అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో మోదీ ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు సిద్ధమయింది. హిందీ బెల్ట్ ఐన మూడు రాష్ట్రాల్లో, బలం ఉంది అనుకున్న చోట, ఎక్కువుగా ఎంపీ సీట్లు వచ్చి, విజయం సునాయాసంగా అవుతుంది అనుకున్న చోట, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది బీజేపీ. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ, ఇటు పార్టీ పరంగా, అటు ప్రభుత్వ పరంగా కూడా తీసుకోవాల్సిన నష్ట నివారణ చర్యల పై, సమాలోచనలు జరుగుతుంది. ఇందులో భాగంగా, దేశ బద్రత కోసం వినియోగించాల్సిన వ్యవస్థని, రాజేకాయం కోసం వాడుతున్నారు. అధికారంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ చేసే పనే ఇదైనా, మేము ఇలాంటివి చెయ్యం అని చెప్పే బీజేపీ, ఇలా వ్యవస్థలని తన రాజకీయం కోసం వినియోగిస్తుంది.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి సాక్షాత్తూ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) సేవలను ఉపయోగించుకోనుంది. దేశవ్యాప్తంగా ఓటర్ల మనోభావాలు తెలుసుకొని జనవరిలోగా నివేదిక సమర్పించాలని ఐబీని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదేశించింది. దేశాన్ని అయిదు జోన్లు...దక్షిణ, ఉత్తర, తూర్పు, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాలుగా విభజించి సమాచారాన్ని సేకరించాలని సూచించింది. 2019 ఎన్నికల్లో ప్రజలకు నచ్చే పార్టీ ఏదన్నది ప్రధాన ప్రశ్నగా ఉంటుంది. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ గురించి, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురించి, అలాగే కూటముల గురించి కూడా ప్రజల అభిప్రాయలు తీసుకుంటుంది.
మోదీ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏది? పరిష్కార మార్గం ఏమిటి? ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారన్నవి ఇతర ప్రశ్నలుగా ఉంటాయి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనా ఐబీ నివేదికలు ఇచ్చింది. రాజస్థాన్‌లో ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో రైతులు, నిరుద్యోగ యువత ఆగ్రహంతో ఉన్నారని పేర్కొంది. అయితే ఈ సమస్యల కారణంగానే ప్రభుత్వాలు పడిపోతాయని ఐబీ స్పష్టంగా చెప్పలేదని, బీజేపీ పై దేశ వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత కూడా, ఈ అంశాలకు తోడయ్యి, బీజేపీ బలంగా ఉన్న చోట ఓడిపోవాల్సి వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఐబి, ఏ నివేదిక ఇస్తుంది ? ఈ మూడు నాలుగు నెలల్లో, బీజేపీ తన పంధా మార్చుకునే అవకాసం ఎంత వరకు ఉంటుంది అనేది చూడాలి.