వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఎకనామిక్స్‌, సోషియాలజీ తెలియదని అన్నారు. అన్నీ ఇచ్చేస్తామని ఆయన కబుర్లు చెబుతున్నారని, ఇలాంటి అనుభవశూన్యులతో భవిష్యత్‌కు ప్రమాదమని చంద్రబాబు అన్నారు. మంగళవారం సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు... సాధించిన ప్రగతిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెక్‌డొనాల్డ్స్‌‌, కేఎఫ్‌సీ కన్నా... అన్న క్యాంటీన్లలోనే శుభ్రత, నాణ్యత ఎక్కువని చెప్పారు. ఇంత తక్కువ ధరకు రుచికరమైన భోజనం అందిస్తున్న... క్యాంటీన్లు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు.

cbn 24122018 3

ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కొంత రాజధానికి ఖర్చు చేస్తే... సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేమని సీఎం అన్నారు. అందుకే కొత్త పద్ధతుల్లో రాజధాని కోసం నిధులు సమీకరిస్తున్నామని, ఇలాంటి విధానాల్లోనే ఏపీ గెలుపు ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేసిన సమయంలో రైతుల కష్టాలు చూశామన్నారు. ఆర్థిక అసమానతలతో బాధపడుతున్నారని, అందుకే సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు. ఆర్థిక సంస్కరణలద్వారా వచ్చే ఫలితాలను.. సంక్షే్మ కార్యక్రమాల ద్వారా, ఆర్థిక అసమానతలు తగ్గించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వానికి, సమాజానికి అతి ముఖ్యమైనది సంక్షేమమని అన్నారు.

cbn 24122018 2

సామాజిక కారణాలు, చారిత్రక, భౌగోళిక కారణాలతో... పేదరికం, ఆర్థిక అసమానతలతో ఇబ్బంది పడుతున్నారని, సంపద సృష్టించకుండా పేదరికం పోదని, సంపద సృష్టించగలిగితే పేదరికం తొలగిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనాథలైనా.. బిడ్డలు పట్టించుకోని తల్లిదండ్రులైనా.. వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటోందని, తాను పెద్దకొడుకులా కాపాడుకుంటానని మాటిస్తున్నానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను పెంచామని, నిధుల కన్వర్జెన్సీ ద్వారా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్రజలకు సంతృప్తకర స్థాయిలో నిత్యావసరాల్ని అందిస్తూ... ప్రజాపంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో 66 శాతం సంతృప్తి వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టామని, జగ్జీవన్‌రామ్ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ కల్పిస్తున్నామని చెప్పారు. చంద్రన్నబీమా పథకం క్లయిమ్స్‌లో 94 శాతం సంతృప్తికరంగా ఉందన్నారు. పెద్దఎత్తున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

మోదీది అత్యంత సంపన్నుల పార్టీ.. టన్నుల కొద్దీ డబ్బు ఉంది.. అదంతా ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు..అందుకే రెండువేల రూపాయల నోటు రద్దుచేయలేదు.. ప్రజాస్వామ్యాన్ని ఈవీఎం చిప్ మేనేజ్‌మెంట్ కు అప్పగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బ్యాలెట్ ఓటింగ్ వల్ల నష్టమేంటని ప్రశ్నించారు. అభివృద్ధిలో ఏపీ నమూనా గుజరాత్‌ను మించిపోతోందనే కసితోనే మోదీ అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. కేసీఆర్‌కు కావాల్సింది కూడా ఇదే.. ఏపీలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉండి.. అస్థిరత నెలకొంటే జాతీయ స్థాయిలో ప్రయోజనం పొందాలనే టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఉండవల్లి ప్రజావేదికలో ‘ప్రభుత్వ పాలన’ (గవర్నెన్స్)పై శే్వతపత్రం-2ను ముఖ్యమంత్రి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాకు శే్వతపత్రంలో అంశాలను విశదీకరించారు.

