తనకు తెలియదన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల తీరు వల్ల రైతులకు నష్టం కలగకూడదనే వారి తరఫున తాను రూ. లక్ష జరిమానా చెల్లించానని తెలిపారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్‌ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని, కేసులు నమోదు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు.

అసలేం జరిగిందంటే... పెనమలూరు మండలం వణుకూరు పుల్లేరు పోరంబోకు స్థలంలోని మట్టిని తీసి స్థానిక రైతులు గట్లు పటిష్టం చేస్తుండగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారంటూ అధికారులు యంత్రాలను జప్తు చేశారు. వాటిని పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఈ విషయం తన దృష్టికి రావడంతో వెంటనే ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అక్కడికి చేరుకున్నారు. సీజ్‌ చేసిన పొక్లెయిన్‌ను తన వెంట తీసుకెళ్లారు. ప్రభుత్వ అధికారులు సీజ్‌ చేసిన యంత్రాలను ఎమ్మెల్యే, ఎంపీపీలు బలవంతంగా ఎలా తీసుకెళ్తారంటూ సబ్‌ కలెక్టర్‌ మిషాసింగ్‌ నిన్న రాత్రి పుల్లేరు పోరంబోకు భూమిని స్వయంగా పరిశీలించారు. తహశీల్దారు, ఆర్‌ఐ, వీఆర్‌వోలతోపాటు పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యే తన కార్యాలయంలో మాట్లాడుతున్న సమయంలో అధికారులు, పోలీసులతో అక్కడి చేరుకున్న సబ్‌ కలెక్టరు సీజ్‌ చేసిన వాహనాన్ని తమకు అప్పగించాలని కోరారు. పుల్లేరు వద్ద రైతులు తప్పేమీ చేయలేదని అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే కోరారు. ఒకవేళ రైతులు తప్పు చేసినట్లు యంత్రాంగం భావిస్తే వారి తరఫున తాను జరిమానా చెల్లిస్తానని చెప్పినా సబ్‌ కలెక్టరు ససేమిరా అంటూ భారీ మొత్తాలను జరిమానాగా విధించారని మండిపడ్డారు. ఇది రైతులపై కక్షపూరితంగా వ్యవహరించడమేనని జరిగిన ఘటన గురించి ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శికి ఎమ్మెల్యే వెల్లడించారు. సీఎం ముఖ్య కార్యదర్శి వద్ద చర్చల అనంతరం ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ శాంతించారు. రైతులకు విధించిన జరిమానా రూ.లక్ష వారి తరఫున ఎమ్మెల్యే చెల్లించటంతో వివాదానికి తెరపడింది.

సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారుల పై టోల్ గేట్లవద్ద రుసుములు రద్దు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. టోల్ గేటు సిబ్బంది వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. కొందరు వాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోవడంలేదు. టోల్ వసూలు చేస్తుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. టోల్ టేట్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందిపడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 12 నుంచి 16 దాకా జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద రుసుము వసూళ్లను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

tollgate 12012019 2

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అయితే ఈ ఆదేశాలను టోల్ సిబ్బంది పాటించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్ర రహదారులకే పరిమితమని ఎన్ఎస్ఐ నుంచి ఆదేశాలు వస్తేనే తాము పాటిస్తామని టోల్ ఫ్లాజా నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, కృష్ణా జిల్లా టోల్ ప్లాజాల వద్దకు పోలీసులని పంపించారు. ఏపి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందే అని, టోల్ ప్లాజా సిబ్బందికి గట్టిగా చెప్పారు. పోలీసులు దగ్గర ఉండి, వాహనాలను పంపిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, హైవే అథారటీ నుంచి ఆదేశాలు రావాలి అంటూ, ఆటలు ఆడుతూ ఉండటంతో, చంద్రబాబు ఏకంగా పోలీసులని పంపి, టోల్ సిబ్బందిని నిలువరించాల్సిన పరిస్థితి వచ్చింది.

tollgate 12012019 3

దీంతో ఏపి సర్కార్ దెబ్బకు టోల్ ప్లాజా సిబ్బంది దిగి వస్తున్నారు. కృష్ణా జిల్లాలో అన్ని టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుము నిలిపివేశారు. కీసర, పొట్టిపాడు, చిల్లకల్లు, టోల్ ప్లాజాల వద్ద, టోల్ రుసుము నిలిపి వేసి, వాహనాలను వదులుతున్నారు. అయితే గుంటూరులో మాత్రం, ఇంకా టోల్ రుసుము తీసుకుంటున్నారు అనే సమాచారం వస్తూ ఉండటంతో, అక్కడకు కూడా పోలీసులను పంపిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, వారికి ఈ నాలుగు రోజులు, ప్రశాంతంగా సొంత ఊర్లకి వచ్చి, ఎక్కువ సేపు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే, దీనికి కూడా నేషనల్ హైవె అథారటీ పర్మిషన్ కావాలంటూ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే, చంద్రబాబు పోలీసులని పంపి, సమస్య పరిష్కరించారు.

పవన్ స్వరం మారుతుందా ? గత నెల రోజుల నుంచి ఎక్కడా మీటింగ్లలో పాల్గునని పవన్, ఈ రోజు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెదరావూరు విచ్చేశారు. ఆ పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. పవన్ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉందా ? లేకపోతే పవన్ ఆలోచన మారుతుందో కాని, సగటు ఆంధ్రుడు మనసులో ఏముందో పవన్ కూడా అదే చెప్పారు. మరి ఈ మార్పు దేనికి సంకేతమో కాని, టీఆర్‌ఎస్, వైసీపీ మధ్య మైత్రి బంధం కొనసాగుతోందన్న ప్రచారంపై పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

pk 13012019

ఈ రోజు తెనాలిలో పవన్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుపై కక్షసాధింపు కోసమే జగన్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు తెలుపుతోందని పవన్ ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్‌ను తెలంగాణ గడ్డ పై అడుగుపెట్టనీయమని అప్పట్లో టీఆర్‌ఎస్ పార్టీ వాళ్లే అడ్డుకున్నారని గుర్తుచేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉండేవారని, నేడు అలాంటి టీఆర్‌ఎస్‌తో జగన్ కలసి నడుస్తున్నారని పవన్‌ విమర్శించారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో వీళ్లని చూస్తే అర్ధమవుతుందని జనసేనాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

pk 13012019

‘‘తెరాస నేతలు గతంలో వైఎస్‌ను దూషించారు... ఇప్పడు వారే ఒకటవుతున్నారు. అవసరమైతే 2014లోనే పదవి తీసుకునేవాడిని. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు... మార్పు కోసం వచ్చా. వ్యక్తులు వ్యవస్థలను నాశనం చేసినందుకు రాజకీయాల్లోకి వచ్చా. వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చాను. 25 కిలోల బియ్యం కాదు.. యువకులు 25 ఏళ్ల భవిష్యత్తు కోరుతున్నారు. ఒకప్పుడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఉండేవి.. ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. పోరాటమే నాకు తెలిసిన విద్య.. పోరాటం చేస్తాం.. పోటీ చేస్తాం’’ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read