బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను ఆదివారం మధ్యాహ్నం తీవ్ర తుపానుగా మారింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు 450 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. సోమవారం సాయంత్రం విశాఖ-తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 20కి.మీ. వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుపాను కదులుతోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర తీరం అంతటా ఆకాశం మేఘావృతం అయ్యింది. నెల్లూరు నుంచి కృష్ణా జిల్లాల వరకు మోస్తరు నుంచి చిరుజల్లులు, పశ్చిమగోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

holiday 16122018 1

తుపాను ప్రభావంతో తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను సమీపించే కొద్దీ 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. మూడు నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా తుపాను హెచ్చరికల సందేశాలను జారీ చేస్తోంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీజీఎస్‌, ఎస్‌డీఎంఏ ద్వారా సమీక్షిస్తున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశారు.

holiday 16122018 1

మరో పక్క కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలకు రేపు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల యంత్రాంగం కూడా రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవలు ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, జిల్లాలో 14 మండలాలపై తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని హోంమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యావసర సరకులు, ఇతర అవసరాలు అన్నీ అందుబాటులో ఉంచామని చెప్పారు. హెలికాఫ్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తుపాను తీవ్రతను బట్టి 72 నివాసిత ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 17 తుపాను ప్రభావిత మండలాలు ఉన్నాయని, అన్ని ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలో ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు.

బంగాళాఖాతంలో పెథాయ్‌ తుఫాన్‌ తీవ్రరూపం దాల్చింది. శ్రీహరికోటకు 450 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో పెథాయ్‌ తుఫాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు సాయంత్రానికి విశాఖ-తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తుఫాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని పేర్కొంది. మరో పక్క, తుపాను రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. పంట చేతికొచ్చే దశలో ఎలాంటి నష్టాన్ని సృష్టిస్తుందో అనే ఆందోళన వారిని కలవరపరుస్తోంది. శుక్ర, శనివారాల్లో కొన్ని ప్రాంతాల్లో మబ్బులు పట్టడంతో అన్నదాతలు పొలాలకు పరుగులు తీశారు. కోసి ఓదెలు వేసిన వరిని.. ఆగమేఘాల మీద కుప్పలు వేయించే పనుల్లో నిమగ్నమయ్యారు. మిరప, ఇతర పంటలు కాపాడుకునే పనిలో కొందరు.. టార్పాలిన్లు తెచ్చుకునే పనిలో మరికొందరు మునిగారు.

cyclone 16122018 1

అయితే రైతుల నుంచి రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు ఫోన్ లు వెళ్తున్నాయి. ఆధునిక యంత్రాలు కావలని, తొందరగా వరి కోతల యంత్రాలు, కల్లాల్లోనే ధాన్యం తడిసిపోకుండా పట్టాలు కావాలని కోరటంతో, సాధ్యమైనంత మేర, ఆ యంత్రాలను కావలసిన చోటుకి పంపిస్తున్నారు. మరో పక్క పట్టాలు కావలసిన వారు, దగ్గరలోనే వ్యవసాయ శాఖ ఆఫీస్ కి వెళ్తే, అక్కడే పట్టాలు ఇస్తారని, రైతులు తెచ్చుకోవచ్చిని చెప్పారు. చంద్రబాబు తీసుకుంటున్న ఈ చర్యలు, సోషల్ మీడియాలో చుసిన, ఇతర రాష్ట్రాల వారు చంద్రబాబుని అభినందిస్తూ, ట్వీట్లు పెట్టారు. మరో పక్క పునరావాస కేంద్రాలు, ఆహరం, తాగునీటి సౌకర్యార్థం వాటర్ పాకెట్స్ బస్తాలు సిద్ధం చేసారు. రెవిన్యూ, పంచాయతీ రాజ్ ,పోలీస్ ,మెరైన్ పోలీస్, మత్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుత సార్వా సీజన్‌లో ఎక్కువ మంది పంట నూర్పిడికి వరికోత యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే, కొంత మంది రైతులు పశుగ్రాసం కోసం వరిగడ్డిని నిల్వ చేసుకోవడానికి కూలీలతో కోత కోయించి పనలపై ఆరబెట్టిన తరువాత కుప్పనూర్పిళ్లు చేయిస్తున్నారు.

