జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కావాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ పై ఒరిస్సా టీవీ సంచలన కధనం ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒడిశా రాజకీయాల పై దృష్టి సారించనున్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశా అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు సైతం తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడుతున్నారంటూ కధనం ప్రసారం చేసింది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, తెలుగుదేశం పార్టీ ఒడిశాలో 52 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తుందని ఒడిశా టీడీపీ ఇంచార్జ్ రాజేశ్ పుత్ర తెలిపినట్టు ఒడిశా టీవీ ప్రసారం చేసింది. దక్షిణ ఒరిస్సాలో ఎక్కువగా ఉన్న తెలుగువారు ఉన్న చోట, తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేస్తుందని చెప్తున్నారు.

orissa 08122018 1

కోరాపుట్, రాయగడ, మల్కన్ గిరి, గజపతి, గంజాం, నబరంగ్ పూర్ జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని రాజేశ్ తెలిపారు. మొత్తం ఐదు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని, వీటిలో కోరాపుట్, నబరంగ్ పూర్, బెహ్రమ్ పూర్, అస్కా లోక్ సభ స్థానాలను ఇప్పటికే ఎంపిక చేయడం జరిగిందని, పోటీ చేసే మరో స్థానాన్ని ఎంపిక చేయాల్సి ఉందని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకుని ఎన్నికల ప్రచారంలో ముందుకు పోతామని, ఒరిస్సాలో కూడా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని వెళ్తామని ఒడిశా టీడీపీ ఇంచార్జ్ రాజేశ్ పుత్ర పేర్కొన్నారు. ఒడిశాలో పోటీచేసే టీడీపీ అభ్యర్థులను త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేస్తారని వ్యాఖ్యానించారు.

orissa 08122018 1

తెలుగుదేశం పోటీ పై కాంగ్రెస్ నేత ప్రసాద్ బహినిపాటి స్పందిస్తూ, తెలుగుదేశం కనుక ఎన్నికల్లో పోటీ చేస్తే, అది అధికార బీజూ జనతాదళ్(బీజేడీ) పార్టీకి చాలా దెబ్బని, ఆ పార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీ చీల్చే అవకాసం ఉందని అన్నారు. అయితే అధికార బీజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ మాత్రం, ఒడిశాలో టీడీపీ ప్రభావం ఉండబోదని తెలిపింది. మరో పక్క బీజేపీ పార్టీ కూడా తెలుగుదేశం పోటీ చేస్తే, మాకు ఇబ్బంది ఉండదని అన్నారు. బీజేపీ వైస్ ప్రెసిడెంట్ సూర్య నారాయణ పాత్రో స్పందిస్తూ, ఇదంతా చంద్రబాబు పొలిటికల్ స్టంట్ అని, మోడీని ఎదుర్కోలేక ఇలాంటివి అన్నీ ప్రచారం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లోనే చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదంటూ, మాట్లాడారు. మరో బీజేపీ నాయకుడు భ్రుగు బాక్సిపాత్ర మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. అయితే, ఇవన్నీ ఊహగానాలే, చంద్రబాబు స్పందించే వరకు ఒరిస్సాలో పోటీ పై క్లారిటీ లేదు.

రూ.1.175 లక్షలతో తయారు చేసిన మొబైల్ క్యాన్సర్ వాహనాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీని అభినందస్తూ ఎంపీ నిధులతో మురళీమోహన్ ఓ మంచి ఆలోచన చేశారని, ఆయన బాటలో మిగిలిన ఎంపీలు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శనివారం ఎంపీ మురళీమోహన్ రాష్ట్రంలో చంద్రన్న సంచార చికిత్స పేరుతో గ్రామలలో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓ వాహనం అందుబాటులోకి తీసుకువస్తే రాష్ట్రంలో క్యాన్సర్‌ను పూర్తిగా జయించవచ్చన్నారు. ఈ అంబులెన్స్ ద్వారా గ్రామీణ ప్రజలకు క్యాన్సర్ ముందస్తు పరీక్షలు పూర్తిగా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

cancer 08122018 2

క్యాన్సర్ నిర్ధారణకు నేడు అనేక ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడం శుభసూచికమన్నారు. క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమాన్ని లాజికల్ గా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. క్యాన్సర్ పై ప్రజల్లో అపోహలు తొలగించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖపైనా ఉందన్నారు. అందుకు తగిన వేదిక ఏర్పాటు చేయడంలో ప్రయివేట్ భాగస్వామ్యాన్ని తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పగించడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కూడా వైద్య ఆరోగ్యశాఖకు సూచించారు.

