నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి రెండు కీలకమైన ప్రాజెక్టులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనకు చంద్రబాబు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేశారు. తాగునీటి అవసరాలకు చేపడుతున్న నీటిశుద్ధి ప్లాంట్‌కు కూడా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగుదనం ఉట్టిపడే విధంగా, అలాగే మన కూచిపూడి పేరు ప్రపంచ వ్యాప్తంగా ధ్వనించే విధంగా, ఈ బ్రిడ్జికి, "కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జి"గా నామకరణం చేసారు.

iconic 12012019

ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై రూ.1387 కోట్లతో 3.2కి.మీ.ల పొడవైన ఐకానిక్‌ వంతెనను నిర్మించనున్నారు. దీని మధ్యలో 0.48కి.మీ.ల భాగాన్ని ఐకానిక్‌గా నిర్మిస్తారు. ఈ భాగంలో యోగ భంగిమను పోలిన విధంగా పైలాన్‌ ఉంటుంది. దీనిని వంతెనతో అనుసంధానిస్తూ రెండు పక్కలా తీగల అమరిక ఉంటుంది. ఈ పైలాన్‌ ఎత్తు 170 మీటర్లు. ఆరు వరుసలుగా నిర్మిస్తారు. రెండు పక్కలా 2.5 మీటర్ల వెడల్పైన నడకదారి ఉంటుంది. నిర్మాణానికి పైల్‌ ఫౌండేషన్‌ వేస్తారు. ఈ వంతెనతో హైదరాబాద్‌, జగదల్‌పూర్‌ జాతీయ రహదారులు అమరావతితో అనుసంధానమవుతాయి. ఆ రెండు ప్రాంతాల నుంచి 40 కి.మీ.ల దూరంతో పాటు విజయవాడలో ట్రాఫిక్‌ కూడా తగ్గుతుంది. 2 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. రాత్రి సమయాల్లో అత్యంత ఆకర్షణీయంగా కనిపించేలా విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాలు వివిధ కాలాలకు అనుగుణంగా వేర్వేరు రంగులు వెదజల్లుతాయి. నిర్మాణ గడువు రెండేళ్లు. ఎల్‌ అండ్‌ టీ సంస్థ పనులు దక్కించుకుంది. శంకుస్థాపన పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

iconic 12012019

అలాగే, రాజధాని తాగునీటి అవసరాలకు రూ.745.65 కోట్లతో నిర్మించే వ్యవస్థలో భాగంగా మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం వద్ద 13 మీటర్ల చుట్టు కొలత కలిగిన రెండు ఇన్‌టేక్‌ బావులు నిర్మిస్తారు. కృష్ణాయపాలెం వద్ద 190ఎంఎల్‌డీ సామర్థ్యంగల నీటి శుద్ధి కేంద్రం, 64ఎంఎల్‌ సామర్థ్యం గల... పాక్షికంగా భూగర్భంలో ఉండే... శుద్ధజల రిజర్వాయర్‌, క్లియర్‌ వాటర్‌ పంప్‌ ఏర్పాటవుతాయి. * నీటి పంపిణీ కేంద్రం వద్ద పాక్షికంగా భూగర్భంలో ఉండే 8రిజర్వాయర్లు, ఏడు ఎలివేటెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లు నిర్మిస్తారు. 1500-2000మి.మీ.ల చుట్టుకొలత కలిగిన 45కి.మీ.ల పొడవైన క్లియర్‌ వాటర్‌ రింగ్‌ మెయిన్‌ (పంపింగ్‌ మెయిన్‌) నిర్మిస్తారు. దీని నుంచి ఈ కేంద్రాలకు 58 కి.మీ.పొడవైన పైప్‌లైన్లు (500 నుంచి 1500 మి.మీ.ల చుట్టుకొలత కలిగిన) వేస్తారు.

పండగ వాతావరణం నడుమ నిన్న నెల్లూరులో జన్మభూమి- మా ఊరు ముగింపు కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీటితో పాటు జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నం దగదర్తి విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. చారిత్రాత్మకంగా సంయుక్త సహకార రైతు సంఘాల(సీజేఎఫ్‌ఎస్‌) భూములను రద్దు చేసి.. వాటి స్థానంలో రైతులకు యాజమాన్య హక్కులను కట్టబెడుతూ డీకేటీ పట్టాలను అందించారు. ఇలా విభిన్న కార్యక్రమాల మేళవింపుగా సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సాగింది. సీఎం పర్యటనతో బోగోలుగా ఒకింత పండుగ వాతావారణం ముందుగానే వచ్చింది. శుక్రవారం నిర్వహించిన సభలో అంశాలు మొత్తం ప్రభుత్వానికి చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నాయి. సీజేఎఫ్‌ఎస్‌లను రద్దు చేసి.. వాటి స్థానంలో డీకేటీ పట్టాలు ఇవ్వటం ద్వారా భూములపై యాజమాన్య హక్కులు లబ్ధిదారులకు దక్కనున్నాయి.