cyclone 16122018 3

ఈ విధంగా డెల్టా ప్రాంతంలో సుమారు 50 వేల ఎకరాల్లో పంట పనలపైనే ఉంది. ఈ తుఫాన్‌కు పంట తడిసిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు కూలీలను ఉపయోగించి నూర్పిళ్లు చేయించడానికి పరుగులు పెడుతున్నారు. కనీసం వరి పననలకు గట్టుకు చేర్చుకుని కుప్పగా వేసి వాతావరణం అనుకూలించాక నూర్పిడి చేయించుకోవచ్చనే ఆలోచనతో కుప్పలు, నెట్టు కట్టడం వంటి పనుల్లో మనిగిపోయారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, విజయనగరం, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో పత్తి గణనీయంగా సాగైంది. అయితే ప్రస్తుతం తుఫాన్‌ ప్రభావం ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పత్తి తీతలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం పత్తి కాయలు పగిలి తీతకు సిద్ధంగా ఉన్నాయి,. ఈ నేపద్యంలో తుఫాన్‌ వార్త పత్తి రైతుకు కాలాడకుండా చేస్తుంది. త్వరగా పత్తి తీయాలని కూలీలకోసం అధిక రేట్టు ఇస్తామన్నా దొరికే పరిస్థితి లేకుండా పోయింది . ఇప్పటి వరకూ 70 శాతం మేర పత్తి తీతలు పూర్తయ్యాయి. మిగిలిన 30 శాతం తీత సమయంలో ఈ తుఫాన్‌ పత్తి రైతు పాలిట శాపంగా మారింది. దేవుడు దయ వల్ల, తక్కువ నష్టంతో ప్రజలు బయట పడాలని కోరుకుంటున్నారు.

జాతీయస్థాయిలో భాజపాయేతర కూటమి ఏర్పాటుకుగాను విపక్షాలు చేస్తున్న ప్రయత్నం ఆదివారం ఒక రూపు తీసుకోనుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ద్రావిడ దిగ్గజ నేతల విగ్రహాల ఆవిష్కరణ, అనంతరం జరిగే బహిరంగ సభ ఇందుకు వేదిక కానుంది. నగరంలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ఆవరణలో డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేశారు. వీటి ఆవిష్కరణ కార్యక్రమంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు తెదేపా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పశ్చిమ్‌ బంగ సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి సహా సీపీఐ, సీపీఎం తదితర పార్టీల జాతీయ నేతలు పాల్గొననున్నారు.

stalin 16122018 2

ఈ నెల 10న దిల్లీలో భాజపాయేతర పార్టీలు సమావేశం అయ్యాయి. మరుసటి రోజు వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మూడు చోట్ల కాంగ్రెస్‌ అధికారాన్ని చేజిక్కించుకోవడం తదితర పరిణామాలతో దిల్లీ సమావేశానికి హాజరు కాని బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు సానుకూల సంకేతాలు కూడా ఏర్పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం అన్నాదురై, కరుణానిధి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో జాతీయ నేతలు ఎవరెవరు పాల్గొంటారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

stalin 16122018 3

2019 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆదివారం నాటి కార్యక్రమాలు భాజపాయేతర కూటమికి ఒక రూపం తీసుకురానున్నాయి. ఈ కూటమికి తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చొరవ తీసుకోవడం, దానికి అనుగుణంగా దిల్లీ సమావేశానికి స్పందన రావడం, రాష్ట్రాల ఎన్నికల ఫలితాల జోష్‌... ఇలా పరిణామాలన్నీ కూటమికి బలం చేకూరుస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు నాలుగైదు నెలలే సమయం ఉండటంతో వైఎంసీఏ మైదానంలో జరగనున్న సభలో కూటమి ఏర్పాటుపై మరింత స్పష్టత రానుంది. ఈ సభను ఒక విధంగా విపక్షాలు తమ బలం, ఐక్యతను చాటుకునేందుకు వేదికగా చేసుకోనున్నాయి.

