ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 64 శాతం పనులు పూర్తి అయ్యాయి. కేంద్రం ఈ ప్రాజెక్టు పనులకు సహకరించక పోయినా... ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులను పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారు. ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో, రేపు గిన్నిస్ రికార్డు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ప్రాధాని మోడీ మాట్లాడుతూ, అసలు పోలవరంలో పనులే జరగటం లేదు అంటున్నారు, కనీసం, ఈ గిన్నీస్ రికార్డు చూసైనా తెలుసుకుంటారేమో.

polavaram 05012019

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నర పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్డు గిన్నిస్ రికార్డు సాధించే దిశగా సాగుతోంది... పోలవరం కాంక్రీటు పనుల్లో మరో కీలక ఘట్టం రేపు చోటుచేసుకోనుంది. గిన్నిస్‌ రికార్డు సాధించే దిశగా నవయుగ నిర్మాణ సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రాజెక్టులోని స్పిల్‌ వే, స్పిల్‌ చానల్లో 6వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభించి 7వ తేదీ ఉదయం 7 గంటల వరకు 24 గంటల్లో 28 వేల నుంచి 30 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పనులతో గిన్నిస్‌ రికార్డు సాధించి తీరుతామని నవయుగ నిర్మాణ సంస్థ ప్రకటించింది... మరో పదేళ్ల వరకు ఈ రికార్డును ఎవరూ అధిగమించలేని విధంగా పనులు జరుగుతాయంటున్నారు.

polavaram 05012019

ఇక దీని కోసం నవయుగ కంపెనీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది... కాంక్రీటును స్పిల్‌ చానల్‌, స్పిల్‌వేలో వేసే విధంగా కాంక్రీటు మిక్చర్‌ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా దారులు ఏర్పాటు చేశారు. ప్రతీ నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని గిన్నిస్‌ రికార్డు సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఈ పనులను పరిశీలించి రికార్డు నమోదు చేసేందుకు లండన్‌ నుంచి గిన్నిస్‌ బుక్‌కు సంబంధించిన అధికారులు కూడా రానున్నారు. కొందరు నిపుణులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఈ రికార్డు పరిశీలనకు మొత్తం 24 మంది వస్తారని నవయుగ నిర్మాణ సంస్థ ప్రకటించింది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన లిక్వాన్‌ యూ స్కూల్‌ అనుబంధ ఏషియా కాంపిటీటీవ్‌నెస్‌ ఇనిస్టిట్యూట్‌ (ఏసీఐ) సర్వేలో ఈ ఘనతను సొంతం చేసుకుంది. సులభతర వాణిజ్యంపై దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన ఏసీఐ ఫలితాలను గురువారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. వివిధ రంగాల్లో పెట్టుబడుదారులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు, పారిశ్రామిక రంగంలో సంస్కరణలు, ఇతర అనేక అంశాలు సులభతర వాణిజ్యంలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడానికి దోహదం చేశాయని ఏసీఐ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా ఇదివరకు నిర్వహించిన సర్వేలోనూ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

led 05012019

ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ‘ఆసియా కాంపిటిటీవ్‌నెస్ ఇనిస్టిట్యూట్’ (ఏసీఐ) కో-డైరెక్టర్ డాక్టర్ టాన్ ఖీ జియాప్ ఈ ర్యాంకులకు సంబంధించిన పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందించారు. ఆ తరువాత ముఖ్యమంత్రితో కలిసి ఉండవల్లి ప్రజావేదికలో పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని ర్యాంకుల వివరాలను వెల్లడించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అట్రాక్టీవ్‌నెస్ టు ఇన్వెస్టర్స్, బిజినెస్ ఫ్రెండ్లీనెస్, కాంపిటిటీవ్‌నెస్ పాలసీస్’ (ఏబీసీ) పేరుతో ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తున్నారు. ఆసియాదేశాలలో ప్రతిష్టాత్మకంగా భావించే ఏసీఐ-ఈడీబీ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఇండెక్స్ ర్యాంకులలో ఏపీ తరువాత మహారాష్ట్ర, ఢిల్లీ రెండు, మూడు స్థానాలలో నిలిచాయి. సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయంలో భాగమైన ‘లీక్వాన్ యు స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ ఆసియా దేశాలలో పోటీతత్వ అభివృద్ధి, అవగాహన కోసం మేథోపరమైన నాయకత్వం, నెట్‌వర్క్‌ను అందించాలన్న లక్ష్యంతో 2016లో ఏసీఐ పేరుతో పరిశోధనా విభాగాన్ని నెలకొల్పింది. ఈ పరిశోధన విభాగం వ్యాపార అనుకూలతలు గల దేశాలను పరిశీలించి ఈడీబీ ర్యాంకులను ప్రకటిస్తుంటుంది. తన దార్శనిక నాయకత్వంతో ఏపీని సూర్యోదయ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని డాక్టర్ టాన్ ప్రశంసించారు.

