ప్రధాని నరేంద్రమోదీ జనవరి 6న గుంటూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకు నిరసనగా, దాదపుగా 15-20కిమీ మేర పాదయాత్ర చేసి, అదే రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మోడీ రాష్ట్రానికి చేసిన మోసం, నమ్మక ద్రోహం, చేస్తున్న కుట్రలుకు వ్యతిరేకంగా, ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మోడీ వచ్చే జనవరి 6న కూడా, నిరసన తెలపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలనే దిశగా సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయం, ద్రోహంపై నూతన సంవత్సరం తొలి రోజున భారీస్థాయిలో నిరసనలు తెలపాలని అనుకున్నా, ప్రజలు నూతన సంవత్సర ఉత్సాహంలో ఉంటారు కాబట్టి, ముందు రోజు కాని, జవనరి రెండున కాని నిరసనలు తెలపాలని నిర్ణయం తీసుకున్నారు.

cbn protest 26122018

తనతో సహా అందరూ ఆ రోజు నల్లబ్యాడ్జి తగిలించుకుని నిరసన తెలిపితే రాష్ట్ర కష్టాలు తెలుస్తాయని భావిస్తున్నారు. అమరావతి నుంచి గ్రామస్థాయి వరకు ప్రజలంతా నిరసనలో పాల్గొంటే కేంద్రమే దిగివస్తుందని పేరొన్నారు. ఇక మరో నిరసనగా, మోదీ పర్యటనకు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్న ఆయన, అదే పెద్ద నిరసనని వ్యాఖ్యానించారు. మోడీకి ప్రధాని హోదాలో, ప్రోటోకాల్ ప్రకారం సియంగా స్వాగతం పలకాల్సి ఉండగా, దానికి వెళ్ళకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, గుంటూరులో మోదీ సభకు తెలుగు ప్రజలు ఎవరూ హాజరు కారాదని అన్నారు.

cbn protest 26122018

ప్రధాని గుంటూరు పర్యటనకు ప్రభుత్వం దూరంగా ఉంటుందని వ్యాఖ్యానించిన ఆయన, అది పార్టీ కార్యక్రమమేనని చెప్పారు. మోడీ పార్టీ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి, దానికి ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారు. దీని పై గత రెండు రోజులగా పార్టీ పెద్దలతో, అధికారులతో కూడా చర్చించి, తగు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ మోదీ సభకు వెళ్లకుంటే, అది ఓ పెద్ద గుణపాఠం అవుతుందని, ప్రజల సెంటిమెంట్ ఎలా ఉందన్న విషయం మోదీకి స్పష్టమవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే డిసెంబర్ 31న కాని, జనవరి 2న బీజేపీకి వ్యతిరేకంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో శాంతియుత నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు సూచించారు. దీని పై త్వరలోనే నిర్ణయం తీసుకుందామని చెప్పారు.

విజయవాడ నేత వంగవీటి రాధా గత కొంత కాలంగా, వైసీపీ తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో అవమానాలు భరించి పార్టీలో కొనసాగుతున్నారు. ఒకానొక సందర్భంలో తాను పార్టీ మారుతునట్టు వార్తలు కూడా వచ్చాయి. మరో పక్క గౌతం రెడ్డితో, జగన్ ఆడించిన గేమ్, ఇప్పటికీ రాధాను, తన వర్గాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. గౌతం రెడ్డి అన్ని మాటలు అన్నా, సస్పెన్షన్ ఎత్తిసి మరీ, జగన్ మళ్ళీ తన పక్కన చేర్చుకోవటంతో, రాధా అవమానం అయినా, భరిస్తూ వచ్చారు. మొన్న విజయవాడలో జగన్ పాదయాత్ర సందర్భంగా, భారీ జనసమీకరణ కూడా చేసారు రాధా. తరువాత విజయవాడ సెంట్రల్ సీట్ ఇవ్వటం కుదరదు అని చావు కబురు చల్లగా చెప్పాడు జగన్.

