ఏపీలోని విపక్ష పార్టీలపై సినీ నటుడు శివాజీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై కొత్త కుట్రకు మరోసారి ప్రయత్నిస్తున్నారంటూ హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. విపక్ష పార్టీలకు కావలసింది.. సీఎం కుర్చీ మాత్రమే అంటూ మండిపడ్డారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని... అంత ఇష్టముంటే రాజీనామా చేసి విపక్షపార్టీలో చేరాలన్నారు. విపక్షానికి ప్రజాసమస్యలు పట్టవని... వారికి కావాల్సింది సీఎం కుర్చీనే అన్నారు. చుక్కల భూములపై మంత్రులను అధికారులు లెక్కచేయడం లేదని... చుక్కల భూముల సమస్య రాజకీయ ఎత్తుగడకు అవకాశంగా మారిందన్నారు. సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.

sivaji 02012019

గట్టిగా మాట్లాడితే భూములు లాక్కుంటామని కలెక్టర్‌ బెదిరిస్తున్నారని.. ఆ భూములు కలెక్టర్‌ అబ్బ సొత్తా అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. సీఎం బతిమిలాడుతున్నా కలెక్టర్లు వినడం లేదన్నారు. ప్రజలను టార్గెట్‌ చేసిన అధికారుల గల్లా పట్టుకుని అడుగుతానన్నారు. అన్ని ఆధారాలను సీఎం చంద్రబాబుకు అందజేస్తానని శివాజీ తెలిపారు. అదే విధంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై కూడా ఆయన స్పందించారు. వెన్నుపోటుకు, వెన్నుదన్నుకు తేడా తెలియని వ్యక్తి రాంగోపాల్‌ వర్మ అని దుయ్యబట్టారు. సుగ్రీవుడి పక్షాన రాముడు నిలిచినట్టుగా ఆనాడు పార్టీ కోసం చంద్రబాబు నిలబడ్డారని శివాజీ అన్నారు. ఆనాడు టీడీపీని కాపాడేందుకే..కేసీఆర్‌తో సహా అందరు కలిసి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌పై చెప్పులు వేసింది లక్ష్మీపార్వతి వర్గం మనిషేనంటూ శివాజీ చెప్పారు.

sivaji 02012019

అది వెన్నుపోటు కాదని తెలుసుకున్న ప్రజలు..చంద్రబాబును రెండోసారి గెలిపించారన్నారు. చంద్రబాబు మద్దతు లేకుంటే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చేది కాదని వాజ్‌పేయి ప్రధాన మంత్రి అయ్యేవారు కారని అన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు లేకపోతే వాజ్‌పేయి రెండోసారి ప్రధానమంత్రి అయ్యేవారే కాదని, భారతీయ జనతాపార్టీ నిలబడేది కాదని సినీ హీరో శివాజీ అన్నారు. చంద్రబాబు నాయుడుది వెన్నుపోటు కాదని తెలుసుకున్న ప్రజలు.. 1999లో ఆయనను గెలిపించారన్నారు. ప్రజల తీర్పు ముందు... వెన్ను పోటు అని మాట్లాడేవాళ్లది పెద్ద విషయం కాదన్నారు. ప్రజలు ఆ విషయాన్ని పట్టించుకోరని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తన అభిప్రాయమని, నచ్చకపోతే వదిలేయమన్నారు. ఒక్క విషయం ఇక్కడ చెబుతున్నా... ఆ రోజున చంద్రబాబు నిర్ణయం తీసుకోకపోతే ఇవాళ టీడీపీ ఉండేది కాదని శివాజీ స్పష్టం చేశారు.

సినీ హీరో శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పై కొత్త కుట్రకు మరోసారి ప్రయత్నిస్తున్నారని మరోసారి సంచలనానికి తెరదీశారు. చంద్రబాబు ప్రభుత్వం పై దాడికి కొత్త తరహా ప్రయత్నం జరుగుతోందన్నారు. చుక్కల భూముల పేరుతో కుట్రకు తెరదీశారని, చుక్కల భూముల రైతులను ప్రభుత్వం పై ఉసిగొల్పాలని కుట్ర జరిగిందన్నారు. చుక్కల భూములను ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులరైజ్ చేసిందని, ఆ ఫైల్‌ను కొంతమంది అధికారులు తొక్కిపెట్టారన్నారు. ఈ కుట్ర పై చంద్రబాబును త్వరలోనే కలిసి వివరిస్తానన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరానని శివాజీ మీడియా సమావేశంలో వెల్లడించారు.

