విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ఉత్తరాఖండ్‌ ఆధికారుల బృందం మంగళవారం సందర్శించింది. సీఆర్‌డీఏ స్పెషల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావు, అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌తో వారు సమావేశమయ్యారు. అమరావతి రాజధాని ప్రణాళిక, ఆర్థిక వనరుల ప్రణాళిక, భూ సమీకరణ పథకం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ సమీకరణ పథకం కింద అమరావతి నగరానికి భూముల సేకరణలో అనుసరించిన విధానాలను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్‌లో వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా అమరావతిలో అమలుచేసిన వినూత్న అంశాల అధ్యయనానికి వచ్చినట్టు వారు తెలియజేశారు.

apcrda 1212218 2

బృందంలో ముస్సోరి డెహ్రాడూన్‌ డెవల్‌పమెంట్‌ ఆథారిటీ వైస్‌ చైర్మన్‌ ఆశిష్‌ శ్రీవాత్సవ, మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ జోగ్‌డాండే, డిస్ర్టిక్‌ మేజిస్ర్టేట్‌ మురుగేశన్‌ పలువురు డెహ్రడూన్‌ అధికారులు పాల్గొన్నారు. మరో పక్క,
సీఆర్‌డీఏ కార్యాలయంలో కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌తో యూఎస్‌ కాలిఫోర్నియా స్టేట్‌ అసెంబ్లీ డెలిగేట్ల బృందం మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని విశేషాలను కమిషనర్‌ వారికి వివరించారు. అమరావతిలో అవకాశాలను తెలియజేశారు. బ్లూగ్రీన్‌ సీటి అమరావతి హ్యాపీసిటీగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

apcrda 1212218 3

ఎల్వీఎస్‌ తదితర అంశాలను వారికి తెలియజేశారు. ప్రజారాజధాని డిజైనింగ్‌ గురించి బృందం తెలుసుకుంది. భారత-కాలిఫోర్నియా మధ్య సాంకేతిక సహకారం అంశంపై చర్చించేందుకు వారు విచ్చేసినట్టు కమిషనర్‌ తెలిపారు. అమరావతి ప్రణాళిక, వాటర్‌ మేనేజ్‌మేంట్‌, ఎనర్జీ ఎఫీషియన్సీ విధానం గురించి వారికి వివరించినట్టు పేర్కొన్నారు. బృందంలో ఆష్‌కాల్రా, సెస్లియా అగ్వయిర్‌ కర్రి, ఎలాయిస్‌ గొమెజ్‌ రేయిస్‌, రిచర్డ్‌ బ్లూమ్‌, మార్క్‌ స్టోన్‌, షారోన్‌ క్విర్క్‌ సిల్వా ఉన్నారు. సమావేశంలో సీఆర్‌డీఏ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ వై.నాగిరెడ్డి, అడ్వయిజర్‌ ఆర్‌.రామకృష్ణారావు, ఇన్‌ఫ్రాచీఫ్‌ గణే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.

 

ప్రతి ఒక్కరికీ ఏపి ఒక ప్రయోగశాల అయిపొయింది. ఇక్కడ ఉన్న కొంత మంది కుల పిచ్చ గాళ్ళని ఆసరాగా తీసుకుని, హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి రాజకీయం చేసే కొన్ని పార్టీలను అడ్డం పెట్టుకుని, ప్రతి ఒక్కడు వేలు పెడతా, కాలు పెడతా అని బయలుదేరుతున్నారు. తెలంగాణాలో నోరు ఎత్తని వాళ్ళు, కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యని వాళ్ళు, ఇక్కడ చంద్రబాబు పై వీర ప్రతాపం చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి, కొత్త పార్టీలు ప్రకటించి, తెలంగాణాలో పోటీ చేయం, ఏపి మా టార్గెట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు అంటే, మన ఏపి ప్రజలు వీళ్ళకు అంత అలుసుగా కనిపిస్తున్నారు. 9 ఏళ్ళు ముఖ్యమ్నంత్రిగా చేసారు, సైబరాబాద్ నిర్మించారు కాబట్టి చంద్రబాబు తెలంగాణాలో ప్రచారం చేసారు. అయితే, కేసీఆర్ అది సాకుగా చూపించి, ఏ నోటితో అయితే ఏపి ప్రజలను కుక్కలు, రాక్షసులు, దెయ్యాలు అన్నాడో, అక్కడికే వచ్చి వేలు పెడతా అంటున్నాడు.

