ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే, ఈ దేశంలో తెలియని వారు ఉండరు. 1995 నుంచి దేశ రాజకీయాల్లో అనేక సార్లు ఆయన పాత్ర ఎంతో, ఈ దేశం చూసింది. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏల సంకీర్ణ ప్రభుత్వాలని, మ్యానేజ్ చేసిన చరిత్ర చంద్రబాబుది. యునైటెడ్ ఫ్రంట్ లో ప్రధానులని నిర్ణయించిన చరిత్ర ఆయనిది. అలాగే అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రాష్ట్రపతిగా ప్రతిపాదించిన చరిత్ర చంద్రబాబుది. పార్టీలకు అతీతంగా చంద్రబాబు అంటే దేశ వ్యాప్తంగా వివిధ పార్టీలలో గౌరవం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా లేని రోజుల్లో కూడా, ఆయాన అంటే ఎంతో గౌరవం ఇచ్చే వారు. అంతెందుకు, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తుంటే, అలా చేయద్దు, ఆయన రాష్ట్రానికి చేసిన మేలుకు, మనం గౌరవం ఇవ్వాలి అంటూ రాహుల్ 10 ఏళ్ళ క్రితమే చెప్పారు. ఇంతటి చరిత్ర ఉన్న చంద్రబాబుని, మొన్న కేసీఆర్ పట్టుకుని, అసలు చంద్రబాబు లీడరే కాదు, మ్యనేజేర్ అంటూ హేళన చేసారు.
నేను ఈ దేశాన్ని మార్చేస్తున్నా, ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నా, అసలు ఈ దేశం అంతా నా వెంటే ఉంది అంటూ, హంగామా చేసాడు. ఈ నేపధ్యంలో, రాజస్తాన్ పత్రికలో, భారత దేశ భవిష్య నిర్మాణంలో ఇక్కడ పేర్కొన్న నేతల్లో మీకు ఎవరిపై ఎక్కువ నమ్మకం ఉంది అంటూ ఇచ్చిన లిస్టు లో, మోడీ, రాహుల్, మాయావతి, మమత, చంద్రబాబు ఉన్నారు. ఇది చంద్రబాబుకి దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఉన్న గౌరవం. ఒక చిన్న రాష్ట్రం నుంచి ప్రాతిధ్యం వహిస్తున్న చంద్రబాబుకి, దేశ వ్యాప్తంగా అంత నమ్మకం ఉంది. మోడీ, రాహుల్, మాయావతి అంటే అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీ ఉంది, అలాంటిది ఒక రాష్ట్రంలోనే పరిమితమైన చంద్రబాబుకు, దేశ ప్రజల్లో ఇంత నమ్మకం ఎలా వచ్చిందో, కేసిఆర్ గారు గ్రహించాలి. నేను ఈ దేశాన్ని మార్చేస్తున్నా అని హడావిడి చేసే కేసీఆర్ ఈ లిస్టులో లేడు అంటేనే, ఎవరూ లీడర్, ఎవరు మ్యానేజర్ అనేది అర్ధమవుతుంది.
లేకపోటే, "మ్యానేజర్ మళ్ళీ మ్యానేజ్ జేసేసిండు. లీడర్ కాదని నేను జెప్తే దేశం అంతా లీడర్ అంటాంది. అవ్ రా బై? గింతకీ హిమాలయం అంత లీడర్ని, నా పేరేదిరా బై?" అంటూ ప్రెస్ మీట్ పెట్టి బుకాయించిన బుకాయిస్తాడు కేసీఆర్. చంద్రబాబు మోడీ పై యుద్ధం ప్రకటించే నాటికి, దేశమంతా మోడీ వేవ్ నడుస్తుంది. అడపా తడపా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్నా, అది ప్రజల్లోకి వెళ్ళని పరిస్థితి. మోడీకి ఎదురే లేదు, ప్రతిపక్షాలు ఐక్యంగా లేవు అనుకుంటున్న టైంలో, డిసెంబర్ 2017 నుంచి చంద్రబాబు రంగంలోకి దిగగానే సీన్ మారిపోయింది. అవిశ్వాస తీర్మానంతో, అన్ని విపక్షలాని ఏకం చేసారు చంద్రబాబు. మోడీ దేశంలోని వ్యవస్థలని నాశనం చేస్తున్న విధానం చూసి, చివరు కాంగ్రెస్ పార్టీతో కూడా దేశ వ్యాప్తంగా కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు విపక్షాల ఫ్రంట్ కి చంద్రబాబు ఫ్రోన్త్ఫ్ పేస్ అయ్యారు. 22 పార్టీలను ఏకం చేసి, 17 దేశ వ్యాప్త అంశాల పై మోడీతో పోరాడుతున్నారు. అందుకే చంద్రబాబుని ఈ దేశం గుర్తించింది. కేసీఆర్ గారు, కొంచెం సోయలో ఉండండి, అన్నీ అర్ధమవుతాయి.