తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పరిస్థితి గురించి లగడపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 28న తాను గజ్వేల్‌కు వెళ్లానని వెల్లడించారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపారన్నారు. తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో సెల్ఫీలు వారు దిగారన్నారు. గజ్వేల్‌లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగానన్నారు. దానికి ‘పోతారు సార్..’ అని ఏడుగురు కానిస్టేబుళ్లు బదులిచ్చారన్నారు. గజ్వేల్‌లో ఎవరు పోతారో..? ఎవరు గెలుస్తారో...? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.

kcrlagadapati 0512018

కాగా.. చంద్రబాబును వదులుకోవద్దని కేటీఆర్‌కు తాను స్పష్టంగా చెప్పానని లగడపాటి అన్నారు.. టీడీపీ బలం టీఆర్ఎస్‌కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని అన్నానన్నారు. పొత్తులతో వెళ్లాలని తాను సూచించినప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఒంటరిపోరుతోనే విజయం సాధిస్తానని తెలిపారన్నారు. కూటమికి అనుకూలంగా అబద్ధపు సర్వేలు వెల్లడిస్తున్నారంటూ మంగళవారం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదనీ, వ్యక్తిత్వం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరమన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారన్నారు. ఆ సమయంలో సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగారన్నారు.

 

kcrlagadapati 0512018

‘నవంబర్‌ 28 తర్వాత నాకు అనేక రిపోర్టులు వచ్చాయి. ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పా.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదు. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉంది. ఈ ఉదయమే సమాచారం వచ్చింది. పోటాపోటీగా లేనప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనబడదు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మూడెకరాల భూమి విషయంలో.. ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ హామీ బాగా పనిచేసింది. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. కేటీఆర్‌కు, నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఈ ఐదేళ్లలో కేటీఆర్‌ని నేను ఎప్పుడూ కలవలేదు. నేను ఎప్పుడూ బోగస్ సర్వేలు చేయలేదు. జిల్లాల వారీగా అనుకూలంగా ఉన్న స్థానాలు చెప్పా. సెప్టెంబర్ 20న టీఆర్ఎస్‌కు అనుకూలంగా..సర్వే ఇచ్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? నేను తెలంగాణకు వ్యతిరేకం అంటే.. కేటీఆర్‌కు రిపోర్టులు ఎందుకు పంపుతా..?’ అని లగడపాటి ప్రశ్నించారు.

తాను చేసిన సర్వే బోగస్ సర్వే అంటూ టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈ ఉదయం తీవ్రంగా మండిపడిన లగడపాటి రాజగోపాల్, కేటీఆర్ కు తనకు మధ్య జరిగిన వాట్స్ యాప్ చాటింగ్ ను మొత్తం బయటపెట్టారు. ఆయన ఫోన్ నంబర్లను కూడా లగడపాటి బయటపెట్టడం గమనార్హం. కేటీఆర్ వాట్స్ యాప్ నంబర్ ను మీడియాకు చెబుతూ, 9490866666 నంబర్ నుంచి ఆయన తనతో చాటింగ్ చేశారని, ఆయన వద్ద 8096699999 నంబర్ కూడా ఉందని చెప్పుకొచ్చారు. కేటీఆర్ రాష్ట్రంలోని 23 నియోజకవర్గాల్లో ఎన్నికలపై సర్వే నిర్వహించాల్సిందిగా తనను కోరారని లగడపాటి తెలిపారు. తన మిత్రుడి ద్వారా ఈ విషయాన్ని చేరవేశానన్నారు. ఇందుకోసం తాను డబ్బు, నగదు, రాజకీయ లబ్ధిని కోరుకోలేదని స్పష్టం చేశారు. తన ప్రత్యర్థులు వచ్చి సాయం కోరినా చేస్తానని ప్రకటించారు. కేటీఆర్ కేవలం 23 స్థానాల్లో సర్వే కోరితే తాను 37 నియోజకవర్గాల్లో సర్వే చేసి నవంబర్ 11న కేటీఆర్ కు ఈ-మెయిల్ ద్వారా పంపానని వెల్లడించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

lagdaapati 52018

తెలంగాణలో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించిందని పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బాంబు పేల్చారు. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకే తొలుత ఆధిక్యం వస్తుందని తేలినప్పటికీ, క్రమంగా పరిస్థితి మారిపోయిందని తెలిపారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ చేసిన సర్వే నిన్న చేసిన సర్వేను ఈరోజు ఉదయాన్నే తనకు పంపిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత కనిపించదనీ, అదే ప్రతిపక్షాలు ఏకమైతే ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గుణగణాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చర్చకు వస్తాయన్నారు. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు, కోదండరాం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు ఏకం కావడంతో అదే పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. దళితులకు మూడెకరాల భూమిని ఇవ్వలేదన్న విషయంలో ఆ సామాజివకర్గం ఏకమయిందనీ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు.

