మాన్యశ్రీ గౌరవ ప్రతిపక్ష శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి, చుక్క నీరు లేకపోయినా పోలవరం గేట్లు బిగింపా అని మీరు పలాస సభలో వాఖ్యానించారు. ఎలా వుంది అంటే, జైలు కట్టి దొంగ వచ్చాక, జైలులో ఊచల గేటు బిగించుకోవచ్చు అన్నట్టు వుంది. అది మీ అనుభవం తో వచ్చిన అవగాహన తో మీరు అని వుండొచ్చు. కాని ఇది పోలవరం. నీటి వరద వచ్చినప్పుడు, ఎదురుగా వెళ్లి గేట్లు బిగించడం కుదురుతుందా? ఈ గేటు పెట్టిన విషయం మీ సాక్షి మీడియాలో అప్పుడు వ్రాయలేదు. మొదట గేటు గురించి వారికి అర్థం కాకపోయినా, మీరు దాని గురించి మాట్లాడి ప్రచారం కల్పిస్తున్నావు. మీ అభిమానులకు ఈ చదువులు చెప్పడం, ఎవరి తరం కాదు. మీరే ఆ పనికి పూనుకొని, వారికి అవగాహన కల్పిస్తున్నందుకు, సంతోషం. ఇక “ఏపీకి హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని కేసిఆర్ చెబితే ఎవరైనా ఆనందించి స్వాగతిస్తారు. కేసీఆర్‌ మద్దతుతో మొత్తం 42 మంది ఎంపీలవుతారు. బలం దొరుకుతుంది. అయినా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు” అని మీరు సెలవిచ్చారు.

polavaram 01012019 2

కేసీఆర్ ఒక మాటమీద వున్నట్టు ఎప్పుడైనా మీకు అనిపించిందా? తెలంగాణా ఇస్తే కాంగ్రెస్స్ లో కలిపేస్తా లేదంటే తల నరుక్కొంటా అన్నాడు. దళితులను సిఎం చేస్తా అన్నాడు. ఇలా ఆయన మాటలు కోకొల్లలు. అచ్చం కుక్క తోక వంకర లెక్క వుంటుంది. గోదావరి ఈదలేము, ఆ తోక పట్టుకొని ప్రత్యేక హోదా తెచ్చుకోలేము. అది బిజెపి తోక. అది ప్రత్యేక హోదా ఇవ్వను అని తేల్చి చెప్పింది. మీరు ఆ తోక పట్టుకొండి. కాంగ్రెస్స్ ఇస్తాను అంది. దానికి వందకుపైగా వస్తారు ఎంపిలు ఈ సారి ఎన్నికల్లో. దాని వెనుక పోవడం మేలా? లేదా పిచ్చి అరుపుల ప్రేలాపనల వంకర వ్యక్తిత్వం వున్న కేసీఆర్ తోక పట్టుకొని పోవడం లాభమా? బిజెపి ఇవ్వనప్పుడు, దానికి స్టెపినీ ఫ్రంట్ పెడుతున్న ఆయనకు, దేశంలో ఎవడైనా మద్దతు ఇచ్చాడా? మనకు ఆయన శత్రువు కాదా? కాంగ్రెస్స్ కి జరిగిన అంత్యక్రియలు ఈసారి బిజెపికి జరుగుతుంది. దాని ముసుగు ఫ్రంటు తో కెసీఆర్ తో కలిసి నువ్వు వస్తే, జనం నిన్ను గోదాట్లో ముంచుతారు. ఇక కుంభకర్ణుడి జాతికి చెందిన ‘నారాసురుడు’ చంద్రబాబునాయుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతి వాఖ్యలు చేసినందుకు మీ మీద కేసులు పెడతారని, సానుభూతి వస్తుంది అని మీ కోడి బుర్ర వాడారు. చంద్రబాబు అనుక్షణం పనిచేస్తున్నాడు. మీలా తుఫాను సమయంలో కోడి కత్తి డ్రామాలు గట్రా ఆడి పడుకోలేదు. మూడు తుఫానులు వచ్చినా వాటి ఆనవాళ్లు కూడా చెరిచి, సహాయ కార్యక్రమాలలో సాయం చేసాడు.