modi topi 24122018 2

గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఏర్పాటైన ఐటీ పరిశ్రమలు గుజరాత్‌లో కూడా లేవన్నారు. దూరదృష్టి.. లక్ష్యం ఉంటే ఏదైనా సాధించ గలమన్నారు. తలసరి ఆదాయంలో ధనిక రాష్ట్రం, జనాభా తక్కువ ఉన్న తెలంగాణ సైతం మన రాష్ట్రం కంటే వెనుకబడి ఉందన్నారు. ఈ కారణంగానే మోదీ, కేసీఆర్‌లు తమపై కక్షకట్టారని ఆరోపించారు. కీలుబొమ్మ ప్రభుత్వం ఉండి, ఏపీలో అస్థిరత ఉంటే తాము లబ్ధిపొందాలనుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. గత నాలుగున్నరేళ్లలో మోదీ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని దీనివల్ల ఓటమి పాలయ్యారని విమర్శించారు. గుజరాత్‌లో 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం ఒరగబెట్టారని నిలదీశారు. అన్న క్యాంటీన్‌లు, చంద్రన్న బీమా, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, మైక్రో న్యూట్రియంట్స్, పండుగ కానుకలు దేశంలో ఎక్కడా అమలు కావటం లేదని తెలిపారు. దేశానికి ఇప్పుడు ఏపీ లీడర్‌గా నిలిచే స్థాయికి చేరిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ అభ్యంతరం చెప్పటంలో అర్థం లేదన్నారు. ఎగువన కాళేశ్వరం నిర్మిస్తూ దిగువన కట్టే ప్రాజెక్ట్‌లకు అభ్యంతరం చెప్పటమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నా అధిగమిస్తున్నామని స్పష్టం చేశారు.

modi topi 24122018 3

వివిధ శాఖల పరిధిలో మొత్తం 615 అవార్డులు సాధించటం వెనుక అధికార యంత్రాంగం కష్టం ఉందన్నారు. ప్రజల ఆహార అలవాట్లలో మార్పుల కనుగుణంగా చెత్త, వ్యర్థాల నిర్వహణతో సంపద సృష్టించే స్థితికి చేరామన్నారు. అత్యుత్తమ సంస్థలు, జవాబుదారీతనం, ప్రభుత్వ విధానాలు, వినూత్న ఆలోచనలతో అభివృద్ధిపధంలో రాష్ట్రం దూసుకు పోతోందని వివరించారు. పోలవరానికి కేంద్రం డబ్బులు మాత్రం ఇవ్వదు.. తప్పకపోవటంతోనే అవార్డులు ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఒడిశా ప్రభుత్వంతో సమావేశపరిచేందుకైనా ప్రయత్నించటం లేదని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో నష్టపరిహారాన్ని చెల్లించే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఎన్టీఆర్‌కు ద్రోహం చేసినట్లు మోదీ విమర్శించటంలో అర్థం లేదన్నారు. జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ అనేది చరిత్రలోలేదని, కాంగ్రెస్, బీజేపీలకు మద్దతివ్వక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు హాస్యాస్పదమన్నారు. బీజేపీ యేతర ఐక్య ఫ్రంట్‌కు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు నిరసనగా తొలుత అనుకున్నట్టుగా జనవరి ఒకటిన కాకుండా మరో రోజు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. జనవరి 1న నిరసన తెలపాలి అని అనుకున్నా, ఆ రోజున ప్రజలు కొత్త సంవత్సర మూడ్ లో ఉంటారని, అది చెడగొట్టకుండా, ముందు రోజు కాని, తరువాత రోజు కాని చెయ్యాలనే యోచనలో ఉన్నారు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. గుంటూరులో జరిగే నిరసన ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. దాదపుగా 20 కిమీలు పాదయాత్ర చేసేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ప్రదర్శన చివర్లో బహిరంగ సభ నిర్వహిస్తారు. నిరసన ప్రదర్శన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహించాలి? సభ ఎక్కడ నిర్వహించాలి? అన్న అంశాన్ని నిర్ణయించే బాధ్యతను గుంటూరు జిల్లా నాయకులకు పార్టీ అప్పగించింది.

