నవ్యాంధ్ర రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నోవాటెల్ ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభానికి సిద్ధమైంది. వరుణ్ గ్రూప్ రూ.150 కోట్ల పెట్టుబడితో విజయవాడలో జాతీయ రహదారి పక్కన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలో ఎకరం విస్తీర్ణంలో ఈ హోటల్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఈ హోటల్‌ను ప్రారంభిస్తారని వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిశోర్ చెప్పారు. ‘విజయవాడ విమానాశ్రయం నుంచి 16 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్లు, బస్‌స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో 227 గదులతో ఈ హోటల్‌ను నిర్మించాం. ప్రతి రూమ్‌లో వైఫై సౌకర్యం ఉంటుంది. ఒకేచోట అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఈ హోటల్‌ను నిర్మించాం’ అన్నారు.
హోటల్‌లో దిగే అతిథుల వ్యాయామం కోసం 200 మీటర్ల వాకింగ్ ట్రాక్, 45 మీటర్ల విస్తీర్ణంలో టెర్రా్‌సపై ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. నాలుగు ఫుడ్, బేవరేజ్ ఔట్‌లెట్స్, ఏడు సకల సౌకర్యాలు కల్గిన సమావేశ గదులు, 10వేల చ.అడుగుల బాంక్వెట్‌హాల్, భూగర్భంలో మూడు ఫ్లోర్లలో 200 కార్ల పార్కింగ్, సౌర విద్యుత్తు, ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటు దీని ప్రత్యేకత. రాజధాని ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ ఉన్న ఏకైక ఫైవ్ స్టార్ హోటల్ వరుణ్ నోవాటెల్ అని కిశోర్ చెప్పారు. త్వరలో రాజధాని అమరావతి సమీపంలోని ఉద్దండరాయునిపాలెంలో రూ.150 కోట్ల అంచనాతో మరో ఫైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించేందుకు వరుణ్ గ్రూపు సిద్ధమవుతోంది.
ఇందుకోసం ఇప్పటికే నాలుగు ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన మార్చి నెలలో మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నట్టు కిశోర్ చెప్పారు. వరుణ్ గ్రూప్ చైర్మన్ వి ప్రభుకిషోర్ మాట్లాడుతూ 2009లో విశాఖ హోటల్ ద్వారా తాము ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టామన్నారు. ఇప్పటికి తమకు మూడు హోటల్స్ ఉన్నాయన్నారు. ఆహార ప్రేమికుల అభిరుచులకనుగుణంగా అత్యుత్తమ క్యూసిన్స్‌ను అతిథులిక్కడ అనే్వషించవచ్చన్నారు. నాలుగు డైనింగ్ అవకాశాలను వైవిద్యమైన ఫుడ్, బేవర్‌రేజ్స్ నుంచి ఎంచుకునే సౌకర్యం. అంతర్జాతీయ... జాతీయ... రుచులను అందుబాటులో ఉంచామన్నారు. నోవాటెల్ 59 దేశాల్లో 500 హోటల్స్‌ను కల్గి ఉందన్నారు.