చంద్రబాబు గేర్ మార్చుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, నేతలను అలెర్ట్ చేస్తూ,మాట వినని వారి పై కఠినంగానే వ్యవహరిస్తున్నారు. వారం రోజుల క్రితం, జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటి సమావేశంలో, తెలుగుదేశం నేతలని వాయించిన సంగతి తెలిసిందే. తాజాగా కడప జిల్లా నేతలకు, మరో సారి క్లాస్ పడింది. నిన్న ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకు వెళ్ళిన చంద్రబాబు, అక్కడ నేతలను వాయించారు. కడప జిల్లాలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి చేస్తున్నాం, మీరు అడిగినవి అన్నీ ఇస్తున్నా, మీరు మాత్రం అందరూ కలిసి పని చెయ్యటం లేదు. ఇగోలకి పొతే, అందరూ నష్టపోతామని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా నేతలకు క్లాస్‌ పీకారు. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన, బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు మధ్యాహ్నం 2.10గంటలకు ప్రత్యేక బస్సులో జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. 45 నిమిషాలకుపైగా బస్సులోనే గడిపిన చంద్రబాబు జిల్లా నేతలకు గట్టిగానే హెచ్చరించినట్లు సమాచారం.

cbn bus 28122018

కలిసి పని చేయండి, ఎవరి నియోజకవర్గాల్లో ఏమి జరుగుతుందో ఒక్కొక్కరు చెప్పాలని సీఎం కోరారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరన్నది క్లారిటీ ఉందని, ముందుగానే డిసైడ్‌ అయితే ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని, జిల్లా నేతలు అనడంతో సీఎం జిల్లా నేతలంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే తానెందుకు అడ్డు చెబుతాను, అలా ఏ నియోజకవర్గాల్లో క్లారిటీ ఉందో ఆ వివరాలతో రేపే అమరావతికి వచ్చి మాట్లాడాలని చెప్పారు. ఇప్పటివరకు మనం ఏమి చేసింది నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు తెలియజేయాలని సీఎం కోరగా జనవరి నుంచి జరిగే జన్మభూమిలో పాల్గొంటామని నేతలు చెప్పారు. అది అధికారులు చేసే కార్యక్రమమని, పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలంటూ హితోపదేశం చేశారు. నేతల మైండ్‌సెట్‌ మారాలని క్లారిటీతో నడవాల్సి ఉంటుందని ముఖ్యంగా అందరూ కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధించే దిశగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎ

 

cbn bus 28122018

క్కడెక్కడ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఉన్నారో వాటి వివరాలను తీసుకుని రెండు రోజుల్లోగా అమరావతికి వచ్చి కలవాలని, ముందుగా ఓ రోజు చెబితే సరిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మారరా? కలసిపనిచేయమంటే వీధికెక్కి రాజకీయం చేస్తారా అంటూ ప్రొద్దుటూరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులకు నీళ్ల విషయమై ఇన్‌చార్జి సతీష్‌రెడ్డి మాట్లాడినప్పుడు ఇచ్చిన నీళ్ల పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని రెండు మండలాలకు, సతీష్‌రెడ్డిని మూడు మండలాల బాధ్యులుగా వ్యవహరించాలని సూచన చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలా 45 నిమిషాలపాటు జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు మాట్లాడి క్లాస్‌ తీసుకున్నట్లు సమాచారం. 2.55 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం కడప విమానాశ్రయానికి బయల్దేరారు.

ఆంధ్రప్రదేశ్‌ కు వేరుగా రిజిస్ర్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) కార్యాలయం ప్రారంభం కానుంది. నిన్న కాక మొన్న మన అమరావతిలో హైకోర్ట్ ఏర్పాటు పై నోటిఫికేషన్ రాగా, ఇప్పుడు ప్రత్యెక ఆర్‌ఓసీ పై కూడా నోటిఫికేషన్ వచ్చింది. విజయవాడలోని సూర్యారావుపేటలో తాత్కాలిక కార్యాలయాన్ని జనవరి ఒకటిన ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యాలయం ఏర్పాటుకు ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లోని ఆర్‌ఓసీ కార్యాలయం సేవలు అందిస్తోంది. హైదరాబాద్‌ ఆర్‌ఓసీలో రిజిస్ర్టార్‌గా పని చేస్తున్న డెన్నింగ్‌ కె బాబు ఏపీ ఆర్‌ఓసీ కార్యాలయానికి బదిలీ అయ్యారు.