nellore 12012019 1

ఈ సందర్భంగానే సహకార సంయుక్త రైతు సంఘాల(సీజేఎఫ్‌ఎస్‌) భూములకు సంబంధించి ఒకే రోజు రూ.8 వేల కోట్ల విలువైన భూ పట్టాలను పేదలకు సీఎం చంద్రబాబునాయుడు అందించారు. మొత్తం 66,276.79 ఎకరాల భూమికి హక్కులను కట్టబెట్టారు. తొలివిడత కింద 60,596 మంది లబ్ధి పొందారు. వీరిలో ఎస్సీలు, ఎస్టీలు, ఇతరులు, బీసీలు ఉన్నారు. ఈ భూమి విలువ ఎకరా సగటున సుమారు రూ.12 లక్షల చొప్పున... మొత్తం విలువ దాదాపు రూ.8వేల కోట్లు. ఈ స్థాయిలో ఒకేసారి పట్టాలను ఇవ్వటం రాష్ట్రంలో సరికొత్త చరిత్రగా మారింది. భూమి పట్టాతో పాటు చీర, పసుపు, కుంకుమ, గాజులు, టెంకాయ కలిపి పంపిణీ చేశారు. ఈ పట్టాలను మహిళలకు అందిస్తూ సీఎం ఉద్విగ్నతకు గురయ్యారు. ఇంతమంది ఆడపడుచులకు రూ.కోట్ల విలువైన భూమిని కానుకగా ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఆస్తి భద్రత కల్పించామని చెప్పారు. ఎవరికీ ఒక్కపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, లబ్ధిదారులకు మళ్లీ ఫోన్లు చేసి మాట్లాడతానని స్పష్టం చేశారు

nellore 12012019 1

మొదటివిడత నిర్వహించిన జన్మభూమిలో ప్రజల నుంచి 40 లక్షల వినతులు వస్తే... ప్రస్తుతం 4.57 లక్షలు మాత్రమే వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవి గణనీయంగా తగ్గిపోవడమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని టెలీకాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. శనివారం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించాలన్నారు. ‘16వేల గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడం ఒక చరిత్ర. 16వేల గ్రామాభివృద్ధి ప్రణాళికలను అప్‌లోడ్‌ చేయడం ఒక రికార్డు. ప్రజల భాగస్వామ్యానికి జన్మభూమి, గ్రామవికాసం, జలసిరికి హారతి కార్యక్రమాలను తీసుకొచ్చాం. స్వశక్తితో ముందుకెళ్తున్నాం. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లోనూ పనిచేస్తాం...’ అని వివరించారు. చంద్రబాబు ప్రసంగం కూడా కొత్తపుంతలు తొక్కింది. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి.. సంక్షేమ పథకాలు.. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన అంశాలను ఇవ్వకుండా కేంద్రం చేసిన మోసాలు.. నాలుగున్నరేళ్ల తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్‌ గురించి విమర్శలు చేశారు. సంపద సృష్టించే పార్టీగా తెదేపా గురించి చెబుతూ.. వైకాపాకు అధికారం అప్పగిస్తే రాష్ట్ర అభివృద్ధి కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందని హెచ్చరించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీతో పొత్తు కోసం వైసీపీ నేతలు యత్నిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేనకు బలం లేదంటూనే రాయబారాలు నడిపిస్తున్నారని పవన్ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలతో జనసేన పార్టీతో మాట్లాడిస్తున్నారని పవన్‌కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. అయితే రాయబారం నడిపిన టీఆర్ఎస్ నేతలు ఎవరనే విషయాన్ని చెప్పడానికి పవన్ సాహసించలేదు. దీంతో పొత్తు కోసం రాయబారం నెరపుతున్న ఆ నేతలు ఎవరు, పొత్తు కోసం ప్రయత్నిస్తున్న నేతలు ఎవరనే చర్చ సాగుతోంది.