అలాగే ఆదివాసీలకు(ఎస్టీ) 12 శాతం రిజర్వేషన్ హామీ నిలబెట్టుకోకపోవడంతో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టీ సామాజికవర్గం మొత్తం మహాకూటమి వైపు మొగ్గు చూపుతోందని వెల్లడించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడంతో పట్టణాల్లో టీఆర్ఎస్ కు తీవ్రమైన వ్యతిరేకత వస్తోందన్నారు. దీనికి తోడు డబుల్ బెడ్రూమ్ దక్కని ప్రజలకు అధికారంలోకి రాగానే రూ.50 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో పరిస్థితి ఇంకా దిగజారిందని వ్యాఖ్యానించారు. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ హామీని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంలోని మహాకూటమి ఇచ్చిన హామీలు ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నారని వెల్లడించారు. ముస్లింలు రిజర్వేషన్ విషయంలో క్రమంగా టీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నారని బాంబు పేల్చారు.

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ నిన్న వెల్లడించిన తెలంగాణ ఎన్నికల సర్వేపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. లగడపాటి సర్వే సైతం మహాకూటమి విజయం తథ్యమని చెప్పిందన్నారు. ఇక తెరాస పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. రెండున్నర నెలల క్రితం లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వే ప్రకారం తెరాసకు 90 సీట్లు వస్తాయంటే ఆనందపడిన కేసీఆర్‌.. ఇప్పుడు తెరాస ఓడిపోతుందని చెబితే ఆయనపై విమర్శలకు దిగుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజాకూటమి అధికారం సాధించే అవకాశం ఉందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు.

cbn 05122018

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని చంద్ర గార్డెన్స్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రజాకూటమి బలపరిచిన తెదేపా అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెరాసను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'నిన్ననే లగడపాటి చెప్పారు... అయిపోయింది తమ్ముళ్లూ... మొత్తం అయిపోయింది' అంటూ కేసీఆర్ ఓడిపోతున్నారనే విధంగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకి నీతి, నిజాయతీ లేదని చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్ టీడీపీలోనే పుట్టి, టీడీపీలోనే పెరిగారని అన్నారు. టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడుండేవారని ప్రశ్నించారు.

cbn 05122018

పెద్ద మోదీ ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీ అయితే... కేసీఆర్ చిన్న మోదీ అని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేశారని విమర్శించారు. తాను హైదరాబాదును కట్టలేదని, సైబరాబాదును నిర్మించానని చెప్పారు. మిషన్ భగీరథ పూర్తయ్యేంత వరకు ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్... ప్రాజెక్టును పూర్తి చేయకుండానే ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. లోటు బడ్జెట్‌లో ఉన్నా ఏపీలో 10 లక్షల ఇళ్లు కట్టాం. మొత్తం 25 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. తెలంగాణలో అద్దె ఇంట్లో ఉండే వాళ్లకి 50 వేలు గ్రాంట్‌ ఇచ్చి, ఇళ్లు కట్టించే బాధ్యత ప్రజా కూటమి తీసుకుంటుందని చంద్రబాబు అన్నారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ టీవీ9 పై సంచలన ఆరోపణలు చేసారు. కోదాడలో కాంగ్రెస్ పార్టీ ఆరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్ మాట్లాడుతూ టీవీ9 పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ డబ్బులు వెదజల్లేందుకు సిద్ధం అవుతుందని ఉత్తమ్ విమర్శించారు. ఈ రెండు రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలనీ, ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులను టీవీ9 వాహనాల్లో, పోలీస్ కార్లలో, అంబులెన్సుల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

uttam 05122018

మరో పక్క రెండు రోజుల క్రిందట టీవీ9 ఒక సర్వే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టీవీ9 సోమ‌వారం నాడు ప్ర‌సారం చేసిన స‌ర్వే బోగ‌స్ సర్వే అని, ఈ లెక్క‌లే చెబుతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇది కేవ‌లం ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం చేశారో ఇట్టే అర్ధం చేసుకోవ‌చ్చని అన్నారు. "ఇప్పుడు టీవీ9 యాజ‌మాన్యం కూడా ఎవ‌రి చేతుల్లో ఉందో అంద‌రికీ తెలుసు. అస‌లు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో క‌నీస అవ‌గాహ‌న లేకుండా ఈ స‌ర్వే ప్ర‌సారం చేసిన‌ట్లు తేలిపోయింది. ఈ లెక్క‌లు చూస్తుంటే. కేవ‌లం తాము కోరుకున్న వారికి ప్ర‌యోజ‌నం చేకూర్చిపెట్ట‌డం కోసం రాష్ట్రంలో లేని అసెంబ్లీ సీట్ల‌ను కూడా టీవీ9 తీసుకొచ్చిందా?" అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

uttam 05122018

మరో పక్క ఎన్నికల్లో భారీ బద్రత ఏర్పాటు చేసమాని పోలీసులు అంటున్నారు. హైదరబాద్ లోని, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 15 మంది ఏసీపీ స్ధాయి అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. అంతేకాకుండా 3,911 పోలీస్‌ స్టేషన్లకు 60 షాడో టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ రోజు 518 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, సమస్యాత్మక కేంద్రాల్లో భారీగా పోలీస్‌ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు రూ.27 కోట్ల 3 లక్షల 76 వేలు పట్టుకున్నామని, 2 కోట్ల 41 లక్షలు విలువచేసే బంగారం సీజ్‌ చేశామని పేర్కొన్నారు. రెండు లక్షల విలువైన మద్యం సీజ్‌ చేశామని అంజనీ కుమార్‌ తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read