roc 28122018 2

సాయి శంకర్‌ లండ సహాయ రిజిస్ర్టార్‌ ఆఫ్‌ కంపెనీ్‌సగా బాధ్యతలు నిర్వహిస్తారు. అమరావతిలో సొంత భవనం నిర్మాణం అయ్యే వరకు ఏపీ ఆర్‌ఓసీ కార్యాలయం విజయవాడలో ఉంటుంది.. ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో కంపెనీల ఏర్పాటు, పర్యవేక్షణ సులభతరం అవుతుంది. రాష్ట్రంలోని కంపెనీల డైరెక్టర్లు, ప్రాక్టీసింగ్‌ కంపెనీ సెక్రటరీలు, చార్టర్డ్‌ అకౌంటెంట్లకు వెసులుబాటు లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2018 డిసెంబరు నాటికి 29,735 కంపెనీలు ఉన్నాయి. ఇందులో 1,509 లిమిటెడ్‌ లయబిలిటీ పార్టనర్‌షిప్‌ (ఎల్‌ఎల్‌పీ) కంపెనీలు. మొత్తం కంపెనీల్లో 18,436 కంపెనీలు, 1,291 ఎల్‌ఎల్‌పీలు చురుగ్గా పని చేస్తున్నాయని ఆర్‌ఓసీ వర్గాలు తెలిపాయి.

roc 28122018 3

ఇటీవలి కాలంలో ఏపీలో ఎక్కువ కంపెనీలు నమోదవుతున్నాయని, గత మూడు నెలల్లో ప్రతి నెలా సగటున 1,000 కంపెనీల నమోదు జరిగిందని పేర్కొన్నాయి. కేరళలోని కొచ్చిన్‌కు చెందిన డెన్నింగ్‌ కె బాబు 2011 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీస్‌ (ఐసీఎల్‌ఎస్‌) అధికారి. సహాయ రిజిస్ర్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ సాయి శంకర్‌ది విజయనగరం జిల్లాలోని కొవ్వాడపేట గ్రామం. తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీ్‌సకు ఎంపికైనా తొలి వ్యక్తి. మొత్తానికి హైదరాబాద్ లో మిగిలిపోయినవి అన్నీ ఒక్కొక్కటి మన అమరావతికి వచ్చేస్తున్నాయి. ఇక విభాజన చట్టంలో ఉన్న ఉమ్మడి ఆస్థుల విభజన కూడా అయిపోతే, ఇక మన రాష్ట్రంలో, అన్ని శాఖలు వచ్చేస్తాయి.

గత కొన్ని రోజులుగా టెన్షన్ తో కొట్టుకుంటున్న జగన్, పవన్ లకు, ఢిల్లీ నుంచి మోడీ గారు చల్లని కబురు వినిపించారు. న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చినంత సంతోషంతో, జగన్, పవన్ లు ఉన్నారు. వారం నుంచి ప్రజలను ఎలా ఫేస్ చెయ్యాలా అని ఆలోచలనలో ఉన్న జగన్, పవన్ లకు మోడీ చెప్పిన గుడ్ న్యూస్ తో, ఊపిరి పీల్చుకున్నారు. జనవరి 6 న మోడీ గుంటూరులో బహిరంగ సభ కోసం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, విభజన బిల్లులో అంశాలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవటంతో, మోడీ పర్యటన పై నిరసన తెలుపుతామని, చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ప్రజలు కూడా స్వచ్చందంగా నిరసన తెలపటానికి సిద్ధమయ్యారు. అయితే పవన్, జగన్ మాత్రం మోడీ పర్యటన పై ఒక్కటంటే, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.

pk 28122018

పర్యటన దగ్గర పడే కొద్దీ, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంటే, జగన, పవన్ మాత్రం కలుగుల్లో దాక్కున్నారు. చంద్రబాబు కూడా ప్రతి రోజు, వీరిని, మోడీ పర్యటన పై వైఖరి చెప్పమని అడుగుతున్నారు. ఈ నేపధ్యంలో, ఈ రోజు ఢిల్లీ నుంచి వీరిద్దరికీ గుడ్ న్యూస్ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన వాయిదా పడింది అంటూ, పీఎంఓ నుంచి కబురు వచ్చింది. దీంతో, జగన్ పవన్ లకు పెద్ద గండం తప్పింది. మోడీ కనుక వచ్చి ఉంటే, చంద్రబాబు పెద్ద ఎత్తున నిరసన తెలిపే వారు. అది టాక్ అఫ్ ది నేషన్ అయ్యేది. జగన్, పవన్ మాత్రం, మోడీ ని ఒక్క మాట కూడా అనకుండా, ఎక్కడో దాక్కునే వారు. ప్రజలకు ఫుల్ క్లారిటీ వచ్చేది. అయితే, ఇప్పుడు మోడీ రారు అని తెలియటంతో, వీరి ఇద్దరికే, పెద్ద గండం తప్పింది.

pk 28122018

బిజీ షెడ్యూల్‌, ఆకస్మిక కార్యక్రమాల వలన ఈ టూర్‌ను మోడీ వాయిదా వేసుకున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో మోదీ పర్యటన ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. జనవరి 6న కేరళన కేరళ, ఆంధ్రప్రదేశ్ పర్యటనలకు షెడ్యూల్ ఖరారయ్యింది. కేరళ పర్యటన తర్వాత.. ఏపీకి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. కేరళ పర్యటనలోనే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీ పర్యటనకు సమయం సరిపోదనే కారణంగానే వాయిదా వేసుకున్నారట. ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడటంతో బీజేపీ శ్రేణులు కాస్త నిరుత్సాహపడ్డాయి. ఉన్నట్టుండి టూర్ వాయిదా వేయడంతో టీడీపీ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుందని బీజేపీ నేతలు బాధ పడుతున్నారు.