sivaji 02012019

చుక్కల భూములపై సమస్యలను సంక్రాంతిలోపు పరిష్కరించకుంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని శివాజీ ప్రకటించారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే రాజీనామా చేసి ప్రతిపక్షంలో కూర్చోవాలని అన్నారు. ఇప్పటికే కొంద మంది సీనియర్ ఉద్యోగులు పదవులకు రాజీనామాలు చేసి వారికి నచ్చిన పార్టీల్లో చేరాలని సూచించారు. చుక్కల భూములపై ముఖ్యమంత్రి సూచించినా అధికారుల్లో పట్టింపులేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రులను కూడా అధికారులు లెక్కచేయడం లేదని శివాజీ ఆరోపించారు. ఈ సమస్య విపక్షానికి ప్రజాసమస్యలు పట్టవని, వారికి కావాల్సింది సీఎం కుర్చీయేనని విమర్శించారు. చుక్కల భూముల సమస్య రాజకీయ ఎత్తుగడకు అవకాశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

sivaji 02012019

సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానని శివాజీ అన్నారు. చుక్కల భూముల విషయంలో అధికారులు మంత్రులను కూడా లెక్కచేయడం లేదన్న శివాజీ భూముల సమస్య రాజకీయ నాయకులకు వరంగా మారిందన్నారు. గట్టిగా మాట్లాడితే భూములు లాక్కుంటామని కలెక్టర్‌ బెదిరిస్తున్నారని, ఆ భూములు కలెక్టర్‌ అబ్బ సొత్తా అని సినీ హీరో శివాజీ అన్నారు. చుక్కల, కుంటల భూముల పేరుతో రైతులను ప్రభుత్వంపై పురిగొల్పుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు బతిమిలాడుతున్నా కలెక్టర్లు వినడం లేదని విమర్శించారు. ప్రజలను టార్గెట్‌ చేసిన అధికారుల గల్లా పట్టుకుని అడుగుతానని ఆయన ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను సీఎంకు అందజేస్తానని ఆయన స్పష్టం చేశారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే వైకాపా అధినేత జగన్‌పై నిందితుడు శ్రీనివాస్‌ దాడి చేశాడని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా వెల్లడించారు. వాస్తవానికి గతేడాది అక్టోబర్‌ 18నే దాడి చేయాలని శ్రీనివాస్‌ ప్రణాళిక రూపొందించినప్పటికీ అది సాధ్యం కాలేదని తెలిపారు. అక్టోబర్‌ 25న జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడికి సంబంధించి మీడియాతో మాట్లాడారు. కేసుకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు. నిందితుడు శ్రీనివాస్‌ వెల్డర్‌గా, కేక్‌ మాస్టర్‌గా, కుక్‌గా పలు చోట్ల పనిచేశాడని సీపీ తెలిపారు. దాడి జరిగిన రోజున నిందితుడు శ్రీనివాస్‌ కోడికత్తికి సాన పట్టించాడని, దీన్ని అతడి సహచరులు కూడా చూశారని చెప్పారు. జగన్‌ చొక్కా, కత్తి, ల్యాబ్‌ రిపోర్ట్‌లు అందాయని, శ్రీనివాసరావు హ్యాండ్‌ రైటింగ్‌ రిపోర్టులు అందాయని సీపీ లడ్డా అన్నారు.

labrpeort 02012019

జగన్‌ను హత్య చేయాలని దాడి చేయలేదని, కేసులో ఇప్పటి వరకు 92 మందిని విచారించామని సీపీ లడ్డా వెల్లడించారు. దాడి జరిగిన రోజు పక్కా ప్రణాళికతో ఇంటి నుంచి శ్రీనివాస్‌ ఉదయం 4.55 గంటలకే బయల్దేరాడని చెప్పారు. ఉదయం 8 గంటలకు హేమలత, అమ్మాజీ అనే మహిళలకు ఫోన్‌ చేసి ‘ఈ రోజు నన్ను టీవీలో చూస్తారు’ అని, అమ్మాజీతో ‘ఒక సంచలనం చూస్తారు’ అని పలుమార్లు శ్రీనివాస్‌ చెప్పాడని సీపీ పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మాదిరిగా నా వద్దకు కూడా పీఏ అపాయింట్‌మెంట్‌ తీసుకొని రావాలని ఆమెతో చెప్పాడని తెలిపారు. ఉదయం 9గంటల సమయంలో రెస్టారెంట్‌లో కూడా కోడికత్తికి సానపెట్టాడని తెలిపారు. రెండుసార్లు కోడికత్తిని వేడి నీటిలో స్టెరిలైజ్‌ చేశాడని, హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయంలో వైకాపా నేత ధర్మశ్రీతో జగన్‌ మాట్లాడుతున్నప్పుడు శ్రీనివాస్‌ దాడి చేశాడని లడ్డా వెల్లడించారు.

