ఈయన ఎప్పుడూ మాటలే చెప్తాడు, ఏమి చేస్తాడులే, నాలుగు తిడతాడు, అంతకు మించి ఏమి ఉంటుంది అనుకున్నారో ఏమో, నిన్న జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో తోక జాడించిన నేతల పై, చంద్రబాబు ఫైర్ చూసి, అందరూ షాక్ అయ్యారు. సీనియర్ నేతలను కూడా వాయించి పడేసారు. ఒక పక్క అన్ని వైపుల నుంచి, అందరూ టార్గెట్ చేస్తుంటే, ఎవరూ ఏదీ పట్టనట్టు, ఎవరి పని వారు చూసుకోవటం పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎమర్జెన్సీ పరిస్థితిగా భావించి పార్టీలోని ప్రతి ఒక్కరూ ఎన్నికలయ్యేంత వరకూ కష్టపడి పనిచేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. రాబోయే 6 నెలల్లో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని, తనతో సహా ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రజల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదులో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ నాయకులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

cbn 22122018 2

పార్టీ నేతల అలసత్వంపై చంద్రబాబు గతంలో మున్నెన్నడూ లేని స్థాయిలో మండిపడ్డారు. ఆయన కోపం చూసి ఆ పార్టీ నేతలు వణికిపోయారు. ఈ భేటీకి జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తమ జిల్లా కార్యాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పాల్గొనాల్సి ఉంది. కానీ, కొన్ని జిల్లాల్లో నేతల హాజరు పలుచగా ఉండడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. అలాగే సభ్యత్వ నమోదు కొన్ని నియోజకవర్గాల్లో మందకొడిగా జరగడంతో నేతలపై విరుచుకుపడ్డారు. ‘‘పార్టీ సమావేశాలంటే తమాషాగా ఉందా? నాకు పనిలేక పెడుతున్నానా? బాధపడతారని సంయమనం పాటిస్తుంటే అలుసుగా తీసుకుంటున్నారా? మీ వల్ల నేను ప్రజల్లో బలహీనపడుతున్నాను. మీరు చేసే తప్పులకు పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇక చూస్తూ ఊరుకోను. మిమ్మల్ని గట్టిగా మందలిస్తే ప్రజలు నన్నయినా హర్షిస్తారు. నేను బలపడతాను. మీరు ఏమనుకున్నా వచ్చే 6నెలలూ కఠినంగానే ఉంటాను. కఠినంగానే మాట్లాడతాను’’ అని ఆయన తేల్చిచెప్పారు.

cbn 22122018 3

గుంటూరు జిల్లా నేతల హాజరు బలహీనంగా ఉండడంతో సీఎం సీరియస్‌ అయ్యారు. ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయ్యన్న పాత్రుడు, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు సమావేశానికి రాకపోవడంతో మండిపడ్డారు. ‘గుంటూరు జిల్లా నేతలకు అతి విశ్వాసం ఎక్కువగా ఉంది. బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. సమయం లేదని సాకులు చెబుతున్నారు. నాకు దొరుకుతున్న సమయం మీకెందుకు దొరకడం లేదు? మీ తీరు చూసి ఫ్రస్ట్రేషన్‌ వస్తోంది. ప్రయత్నం లేకుండా ఏ పనీ కాదు. పని చేయకుండా గెలవలేరు’ అని స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వచ్చారా అని వాకబు చేసినప్పుడు రాలేదని పార్టీ నేతలు చెప్పారు. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జి సిద్ధా రాఘవరావు ఆకాశంలో తిరుగుతున్నారని, నేల మీదకు రావడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా నేతలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీలో సమన్వయం కనిపించడం లేదు. అతి విశ్వాసం పెరిగింది. ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. ఒక మాట చెబితే దానిని నిలుపుకొనేలా పనిచేయాలి. నేను పదేపదే మీ వెంట పడే పరిస్థితి ఉండకూడదు’ అని హితవు చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కూడా ఈ సందర్భంగా అక్షింతలు పడ్డాయి. ఆయన వరుసగా పలుమార్లు సమావేశాలకు గైర్హాజరు కావడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశా రు. ‘సీనియర్లు కూ డా పదేపదే చెప్పించుకోవడం సరికాదు. పని చేయకుండా ప్రజల్లోకి వెళ్లలేమని గుర్తించాలి’ అని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నేత, మంత్రి అచ్చెన్నాయుడు గైర్హాజరు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసి మెప్పు పొందాలని, పార్టీని మోసం చేయవద్దని ముఖ్యమంత్రి హితవు పలికారు. జిల్లాలో జరిగిన గ్రామ వికాసం కార్యక్రమంలో సైతం మంత్రి సరిగ్గా పాల్గొనడం లేదని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పనులుంటే 2019 జరిగే ఎన్నికలను వాయిదా వేయబోరని చురకలు అంటించారు. ‘‘నాయకుల్లో అతి విశ్వాసం, అతిశయం, అహంభావం ఉండరాదు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాను. అన్ని నివేదికలను బేరీజు వేసుకుంటున్నాను. సరైన వ్యక్తులనే సరైన స్థానంలో పెడతాను!’’ అని చంద్రబాబు నర్మగర్భ హెచ్చరికలు చేశారు.