ఉమ్మడి హైకోర్టును విభజించి రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ కావడంతో విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఎటువంటి ముందస్తు సంకేతాలు లేకుండా ఆకస్మికంగా ఉత్తర్వులు వెలువడంతో విజయవాడలో హైకోర్టు కార్యకలాపాల ప్రారంభంపై గందరగోళం నెలకొంది. తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 15 రోజుల్లో పూర్తవుతాయని భావిస్తున్న తరుణంలో ఉత్తర్వులు వెలువడంతో అప్పటి వరకూ హైకోర్టు కార్యకలాపాల నిర్వహణకు వీలుగా వసతి కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విజయవాడ నగరంలోని ఆర్ అండ్ బి భవనం, సీఎం క్యాంపు కార్యాలయ భవనాలను పరిశీలించింది. చివరికి సీఎం క్యాంపు కార్యాలయంలోనే జనవరి 1 నుంచి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది.

court 28122018 2

ముందుస్తు సమాచారం లేకపోవడం వల్ల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు వసతి కల్పన సమస్యగా మారుతోంది. కేసుల విభజన, పోర్టుపోలియోల కేటాయింపు వంటివి కూడా జరగాల్సి ఉంది. కీలకమైన అగ్రిగోల్డ్ కేసు ఏ రాష్ట్రానికి కేటాయిస్తారో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జనవరి 1 నుంచి 4 వరకు హైకోర్టు పనిదినాల అనంతరం 5 నుంచి 20 వరకూ సంక్రాంతి సెలవులు. ఐనప్పటికీ ఈ కాలంలో ఒక బెంచ్ పని చేయాల్సి ఉంటుంది. సెలవుల సమయంలోగా అమరావతిలోని తాత్కాలిక హైకోర్టు భవన సముదాయంలో పూర్తిస్థాయి వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇలాఉంటే కనీస ఏర్పాట్లు చేసుకునే వీలు కూడా లేకుండా ఉత్తర్వులు జారీ చేయడం అధికార వర్గాలను అసహనానికి గురి చేస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తీవ్రంగానే స్పందించారు. హైకోర్టు తరలింపులో కేంద్రం సరైన పద్ధతి లేకుండా వ్యవహరిస్తోందని, ఒక నెల రోజులు కూడా సమయం ఇవ్వకుండా, అయుదు రోజులు టైం ఇచ్చి, ఇంత పెద్ద హైకోర్ట్ విభాజన చేసారని విమర్శించారు. తరలింపులో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

court 28122018 3

అదే విధంగా అమరావతిలో న్యాయమూర్తుల ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తికాకపోవటంతో హైదరాబాద్ నుంచి వచ్చే న్యాయమూర్తులు, న్యాయవాదులకు తగు వసతి కల్పించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇలాఉంటే ఏపీలో హైకోర్టు కార్యకలాపాలపై అటు న్యాయవాదులు, ఇటు కక్షిదారులు దీనిపై గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాకోర్టుల్లో గడచిన వ్యాజ్యాలపై హైకోర్టులో కేసులు దాఖలైన సందర్భాల్లో ఈ రాష్ట్రంలోని న్యాయవాదులు తమతమ కక్షిదారులను హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీనియర్ న్యాయవాదులకు అప్పగించారు. ఆయా కేసులకు సంబంధించిన ఫైళ్లన్నీ ఆ న్యాయవాదుల వద్దనే ఉన్నాయి. కొత్తగా ఇక్కడ హైకోర్టు ఏర్పాటైతే అక్కడి న్యాయవాదులు తిరిగి తమతమ కేసులను అప్పగిస్తారా.. లేక తామే వచ్చి వాదించుకుంటామని చెబితే తమ పరిస్థితి ఏమిటని పలువురు న్యాయవాదులు మథన పడుతున్నారు. ఇక్కడికి రావటం ఇష్టం లేక ఎవరైనా తమ కేసులను ఒక వేళ తిరిగి తమకు అప్పగించినా కక్షిదారులు ఇచ్చిన అడ్వాన్స్‌లు పరిస్థితి ఏమిటనేది వెయ్యిడాలర్ల ప్రశ్న. దీనికి తగ్గట్లు ఆంధ్ర ప్రాంత కేసుల ఫైళ్లన్నీ ఎప్పటికి విభజిస్తారో తెలియని స్థితి. ఇది అంత తేలికైన విషయం కాదంటున్నారు. రాష్టప్రతి నోటిఫికేషన్ జారీతో కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

Advertisements

Latest Articles

Most Read