ప్రముఖ హాస్య నటుడు అలీ రాజకీయ రంగం ప్రవేశం ఇప్పటికే ఖాయమైంది. అయితే, అది ఏ పార్టీ నుంచి అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్‌తోనూ ఆయన భేటీ కావడంతో ఆయన తొలుత వైసీపీ, తర్వాత జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే, వీటిని అలీ కొట్టిపారేశారు. తాజాగా మంగళవారం టీడీపీ నేత, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో అలీ భేటీ అయ్యారు. ఓ సినిమా షూటింగ్ కోసం విశాఖకు వెళ్లిన ఆయన గంటాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీకి తనకు అవకాశం ఇచ్చిన పార్టీకే జై కొడతానని పేర్కొన్నారు.

ali 09012019

తనకు ఒక గురువు ఉన్నారని, జనవరి 16 వరకు రోజులు బాగాలేవని ఆయన చెప్పారని, ఆ తేదీ తరువాతే తాను ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని అన్నారు. టీడీపీ అంటే తనకు అభిమానమని, సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులతో తనకు పరిచయాలున్నాయని, తనను వారు ఓ సోదరుడిలా చూసుకుంటారని తెలిపారు. గతంలో తాను గంటాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే, మంత్రి గంటాకు తాను చెప్పాల్సింది చెప్పానని, ఆయన తనను సిఫారసు చేస్తారని భావిస్తున్నానని పరోక్షంగా టీడీపీలో చేరుతాననే సంకేతాలిచ్చారు.

ali 09012019

అంతేకాదు, తాను 20 ఏళ్ల నుంచి కార్యకర్తగానే ఉన్నానని, ఇక అభ్యర్థిగా ఉండాలన్నది తన అభిమతమని వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి గంటా మాట్లాడుతూ.. అలీ గురించి ముఖ్యమంత్రికి తెలుసని, ఆయన ఉద్దేశాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని వివరించారు. తాను కూడా ముఖ్యమంత్రికి చెప్పాల్సినవి చెబుతానన్నారు. గుంటూరు నుంచి పోటీ చేయడానికి అలీ ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. అయితే ఆలీ ప్రతిపాదన పై చంద్రబాబు ఎలా స్పందిస్తారు ? అలీ చెప్పింది చేస్తారా ? గంటా రాయబరాం ఫలిస్తుందా ? ఇప్పటికే ఉన్న ఆశావాహులు ఎలా రియాక్ట్ అవుతారు ? ఇవన్నీ తెలియాలంటే, చంద్రబాబు రియాక్షన్ కోసం ఎదురు చూడటమే...

రాష్ట్రంలోని పార్ట్‌టైమ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వో)కు ప్రభుత్వం సంక్రాంతి బొనాంజా ప్రకటించింది. వారి గౌరవ వేతనాన్ని నెలకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రెవెన్యూశాఖ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు (జీవో నం.10) జారీ చేసింది. పెంచిన వేతనం వెంటనే అమల్లోకి వస్తుందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. భారీగా వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమకు ముందే సంక్రాంతి వచ్చిందని వీఆర్‌వోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

vro 09012019

ఈ వేతన పెరుగుదల కోసం వారు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్నారు. వారికి సర్వీసు రూల్స్‌, క్రమబద్ధీకరణే ఇక మిగిలాయి! వీటిని కూడా దశలవారీగా చేపట్టాలని రెవెన్యూశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రెవెన్యూశాఖలో రెగ్యులర్‌ వీఆర్‌వో, వీఆర్‌ఏలతోపాటు పార్ట్‌టైమ్‌ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. 2012, 2014 సంవత్సరాలలో ఏపీపీఎస్సీ ద్వారా భారీగా నియామకాలు చేపట్టారు. ఇందులో 4600 మంది వీఆర్‌ఏలే ఉన్నారు. నియామకాల నుంచి ఇప్పటి దాకా వారికి వేతన సవరణ జరగలేదు. దీనిపై వారు ప్రభుత్వానికి అనేక విన్నపాలు ఇచ్చారు.

vro 09012019

ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన తమకు వేతనాలు పెంచడంతోపాటు సర్వీసు రూల్స్‌ను వర్తింపచేసి క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. ఇదే విషయమై రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ద్వారా, ఆ తర్వాత వీఆర్‌వోల సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వేతనం పెంచింది. ఇదిలావుండగా, వీరి సర్వీసు రూల్స్‌, ఇతర అంశాలపై రెవెన్యూశాఖ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారని తెలిసింది.

