తనకు ప్రధాని కావాలన్న కోరిక ఏ మాత్రం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జన్మభూమి-మాఊరు గ్రామసభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా అన్న క్యాంటిన్‌ను ప్రారంభించారు. అక్కడ మాట్లాడుతూ, ఎలాంటి విమర్శలు పట్టించుకోకుండా, దగాపడ్డ ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నానన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడగడుతున్నానన్నారు. అదృష్టం కలిసివచ్చి ప్రధాని అయ్యారని, మనపై కుట్ర పన్నారని విమర్శించారు. తన కుటుంబం పై ప్రధాని మోడీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి స్థాయికి ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.

lokesh 007022019 2

నా కుటుంబ సభ్యులు హెరిటేజ్‌ను ఒక పద్దతి ప్రకారం నడిపిస్తున్నారన్నారు. డబ్బుల కోసం ఇబ్బందిపడకుండా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. కంపెనీలు చూసుకోమని తాను లోకేష్‌కు సూచించానన్నారు. కాని లోకేష్ రాజకీయాల్లోకి వస్తానని, ప్రజా సేవ చేస్తాను అని కోరటంతో, ఇటు వైపు వచ్చారని అన్నారు. తాను బాగా పని చేస్తే, ప్రజలు ఆదరిస్తారాని, ఏ రాజకీయ నాయకుడుకి అయినా అంతే అని అన్నారు. ‘‘రాష్ట్ర పరిధిలో ఉండే కోడి కత్తి కేసుపై ఎన్ఐఏ ఎంక్వైరీ వేశారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో నాడు సీబీఐ విచారణను మోదీ అడ్డుకున్నారు. నా కుటుంబ సభ్యులు హెరిటేజ్‌ను పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు. కంపెనీలు చూసుకోవాలని లోకేష్‌కు సూచించా. ప్రజాసేవ కోసం రాజకీయాలకు వస్తానని లోకేష్ చెప్పారు. నా కుటుంబంపై ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరం. నాకు ప్రధాని కావాలన్న కోరిక ఏ మాత్రం లేదు. హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం. రేపు మరోసారి ఢిల్లీ వెళ్తా.. ఇతర పార్టీల నేతలను కలుస్తా’’ అని చంద్రబాబు తెలిపారు.

lokesh 00702201 9

విభజన హామీలు అమలు చేయకపోవడంతో పాటు ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా నమ్మకద్రోహానికి పాల్పడటం వల్లే తాము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నప్పటికీ కేంద్రం మాత్రం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జరిగిన దాడి కేసులో కావాలనే కేంద్రం జోక్యం చేసుకుంటోందని చంద్రబాబు విమర్శించారు. విభజన హామీల అమలు కోసం పోరాటం చేస్తుంటే ఐటీ, సీబీఐ దాడుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిన్న మోడీ మాట్లాడుతూ, చంద్రబాబుకి ప్రజా సేవ తెలియదని, కేవలం కొడుకు కోసమే రాజకీయాలు చేస్తున్నారని చెప్పిన విషయం తెలిసిందే.

ఏపీ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి అర్బన్) పార్టీకి రాజీనామా చేశారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి తన రాజీనామా లేఖను అందజేస్తారని సమాచారం. ప్రస్తుతం ఏపీ బీజేపీలో తలెత్తిన పరిణామాలను తనకు రుచించలేదని, కన్నా లక్ష్మీనారాయణకు, పార్టీ కేడర్‌కి అగాధం ఏర్పడిందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. వీటితో పాటు తన వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో రాసినట్టు తెలుస్తుంది. అయితే ఆకుల సత్యానారాయణ జనసేనలో చేరుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

amitshah 07012019

ఇంతకు ముందు టీడీపీలో చేరాలని భావించారని సమాచారం. అయితే అధ్యక్షుడు చంద్రబాబు నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాకపోవడంతో టీడీపీలో చేరాలన్న ఆలోచన విరమించుకొని జనసేనలో చేరాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం. మరోవైపు ఆకుల సతీమణి ఇప్పటికే జనసేనలో కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి అర్బన్ స్థానం నుంచి 2014లో ఆకుల సత్యనారాయణ, బీజేపీ తరపున గెలుపొందారు. ఈ వార్తలు వస్తూ ఉండగానే, ఆయన ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు.

amitshah 07012019

ఈ విషయమై ఆకుల సత్యనారాయణ ఢిల్లీలో స్పష్టత ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకునేందుకు ప్రస్తుతం తాను ఢిల్లీకి వచ్చానని సత్యనారాయణ తెలిపారు. షా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారనీ, త్వరలోనే ఢిల్లీకి తిరిగివస్తారని వ్యాఖ్యానించారు. ఆయన అపాయింట్ మెంట్ తనకు ఇంకా లభించలేదన్నారు. అమిత్ షాను కలుసుకున్నాక పార్టీ మారడంపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. రాజీనామా విషయం ఇంకా ఆలోచించలేదని, నియోజకవర్గ సమస్యలపై కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. అయితే, నియోజకవర్గ సమస్యల గురించి, అమిత్ షాతో మాట్లాడేది ఏముంటుందో, ఆయనకే తెలియాలి. అమిత్ షా నుంచి ఆదేశాలు రాగానే, జనసేనలో జాయిన్ అవుతారని సమాచారం..