cbn 24122018 3

మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆదివారం గుంటూరులో సమావేశమై దీనిపై చర్చించారు. గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం నుంచి పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న రాష్ట్రానికి వస్తున్నారు. గుంటూరు సమీపంలో జరిగే సభలో పాల్గొంటారు. మరో పక్క ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వైపు నుంచే కాకుండా, వివిధ సంస్థలు, సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నారు. ఏపి ప్రజల బాధను, నిరసనను మోడీకి తెలిసేలా, కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

cbn 24122018 2

రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేసిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి వీల్లేదని, ‘ప్రధాని మోదీ గో బ్యాక్‌’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థి యువజన సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అశోక్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్రలు మాట్లాడారు. అన్ని రకాలుగా ఏపీని మోసం చేసిన ప్రధాని రాకను అడ్డుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ నెల 30న అన్ని జిల్లా కేంద్రాల్లో నల్లజెండాలతో నిరసన, జనవరి 3న మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రావద్దని, జనవరి 4న రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల వరకు ఆందోళనలు, జనవరి 6న గుంటూరులో కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమాలు చేయనున్నట్టు చెప్పారు. అయితే మోడీ రాక పై పవన్, జగన్ ఇప్పటి వరకు స్పందించలేదు.

రాష్ట్రంలో రాజకీయం హీట్ ఎక్కింది.ఎన్నికలు సమయం దగ్గర పడుతూ ఉండటంతో, అన్ని పార్టీల్లో హడావిడి మొదలైంది. అన్ని పార్టీలు కలిసి తన పై దాడి చేస్తూ, ఎన్నికల ఎజెండా సెట్ చెయ్యటంతో, చంద్రబాబు కూడా ఎన్నికలకు పక్కగా వెళ్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. జాబితా విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలిసింది. ఇది ధనుర్మాసం.. సంక్రాంతికి నెలరోజుల ముందు వరకూ శుభ ముహూర్తాలు ఉండవంటారు. జనవరి 17వ తేదీవరకు కూడా శుభలగ్నాలు లేవట. అయితే ఈలోగా అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు చంద్రబాబు. ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన గత కొన్ని రోజులుగా తరుచూ చెప్తున్నారు.

cbn 24122018 3

పార్టీ అంతర్గత సర్వేలు, గూఢచారి నివేదికలు, స్వతంత్ర సంస్థల సర్వేల ద్వారా రప్పించుకున్న నివేదికల ఆధారంగా ముఖ్యమంత్రి అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించారు. అన్ని నివేదికలను క్రోడీకరించి ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చేశారని తెలిసింది. ముఖ్యమంత్రి ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో సర్వే నివేదికలను పరిశీలించి, క్షేత్ర స్థాయి పరిస్థితులు కూడా తెలుసుకుంటూ,తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బ్యాక్‌ ఆఫీస్ నుంచి వచ్చిన నివేదికలతో పాటు, ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఎలాంటి ఇమేజ్ ఉంది? శాసనసభ్యుల తీరుపై పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు ఎలా ఉంది? నియోజకవర్గంలో మండలస్థాయి ద్వితీయశ్రేణి నేతలతో వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? వంటి పలు అంశాలనూ సీఎం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట. ఈ వడపోతల అనంతరం ముఖ్యమంత్రి 75 నుంచి 100 స్థానాలకు అభ్యర్ధులను త్వరలోనే ప్రకటిస్తారన్నది పార్టీ వర్గాల భోగట్టా!

cbn 24122018 2

ఇక జనవరి 17 తరవాత ఓ మంచి ముహూర్తాన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. అందరి సహకారం ఉండటంతో అభ్యర్థుల గెలుపు సులువు అయింది. ముందుగా పార్టీ టిక్కెట్లు ప్రకటిస్తే చాలదు- అభ్యర్థి గుణగణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తానని ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌ సందర్భంగా ముఖ్యమంత్రి మొన్నామధ్యే స్పష్టంచేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో కలవరం మొదలైందట. మంచి ముహూర్తాలు ఉన్నందున ఈ నెలాఖరుకే తుది జాబితా వస్తుందని అందరూ భావించారు. అయితే కొత్త సంవత్సరంలోనే ప్రకటించవచ్చని మరికొందరు అనుకుంటున్నారు. కానీ అభ్యర్థుల జాబితా ప్రకటన కోసం చంద్రబాబు ముహూర్తం చూసుకుంటున్నారని తెలిసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారట. అలా అయితే జనవరి 17 తరవాతే జాబితా విడుదల ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read