కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా ఈ నాలుగేళ్లలో ఎదుర్కోలేని వ్యక్తి మన దేశ ప్రధాని అంటే నమ్మగలరా. మళ్ళీ నాకు 56 అంగుళాల ఛాతీ ఉంది, దానిలో దమ్ము ఉంది అంటూ డైలాగులకి కొదవే లేదు. ఇలాంటి వ్యక్తి చెప్పే అబద్ధాలు విని, విసుగెత్తి, బహిరంగ చర్చకు రండి అంటే, పారిపోతున్నారు. నిన్న చంద్రబాబు, ఈ రోజు రాహుల్, ఇద్దరికీ సమాధానం చెప్పే దమ్ము మన ప్రధానికి లేదు. ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ ‘కాపలాదారు దొంగ’ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం సంచలన డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ముఖాముఖి చర్చించేందుకు రావాలని కోరారు. ఏ అంశంపైన అయినా తాను మాట్లాడతానని, కేవలం 20 నిమిషాల సమయం ఇవ్వాలని అన్నారు.

rahul 02012019

కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అంటే ఏమిటో రాహుల్ గాంధీకి తెలియదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ఆరోపించిన నేపథ్యంలో రాహుల్ ఈ సవాల్ విసిరారు. పారికర్‌ పడకగదిలో రఫేల్‌కు సంబంధించి ఎటువంటి పత్రాలను దాచి పెట్టారంటూ ప్రశ్నించారు. మోదీ నిజాన్ని ఎంత దాచి పెట్టాలని ప్రయత్నించినప్పటికీ అది ఎన్నటికీ దాగలేదని ఆయన అన్నారు. ‘రఫేల్‌ ఒప్పందం విలువ రూ.58వేల కోట్లు అని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో చెప్పారు. అంటే ఒక్కో విమానం ధర రూ.1600కోట్లు. విమానం ధర రూ.526కోట్ల నుంచి రూ.1600కోట్లకు ఎలా వెళ్లింది. అంతలా ధరను ఎవరు పెంచారు. ధరను పెంచడంపై వైమానిక దళం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు? జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ విచారణ చేస్తే కచ్చితంగా ఇద్దరు పేర్లు బయటకు వస్తాయని మాకు నమ్మకం ఉంది. రఫేల్‌ ద్వారా మోదీ అనిల్‌ అంబానీకి సాయం చేశారనే విషయం బయటపడుతుంది’. అంటూ రాహుల్‌ ధ్వజమెత్తారు.

 

rahul 02012019

నిన్న చంద్రబాబు కూడా ఇదే విధమైన ఛాలెంజ్ చేసారు. ప్రధాని మోదీ వల్ల దేశానికి ఏం లాభం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ, ఐటీ, ఆర్‌బీఐ సహా సమస్త వ్యవస్థల్నీ ఆయన భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. చివరకు సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆక్షేపించారు. తాను ఆక్రోశంతో మాట్లాడుతున్నానని మోదీ అనడంపై అభ్యంతరం తెలిపారు. ‘నేను ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నాను. ఆయన ఢిల్లీలో కూర్చుని ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఈ అంశాలపై ఆయన చర్చకు సిద్ధమా’ అని సవాల్‌ విసిరారు. దేశంలో అవినీతిని మోదీ ఏ మాత్రం తగ్గించారని నిలదీశారు. రాఫెల్‌ ఒప్పందంలో అవకతవకలపై ఏం చెబుతారని అడిగారు. ‘బ్యాంకులను ముంచిన అవినీతిపరులు దేశాన్ని వీడి దర్జాగా వెళ్లిపోతున్నారు. దేశంలో ప్రగతి రేటు పడిపోయింది. ప్రజల ఆదాయం క్షీణించిపోయింది. మోదీ ఆర్థిక, పాలనా విధానాలు దేశాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. ప్రతిపక్ష కూటమి విఫలం కాలేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వారి నమ్మకం నిలుపుకోవడంలో మోదీ, ఎన్డీఏ కూటమే విఫలమయ్యాయి’ అని ఆయన అన్నారు.

అనంతపురంలో అమ్యూనేషన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు స్టంప్ ష్యూలే కేసింగ్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ దేశ రక్షణ రంగాలకు అవసరమైన అత్యున్నత ప్రమాణాలతో అమ్యూనేషన్ ఉత్పత్తులను దేశీయంగా తయారుచేసి సరఫరా చేస్తుంది. తొలి రెండు దశల్లో 520 కోట్ల రూపాయలను, మూడో దశలో 500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతుంది. 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది. ఈ సంస్థ ఉత్పత్తి ప్రారంభిస్తే దక్షిణ భారత్‌లో అమ్యూనేషన్ తయారుచేసే సంస్థ ఇదే మొదటిది కానుంది. ఈ సంస్థకు దేశంలో 11చోట్ల తయారీ యూనిట్లు ఉండగా, స్ప్రింగ్స్ తయారీలో దేశంలోనే నెంబర్-1 పేరు పొందింది. ఏరోస్పేస్, డిఫెన్సు రంగాల్లోకి కూడా అడుగుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీఈడీబీ జె కృష్ణకిషోర్, ఎస్‌ఎస్‌సి ఎండీ సతీష్ మచ్చాని ఒప్పందాలపై సంతకాలు చేశారు.