polavaram 01012019 3

అయినా మీ తాత & అయ్య మీద ఎన్ని కేసులు వున్నాయో నీకు తెలుసా? మీ మీద ఎన్ని కేసులు వున్నాయో తెలుసు కదా? నిన్ను ఏమంది సుప్రీం కోర్టు? ఆర్థిక ఉగ్రవాది అందా లేదా? నర రూప రాక్షసులకు మించి ఆ దేవుని కడపను కొన్ని దశాబ్దాలుగా రక్తసిక్తం చేసి, ఏ పరిశ్రమా అటు రాకుండా చేసిన రాక్షస కుటుంబం మీది కాదా? మీ జిల్లా వాళ్లు గాని, పొరుగున వున్న పెద్ది రెడ్డి అరబిందో వారు గాని, రాష్ట్రంలో మిగిలిన వారు గాని, పొరుగు రాష్ట్రాలు గాని, దేశంలో నుండి గాని, విదేశాల నుండి గాని, ఎవరైనా కడపలో సంస్థ పెట్టి బతికి బట్టగట్టి, లాభాలు కళ్లజూస్తామని, మీ కుటుంబాన్ని గురించి తెలుసుకొంటే అనుకొంటారా? మీరు కూడా బాబు గారికి అసుర జాతి అంటగట్టేవారేనా? సీమ ముందులా లేదు ప్రతి జిల్లాలో విమానాశ్రయంతో, వస్తున్న నీళ్లతో, పంట సిరులతో మారుతోంది. నువ్వు మారకు. ఇవే చివరి ఎన్నికలు. నిన్ను ఎవరూ నమ్మి వుండరు. తరువాత నీ పార్టీ వుండదు. నువ్వూ ఆ కేసుల్లో ఊచలు లెక్కబెట్టక తప్పదు. రాష్ట్రానికి నీలాంటి వాడి దరిద్రం వదులుతుంది. ఉత్తర భారతదేశంలో కూడా దుర్భిణి వేసి వెతికినా నీ లాంటి రాజకీయ నాయకుడు దొరకడు. కానీ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నువ్వు పోగొట్టుకొన్నావు. చాలా మంది, మంచి మనుషులు పార్టీలు పెట్టి వస్తున్నారు. నిన్ను ముయ్యించిన జెడి లక్ష్మీనారాయణ గారు కూడా. నీ పార్టీ కనుమరుగు అవుతూనే, జనానికి ప్రత్యామ్నాయాలు సిద్ధం అవుతున్నాయి. తెలుగు జాతి చరిత్రలో మొట్ట మొదట ఒక చచ్చు ప్రతిపక్ష పార్టీగా చరిత్రకెక్కిన పార్టీ నీదే, దానికి నువ్వో నాయకుడివి"

రాష్ట్ర విభజన చట్టం హామీల అమలులో కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై ఒత్తిడి పెంచుతూ వచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు సొంతగానే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. ఈ క్రమంలో మరో కీలక ముందడుగు వేశారు. ప్రకాశం జిల్లాలో నిర్మించాలని భావిస్తున్న రామాయపట్నం ఓడరేవుకు కేంద్రం సహకరించకపోయినా.. స్వశక్తితోనే ఈ పోర్టును నిర్మించాలని నిర్ణయించి జనవరి 9న శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. ఇప్పటికే, పోలవరం సాగు నీటి ప్రాజెక్టు అంచనాలను ఆమోదించకుండా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కొర్రీలు వేస్తుంటే.. రాష్ట్రం సొంత నిధులతోనే లక్ష్యాన్ని అధిగమించేందుకు సన్నద్ధమైంది.