manikyalarao 25122018

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటును వంగవీటి రాధాకు కేటాయించకుండా.. మల్లాది విష్ణుకు కేటాయించటంతో, రాధా అసంతృప్తికి లోనయ్యారు. అయితే, ఎటూ తేల్చుకోని రాధా, కొన్నాళ్ళుగా సైలెంట్ అయిపోయారు. ఇప్పడు తాజగా మరోసారి రాధా తానేంటో జగన్ కు చూపిస్తా అని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ రోజు, డిసెంబర్ 26వ తేదీన వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా 'రంగానాడు' పేరిట, కాటూరులో భారీ బలప్రదర్సన చెయ్యనున్నారు. చైతన్య కలయిక, రాధా రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ సీటు దక్కక పోవటంతో అలకబూనిన ఆయన... బల ప్రదర్శన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సన్నిహితులతో సమావేశమైన దీనిపై చర్చించిన రాధా... ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని రంగా అభిమానులను పిలవటం, సన్నిహితులతో భేటీ కావటంతో, ఈ రోజు ఏ ప్రకటన చేస్తారా అనే ఆసక్తి నెలకొంది.

manikyalarao 25122018

రాధాకు సీటివ్వకపోతే వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాధా అనుచరులు చెబుతున్నారు. మేం రాధా వెంటే ఉంటామని.. రాధా ఏ పార్టీలో ఉంటే మేం అదే పార్టీలో ఉంటామని రంగా అభిమానులు స్పష్టం చేశారు. ఈ క్ర‌మంలోఈ రోజు, అంటే డిసెంబర్ 26న వంగ‌వీటి రంగా వర్ధంతి సంద‌ర్బంగా అభిమానుల స‌మక్షంలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై వంగ‌వీటి రాధా కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ రోజు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు సంబంధించి ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ఆయ‌న అన‌చ‌రులు చెబుతున్నారు. జగన్ తో ఉండి తెల్చుకుంటారా, లేక తెలుగుదేశం పార్టీలో కాని, జనసేనలో కాని చేరతారా అనే ఆసక్తి రాధా అనుచరుల్లో ఉంది. మ‌రి వంగ‌వీటి రాధా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి..!

తెలుగుదేశం ప్రభుత్వంపై ఎదురుదాడిని మరింత ముమ్మరం చేసింది బీజేపీ. ఈసారి ముఖ్యమంత్రిపైకి మాజీ మంత్రి మాణిక్యాలరావు రాజీనామా అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. తన నియోజకవర్గం తాడేపల్లిగూడేన్ని అభివృద్ధి చేయడం లేదని ఆరోపిస్తూ ఆయన తన రిజైన్ లేఖను సీఎంకు పంపించారు. 15 రోజుల్లో చంద్రబాబు దీనిపై స్పందించకపోతే 16వ రోజున నిరాహార దీక్షకు దిగుతానని అన్నారు. తాడేపల్లిగూడెంలో నిట్‌ శంకుస్థాపన సందర్భంగా ప్రభుత్వం తరపున 53 హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో వైఫల్యం చెందారని మాణిక్యాలరావు ఆరోపిస్తున్నారు. తాను MLAగా ఉన్నా.. స్థానిక టీడీపీ నేతలు పనులకు అడ్డుపడుతూ అభివృద్ధి జరక్కుండా కుట్ర చేస్తున్నారని మాణిక్యాలరావు అన్నారు.