stumpp 02012019 2

ఇది ఇలా ఉంటే, పరిశ్రమలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి’పై రూపొందించిన శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. సేవలు, పారిశ్రామికం, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. చాలా మంది పోటీపడినా.. మనపై ఉన్న విశ్వసనీయత కారణంగానే కియా మోటార్స్‌, ఇసుజు, జియో, అశోక్‌లేలాండ్‌, అపోలో టైర్స్‌ తదితర సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. వెనకబడిన రాష్ట్రాలకు ఇచ్చే రాయితీలు మనకూ ఇచ్చి ఉంటే మరింత మంది పారిశ్రామికవేత్తలు వచ్చేవారని వివరించారు. ‘నాలుగున్నరేళ్లు రాత్రింబవళ్లు పనిచేశాం. ప్రపంచమంతా తిరిగాం. అధికారులు నిరంతరం శ్రమించారు. వ్యక్తిగతంగా నాపై ఉన్న విశ్వసనీయత కూడా ఇందుకు ఉపయోగపడింది’ అని చంద్రబాబు చెప్పారు. నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని.. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో రూపాయి అవినీతి లేకుండా అన్ని అనుమతులు ఇప్పించే విధానం తెచ్చామని అన్నారు.

stumpp 02012019 3

12 పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టామన్నారు. విశాఖ ఐటీ కారిడార్‌ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కేంద్రంపై సీఎం మండిపడ్డారు. దుగరాజపట్నం నౌకాశ్రయం, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవకు నిధులు మంజూరులోనూ కేంద్రం అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. పెట్రో కెమికల్‌ కారిడార్‌ విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తోందని.. దీన్ని తామే ఏర్పాటు చేయించబోతున్నట్లు వివరించారు. నిమ్జ్‌ల(జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి) ప్రకటన తప్పితే కేంద్రం పైసా విదల్చలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరి నిమ్జ్‌ తామే చేపట్టి రామాయపట్నానికి అనుసంధానించబోతున్నట్లు వెల్లడించారు.

ప్రధాని హోదాలో ఉండి, ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడే ప్రధాని, బహుసా మోడీనే అయ్యుంటారు. ఆంధ్రప్రదేశ్ కు చేసిన సహాయం పై, ఈ రోజు పచ్చి అబద్ధాలు ఆడుతూ, ప్రజలను మధ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నా మధ్య అమిత్ షా వచ్చి, లక్షల లక్షల కోట్లు ఇచ్చాం అని చెప్పిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు, అసెంబ్లీ వేదికగా అమిత్ షా లెక్కలు అన్నీ బొక్కలే అని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ప్రధాని మోడీ, లక్షల లక్షలు కాకపోయినా, 20 వేల కోట్లు ఇచ్చేసినట్టు చెప్పారు. బీజేపీ బూత్‌కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, మ‌చిలీప‌ట్నం, న‌ర‌సాపురం, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం లోక్‌సభ స్థానాలకు చెందిన బూత్‌కార్యకర్తలు పాల్గొన్నారు.

moddi 02012018 2

ఈ సమావేశంలో, ఏపి ప్రభుత్వం పై అబద్ధాలు ప్రచారం చేసారు మోడీ. లోటు బడ్జెట్‌, రిసోర్స్‌ గ్యాప్‌ కింద ఏపీకి 20 వేల కోట్ల వరకు విడుదల చేశామని, ఏపీ ప్రభుత్వం మాత్రం అందలేదని చెబుతోందన్నారు. మరి ఆ డ‌బ్బు ఎవ‌రి జేబుల్లోకి వెళ్ళిందంటూ మోదీ ప్రశ్నించారు. ప్రధాని హోదాలో ఉంటూ, ఇలాంటి చిల్లర మాటలు ఎలా మాట్లాడారో ఆయనకే తెలియాలి. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే మనకూ ఇచ్చారు, ఇక్కడ కొత్తగా మనకు ఇచ్చింది ఏమి లేదు. 2013-14 సంవత్సరానికి లోటు బడ్జెట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇది విభజన చట్టంలో ఉన్నది, దీని పై మాత్రం మాట్లాడరు. ఇక ఎవరి జేబులోకి వెళ్ళింది అంటున్న మోడీ, ఆయన ప్రధాని అనే సంగతి మర్చిపోయాడు. దమ్ము ఉంటే, చంద్రబాబు ఇది నోక్కేసాడు అని ఏపి ప్రజల ముందు ఆధారాలు పెట్టచ్చు కదా ? 20 వేల కోట్లు ఏమయ్యాయో, తెలియని ప్రధాని ఎందుకు ?