labrpeort 02012019

2017 జనవరిలో జగన్‌తో ఉన్న ఫ్లెక్సీని తయారు చేయించాడని, అక్టోబర్‌ 18నే జగన్‌పై దాడి చేసేందుకు శ్రీనివాస్ ప్రణాళిక వేశాడని చెప్పారు. అయితే, అక్టోబర్‌ 17నే జగన్‌ హైదరాబాద్‌ వెళ్లడంతో అది సాధ్యపడలేదని లడ్డా వెల్లడించారు. జాతీయ భద్రతా అంశాలు ఉంటేనే ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని గంటల్లోనే వివరాలు చెప్పాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. జగన్‌పై విష ప్రయోగం చేయాలనే ఉద్దేశం నిందితుడికి లేదనే విషయం విచారణలో వెల్లడైందని సీపీ తెలిపారు. తనపై దాడి ఘటనపై జగన్‌ ఇప్పటికీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. హైకోర్టు తాము చెప్పేదాకా ఛార్జిషీట్‌ దాఖలు చేయవద్దని చెప్పిందని ఈ సందర్భంగా సీపీ మీడియాకు వివరించారు.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా కాంగ్రెస్ మాటల దాడి ఉధృతం చేసింది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన ఆధారాలన్నీ మాజీ రక్షణమంత్రి, గోవా సీఎం మనోహర్ పారికర్ వద్ద ఉన్నాయంటూ గోవా బీజేపీ మంత్రి చెబుతున్న ఆడియో రికార్డింగ్‌లు తమ వద్ద ఉన్నాయని ఆ పార్టీ ఆరోపించింది. రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసేందుకు ప్రభుత్వం తటపటాయించడం వెనుక అసలు కారణం ఇదేనా అంటూ కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్రాన్స్ యుద్ధ విమానాల తయారీసంస్థ దసో ఏవియేషన్‌తో రాఫెల్ ఒప్పందం జరిగినప్పుడు పారికర్ కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.

parrikar 02012019

కాగా గోవా మంత్రి విశ్వజిత్ రాణేకి మరో వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ను సైతం ఇవాళ సుర్జేవాలా మీడియా ముందుకు తీసుకొచ్చారు. ‘‘రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన సమాచారం అంతా తన బెడ్‌రూమ్‌లోనే ఉందని, ఆ డాక్యుమెంట్లన్నీ తన ప్లాట్‌లోనే ఉన్నాయని ముఖ్యమంత్రి చాలా ఆసక్తికరమైన ప్రకటన చేశారు. కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఆయన వాటిని తనవద్ద అట్టిపెట్టుకున్నారు. ఇప్పుడు దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలి. మనోహర్ పారికర్ బెడ్‌రూమ్‌లో, ఆయన ఫ్లాట్‌లో రాఫెల్ కుంభకోణంపై ఎలాంటి సీక్రెట్లు ఉన్నాయో చెప్పాలని దేశం డిమాండ్ చేస్తోంది..’’ అని సుర్జేవాలా పేర్కొన్నారు.

parrikar 02012019


కాగా కాంగ్రెస్ చెబుతున్న ఈ ఆడియో క్లిప్ నిజమైనదా కాదా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే మంత్రి రాణే మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ ఆడియో టేపును కావాలని సృష్టించారని పేర్కొన్నారు. గతవారం జరిగిన గోవా కేబినెట్ సమావేశం సందర్భంగా... రాఫెల్ డీల్‌కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, మొత్తం ఫైలు తన బెడ్రూంలోనే ఉన్నదంటూ పారికర్ చెప్పినట్టు సదరు ఆడియో క్లిప్‌లో వినిపిస్తోంది. వ్యక్తిగతంగా తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవంటూ నిన్న ఓ ఇంటర్యూలో ప్రధాని మోదీ పేర్కొన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తాజా ఆరోపణలు చేయడం గమనార్హం.

Advertisements

Latest Articles

Most Read