owaisi 12122018

సరే రానివ్వండి, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు, ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే చంద్రబాబు ఇక్కడ ఉన్నారు కాబట్టి, వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. కేసీఆర్ కు తోడుగా, మేము వేలు పెడతాం.. జగన్ తో కలిసి ఏపి రాజకీయాల్లో వేలు పెడతాం అంటున్నడు ఒవైసీ.. ఏపీకి వెళ్లి జగన్‌కు మద్దతిస్తానని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి టీడీపీ రెండు స్థానాలు కూడా గెలవలేదని, జగన్ తో కలిసి మేము ఈ దిశగా పని చేస్తాం అంటున్నారు. ఏపీలో తాను ప్రచారం చేస్తే ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని, కేసీఆర్, జగన్, నేను కలిసి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తాం అంటున్నారు. ఇప్పటికే బీజేపీ చుక్కలు చూపిస్తాం అంటుంది, కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అంటున్నాడు, ఇప్పుడు ఒవైసీ వంతు.

owaisi 12122018

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాఖ్యలపై మంత్రి ఫరూక్ మండిపడ్డారు. మైనారిటీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ముస్లింల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం ఒవైసీకి తగదని హితవుపలికారు. ‘‘మా రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేసుకోవచ్చు...పోటీ చేయవచ్చు మీది, మాది ఒకటే నినాదం...మోదీ హఠావో- దేశ్ బచావో. మోదీతో లాలూచీ పడిన జగన్‌కు మద్దతిస్తామనడం సరికాదు. జగన్ ఎవరివైపు ఉన్నారో తెలుసుకుని మద్దతివ్వాలి’’ అని ఫరూక్‌ కోరారు. మరో పక్క, కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ కామెంట్స్‌పై చంద్రబాబు స్పందించారు. విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుందని, ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారని చంద్రబాబు గుర్తుచేశారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రెస్ తో మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబుకు, విజయవాడ వెళ్లి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని కేసీఆర్‌, బెదిరిస్తూ చెప్పిన విషయం తెలిసిందే. 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, సైబరాబాద్ సృష్టికర్తగా, చంద్రబాబు తెలంగాణా ఎన్నికల ప్రచారంలో తిరిగారు. అయితే కేసీఆర్ మాత్రం, ఏ మాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విజయవాడ వచ్చి, చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తాను, వేలు పెడతాను, ముక్కు పెడతాను అంటూ బెదిరిస్తున్నారు. "వంద శాతం ఏపీ రాజకీయాల్లోనూ కలుగజేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు వచ్చి ఇక్కడ పని చేశారు. మేం పోయి అక్కడ పనిచేయొద్దా? ఇప్పుడు మనం బర్త్‌డే పార్టీ చేస్తం.. మనం తిరిగి గిఫ్ట్‌ ఇస్తమా లేదా? ఇయ్యకపోతె మనది తప్పయితది మరి. చంద్రబాబు నాకు గిఫ్టు ఇచ్చారు. నేను రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా’’ అని కేసీఆర్ వెటకారంగా స్పందించారు.

cbn gift 12122018 2

అయితే కేసీఆర్ మాటల పై చంద్రబాబు స్పందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన జ్ఞానభేరిలో ఆయన మాట్లాడారు. విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుందని, ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారని చంద్రబాబు గుర్తుచేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని.. అక్కడి సీఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తనకేదో గిఫ్ట్‌ ఇస్తానంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి.. రావొచ్చన్నారు. ఎన్టీఆర్‌ తెదేపాను తెలుగుజాతి కోసం పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొందరు అటూ ఇటూ లాలూచీ పడొచ్చేమోగానీ.. తాము మాత్రం తెలుగువారు ఎక్కడ ఉన్నా పనిచేశామన్నారు.