పవన్ కల్యాణ్ గురించి తెలిసిన వారు ఎవరైనా, ముందుగా చెప్పేది, అతనికి స్థిరత్వం లేదని. అనేకసార్లు, తాను చేసిన పనులతో, అదే నిజం అని నిరుపించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి, నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్తూ కూడా, ఈ అలవాటు మాత్రం మానటం లేదు. హడావిడి చెయ్యటం, సడన్ గా సైలెంట్ అయిపోవటం, పవన్ కు ఇది మామూలు విషయం. అందుకే పవన్ ను ఎవరూ, సీరియస్ పొలిటిషియన్‌గా తీసుకోరు. అతని సినిమా ఫాన్స్, ఆహా, ఓహో అని చెప్పటమే కాని, ప్రజలకు మాత్రం, తాను పార్ట్ టైమ్ పొలిటిషియన్‌ లాగానే కనిపిస్తున్నారు. తెలంగాణా ఎన్నికలు ముందు, ప్రజల నుంచి దూరమైన పవన్, అమెరికా పర్యటన అంటూ 15 రోజులు వెళ్లి, మళ్ళీ ఇప్పుడు విజయవాడ వచ్చి, పది రోజులు అయినా, సమీక్షలకే పరిమితం అయ్యారు.

pk 09012019

ఇప్పుడు ఆయన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోరాట యాత్రను కూడా ఆపేశారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఐదేళ్లు దాటింది. ఇప్పటికీ నాకు సమయం సరిపోవడం లేదు అనే కారణం చెబుతున్నారు. అధికారంలో ఉన్నా .. ప్రతిపక్షంలో ఉన్నా సమయంతో పోటీ పడి రాజకీయాలను చక్క బెట్టుకోవాలి. అంతే కానీ.. ప్రతీ దానికి సమయం లేదని తప్పించుకోవడం రాజకీయం అనిపించుకోదు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఓ వైపు ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూనే… పార్టీని నడుపుతున్నారు. ఆయన ఒక్కో జిల్లాకు పదుల సార్లు వెళ్లారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాలు చుట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర యాత్ర ద్వారా మెజార్టీ నియోజకవర్గాల్లో నడిచారు కలుస్తున్నారు. త్వరలో బస్సు యాత్రకు కూడా సిద్దం అవుతున్నారు. మరి ఇద్దరితో పోలిస్తే.. పవన్ కల్యాణ్.. ఏమంత బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని జిల్లాలున్నాయి…? పదమూడు జిల్లాలు. ఈ పదమూడు జిల్లాలో తిరగడానికి కూడా.. పవన్ కల్యాణ్‌కు సమయం సరిపోలేదు.

pk 09012019

పోరాటయాత్ర చేస్తా.. కవాతు ద్వారా.. రాజకీయం చేస్తా అన్నాడు. కానీ ఐదు జిల్లాలు తిరిగే సరికే సమయం మొత్తం గడిచిపోయింది. ఇప్పుడు ఎన్నికలు ముంగిటకు వచ్చేశాయి కాబట్టి.. పోరాటయాత్ర నిలిపివేసి.. ఆయన జిల్లాలలో అంశాల వారీ సమస్యలు తీసుకుని పర్యటించాలని అనుకుంటున్నారట. కనీసం పదమూడు జిల్లాల్లో పర్యటించలేని రాజకీయ నేత ఎవరైనా ఉన్నారా అంటే.. అది పవన్ కల్యాణే. గత మేలో శ్రీకాకుళం జిల్లాలో పోరాటయాత్ర చేశారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలు తిరిగేసి ఇక సమయం లేదని ఆగిపోవడం ప్రణాళిక లేని రాజకీయం అవుతుంది. కనీసం పార్టీ కార్యక్రమాల్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించలేనంతగా పరిస్థితులు ఉంటే.. ప్రజలు ఎలా అధినేతను ఎలా నమ్ముతారంటూ జనసేనలోని ద్వితియ శ్రేణి నాయకులు అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను గమనించిన పవన్‌ కల్యాణ్‌ ఆ తరహా రాజకీయాన్ని ఇక్కడ అమలు చేయాలని కొన్నినెలలుగా భావిస్తున్నారు. జేడీఎస్‌ ఆదర్శంగా పవన్‌ కల్యాణ్‌ రాజకీయం ఏపీలో రాజకీయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ జేడీఎస్‌ జాక్‌ పాట్‌గా సీఎం పీఠాన్ని పొందడమే పవన్‌ చూశాడు కానీ.. దానివెనుక కష్టాన్ని చూడలేదు. దానివెనుక ఉన్న దశాబ్దాల పార్టీ నిర్మాణాన్ని గమనించలేదు. జేడీఎస్‌ పార్టీ ఒక కుటుంబ పార్టీనే. అయితే ఆ కుటుంబీకులకు నిరంతరం రాజకీయమే వృత్తి. ఓడిపోయినప్పుడు ఇంట్లో కూర్చోలేదు. నెలల తరబడి విరామాలు తీసుకోలేదు. అవేమీ గమనించకుండా అసలైన టైంలో టైమ్ లేదు అనడం సరికాదనేది రాజకీయ విశ్లేషకుల వాదన.

