విజయవాడకి మరో ఐకానిక్ స్ట్రక్చర్ రాబోతుంది. చెన్నై-కోల్కతా మహానగరాలను కలిపే జాతీయ రహదారి పై పై జంట నగరాలను కలిపే కూడలి వారధి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం అత్యంత సుందరంగా రూపుదిద్దుకోనుంది. వేలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగించే ఈ కూడలిని పూర్తిస్థాయిలో ఆధునికీకరించడంతోపాటు ఆకర్షణీయమైన పచ్చదనంతో నేత్రపర్వం చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్టనుంది. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు ఆ దిశగా కసరత్తు సాగిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారు రెండు డిజైన్లను సిద్ధం చేశారు. వీటిల్లో ఒకటి అమరావతి చారిత్రక వారసత్వానికి దర్పణం పట్టనుండగా, మరొకటి సుందర ఉద్యాన వనాన్ని తలపించేలా ఉంది.

buddha 09012019 1

రాజధానికి దారి తీసే అన్ని ముఖద్వారాలనూ అత్యంత ఆకర్షణీయంగా రూపొందించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో అధికారులను ఆదేశించారు. స్పందించిన ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్ధసారథి విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి జంక్షనను ముందుగా అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఏడీసీ రూపొందించిన రెండు డిజైన్లూ వారధి జంక్షన వద్ద ఉన్న ట్రాఫిక్‌ ఐల్యాండ్లను హరిత శోభితంగా మార్చేవే. ఒకటి గతంలో బౌద్ధానికి సూచికగా భారీ ధర్మచక్రం, ఇతర ఆకర్షణలతో కూడి ఉంది. ఈ నమూనాలో వలయాకారంలో ఉన్న స్థూపంపై పురాతన శిల్పకళను ప్రతిబింబించే మందిరాల మధ్య ధర్మచక్రాన్ని ఏర్పాటు చేస్తారు.

buddha 09012019 1

ఈ స్థూపం చుట్టూ ఆకట్టుకునే పలు రకాల క్రోటన్లు, పూలమొక్కలతోపాటు అక్కడక్కడ పెద్ద చెట్లను సైతం పెంచుతారు. సందర్శకులు నడిచేందుకు వీలుగా వాకింగ్‌ టైల్స్‌తో కూడిన బాటలను ఏర్పాటు చేస్తారు. చక్కటి పచ్చిక బయళ్లూ, వాటి మధ్యన చెట్ల వరుసలూ మాత్రమే ఉంటాయి. ఈ లాన్లను కూడా ఆకుపచ్చ రంగులో మాత్రమే కాకుండా వివిధ వర్ణాల్లో ఉండే క్రోటన్లు, ఇతర మొక్కలతో రంగురంగుల్లో ఉండేలా చూస్తారు. ట్రాఫిక్‌ ఐల్యాండ్ల స్వరూపానికి అనుగుణంగా పచ్చిక బయళ్లను చక్కటి ఆకృతుల్లో అభివృద్ధి పరుస్తారు. ఇప్పటికే దీనికి సంబందించిన పనులు పరుగులు పెడుతున్నాయి.

ఏపీలో కొత్తగా మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్‌‌కు సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ బాధ్యతలను అప్పగించారు. ఇక గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను సంగీత, నృత్య అకాడమీ ఛైర్మన్‌గా నియమించారు. జానపద కళలు, సృజనాత్మకత (ఫోక్ అండ్ క్రియేటివ్) అకాడమీ ఛైర్మన్‌గా పొట్లూరి హరికృష్ణను నియమించారు. ఏపీ స్టేట్ క్రిస్టియన్ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మద్దిరాల జోసెఫ్ ఇమాన్యుయేల్‌ను నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

vademaatram 09012019

సీఎం చంద్రబాబు ఇటీవలే కొన్ని కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తాజాగా మరో నాలుగు కొర్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించారు. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వందేమాతరం శ్రీనివాస్‌కు ఏపీ సీఎం కీలక పదవి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పార్టీ కోసం వందేమాతరం శ్రీనివాస్ పాడిన ‘తరలుదాం రండి మనం జన్మభూమికి..’ అంటూ సాగే పాట విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే.

vademaatram 09012019

అటు ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2018 విజేత ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు సమున్నత గౌరవం కల్పించారు. ఆయన రాసిన ‘విమర్శిని’కి 2018కి గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. తెలుగు సాహిత్యంపై విమర్శకు సంబంధించి ఇనాక్ ఈ పుస్తకాన్ని రాశఆరు. జనవరి 29న ఢిల్లీలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఏటా 24 భాషల్లోని సాహిత్య రచనలను పరిశీలించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందిస్తారు. ఇనాక్ గతంలో ఎస్వీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా సేవలు అందించారు. ఆయన రాసిన ‘అనంత జీవనం’కు ప్రతిష్టాత్మక మూర్తిదేవి అవార్డు లభించింది. తెలుగులో ఇనాక్ అనేక నవలలు రాశారు. అందులో ‘ఊరబావి’ ప్రధానమైంది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పవిత్ర సంగమ ప్రదేశానికి అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు సీఎం చంద్రబాబు ఈ నెల 12న శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పవిత్ర సంగమం దగ్గర శంకుస్థాపన ఫలకాన్ని ఆ రోజు ఉదయం 10 గంటలకు సీఎం ఆవిష్కరించనున్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో నిర్మితమయ్యే ఈ వంతెన అమరావతిలోని ఉద్ధండరాయునిపాలెం నుంచి సంగమ ప్రదేశం వరకూ 3.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ వంతెన నిర్మాణ వ్యయం సుమారు రూ.1387 కోట్లు. కేబుల్‌పై అరకిలోమీటరు.. రాజధాని శోభను మరింత ఇనుమడింపజేయగల ఈ ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు అనేక విశిష్ఠతలున్నాయి.