ap 01012019

కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలోనూ కేంద్రం ఇదే వైఖరి ప్రదర్శించింది. దీంతో ఇటీవల ఈ స్టీల్‌ ప్లాం ట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రామాయపట్నం పోర్టు లాభనష్టాలపై మెసర్స్‌ రైట్స్‌ సంస్థ అధ్యయనం చేసి లాభదాయకమేనని నివేదిక ఇచ్చింది. దీనిని కేంద్రానికి పంపింది. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి పలు దఫాలు రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. రామాయపట్నం పోర్టు డీపీఆర్‌ తయారీని ప్రభుత్వం కాకినాడ పోర్టు డైరెక్టరేట్‌కు అప్పగించింది. అదేసమయంలో పోర్టుకు అవసరమైన వనరులు, నిధులు సమకూర్చే బాధ్యత ను ఏపీ మారిటైమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఎంఐడీసీఎల్‌)కు అప్పగించారు. ఏపీఎంఐడీసీఎల్‌ నిర్వహణ కోసం రూ.100 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

ap 01012019

మరో రెండు నెలల్లో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు తాజాగా రామాయపట్నం ఓడరేవును పూర్తి చేసే బాధ్యతను కూడా చంద్రబాబు తానే తీసుకున్నారు. తద్వారా, మేము సహాయం చెయ్యకపోతే, మీరు ఎదగరు, మేము చెప్పినట్టు వినాలి, మా చెప్పు చేతల్లో ఉండాలి అనే, ఢిల్లీ అహంకారానికి ఎదురు నిలబడి, మీరు సహాయం చెయ్యకపోయినా, ఎదిగే సత్తా, దమ్ము మా ఆంధ్రులకు ఉంది, అనే విధంగా, మరోసారి ఢిల్లీ వాళ్లకి, ఆంధ్రుడు అంటే ఎంతో చెప్పటానికి చంద్రబాబు రెడీ అయ్యారు. సంపద సృష్టించేందుకు, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు పరిశ్రమ, సేవా రంగాల విస్తృతికి తాను నాలుగున్నర ఏళ్లుగా రాత్రి పగలు అహర్నిశలు పాటుపడుతూ, రాష్ట్రాన్ని ఆంధ్రుల కష్టంతో ముందుకు తీసుకువెళ్తున్నారు.

సహజంగా చంద్రబాబు పై ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇక పోలీస్ శాఖలో అయితే అది మరీ ఎక్కువ ఉంటుంది. ఇదంతా చంద్రబాబు ఎక్కువ పని చెయ్యమంటారు, మా మీద ఒత్తిడి ఉంటుంది అని, అందుకే చంద్రబాబు అంటే వ్యతిరేకం అని బహిరంగంగానే చెప్తూ ఉంటారు. అయితే ఇందుకు భిన్నంగా నిన్న ఒక కానిస్టేబుల్, ఎంతో ఎమోషనల్ గా చేసిన ప్రసంగం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు చేసిన మంచికి, పోలీస్ శాఖ నుంచి వస్తున్న ప్రశంస ఇది. ఇటీవల పోలీస్‌ శాఖలో ఉద్యోగోన్నతి పొందిన సిబ్బంది సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగోన్నతి ఇచ్చిన ముఖ్యమంత్రిపై పోలీసు సిబ్బంది ప్రశంసలు జల్లు కురిపించారు. ఆయన రుణం తీర్చుకోలేనిదన్నారు. వృత్తిలో ఉద్యోగోన్నతి పొందలేమనే తమకు పదోన్నతులు ఇచ్చి జీవితంలో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించారని ప్రశంసించారు.

conistable 01012019

ఉద్యోగోన్నతి పొందిన పలువురు సిబ్బంది తన మనసులోని మాటలను సభావేదికపై వివరించారు. అరుంధతీ నక్షత్రంలా ఏఎస్సైల భుజాలపై ఒక నక్షత్రం పెట్టారని, హెడ్‌కానిస్టేబుళ్ల భుజాలపై మూడు పట్టీలను చంద్రన్న కానుకగా ఇచ్చారన్నారు. మరో కానిస్టేబుల్‌ మాట్లాడుతూ పాతికేళ్లకిందట తాను పాఠశాలకు వెళ్లకుండా రోడ్డు మీదకు తిరుగుతుంటే మంత్రి హోదాలో ఉన్న చంద్రబాబునాయుడు తనను ఆపితే తమకు పాఠశాల లేదని ధైర్యంగా చెప్పానన్నారు. ఆ రోజు చంద్రబాబునాయుడు చొరవతో ఏర్పాటు చేసిన పాఠశాలలో చదువుకుని తాను కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను వివరించిన పోలీసు సిబ్బందిని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