ఒక జెడ్ ప్లస్ క్యాటగిరీ ఉండే ముఖ్యమంత్రి వాహనాన్ని, ఒక పది మంది వేరే పార్టీ కార్యకర్తలు వచ్చి అడ్డుకోవటం అంటే, అంత ఈజీగా జరిగే విషయం కాదు. కాకినాడలో చంద్రబాబు కాన్వాయ్ ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న సందర్భంగా, చాలా మంది చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే, ఇది నిజమే అని ఇంటలిజెన్స్ రిపోర్ట్ తేల్చింది. ‘బీజేపీ జిల్లా అధ్యక్షుడితో సహా ఇరవై మంది సీఎం కాన్వాయ్‌ని అడ్డగించేందుకు సిద్ధమవుతున్నారు’ అని జిల్లా పోలీసు అధికారులకు సీఎం పర్యటనకు ముందురోజే అందిన సమాచారం. అయితే బీజేపీ అధ్యక్షుడిని ఒక్కరినే గృహనిర్బంధం చేసి మిగిలిన వారి కదలికలపై దృష్టి పెట్టలేదు. పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్లే సీఎం పాల్గొనే సభకు 100 మీటర్ల దూరంలోనే సీఎం వెహికల్‌కి బీజేపీవాళ్లు అడ్డంపడ్డారు.’ ఇదీ ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్‌ నివేదికలోని షాకింగ్ విషయం.

intelligence 09012019 2

ఈనెల 4న కాకినాడ జేఎన్టీయూకే క్రీడా మైదానంలో జన్మభూమి సభకు సీఎం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆ సభలో పాల్గొనేందుకు వస్తుండగా.. సీఎం కాన్వాయ్‌ వాహనాన్ని బీజేపీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం డౌన్‌డౌన్‌.. అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేయగా... సీఎం వాళ్లపై ఫైర్‌ అయ్యారు. మోదీ రాష్ట్రానికి చేసిన మోసంపై నిలదీయండంటూ తన కాన్వాయ్‌ను అడ్డుకున్న వాళ్లకు క్లాస్‌ పీకారు. ఇదేకాకుండా కాకినాడ జేఎన్టీయూ క్రీడా మైదానంలో సభ విషయంలోనూ కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడినట్టు కూడా ఇంటిలిజెన్స్‌ నివేదిక పేర్కొన్నట్టు సమాచారం. జన్మభూమి సభ అంటే కలెక్టర్‌, అధికారులే చూసుకుంటారులే అన్నట్టు ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల టీడీపీ కేడర్‌లో అసంతృప్తి వ్యక్తమైంది.

intelligence 09012019 3

జన్మభూమి అధికారిక కార్యక్రమమే అయినా.. పార్టీపరంగానూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కేడర్‌ ఎక్కడికక్కడ తమవంతు సహకారం అందిస్తోంది. అయితే కాకినాడలో జరిగిన జన్మభూమి సభ విజయవంతం చేయడానికి సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలతోపాటు.. మేయర్‌, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోలేదు. జన్మభూమి సభ అంటే అధికారులే చూసుకోవాలని టీడీపీ ప్రజాప్రతినిధులు.. అన్నిచోట్లా టీడీపీ ఎమ్మెల్యేలే జనాన్ని తీసుకువస్తున్నారంటూ అధికారులు ఎవరికి వారు తప్పించుకునే ధోరణితో వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి అటు పోలీస్ అధికారులు, ఇటు పార్టీ నేతలు కలిసి, చంద్రబాబుకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చింది.

 

Advertisements

Latest Articles

Most Read