cbn gift 12122018 3

భవిష్యత్ అంతా ఆవిష్కరణలదే, విజన్ లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేరన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని.. జవాబుదారీతనంతోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. మనదేశంలోనే కాకుండా అమెరికాలోనూ మన తెలుగువాళ్లు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నారని.. రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. రాష్ట్ర వృద్ధి రేటు 4.05 శాతం నుంచి 11.72 శాతానికి చేరిందన్నారు. ప్రధాని మోదీ ఏపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు.. ఏపీకి రావాల్సిన ఫలాల కోసం ఎంత సమయం వేచి చూసినా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారని.. చరిత్రలో చెడ్డపేరు రాకుంటే చాలనుకున్నారని.. సీబీఐ వ్యవస్థ కుప్పకూలిపోయో పరిస్థితి వచ్చిందన్నారు. దేశం, రాష్ట్రం కోసమే పోలవరానికి 3500 కోట్లు ఖర్చు పెడితే…ఇంతవరకూ కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇన్సిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఉన్న విద్యాసంస్థలకు కేవలం 600 కోట్లు మాత్రమే ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి 62 శాతం పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మేలో పూర్తి ప్రకాశం జిల్లాలో కరవు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు వస్తున్నాయి.. ప్రకాశం పంతులు పేరుతో ఈ రోజే ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీ ఇచ్చాం, పనులు కూడా త్వరగా పూర్తిచేయాలన్నారు.

పాకిస్తాన్‌ నేవీ అదుపులో ఉన్న 24 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కళా వెంకట్రావు విజ్ఞప్తితో కుటుంబానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. జాలర్లను విడిపించేందుకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. పట్టుబడిన జాలర్లది శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో జిల్లాలుగా తెలుస్తోంది. గుజరాత్ వద్ద సరిహద్దు దాటారని ఆరోపిస్తూ చేపట వేటకు వెళ్లిన 24 మంది ఏపీ జాలర్లను పాకిస్థాన్ కోస్ట్ గార్డు అధికారులు గత నెలలో అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న శ్రీకాకుళం మత్స్యకారులపై భారత ఎంబసీ స్పందించింది.

fishermen 12122018

ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ స్వీకరించింది. ఏపీ ప్రభుత్వ ఆందోళనను భారత హైకమిషన్.. పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. నిర్బంధించిన మత్స్యకారులను కరాచీ పంపినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ అధికారులతో భారత ఎంబసీ అధికారి గౌరవ్ అహ్లువాలియా సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి పూర్తి తోడ్పాటు ఇస్తామని భారత ఎంబసీ అధికారుల హామీ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్‌కు కమిషనర్ అర్జా శ్రీకాంత్‌కు సమాచారం అందించారు. ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న మత్స్యకారుల యోగక్షేమాలపై ఆరా తీశారు. మత్స్యకారులంతా సురక్షితంగా రాష్ట్రానికి వచ్చేలా చూడాలని సూచించారు.

fishermen 12122018

అదుపులో ఉన్న జాలరల్లో 20 మంది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల వాసులుగా గుర్తించారు. నమిగతా వారు తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాకు చెందిన జాలర్లను తెలుస్తోంది. మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్బంధించిన జాలర్లను కరాచీ పంపినట్టు సమాచారం. ఏపీ భవన్ అధికారులతో ఈ మేరకు చంద్రబాబు మాట్లాడినట్టు సమాచారం. అదుపులో ఉన్న జాలర్లను తిరిగి ఇక్కడికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని, జాలర్లకు అన్ని విధాలా అండగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాలర్ల కుటుంబాలు ఆందోళన చెందవద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అందుకు తగ్గట్టే, ఆ కుటుంబాలకి, ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.

Advertisements

Latest Articles

Most Read