రాష్ట్రంలో ఎక్కడా ఫాక్షన్ లేదు. ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, చదువుల్లో, ఉద్యోగాల్లో చేరటంతో, బాంబుల సంస్కృతి చాలా వరకు కనుమరుగైంది. అడపాదడపా ఎక్కడైనా ఒకటి రెండు బాంబులు పట్టుబడటం మినహా చెప్పుకోదగిన సంఘటనలు ఏమి లేవని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. అలాంటిది రెంటచింతల మండలం మంచికల్లులో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు 15 నాటుబాంబులు లభ్యం కావడంపై ఆ ప్రాంతంలోనే కాదు.. జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. బాంబులు పట్టుబడింది గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్వగృహం సమీపంలోనే. పోలీసు జాగిలాలు అక్కడికి వెళ్లి ఆగిపోయాయి. దీన్నిబట్టి ఎమ్మెల్యే యరపతినేనిని ఎవరైనా లక్ష్యంగా చేసుకున్నారా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో బాంబులు బయటపడటం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని పల్నాడు వాసులు కోరుతున్నారు.

yarapataneni 22122018 2

ఈ నెల 22వ తేదీ శనివారం కోర్ల పౌర్ణమిని పురస్కరించుకుని మంచికల్లులో తిరునాళ్ల, సిడిమాను ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇదే గ్రామానికి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని పలు కూడళ్లలో గురువారం రాత్రి నుంచి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు నుంచి బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో పాటు మాచర్ల, గురజాల సీఐలు సాంబశివరావు, నరసింహారావు, మాచర్ల రూరల్‌, కారంపూడి ఎస్‌ఐలు లోకేష్‌, ఎం మురళి రంగ ప్రవేశం చేసి గ్రామాన్ని జల్లెడ పట్టారు. ఈ క్రమంలో వేకువ జామున గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంటి ఎదుట యరపతినేని నరసింహారావుకు చెందిన కారు కింద బక్కెట్‌లో 15 నాటుబాంబులను కనుగొన్నారు. అనుమానంతో నరసింహారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆ బాంబులను ఎవరు తెచ్చారు..? ఎక్కడ తయారు చేయించి తీసుకువచ్చారనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

yarapataneni 22122018 3

ఎమ్మెల్యే వస్తారని తెలిసి కవ్వించి గొడవలు పెట్టుకొనేందుకు ముందుగానే రంగం సిద్ధం చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 15 నాటు బాంబులు ఒకే చోట ఉంచారంటే పథకం భారీ స్థాయిలోనే ఉంటుందని స్థానికులు అంటున్నారు. 40 మంది పోలీసులు మంచికల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా యరపతినేని నరసింహారావు ఇంటి ముందు ఆగిన ఉన్న వాహనం కింద అడుగు భాగాన బాంబులతో కూడిన బక్కెట్‌ లభ్యమైంది. పదేళ్ల క్రితం మంచికల్లు-పాలువాయి గేటు మార్గమధ్యంలో బాంబులు దొరికాయి. మరోసారి ఇవి పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తుంది. నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రామంలో నలుగురు కానిస్టేబుళ్లను బందోబస్తు విధులకు కేటాయించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వైసీపీ నాయకుడు నరసింహారావును విడుదల చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు గురజాలలో ధర్నా చేశారు.

చెప్పినట్టుగానే అగ్రిగోల్డ్‌ భాదితులకి న్యాయం చేస్తున్నారు చంద్రబాబు. జనాల నెత్తిన టోపీ పెట్టి మూసేసిన చిట్ ఫండ్ కంపనీ నుంచి, ఆస్తులు రికవర్ చేసి, వేలం వేసి, డబ్బులు రికవరీ చేసి, బాధితులకి తిరిగి డబ్బులు ఇవ్వనుంది చంద్రబాబు ప్రభుత్వం. విశాఖపట్నంలో, విఆర్‌ చిట్స్‌ బాధితులను ఆదుకున్న తరువాత నుంచి, అగ్రి గోల్డ్ బాధితులు కూడా, కొండ అంత అండతో, చంద్రబాబు మమ్మల్ని ఆదుకుంటారు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే అనేక కారణాలతో, విషయం కోర్ట్ లో ఉండటంతో, లేట్ అవుతూ వస్తుంది. అయితే, ఇప్పుడు వీరి బాధలు తీరనున్నాయి. ఒక పక్క ప్రతిపక్షాలు, అగ్రిగోల్ద్ బాధితుల్ని రెచ్చగొడుతూ పనులు చేస్తున్నా, చంద్రబాబు మాత్రం, ఇవేమీ పట్టించుకోకుండా, బాధితులకు న్యాయం చేస్తున్నారు.