cancer 08122018 3

ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ గ్రామాలలో క్యాన్సర్ చికిత్సలను అందుబాటులో తీసుకువచ్చేందుకు ఈ వాహనం రూపొందించామన్నారు. మండల హెడ్‌క్వార్టర్స్‌లో ఈ వాహనాన్ని ఉంచి గ్రామలలో ఉన్న ప్రజలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి వాహనాలను ఏర్పాటు చేసి క్యాన్సర్ నివారణకు కృషి చేయలనేదే తన ఉద్దేశమని ఎంపీ మురళీమోహన్ స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ జనవరి 6న రాష్ట్రానికి రానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాష్ట్ర బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం.. దాని బదులు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఊసే ఎత్తకపోవడం.. రాజధాని, పోలవరం నిర్మాణాలకు అడ్డంకులు.. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకపోవడం, రైల్వే జోన్‌, కడప ఉక్కు కర్మాగారంపై దాటవేతలపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడచిన నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమిచ్చిందో ప్రధాని సదరు సభలో వివరిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీని కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాద్‌లో కలిశారు.

modi 08122018 2

ఈ సందర్భంగా ఏపీ వచ్చేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్ర బీజేపీ కోర్‌ కమిటీ హైదరాబాద్‌లో గురువారం సమావేశమైంది. కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ ముఖ్యులు హాజరై సుదీర్ఘంగా చర్చించారు. 11న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో 14న ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు అనుకూలంగా ఉంటుందని వారు గురువారం రాత్రి ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) తెలియజేశారు. ఆ తేదీ సాధ్యం కాదని పీఎంవో చెప్పడంతో రెండు, మూడు తేదీలు సూచించామని.. చివరకు జనవరి 6న ఖరారైనట్లు కీలక నేతలు తెలిపారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల మైదానం, లేదా పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో మోదీ సభ నిర్వహిస్తే బాగుంటుందని కోర్‌ కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది.

 

modi 08122018 3

అయితే రాజధాని అమరావతి భూమిపూజకు 2015 అక్టోబరు 22న మోదీ వచ్చారని.. దోసెడు మట్టి.. చెంబుడు నీళ్లు తప్ప ఏమీ ఇవ్వలేదని ప్రజల్లోకి వెళ్లిందని.. అక్కడ సభ పెడితే ఈ నిధుల గురించి నిలదీస్తారని కోర్‌ కమిటీ అభిప్రాయపడింది. అయితే రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖలో బీజేపీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉండడం.. నేవీ ఉద్యోగులు, ఇతర ఉత్తరాది ప్రజలు ఉన్నందున అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. విశాఖకు రైల్వే జోన్‌ ప్రకటించకుండా అక్కడ ప్రధాని సభ పెడితే.. ఇతర పార్టీలు ఆందోళన చేస్తే ఇబ్బందిగా మారుతుందన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాయలసీమలో కూడా వద్దనుకున్నారు. మోదీ గత ఎన్నికల సమయంలో తిరుపతిలోనే ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని.. ఇది, కడప ఉక్కు పరిశ్రమ మంజూరు చేయకపోవడం తలనొప్పిగా తయారవుతాయని, తుదకు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెమైతే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని మెజారిటీ నేతలు భావించారు.

విమానయానానికి సంబంధించిన శిక్షణ, పరిశోధన కోసం ఒక సంస్థను దొనకొండ వద్ద ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డ్రోన్ ల పరీక్షల నిర్వహణను కూడా ఈ కేంద్రంతో అనుసంధానం చేయాలనీ ముఖ్యమంత్రి సూచించారు. అమెరికా కేంద్రంగా ఎన్3ఎం సోలుషన్స్ సంస్థను నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రుడు ఎన్.మహేష్- యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ సంయుక్తంగా రూపొందించిన లాంగ్ రేంజ్ డ్రోన్ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ తో కలిసి ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ రూపొందించిన డ్రోన్ ఒకే సారి వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

drone 08122018 2

ఏడున్నర గంటలపాటు నిరాఘాటంగా ప్రయాణించే ఈ డ్రోన్ వ్యవసాయం, వాతావరణం వంటి ముఖ్యమైన అవసరాలకు వినియోగించవచ్చని వెల్లడించారు. 15 కిలోల బరువుండే ఈ లాంగ్ రేంజ్ డ్రోన్ ద్వారా 25 కిలోల బరువును మోయగలిగే సామర్థ్యం ఉంటుంది. గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగం తో ఈ డ్రోన్ ప్రయాణిస్తుంది. దీనిని మరింత అభివృద్ధి చేసి వివిధ ప్రయోజనాలకు వినియోగించేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సీఈఓ కె. రవీంద్రరెడ్డి కూడా ఈ సందర్బంగా పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read