manikyalarao 25122018

మాజీ మంత్రి మాణిక్యాలరావు రాజీనామా లేఖకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మంగళవారం అమరావతిలో మూడో శ్వేతపత్రం విడుదల చేశాక.. రాజీనామా వ్యవహారాన్ని మీడియా ప్రస్తావించగా స్పందించారు. మాణిక్యాలరావు పోలవరం ప్రాజెక్ట్ కోసం దీక్ష, పోరాటం చేస్తే బావుంటుందన్నారు చంద్రబాబు. ఆయన సొంత జిల్లాలోని పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే మాణిక్యాలరావు ఒక్క మాట అడగలేదన్నారు. మాణిక్యాలరావు ధర్నాలు, దీక్షలు ఢిల్లీలో చేస్తే బావుంటుందన్నారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గాన్ని మాత్రమే కాదని రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు సీఎం.

manikyalarao 25122018

అభివృద్ధి చేయడం ప్రభుత్వ పని.. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయన్నారు. మాణిక్యాలరావు ఒక్కసారి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా గమనించాలన్నారు. తాడేపల్లి గూడెంకు దగ్గరలోని నిట్‌కు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మోదీ దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి పశ్చిమగోదావరి జిల్లా కంచుకోటన్నారు చంద్రబాబు. ఆ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని.. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం మంచిదికాదన్నారు. బెదిరంపులతో రాజకీయాలు చేయాలనుకోవడం సరైన పద్దతి కాదన్నారు ముఖ్యమంత్రి. రాజీనామాల పేరుతో తన దగ్గర చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ సారథి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను కలిసిన రెండోరోజే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నవీన్‌ పట్నాయక్‌ ప్రతినిధిగా బీజేడీ ఎంపీ సౌమ్యా రంజన్‌ పట్నాయక్‌ మంగళవారం అమరావతికి వచ్చారు. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సుమారు 45 నిమిషాలపాటు చర్చలు జరిపారు. పోలవరం విషయంలో తెలంగాణ, ఒడిసా వైఖరులపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆయన స్వయంగా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో చురుగ్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా పాల్గొన్నారు. తమ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇచ్చిన లేఖను సౌమ్యా రంజన్‌ ఈ సందర్భంగా చంద్రబాబుకు అందించారు.

manikyalarao 25122018

మహిళా రిజర్వేషన్లు, ఈవీఎం మిషన్లు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ప్రస్తావించారు ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్. తన ప్రతినిధిగా వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి రావాలని ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్‌ను ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పంపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఇటీవలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేవనెత్తిన అభ్యంతరాలకు మద్ధతు తెలుపుతున్నట్టు ఒడిషా సీయం సందేశం పంపించారు. ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మద్దతు పలికారు. ఈ అంశంతో పాటు పలు జాతీయ అంశాల పై కలిసి పనిచేయాలన్న ప్రతిపాదన పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ చర్చలు జరిపారు.

manikyalarao 25122018

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యల్ని కూర్చుని చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుందామన్న ఒడిషా ఎంపీ రంజన్ పట్నాయక్, చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు జాతీయ స్థాయిలో జరిపే పోరాటంలో బాసటగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒడిషా ఎంపీ పట్నాయక్ చెప్పారు. నవీన్ పట్నాయక్ గత 19 సంవత్సరాలుగా ఒడిషా సిఎం. స్వాతంత్య్రం రాకముందు నుండీ రాజకీయాల్లో ఉన్న కుటుంబం వాళ్ళది. ఆయనకి తెలియదా ఎవరి స్థాయి ఏంటో ? కెసిఅర్ తనని కలిసి వెళ్లిన మరునాడే తన ప్రతినిధిగా బిజెడి ఎంపి సౌమ్యా రంజన్ పట్నాయక్ ను చంద్రబాబు వద్దకు పంపారు. వివిధ అంశాల మీద , జాతీయ రాజకీయాల మీద నవీన్ పట్నాయక్ మనోగతాన్ని చంద్రబాబుకు సౌమ్యా రంజన్ వివరించారు. చిన్న చిన్న సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అని ఆయన చెప్పారు. అనేక విషయాల్లో చంద్రబాబుకు తమ సంఘీభావాన్ని తెలిపారు..

Advertisements

Latest Articles

Most Read