ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. ఉత్తరాదిలో ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీని కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఉత్తరాదినే బీజేపీ కోటకు బీటలు వారుతున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్‌ వేరుపడిన తర్వాత కాంగ్రెస్ అజిత్‌జోగిని సీఎం చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు బీజేపీ విజయ ధుంధుభి మోగించింది. మూడు పర్యాయాలు ఛత్తీస్‌గఢ్‌‌ను ఏకఛత్రాధిపత్యంగా రమణ్‌సింగ్ ఏలారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు తిరష్కరించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 65 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంద. బీజేపీ 16 స్థానాల్లో కాంగ్రెస్ కొనసాగుతోంది. ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ పడ్డాయి. ఇక్కడ మ్యాజిక్ మార్కును కాంగ్రెస్ చేరుకుంది. రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్‌కే పట్టం కట్టబోతున్నారు.

bjp 11122018 2

తెలంగాణలో మాత్రం బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే పరిపూర్ణానందను బీజేపీలోకి చేర్చుకుంది. అంతేకాదు యూపీ తరహాలో ఎత్తుగడ ఇక్కడ అమలు చేయాలని భావించి బోర్లాపడింది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో.. అత్యధిక స్థానాల్లో నాటోకు వెయ్యికి పైగా ఓట్లు పోలయ్యాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 5864(సాయంత్రం 4 గంటల వరకు) ఓట్లు నోటాకు వచ్చాయి. అలాగే ఖమ్మం, ములుగు నియోజకవర్గాల్లో జాతీయపార్టీ బీజేపీ అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ప్రధాని మోదీ, అమిత్‌షా మొదలుకుని కేంద్రమంత్రులు విస్తృతంగా పర్యటించారు. రెండంకెల సీట్లు గెలుచుకుంటామని ప్రకటించిన బీజేపీ.. కనీసం రెండు సీట్లయినా దక్కించుకోలేకపోయింది. పార్టీ అగ్రనేతలైన లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తో పాటు చింతల రామచంద్రా రెడ్డి కూడా ఓటమిపాలయ్యారు. గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రం గెలిచి కాస్త పరువు దక్కించారు.

bjp 11122018 3

గత ఎన్నికల్లో నగరంలోని అంబర్‌పేట, ఖైరతాబాద్, ఉప్పల్, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని తన బలాన్ని 5 సీట్లకు పెంచుకుంది. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్లింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. చివరి క్షణాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వలస వచ్చిన వారికి కూడా టికెట్లిచ్చింది. అయినప్పటికీ ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. అయితే ఇంట ఘోర పరాజయం మూట కట్టుకున్నా, రెండు తెలుగు రాష్ట్రాలలోని బీజేపీ నేతలు మాత్రం, అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయామన్న బాధ కంటే, చంద్రబాబు వ్యూహాలు తెలంగాణాలో పని చెయ్యలేదు అని సంతోషంలో ఆనంద తాండవం చేస్తున్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో అధికారం కోల్పోయినా, జీవీఎల్ లాంటి వారు మాత్రం, 13 స్థానల్లో పోటీ చేసి, 2 స్థానాల్లో విజయం సాధించిన తెలుగుదేశం పై, చంద్రబాబు పై వెటకారపు మాటలు మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మన కుండకి బొక్క పడిన సంగతి మర్చిపోయి, ఎదుటి వాడిని చూసి నవ్వుతున్నారు. ఇలా ఉంది మన రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ, జనసేన పరిస్థితి.

తెలంగాణా ప్రజా తీర్పుని అందరూ గౌరవించాల్సిందే. ప్రజాస్వామ్యంలో, ప్రజల తీర్పే ఫైనల్. అది ఎలా గెలిచినా, ఓడిన వాడు ఎన్ని కారణాలు చెప్పినా, గెలుపు గెలుపే. అయితే గెలిచిన వాడు అహంకారంతో విర్రవీగితే, అది అతని పతనానికే నాంది అవుతుంది. ఈ రోజు కేసీఆర్ గెలిచిన తరువాత పెట్టిన ప్రెస్ మీట్ లో, మరో సారి చంద్రబాబు పై అవాక్కులు చావాక్కులు పెలాడు. ఏపీ రాజకీయాల్లో ప్రవేశిస్తామని అంటున్నారు కదా... ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తారా? ప్రత్యేకంగా పార్టీనే ఏర్పాటు చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ స్పందిస్తూ, ఈ విషయంలో ఏదైనా జరగొచ్చు అని.... దానికి కాలమే సమాధానం చెబుతుందని అంటూనే, చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పడు తాము అక్కడకు వెళ్లమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారు, మరి తాము కూడా ఆంధ్రకు వెళ్లి పనిచేయాలా వద్దా అని అన్నారు.