conistable 01012019

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘పోలీసు వ్యవస్థలో కానిస్టేబుళ్లకు కొత్త శక్తినిస్తున్నాం. మొత్తం 3,151 మందికి పదోన్నతులు కల్పించాం. తిరుపతిలో వీరేష్‌ అనే బాలుడు కిడ్నాప్‌ అయితే 48 గంటల్లోనే టెక్నాలజీ సాయంతో ఛేదించి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడం ఏపీ పోలీసుల సమర్థతకు నిదర్శనం. ఇప్పుడు పదోన్నతులు రావడంతో మీలో కనిపించిన ఆనందం శాశ్వతంగా ఉండాలి. సివిల్‌ పోలీసులతోపాటు ఏఆర్‌, మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పించే బాధ్యతనూ తీసుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హోంమంత్రి చినరాజప్ప మాట్లాడారు. ‘రాష్ట్రంలో 60వేల మంది పోలీసులు, వారి కుటుంబాల్లోని 3 లక్షల మంది, మా అందరి బంధువులు మరో ఆరేడు లక్షల మంది మొత్తం సుమారు 10 లక్షల మంది మీకు (ముఖ్యమంత్రి) రుణపడి ఉంటాం’ అని ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం (2019 జనవరి 1) చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. విభజన జరిగిన నాలుగున్నరేళ్ల అనంతరం కీలకమైన హైకోర్టు కొలువు తీరుతోంది. తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారురు. విజయవాడలో గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తితోపాటు మిగిలిన న్యాయమూర్తులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లయింది. ఏపీ విభజన నేపథ్యంలో 62ఏళ్ల తర్వాత సోమవారం అమరావతికి హైకోర్టు తరలివెళ్లింది.

highcourt 01012019 2

దీంతో రాష్ట్రంలో చారిత్రక ఘటం ఆవిష్కృతమైంది. 2018 డిసెంబరు 26న ఉమ్మడిహైకోర్టు విభజన నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో నేటి నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ రాష్ట్ర హైకోర్టు విధులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడిహైకోర్టులో 3.4లక్షల వ్యాజ్యాలు ఉండగా.. అందులో 70శాతం వరకు కేసులు ఏపీకి చెందినవే. ఏపీ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 37 కాగా... ప్రస్తుతం ఉన్న వారు 14 మంది. క్యాంపు కార్యాలయంలో 9 కోర్టుహాళ్లు సిద్ధం చేశారు. మరో హాలును మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులంతా ప్రమాణ స్వీకారం అనంతరం తాత్కాలిక హైకోర్టుకు చేరుకున్నారు. తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులుకానున్నారు. 2వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు విధులు నిర్వర్తిస్తారు. 5వ తేదీన సంక్రాంతి సెలవులు మొదలవుతాయి. అప్పటి నుంచి 21వ తేదీ వరకు వెకేషన్‌ కోర్టును నిర్వహిస్తారు. ఇది వారంలో రెండు రోజులపాటు పనిచేస్తుంది. ఈ నెలాఖరుకు రాజధాని అమరావతి పరిధిలోని జ్యూడీషియల్‌ కాంప్లెక్స్‌కు హైకోర్టు తరలి వెళుతుంది.

highcourt 01012019 3

ఉమ్మడి హైకోర్టులో చివరి పని రోజు భావోద్వేగాల మధ్య గడిచింది. కోర్టు విభజనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం ఎదుట తన కేసు వాదనలను ముగిస్తూ సీనియర్‌ న్యాయవాది డి.వి.సీతారాంమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తప్పనిసరైనప్పటికీ సమయం సరికాదన్నారు. కోర్టు విధులు కొంతసేపు మాత్రమే కొనసాగాయి. అనంతరం న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య పరస్పర ఆలింగనాల నడుమ వీడ్కోలు పలుకులతో గడిచింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, ఏపీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌లు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. విడిపోయే న్యాయమూర్తులందరూ కలిసి కొబ్బరికాయ కొట్టి వెళ్లారు. తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ వీడ్కోలు ఏర్పాటు చేసింది. హైకోర్టు ఆవరణలో న్యాయవాదులు, న్యాయమూర్తులు ఒకరికొకరు అభినందనలు, వీడ్కోలు పలికారు.

Advertisements

Latest Articles

Most Read