బీజేపీ యేతర ఐక్యఫ్రంట్‌పై మరో విడత జాతీయ నేతలతో చర్చలు జరిపేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళుతున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయం ప్రారంభం అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని అటు నుంచి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. గత నెల మొదటి వారంలో జాతీయ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ నెల రెండో వారంలో మరోసారి ఆయన భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, మాయావతి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, తదితర నేతలతో ఆయన మలివిడత చర్చలు జరపనున్నారు.

delhi 07012019

అంతకుముందు ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీలతో సమావేశమై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధానికి నిధుల మంజూరు, రైల్వేజోన్, తదితర అంశాలపై పార్లమెంట్‌లో ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేసిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో ఇకముందు జరిగే సమావేశాల్లో ఆందోళన ఉద్ధృతి పెంచే దిశగా కార్యాచరణ రూపొందించనున్నారు. జాతీయ, ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల ఎంపీలను కలుపుకుని రాఫెల్ కుంభకోణంపై మూకుమ్మడి ఆందోళన నిర్వహించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి షాక్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని సమాచారం.

delhi 07012019

మరో పక్క చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై స్పందించారు. అదృష్టం కలిసి వచ్చి మోదీ ప్రధాని అయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. నిడదవోలులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా అన్న క్యాంటిన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘రాష్ట్ర పరిధిలో ఉండే కోడి కత్తి కేసుపై ఎన్ఐఏ ఎంక్వైరీ వేశారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో నాడు సీబీఐ విచారణను మోదీ అడ్డుకున్నారు. నాకు ప్రధాని కావాలన్న కోరిక ఏ మాత్రం లేదు. హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం. రేపు మరోసారి ఢిల్లీ వెళ్తా.. ఇతర పార్టీల నేతలను కలుస్తా’’ అని చంద్రబాబు తెలిపారు.

నిన్న జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు పై ఒక కామెడీ పుస్తకం రిలీజ్ చేసారు. ఆ పుస్తకం చూసి, సొంత పార్టీ నేతలే నమ్మని పరిస్థితి. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో 6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అవి ఈ వివరాలు అంటూ పుస్తకం రిలీజ్ చేసాడు జగన్. అసలు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, 6 లక్షల కోట్లు అవినీతి చెయ్యటం ఏంటి, ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇన్ని లక్షల కోట్లు అవినీతి చేస్తే, ఒక్క చిన్న సాక్ష్యం చూపించి, కోర్ట్ కి వెళ్ళవచ్చు కదా ? లేకపోతే ఢిల్లీ లో ఉన్న, మన దోస్త్ మోడీకి చెప్తే, ఆయన చూస్తూ ఊరుకోడు కదా.. చంద్రబాబు తప్పు చేస్తే, ఇది తప్పు అని సాక్ష్యాలతో ప్రజల ముందు నిలబెట్టాలి. అప్పట్లో చంద్రబాబు అలాగే చేసారు, జగన్ ని చిప్ప కూడు తినిపించారు. మరి, ఇప్పుడు జగన్, ఇలా చెయ్యటం ఎందుకు.

lokesh 07012019

అయితే, ఈ విషయం పై లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. 420-840 కలిసి జగన్-కసాయి దొంగలు అనే పుస్తకాన్ని తెచ్చారని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తమ అవినీతి పుత్రిక దర్శకత్వంలో ఈ పుస్తకం తెచ్చారన్న లోకేష్ మహామేత హయంలో జలగన్న లక్షకోట్లు దోచుకున్నారని.. దోచుకున్న సొమ్ముతో అవినీతి అనే సామ్రాజ్యాన్ని నిర్మించారని.. అవినీతి వ్యాపారంలో లాభం, వడ్డీ లెక్కేసుకోని పుస్తకం వేశారని ఆరోపించారు. ఐదేళ్ల రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి జరిగిందని అంటున్నారని.. జలగన్న కేరాఫ్ త్వరలో పిచ్చాసుపత్రి కాబోతుందంటూ ఘాటుగా పోస్ట్ చేశారు.

lokesh 07012019

ఇది లోకేష్ ట్వీట్ "420, 840 కలిసి తమ అవినీతి పుత్రిక డైరక్షన్ లో ‘జగన్ - కసాయిదొంగలు’ అనే పుస్తకం వేసారు. మహామేత హయాంలో జలగన్న దోచుకున్న లక్ష కోట్లతో నిర్మించిన అవినీతి సామ్రాజ్య వ్యాపారాల్లో వచ్చిన లాభం, వడ్డీలు లెక్కేసుకొని పుస్తకం వేసారు. రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి జరిగింది అంటున్న జలగన్న కేర్ ఆఫ్ అడ్రెస్ త్వరలో పిచ్చాసుపత్రి కాబోతోంది." అంటూ లోకేష్ ట్వీట్ చేసారు. మరో పక్క మోడీ పై కూడా లోకేష్ ట్వీట్ చేసారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుగారి పేరు వింటేనే ప్రధాని మోడీగారు భయంతో వణుకుతున్నారు అని ఆయన మాటల్లోనే అర్థం అవుతుంది. ప్రధాని మోడీగారు ఆకాశంలో విహరించడంమాని భూమి మీదకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి కనిపిస్తుంది."

Advertisements

Latest Articles

Most Read