కొంత మంది చేసిన తప్పు ఒప్పుకుంటే, మరికొంత మంది ఒక తప్పుని సమర్ధించటానికి, వంద తప్పులు చేస్తూ ఉంటారు.. అలాంటి పనే ఇప్పుడు కేంద్రం చేసింది. దేశంలో హాట్ టాపిక్ గా మారిన రఫేల్‌ కుంభకోణం గురించి, ఏకంగా సుప్రీం కోర్ట్ నే తప్పుదోవ పట్టించారు. చట్టబద్ధ ప్రక్రియ జరగకుండానే జరిగినట్లు చెప్పడం, దాని ఆధారంగా తీర్పు రావడం ప్రతిపక్షాల చేతికి ప్రధానాస్త్రంగా మారింది. తీర్పులోని పేరా-25 వివాదాస్పదమైంది. కేంద్రం సీల్డు కవర్‌లో సమర్పించిన దాంట్లో ‘ధరల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే కాగ్‌తో పంచుకుంది. కాగ్‌ ఈ అంశంపై నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) సమీక్ష జరిపి పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉంది’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పడం అందరూ అవాక్కయ్యారు. అసలు కాగ్ రిపోర్ట్ ఇవ్వకుండా ఇచ్చినట్టు, దాన్ని పీఏసీ సమీక్ష చేసినట్టు కోర్ట్ కి చెప్పేశారు.

rafel 16122018 2

అయితే, ఇప్పుడు ఈ విషయం బయట పడటంతో అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చెయ్యటంతో, చేసిన తప్పు బయటపడిందని గ్రహించిన కేంద్రం, వెంటనే మరో పిటీషన్ కోర్ట్ లో వేసింది. ఈ పిటీషన్ ఏంటో తెలిస్తే చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. కేంద్రం కోర్ట్ కి చెప్పిన దాని ప్రకారం, మేము చిన్న టైపింగ్ ఎర్రర్ చేసాం, మేము కోర్ట్ కి ఇచ్చిన నివేదికలో కొంచెం ఎర్రర్ ఉంది, "THE CAG REPORT WILL BE EXAMINED BY THE PAC" అని రాయబోయి, "it has been examined by the PAC" అని చెప్పాం, ఇది కొంచెం కరెక్ట్ చెయ్యండి అని కోర్ట్ కి చెప్పింది కేంద్రం. అయితే ఈ ఒక్క మాటే ఏకంగా తీర్పుని ప్రభావితం చేసేది. మరి ఈ విషయం పై కోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో పక్క, కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఈ కమిటీ ఛైర్మన్‌ మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.

rafel 16122018 3

దీనిపై నిజానిజాలు తెలుసుకోవడానికి అటార్నీ జనరల్‌, కాగ్‌ చీఫ్‌లను పీఏసీ ముందుకు పిలిపించాలని భావిస్తున్నట్లు చెప్పారు. పీఏసీకి నివేదికను ఎప్పుడు పంపారు? ఎప్పుడు సాక్ష్యాధారాలు సమర్పించారు? అని అడుగుతామన్నారు. ఇప్పటివరకూ ఏ నివేదికా బహిర్గతం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడంవల్లే ఇలాంటి తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. కాగ్‌ నివేదిక ఇవ్వలేదు.. కేవలం తయారవుతోందని మాత్రమే చెప్పామని, తప్పులుంటే కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వం చెబుతోంది కదా అన్న విలేకర్ల ప్రశ్నకు ఖర్గే బదులిస్తూ అలాగైతే తీర్పులో రాసింది అబద్ధమా అని ప్రశ్నించారు. అది అబద్ధమని భావిస్తే ప్రభుత్వం దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజలను మోసగించడానికి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జేపీసీ వేయాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సదరు అఫిడవిట్‌ను అటార్నీ జనరల్‌ ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. సొంత అఫిడవిట్లనూ ప్రభుత్వం చదవదా అని ఎద్దేవా చేశారు.

Advertisements

Latest Articles

Most Read