kcr 01120218

బర్త్‌‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమా? చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, చంద్రబాబు గురించి విజయవాడ వెళ్లి మొత్తం చెబుతాను, తమ గిఫ్ట్ ప్రభావం ఎంతుంటుందో త్వరలో అందరూ చూస్తారు అంటూ, అహంకారంతో సమాధానం చెప్పారు. కొన్ని రోజుల క్రిందట కేటీఆర్ కూడా, చంద్రబాబు అంతు చూస్తాం, ఏపి రాజకీయాల్లో వేలు పెడతాం అని చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు అంటే, ఆయన అక్కడ 9 ఏళ్ళుగా పని చేసారు, తెలంగాణాలో సామాజిక, ఆర్ధిక మార్పులకు కారణం అయ్యారు కాబట్టి, ఆ హక్కుతో అక్కడకు వెళ్లి ప్రచారం చేసారు. మరి కేసీఆర్ కు ఆంధ్రా వచ్చే హక్కు ఏమి ఉంది ? ఆంధ్రా వాళ్ళని దెయ్యం అని తిట్టినందుకా ? ఆంధ్రా వాళ్ళ బిర్యానీ పెంట లాగా ఉంటుంది అన్నందుకా ? ఆంధ్రా వాళ్ళు రాక్షసులు అన్నందుకా ? ఏ హక్కుతో నువ్వు విజయవాడ వచ్చి, మా ముఖ్యమంత్రిని అంటావ్ కేసీఆర్ ?

kcr 01120218

నువ్వు ఏపి వచ్చి, ఎంతగా ఆయనను తిడితే నాలుగు ఓట్లు ఎక్కువే పడతాయే తప్ప ఒక్క ఓటు కూడా తగ్గదు అని ఏపి ప్రజలు అంటున్నారు. నువ్వు అంతు చూస్తా ఉంటే ఆయన, ఆయన్ను నమ్ముకున్న ఏపి ప్రజలు చూస్తూ ఉంటారు మరి. ఎలాగూ మీ రహస్య స్నేహితులు, జగన్, పవన్, బీజేపీ ఉన్నారుగా, నీ ఇంకో కాలు పెట్టినంత మాత్రాన, చంద్రబాబుకి ఏమి కాదులే. మా ఏపి ప్రజలు గొర్రెల మంద కాదు, నీ లాంటి సొల్లు వాగుడు వినాటానికి. నీ వల్ల సర్వం కోల్పోయి, రోడ్డున పడ్డ రాష్ట్రం మాది. నీలాంటి వాళ్ళని వెనకేసుకుని వచ్చే కుల పిచ్చ వెధవలు, మా రాష్ట్రంలో ఉన్నారు, వాళ్లకి సరైన బుద్ధి చెప్తాం. హాయగా ఎన్నికలు గెలిచావ్, ఫార్మ్ హౌస్ లో పార్టీ చేసుకో. మా ముఖ్యమంత్రి జోలికి వస్తే, ఏమి చెయ్యాలో మా ప్రజలకి బాగా తెలుసు. ఇప్పటికే మోడీ, జగన్, పవన్ కలిసి ఎన్నో కుట్రలు చేస్తున్నారో, నువ్వు వస్తే మాకు పెద్దగా ఊడేది ఏమి లేదు, మరింత గట్టిగా, కసిగా పని చేసి, మా ముఖ్యమంత్రిని కాపాడుకుంటాం. మేము ఆంధ్రులం, గొర్రెల మందలం కాదు. నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే, మా ఏపి ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి, మా ముఖ్యమంత్రిని గెలిపించుకుంటాం.

తెలంగాణాలో ఎన్నికల సమరం జరిగింది. చంద్రబాబు డేరింగ్ గా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని, మోడీ పంచన చేరిన కేసీఆర్ ను ఎదుర్కునే ప్రయత్నం చేసారు. అయితే తెలంగాణా ప్రజలు మాత్రం, మాకు కేసీఆరే కావాలని తీర్పు ఇచ్చారు. ఎలా గెలిచినా, అది గెలుపు గెలుపే. యుద్ధంలో గెలవటం ముఖ్యం, భారీ మెజారిటీతో కేసీఆర్ గెలిచి చూపించారు. అసలు పార్టీనే లేదు అన్న దగ్గర నుంచి, గట్టి పోటీ ఇచ్చారు చంద్రబాబు. యుద్ధంలో కేసీఆర్ ని డీ కొట్టారు. ఎవరో ఒకరు గెలవాలి, కేసీఆర్ గెలిచారు. ఎక్కడ తప్పు జరిగింది, ఏంటి అనేది చంద్రబాబు సమీక్షించుకుని, తగు నిర్ణయం తీసుకుంటారు. గెలుపు, ఓటములు చంద్రబాబుకి కొత్త కాదు. ఏదైతేనేం, ఆంధ్రా వాళ్ళని అమ్మనా బూతులు తిడుతున్న కేసీఆర్ ను, ఆంధ్రా వాళ్ళని నాశనం చెయ్యాలని చూస్తున్న మోడీ, ఇద్దరికీ చంద్రబాబు ఎదురుగా నిలబడ్డారు. కాని యుద్ధంలో ఓడిపోయారు.