moddi 02012018 3

ఇక మరొకటి, వెనుకబడిన జిల్లాలకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చారంట. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సింది 23వేల కోట్లు. ఇది కూడా గత రెండు సంవత్సరాల నుంచి ఇవ్వటం లేదు. సిగ్గు లేకుండా 350 కోట్లు మన రాష్ట్ర ఎకౌంటు లో వేసి, మరీ వెనక్కు తీసుకున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పటం లేదు మోడీ గారు ? ఇక అన్నిటికి కంటే వింత ఆరోపణ, యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు ఇవ్వలేదు అంట. ఏపి ప్రభుత్వం అన్నిటికీ లెక్కలు చెప్పి, ఆ కాగితాలు కూడా బయటకు ఇచ్చింది. అవన్నీ ప్రజలు చూసారు కూడా. అయినా ఈ సిగ్గులేని ప్రధాని అబద్ధాలు ఆడతారు. ఇక పోలవరానికి 7 వేల కోట్లు ఇచ్చారంట, ఇంకా ఇవ్వాల్సిన 4 వేల కోట్లు గురించి మాత్రం చెప్పారు. అవి ఎందుకు సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయి, దాని వల్ల రాష్ట్రానికి పడుతున్న వడ్డీ భారం గురించి మాట్లాడరు. డీపీఆర్ 2 ఇప్పటి వరకు ఎందుకు ఆమోదించాలేదో చెప్పరు. ఏపీలో పది జాతీయ విద్యాసంస్థలు ప్రరంభించారంట. కాని వాటిని ఎన్ని నిధులు ఇచ్చారు, ఎన్నిటికీ కాంపస్ లు కట్టారు, ఇలా నిధులు ఇస్తూ పొతే ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతాయో మాత్రం చెప్పరు. చంద్రబాబు ఏమీ చేయలేదు కాబట్టే ప్రజలకు అసత్యాలు చెబుతున్నారన్నారు. ఇవన్నీ ఏపికి వచ్చి చెప్పే దమ్ము లేదు కాని, ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు మన ప్రధాని గారు. దేశంలో అందరినీ మాయ చేసినట్టు, మా ఆంధ్రులని మోసం చెయ్యలేరు మోడీ గారు, సరైన సమయంలో సమాధానం చెప్తాం...

చంద్రబాబుకు ఆక్రోశం ఉందంటూ నిన్న ఏఎన్‌ఐ వార్తా సంస్థ ముఖాముఖిలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపట్ల తప్పకుండా తనకు కోపం, ఆవేశం, బాధ ఉన్నాయన్నారు. తన కోపానికి ప్రధాన కారణం మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేయడమేనన్నారు. అందుకే కేంద్రంపై తాము పోరాటం చేస్తున్నామని, ఇప్పటివరకు 11 ధర్మపోరాట దీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. బుధవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతానని, వెనక్కి తగ్గే ప్రసక్తేలేదన్నారు. తాను చేస్తున్న పోరాటం తన కోసం కాదని, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసమేనన్నారు.

cbn 02012019

తెలంగాణలో మహాకూటమి ఓడిపోవడంతో తాను ఆక్రోశంతో ఉన్నానని, దేశంలో పెట్టే మహాకూటమి విజయవంతం కాదని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రమాదంలో పడిన దేశాన్ని కాపాడుకుంటూనే.. మరోవైపు రాష్ట్రానికి న్యాయం చేసుకోవాలన్నారు. అందుకే కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇటీవల తనపై అసభ్యంగా మాట్లాడారని అన్నారు.

cbn 02012019

తన వద్ద మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడినా తాను ప్రజల కోసమే భరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తన జీవితాశయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేంద్ర సంస్థలను ఇవ్వలేదని, ద్రవ్యలోటును పూడ్చలేదని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్ని సైతం వెనక్కి తీసుకున్నారని దుయ్యబట్టారు. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టమంటే, పెట్టమనే విధంగా కేంద్రం మాట్లాడితే తామే సాహసం చేసి పరిశ్రమను పెట్టుకొనేందుకు సిద్ధపడ్డామని చంద్రబాబు తెలిపారు. విశాఖ రైల్వేజోన్‌, దుగరాజపట్నం పోర్టు... ఇలా విభజన చట్టంలో పేర్కొన్న ఏ పనీ కేంద్రం చేయడంలేదని సీఎం దుయ్యబట్టారు.

Advertisements

Latest Articles

Most Read