led 05012019

విశ్వసనీయత ఉంటేనే పెట్టుబడిదారులు వస్తారని, నాలుగేళ్ల శ్రమతో సులభతర వాణిజ్యంలో ఏపీకి మొదటి స్థానం దక్కిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది గొప్ప గుర్తింపని చెప్పారు. అధికారులు బాగా పని చేయడంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ మొదటి స్థానంలో ఉన్నామని, తెలంగాణ తొమ్మిదిలో ఉందని తెలిపారు. సింగపూర్‌ విశ్వవిద్యాలయం ఇచ్చిన నివేదిక చాలా విశ్వసనీయమైనదన్నారు. ఇంకా ఏమేమి చేయాలో ఎప్పటికప్పుడు సింగపూర్‌ జాతీయ వర్సిటీని అడుగుతున్నామని, 50 ఏళ్లలో వర్సిటీ గొప్ప విశ్వసనీయత ఏజెన్సీగా ఎదిగిందని తెలిపారు.

వరుస నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్న ఏపి ప్రభుత్వం, వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెలాఖరులోగా మరో 14 నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ పీ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 14 నోటిఫికేషన్ల ద్వారా 1521 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సర్వీస్ నిబంధనలు, అర్హతలు, ఖాళీల వివరాలు, తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి వివరాలు రావాల్సి ఉందన్నారు. ఈ వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్‌లు జారీ చేస్తామన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 21 నోటిఫికేషన్లు జారీ చేశామని గుర్తు చేశారు. దీని ద్వారా 3255 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఏఈఈ పోస్టులకు 47001 మంది, ఫారెస్టు రేంజర్ ఆఫీసర్ల పోస్టులకు 16,130 మంది, హార్టికల్చర్ అధికారుల పోస్టులకు 1307 మంది, పంచాయతీరాజ్ సెక్రటరీ పోస్టులకు 56,621 మంది దరఖాస్తు చేశారన్నారు. వివిధ పరీక్షలకు తుది గడువు వరకూ వేచి ఉండకుండా నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.

youth 05012019

చివరి తేదీల్లో దరఖాస్తు చేయడం వల్ల సర్వర్‌పై ఒత్తిడి పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అభ్యర్థులు దీనిని గమనించాలన్నారు. ఓటీపీఆర్‌లో తలెత్తే ఇబ్బందుల పరిష్కారానికి ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను, ఇతర సమస్య పరిష్కారానికి మరో రెండు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు తమ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్లు మార్చడం వల్ల ఓటీపీఆర్ పంపడం, సవరణలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 2016లో 34 నోటిఫికేషన్లను విడుదల చేసి, విజయవంతంగా ఎటువంటి కోర్టు వివాదాలు లేకుండా నియామకాలు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం స్క్రీనింగ్ పరీక్షకు కటాఫ్ మార్కులు నిర్ణయించి, 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేస్తున్నామన్నారు. వివిధ కేటగిరిల్లో తగిన సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కాని పక్షంలో కటాఫ్ మార్కులను సడలించి, కొంతమందిని మెయిన్‌కు అనుమతిస్తున్నామన్నారు.

youth 05012019

అయితే వీరు క్యారీఫార్వర్డ్ అయ్యే పోస్టులకు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. యూపీఎస్సీ తరహాలో పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి ఆర్కియాలజీ మినహా మిగిలిన 43 విభాగాల నియామకానికి ఎటువంటి కోర్టు అభ్యంతరాలు లేవన్నారు. ఆయా వర్సీటీల వీసీలు ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గ్రూప్-2 1999 నోటిఫికేషన్‌కు సంబంధించి సబ్ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు అందచేసిందని, తదుపరి ఆదేశాలు కోర్టు నుంచి తమకు రాలేదన్నారు. ఈ సమావేశంలో ఎపీపీఎస్సీ సభ్యులు ఎస్.రూప, రంగ జనార్ధన్, విజయ్ కుమార్, సుజాత, పద్మరాజు, సెక్రటరీ వౌర్య పాల్గొన్నారు.