janasena 11122018

అయితే ఆంధ్రా వాళ్ళని, తిట్టిన కేసీఆర్, నాశనం అవ్వాలని చూస్తున్న మోడీ, వీళ్ళద్దరి జోడీ సక్సెస్ అయితే, అసలు యుద్ధమే చెయ్యని వైసీపీ, జనసేన హడావిడి చేస్తున్నాయి. కేసీఆర్ మా ఆస్థులు పై దాడులు చేస్తాడని ఒకడు, మా పెన్ డ్రైవ్ బయట పెడతాడని ఒకడు, అసలు ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా పారిపోయారు. నేనే అందరినీ గెలిపించా అని చెప్పే హీరో గారు, అసలు అడ్రస్ లేరు. ఇలాంటి వాళ్ళు, అసలు యుద్దమే చెయ్యలేని వారు, ఇప్పుడు వచ్చి, యుద్ధంలో ధైర్యంగా పోరాడిన చంద్రబాబు పై ఎగురుతున్నారు. తెలంగాణా గెలిచిన కార్ గుర్తు కనపడింది. ఓడిన కూటమి గుర్తులు కనపడినాయ్. కానీ గెలిచాం అని ఎగురుతున్న సేనలు గుర్తు కనపడలా. ఇంతకీ ఏ గుర్తు మీది వీళ్ళు పోటీ చేసారు ? ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు ?

janasena 11122018

పోటీ చేసి గెలిచిన తెరాస పార్టీ సంబరాలు చేసుకుందంటే అర్ధముంది. పోటీ చేసి ఓడిపోయిన కూటమి నేతలు బాధపడటంలో అర్ధముంది. కానీ అసలు పోటీనే చేయకుండా, పరికి పందల్లాగా తప్పించుకున్న ఈ రెండు పార్టీల హడావిడి చూస్తుంటే ఒక సామెత గుర్తుకువస్తుంది. "ఊరిలో పెళ్ళికి కుక్కల హడావిడి అంటే ఇదేనేమో".. ఇక ఈ రెండు పార్టీలు సంగతి పక్కన పెడితే, బీజేపీ పార్టీది కూడా మరో ఎత్తు. మొత్తం అయుదు రాష్ట్రాల్లో అడ్రస్ లేకుండా పోయింది. మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. వీరికి ఆ బాధ లేదు కాని, తెలంగాణాలో చంద్రబాబు వ్యూహం దెబ్బ కొట్టిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో పార్టీల పరిస్థితులు. గెలిచిన వాడు, ఓడిన వాడు బాగానే ఉన్నా, ఈ ఆటలో అరటిపండు గాళ్ళ హడావిడి ఎక్కువైంది.

తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెలంగాణలో గెలుపొందిన శాసనసభ్యులందరికీ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా భాజపా బలహీనపడిందని, ఐదేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ భాజపా ఓటమిపాలైందన్నారు. కమలం పార్టీ పాలన పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. ఐదేళ్లలో భాజపా చేసిందేమీ లేదని అన్ని వర్గాలూ గుర్తించాయని, ప్రత్యామ్నాయం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయన విశ్లేషించారు.

cbntrs 11122018 2

భాజపాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమిలో తెదేపా భాగస్వామ్య పక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి శుభాకాంక్షలు’ అని తెలిపారు. కాగా, అంతకుముందు ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో విజయం సాధించిన పార్టీలకు అభినందనలు చెప్పారు.

cbntrs 11122018 3

మరో పక్క పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అయుదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పై స్పందించారు. ఫైనల్ మ్యాచ్ అయిన 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల్లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా విజయం సాధించలేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మమతాబెనర్జీ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రజాస్వామ్య క్రీడలో ప్రజలే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతలని మమతా వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలను మమతాబెనర్జీ అభినందించారు.

Advertisements

Latest Articles

Most Read