33 వేలు ఎకరాలు మన కలల రాజధాని కోసం త్యాగం చేసారు ఆ రైతులు... వారికి అన్ని విధాలుగా అండగా ఉండాల్సింది పోయి, వారి సమస్యలు ప్రభుత్వంతో పోరాడాల్సింది పోయి, మన రాష్ట్రంలో అసుర జాతి, వారికి అడుగడుగునా అడ్డం పడ్డారు... వారికి భవిష్యత్తు మీద నమ్మకం లేకుండా చేస్తున్నారు... వారికి మానిసిక ప్రశాంతత లేకుండా, రాక్షస పత్రికలు, టీవీల్లో సైకో కధనాలు వేస్తూ, సాడిస్ట్ లు లాగా ఆనందం పొందారు... ఇంత చేసినా వారు కేవలం ఒకే ఒక్క వ్యక్తిని నమ్మారు... ఆయనే మన ముఖ్యమంత్రి.... ఒక్క ఆందోళన లేకుండా 33 వేలు ఎకరాలు ఆయన చేతిలో పెట్టారు... ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు... అది ఒక నాయకుడు మీద, ప్రజలకు ఉన్న నమ్మకం... అందుకే ఈ అసుర జాతి రూట్ మార్చింది... రైతులని రెచ్చగొట్టి ఏమి చెయ్యలేమని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టలేమని అలోచించి, అమరావతిని ఆపాలి అంటూ కేసులు వేస్తుంది.
అమరావతిని రాబందులు పీక్కుటినట్టు, పీక్కుతింటానికి వస్తుంటే, చంద్రబాబు వీరి బారి నుంచి, అమరావతిని కాపాడుతూ వస్తున్నారు. ఇప్పటికే, అమరావతిలో జగన్ చేసిన అరాచకం తెలిసిందే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎన్ని సార్లు కేసులు వేసారో, అమరావతిని ఆపటానికి ఎన్ని సార్లు ప్రయత్నించారో చూసాం. అయితే, అమరావతి నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది... పర్యవనానని ఎటువంటి ఆటంకం కాకుండా, నిర్మాణాలు చేసుకోమని తీర్పు ఇచ్చింది... అయితే, ఇప్పుడు జనసేన పార్టీకి అనుకూలంగా ఉండే, పవన్ కళ్యాణ్ సన్నిహితులు రంగంలోకి దిగింది. అమరావతి నిర్మాణం కృష్ణా నది పక్కనే సాగుతోందనీ, ఇది నిబంధనలకు విరుద్ధమని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అమరావతికి సరైన పర్యావరణ అనుమతులు తీసుకోలేదని దాఖలైన పిటిసన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అమరావతికి ఇచ్చిన పర్యావరణ అనుమతులు సరైనవేనని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ స్పందిస్తూ.. ఇలాంటి పిటిషన్లు దురదృష్టవశాత్తూ భారత్ లోనే వస్తాయని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అమరావతిని కృష్ణా నది పక్కన నిర్మిస్తున్నారనీ, ఇది పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కడమేనని ఈఏఎస్ శర్మ తొలుత జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)ను ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ ను విచారించిన ఎన్జీటీ..రాజధాని నిర్మాణం నిబంధనల మేరకే సాగుతుందని స్పష్టం చేసింది. శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. దీన్ని విచారించిన ధర్మాసనం ఇలాంటి పిటిషన్లను అనుమతించడం సరికాదని పేర్కొంది. దురదృష్టవశాత్తు ఇలాంటి పిటిషన్లు భారత్లోనే వస్తాయన్న జస్టిస్ ఏకే సిక్రి వ్యాఖ్యానించారు.