iconic 09012019

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమై, ఈ ప్రాంతంలోనే పురుడుపోసుకున్న కూచిపూడి నృత్యంలోని అభివాదముద్రను తలపించేలా డిజైన్‌ రూపొందించడం విశేషం. దీంతోపాటు రాష్ట్రంలోనే తొలిసారిగా కేబుల్‌ ఆధారంగా నదిపై నిర్మితమవుతున్న వంతెనగా సైతం ఇది నిలవనుంది. నది మధ్యభాగంలో సుమారు 480 మీటర్ల పొడవునా ఈ వంతెన కేబుల్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సమర్పించిన 6 రకాల ఆకృతులను దీని కోసం సమర్పించింది. నమస్కార ముద్ర, కూచిపూడి నృత్య భంగిమ ముద్ర, కూచిపూడి అరల ముద్ర, పుష్పాన్ని పోలిన ఆకృతిలో ప్రజావారధి(రెండంతస్థులు), అమరావతి స్థూపం, కొండపల్లి బొమ్మ.. ఇలా మొత్తం 6 రకాల ఆకృతులను పరిశీలించిన ముఖ్యమంత్రి, ప్రజాభిప్రాయం తరువాత, కూచిపూడి డిజైన్ ఫైనల్ చేసారు.

iconic 09012019

కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్ర సంగమం నుంచి తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మాణానికి అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) త్వరలో త్వరలోనే టెండర్లు పిలవనుంది. ఈ వంతెన కేవలం రాకపోకలకు మాత్రమే ఉపయోగపడేలా కాకుండా వినోద కేంద్రంగా కూడా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. అందుకే రెండు అంతస్తుల్లో కింది నుంచి ట్రాఫిక్‌ వెళ్లేలా పైన పర్యాటకులు తిరిగేలా దీన్ని తీర్చిదిద్దను న్నారు. ఈ వంతెనకు సంబంధించి ఇప్పటికే ఎల్‌ అండ్‌ టీ ఆరు కాన్సెప్ట్‌ డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు ఆ సంస్థకే వంతెన నిర్మాణ బాధ్యతలను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ ఎన్నికల సమయంలో తమ మద్దతు కాంగ్రెస్‌కే నంటూ వైసీపీ వ్యవస్థాపకుడు, తెలంగాణ యూనిట్ జనరల్ సెక్రటరీ శివకుమార్ పత్రికా ముఖంగా లేఖ విడుదల చేయడంతో ఆయనను పార్టీ నుంచి జగన్ శాశ్వతంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. అప్పట్లో జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన శివకుమార్, రాజ్యాంగం ప్రకారం పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు. తాజాగా మరోసారి తన బహిష్కరణపై నిరసన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ దగ్గర అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.

nirasana 09012019

ఎలాంటి కారణాలు లేకుండానే తనను పార్టీ నుంచి బహిష్కరించడంలో దాగిఉన్న వాస్తవాలను ప్రజలకు వివరిస్తానని శివకుమార్‌ పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాలోనూ దీక్ష చేపడతానని ప్రకటించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఆయన అనుచరులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. వైసీపీలో ధనవంతులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన జగన్‌ లాంటి వారు ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తారని శివకుమార్ నిలదీశారు. తెలంగాణలో ఉద్దేశపూర్వకంగానే పార్టీని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ‘జోహార్ వైఎస్ఆర్.. తెలంగాణ నుంచి జగన్ సార్ పరార్’ అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ఆంధ్రాలో ఫోకస్ పెట్టిన జగన్ భవిష్యత్తులో తెలంగాణలో పోటీ చేస్తాడని అనుకోవడం లేదని, 2024 కు సంస్థాగతంగా బలపడదామని చెబుతున్నా తనకు నమ్మకం లేదని అప్పట్లో శివకుమర్ వ్యాఖ్యానించారు.

nirasana 09012019

దీంతో జగన్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. వైఎస్ఆర్ ను తిట్టిన వాళ్ళకు ఓటు వెయ్యద్దు అన్నందుకు, దేశ చరిత్రలో పార్టీ వ్యవస్థాపకుడినే సస్పెండ్‌ చేసిన ఘనత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ చివరి కోరిక కూడా 42 ఎంపీ సీట్లు గెలిపించి రాహుల్ గాంధిని ప్రధానిని చెయ్యటమే అని, ఆయన ఎన్నో సార్లు ఇది మీడియా ముఖ్యంగానే చెప్పారని, వైఎస్ఆర్ వారసుడు అయిన జగన్ మాత్రం అందుకు విరుద్దుంగా వెళ్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ కోరిక మేరకు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, అతనిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తనను సస్పెండ్‌ చేశారని తెలిపారు. జగన్‌ 16 నెలలు జైలుకెళ్లినా కూడా పార్టీని ఇక్కడ బతికించుకున్నామని చెప్పారు. పార్టీ నుంచి బహిష్కరించే ముందు కనీసం తన వివరణ కూడా అడగలేదన్నారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటానన్నారు.

Advertisements

Latest Articles

Most Read