అమరావతి రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో సెక్రటేరియట్‌ టవర్లలోని రెండింటి(3, జీఏడీ) ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు శుక్రవారం పూర్తయ్యాయి. సచివాలయం, వివిధ శాఖల విభాగాధిపతుల జీఏడీ టవర్‌ రాఫ్ట్‌ ఫౌండేషన్‌ శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో రికార్డు సమయంలో పూర్తయిందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. నిర్మాణ ప్రదేశంలో రాఫ్ట్‌ ఫౌండేషన్‌ తుది దశ పనులను ఆయన దగ్గరుండి పరిశీలించారు. అనంతరం శ్రీధర్‌ మాట్లాడుతూ జీఏడీ టవర్‌కు మొత్తం 11,236 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటును 55 గంటల్లో వేసినట్లు తెలిపారు. ఈ నెల 2న మధ్యాహ్నం టవర్‌ పనులు ప్రారంభించామన్నారు. 500 మంది కార్మికులు, ఇంజినీర్లు మూడు షిఫ్టుల్లో పనిచేశారని ఆయన తెలిపారు. సచివాలయం, హెచ్‌వోడీకి సంబంధించి టవర్‌-3 రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం ప్రారంభించిన ఎల్‌అండ్‌టీ సంస్థ 58 గంటల్లో శుక్రవారం ఉదయానికి పనులు పూర్తి చేసిందన్నారు. డిసెంబరు 27న ముఖ్యమంత్రి టవర్‌-2 పనులు ప్రారంభించగా సంబంధిత గుత్తేదారు సంస్థ 66 గంటల్లో రాఫ్ట్‌ ఫౌండేషన్‌ పూర్తిచేసిందన్నారు.

crda 05012019 2

3వ టవర్‌ ఫౌండేషన్‌ పనులు గత మంగళవారం మొదలవగా, జీఏడీ టవర్‌ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. వీటి పరిమాణాన్ని బట్టి ఒక్కొక్క టవర్‌ ఫౌండేషన్‌ పనులు పూర్తవ్వాలంటే 3 రోజులు అవసరం. అది కూడా ఒక్క క్షణం కూడా పనులు ఆపకుండా చేపట్టాల్సి ఉంటుంది. ఆ ప్రకారమే 5 టవర్లతో కూడిన సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లో మొట్టమొదటగా గత నెల 27వ తేదీన ప్రారంభమైన తొలి టవర్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు 65 గంటల్లోనే పూర్తయ్యాయి. ఆ తర్వాత 3, జీఏడీ టవర్‌ల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు వరుసగా మంగళ, బుధవారాల్లో మొదలయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం 3వ టవర్‌ పనులు శుక్రవారమే పూర్తయ్యాయి. కాగా, జీఏడీ టవర్‌ పనులు శనివారం నాటికి ముగియాల్సి ఉండగా, శుక్రవారం సాయంత్రానికే అయ్యింది.

crda 05012019 3

ఇప్పటి వరకూ ఈ భారీ ఫౌండేషన్‌ పనులు చేపట్టిన 3 టవర్లలోకెల్లా అత్యంత వేగంగా పూర్తయిన టవర్‌గా జీఏడీ టవర్‌ నిలిచింది. కాగా, శాశ్వత సచివాలయ సముదాయంలోని మిగిలిన రెండు(1, 4) టవర్ల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనుల్లో ఒక దాన్ని సంక్రాంతి తర్వాత, మిగిలిన దాని పనులు ఈ నెలాఖర్లో చేపట్టనున్నట్టు సమాచారం. రాజధాని అమరావతి పరిధిలో వివిధ భవనాల నిర్మాణాలు రాత్రి, పగలూ అనే తేడాలేకుండా శరవేగంగా జరుగుతున్నాయి. సచివాలయం పరిధిలోని సీఎం టవర్‌ సహా హైకోర్టు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల గృహ నిర్మాణ పనులు ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. విద్యుద్దీపాల వెలుగులో జరుగుతున్న సంబంధిత పనులతో ప్రస్తుతం అమరావతి ప్రాంతం కళకళలాడుతోంది. అధికారుల పర్యవేక్షణలో శ్రామికులు షిప్టులవారీగా వారీగా పనిచేస్తున్నారు. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మాణరంగ పనుల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఒకవైపు విద్యుద్దీపాల వెలుగులు, మరోవైపు పెద్ద సంఖ్యలో శ్రామికుల సందడితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

Advertisements

Latest Articles

Most Read