agrigold 21122018 2

అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హాయ్‌లాండ్‌ను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. హాయ్‌లాండ్‌ కనీస ధర రూ.600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. హాయ్‌లాండ్‌ విలువ ఎంత ఉంటుందనే దానిపై ప్రభుత్వం, సీఐడీ, ఎస్‌బీఐలు ధరను న్యాయస్థానానికి సమర్పించాయి. అనంతరం హాయ్‌లాండ్‌ను వేలం వేయాలని ఎస్‌బీఐని హైకోర్టు ఆదేశించింది. హాయ్‌లాండ్‌లో కొంతభాగం గతంలోనే ఎస్‌బీఐ వద్ద తనఖా పెట్టినందున.. ఆ ఆస్తిని పూర్తిగా వేలం వేసిన తర్వాత ఎస్‌బీఐకి ఎంత ఇవ్వాలి.. అగ్రిగోల్డ్‌ ఖాతాదారులకు ఎంత ఇవ్వాలి అనే విషయాలను ఖరారు చేస్తామని హైకోర్టు పేర్కొంది.

agrigold 21122018 3

ఆస్తుల వేలంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8లోపు సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని ఎస్‌బీఐకి సూచించింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుపై తొలుత ముందుకొచ్చిన జీఎస్‌ఎల్‌ గ్రూపు ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో జీఎస్‌ఎల్‌ ప్రతిపాదన ఉపసంహరణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. హైకోర్టు సమయాన్ని వృథా చేసినందున జీఎస్‌ఎల్‌కు రూ.3కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇది ఒక శుభ పరిణామం... ఒక సంస్కారం ఉన్న నాయకుడు ప్రవర్తించే తీరుకు నిదర్శనం ఇది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతి పక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యర్ధులు... జగన్, చంద్రబాబు వయసుకి, హోదాకి కూడా గౌరవం ఇవ్వకుండా, ఎన్నో సందర్భాల్లో ఏక వచనంతో సంభోదిస్తూ, బూతులు తిడుతూ, తిట్టిస్తూ, చివరికి ఉరి వెయ్యాలి, కాల్చేస్తాను అని కూడా అన్నారు. అయినా చంద్రబాబు తన సంస్కారం చూపించారు... హుందాతనం చూపించారు... ఇవాళ జగన్ మోహన్ రెడ్డి 47వ ఏట అడుగు పెడుతున్నారు...

jagan 21122018 1

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి , సీఎం నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. "Warm wishes to @ysjagan garu on his birthday. May he be blessed with health and happiness." అంటూ ట్వీట్ట్ చేశారు. చంద్రబాబు శుభాకాంక్షలకు జగన్ ధన్యవాదాలు తెలిపారు. 'థ్యాంక్యూ ఫర్ ది విషెస్ చంద్రబాబు గారు' అంటూ జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఎన్ని వైరాలు ఉన్నా, హుందాతనంగా స్పందించారు... ఇది వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా, సభ లోపలికి జగన్ రాగానే.. జగన్ సీటు వద్దకు వెళ్లిన చంద్రబాబు కరచాలనం చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. ఇప్పటికైనా జగన్ తను ఒక రాజకీయ నాయకుడు అనే విషయం గుర్తుంచుకోవాలి... హుందా రాజకీయాలు చెయ్యాలి అని కోరుకుందాం... రాజకీయాల్లో ఎన్నో విమర్శలు ఉంటాయి, కాని హుందాగా ఉంటే అందరికీ మంచిది... ప్రజలకు కూడా మంచి సందేశం వెళ్తుంది...

jagan 21122018 1

ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ట్వీట్ కి చాలా మంది రిప్లై ఇస్తూ, ఇలాంటి హుందా రాజకీయాలు కావలి అని కోరుకుంటున్నారు... జగన కూడా హుందాగా స్పందించి, మంచి సంప్రదాయానికి నాంది పలకారు. మొన్న రాజస్థాన్ లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకర కార్యక్రమంలో, అలాగే మధ్యప్రదేశ్ లో కూడా, ఓడిపోయిన ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గుని, మంచి సాంప్రదాయానికి నాంది పలికారు అనుకుంటున్నారు. అయితే చంద్రబాబు మొదట నుంచి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ కు గౌరవం ఇస్తున్నా, ప్రమాణస్వీకారం దగ్గర నుంచి, అమరావతి శంకుస్థాపన దగ్గర నుంచి, ఎన్నో సార్లు జగన్ ను పిలిచినా, నేను రాను అని జగన్ చెప్పేవారు. ఇప్పటికైనా, జగన్ గారిలో మార్పు రావాలని, హుందాగా రాజకీయం చెయ్యాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్ డే జగన గారు...

Advertisements

Latest Articles

Most Read