kcr 120012019 2

టీడీపీకి, టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా పొసగడం లేదు. అదే సమయంలో ఏపీలో కేసీఆర్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలను జగన్ స్వాగతించారు. అంతేకాదు, ఇరుపార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి సహా పలుచోట్ల వైసీపీ.. తెరాసకు మద్దతు పలికిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెరాస నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ చెప్పడం చూస్తుంటే, వైసీపీ, తెరాస కలిసి ఏపిలో ఎలాంటి రాజకీయం ప్లాన్ చేస్తున్నారో తెలుస్తుంది. కాగా, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో తెరాసకు అంతర్గతంగా సంబంధాలు ఉన్నట్లుగా కనిపిస్తోందని అర్థమవుతోందని అంటున్నారు. ఇప్పటికే జగన్, తెరాస మధ్య సంబంధాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.

kcr 120012019 3

మోడీ, జగన్, కేసీఆర్ ఒక్కటేనని చెబుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే చెప్పడం గమనార్హం. పవన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్.. జనసేతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్ర ముగింపు రోజుకూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. అయితే పవన్ కల్యాణ్‌‌తో నిజంగానే టీఆర్ఎస్ నేతల ద్వారా సంప్రదింపులు జరిపారా..? లేదా..? అనే విషయాలు తెలియాలంటే వైసీపీ లేదా టీఆర్ఎస్ నేతల్లో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.

చంద్రబాబు దాక సమస్య వెళ్తే చాలు, అది నిమిషాల మీద పరిష్కారం అవుతుంది అనటానికి, ఇది మరో ఉదాహరణ... ఇది రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన... విజయవాడ అర్బన్ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కార్మిక సంఘం ఆటో కార్మికులు గురువారం సాయంత్రం ఉండవల్లి ప్రజావేదికలో చంద్రబాబును కలిశారు. ఆటో రిక్షాలకు రోడ్ టాక్స్ ను రద్దు చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. గతంలో ఉన్న త్రైమాసిక పన్ను విధానాన్ని రద్దు చేసి 2018 జూన్ లో జీవిత కాలం పన్ను విధానాన్ని ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తెచ్చి ఎంతోమంది ఆటోరిక్షాలవారిని ఆదుకున్న విషయాన్ని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. పన్ను విధానం వలన నూతనంగా కొన్న పాసెంజర్ ఆటోలకు పన్ను 2 శాతంగా ఉందన్నారు. 3 సం ॥ నుండి 6సం॥ల లోపు ఆటోలకు 1.5 శాతంగా, 6సం॥ల నుండి 9సం॥ల లోపు ఆటోలకు1.4 శాతంగా, 9సంవత్సరాలలోపు కొనుగోలు చేసిన ఆటోలకు 1.3 శాతం గాను పన్ను విధించడం జరుగుతోందని ముఖ్యమంత్రికి వివరించారు.

auto 12012019

ఈ విధానం వలన ఒక్కో ఆటోకు సంవత్సరానికి రూ.2000 ల నుండి రూ.4000ల వరకు డ్రైవర్లు, ఓనర్లపై భారం పడుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పన్ను విధానాన్ని రద్దు చేసి ఆటో కార్మికులకు పన్నుల నుండి విముక్తి కలగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి సావదానంగా వారి విన్నపాన్ని విని సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిశీలించి తగిన పరిష్కారం చేస్తానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అయితే అటో కార్మికులు మాత్రం, ఎప్పటికో చేస్తారులే, చూద్దాం అంటూ వెళ్ళిపోయారు. కాని, వారికి షాక్ ఇస్తూ, ఒక్క రోజులోనే చంద్రబాబు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, అధికారులతో సమావేశం అయ్యి, సమస్య పై చర్చించారు.

auto 12012019

అంతే, ఒకే ఒక్క నిర్ణయంతో, 5.66 లక్షల మందికి లబ్ది చేకూరుస్తూ ఈ పన్ను విధానం రద్దు చేసేసారు. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 5.66లక్షల ఆటోలున్నాయి. వీటికి ప్రతినెలా రూ.110 చొప్పున ఏటా రూ.1320 రోడ్డు టాక్స్‌ చెల్లించాల్సి ఉంది. ప్రతి నాలుగు నెలలకొకసారి రూ.440 చొప్పున ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి పన్ను చెల్లించాల్సి ఉంది. దీనిని పూర్తిగా రద్దు చేసి... జీవితకాల పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌) మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. నిరుపేదలైన ఆటో కార్మికుల నుంచి ఆ మొత్తం తీసుకోకూడదని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. వెరసి... ఆటోలపై ఎలాంటి పన్నూ ఉండదు. ఆటో కొనుగోలు సమయంలో కట్టే రెండు శాతం పన్ను మాత్రమే అమలులో ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.100 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలోని 2లక్షలకు పైగా వ్యవసాయ ట్రాక్టర్లపైనా అన్నిరకాల పన్నులు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Advertisements

Latest Articles

Most Read