టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని మంగళవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు రేవంత్ అనుచరులుని, మీడియాని ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు ఇస్తూ, తప్పుదోవ పట్టించారు. ముందుగా రేవంత్ బెడ్ రూమ్ తలుపులు బద్దలుగొట్టి, రేవంత్ ని బయటకు ఈడ్చుకుని కార్ లో తీసుకువెళ్తున్న సమయంలో, ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా చెప్పకుండా, వెళ్ళిపోతూ ఉండటంతో, రేవంత్ అనుచరులు పోలేసులు వెనుకు వెళ్లారు. అదే సమయంలో మీడియా కూడా వెంట వెళ్ళింది. ఈ సమయంలో రేవంత్ అనుచరులు వస్తున్న కార్ ని, వేరే పోలీస్ వాహనంతో గుద్ది పక్కకు తోసేసి, తాళం లాక్కుని వెళ్ళిపోయారు. ఇదే సమయంలో మీడియాని కూడా తప్పుదోవ పట్టించటానికి, వాహనాలను వివిధ మార్గాల్లో తీసుకువెళ్ళారు. అయితే హైదరాబాద్ వెళ్తున్నారని, అందరూ భావించారు.

revanth 04122018 2

హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహన శ్రేణికి మీడియా ఫాలో అవ్వగా, రేవంత్ ని మరో వైపు తీసుకువెళ్లారు. చివరకు రేవంత్ ని జడ్చర్లకు తరలించారు. ప్రస్తుతం జడ్చర్లలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో రేవంత్‌‌ ఉన్నారు. అయితే హైదరాబాద్ తీసుకువస్తే మీడియా హడావిడి ఎక్కువగా ఉంటుంది, చంద్రబాబు కూడా అక్కడకు వచ్చి రేవంత్ ని కలిస్తే, మరింత డ్యామేజ్ జరుగుతుందని భావించి, రేవంత్ ను జడ్చర్ల తీసుకువెళ్ళారు. అసలు ఎక్కడకు తీసుకువెళ్తుననరో చెప్పకుండా, ఇన్ని ట్విస్ట్ లు ఇచ్చి, చివరకు జడ్చర్ల పోలీస్ శిక్షణ కేంద్రంలో పడేసారు. రేవంత్ సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రేవంత్ అనుచరులు యూసుఫ్, ప్రశాంత్, రెడ్డి శ్రీనివాస్, సత్యపాల్, వెంకట్‌రెడ్డిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

revanth 04122018 2

టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొడంగల్‌‌లో నిర్వహించబోయే ఎన్నికల ప్రచార సభను అడ్డుకుంటామని రేవంత్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేవంత్ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌‌గా తీసుకున్న ఈసీ.. రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. దీంతో కొడంగల్ పీఎస్‌లో రేవంత్‌పై 341, 188, 506, 511 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఇవాళ ఉదయం రేవంత్‌‌ను అరెస్ట్ చేశారు. కొడంగల్ అభ్యర్థిని అరెస్ట్ చేయడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న కేసీఆర్ కూడా చంద్రబాబుని అడ్డుకోమని చెప్పారని, అప్పుడు లేని నిబంధనలు, ఇప్పుడే వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు.

అవును ఇది సంచలనమే... కేఏ పాల్, పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడిన సంచాలనమే. ఎందుకంటే ఒకాయిన మద్దతు ఉంటేనే, ఆయన పిలుపు ఇస్తేనే అమెరికా అధ్యక్షడిగా ఎంపిక అవుతాడు. ఇంకో ఆయన పిలుపు ఇస్తే, రాష్ట్రాలకు సియంలు, దేశానికి పియంలు అవుతారు. ఈ ఇద్దరూ ఒక్క పిలుపు ఇస్తే చాలు, 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఉన్నవాళ్ళు కూడా చిన్నబోవాల్సిందే. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత అనుభవం ఉన్నా, కేఏ పాల్, పవన్ కళ్యాణ్ ఒక్క పిలుపు చాలు, వారి గెలుపు తారు మారు చెయ్యటానికి. నవ్వుకోకండి, ఇది నిజం అని కేఏ పాల్ అభిమానులు, పవన్ అభిమానులు నమ్ముతున్నారు. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడు అయ్యింది కేఏ పాల్ ప్రచారం చెయ్యటం వల్ల , ఇక్కడ చంద్రబాబు సియం అయ్యింది, అక్కడ మోడీ పియం అయ్యింది పవన్ ప్రచారం వల్ల.

pk 0412018 2

అందుకే ఇప్పుడు పవన్ చేసిన ట్వీట్ తో, అటు కేసీఆర్, ఇటు ప్రజా కూటమి నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5 న పవన్ ఎటు వైపు మొగ్గుతారా, ఆయన మా గురించి ఒక్క ట్వీట్ చేస్తే చాలు, మేము సియం అయిపోతాం అని అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటి అంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయట్లేదని.. పార్లమెంట్‌‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జనసేన మద్దతెవ్వరికన్న విషయంపై ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై తాజాగా పవన్ ట్విట్టర్‌‌లో స్పందించారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని ఎన్నికలకు రెండ్రోజుల ముందు అనగా డిసెంబర్ 5వ తారీఖున తెలియపరుస్తామన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎవరికీ మద్దతు తెలిపి ట్వీట్ చేస్తే, వారే గెలుపు అని జన సైనికులు అంటున్నారు.

pk 0412018 3

పవన్ ట్వీట్ ఇదీ.. " తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5వ తారీఖున తెలియపరుస్తాము" అని పవన్ ట్వీట్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ ఎల్లుండి ఏ ప్రకటన చేస్తారా..? అని అభిమానులు, కార్యకర్తలు.. తెలంగాణ రాజకీయ పార్టీల్లో సర్వాత్రా ఆసక్తి నెలకొంది. మరో పక్క పవన్ , ఇప్పటికే కేసీఆర్ పాలనని మెచ్చుకున్నారు. కేసీఆర్ కు మార్కులు కూడా వేసారు. చంద్రబాబు వేస్ట్ అని తేల్చేసారు. ఇక కేటీఆర్ తో అయితే, పవన్ కు ఉన్న సంబంధాలు అన్నీ ఇన్నీ కాదు. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబు లీడ్ చేస్తున్న ప్రజా కూటమికి కాకుండా, కేసీఆర్ కే పవన్ మద్దతు ఇచ్చే అవకాసం ఉంది.

ఒకడికి మించినోడు మరొకడు అని, జగన్, పవన్ భాష రోజు రోజుకీ దిగజారిపోతుంది. జగన్, పవన్ రోజు రోజుకీ దిగజారి మాట్లాడుతున్నారు. నలుగురు నలుగురు పెళ్ళాలు అని జగన్ అనటం, నువ్వు జైలుకు వెళ్లి చిప్ప కూడు తింటావ్ అని పవన్ అనటం.. ఏపి రాజకీయం ఇలా మారిపోయింది. జగన్‌ నేరాలు చేశాడని ఎప్పటికైనా లాలూప్రసాద్‌ యాదవ్‌లా జైలుకు వెళ్లడం ఖాయమని పవన్ ఎద్దేవాచేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా పారిపోయాడని, పాపం.. ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేసుకుంటున్నాడని పవన్‌‌కల్యాణ్‌ ఆరోపించారు. దీని పై జగన్, పవన్ మగతనం ఇదేనా అని స్పందించారు.

jagan 03122018 2

“ఈ పెద్ద మనిషి ఈ మధ్య కాలంలో మగతనం గురించి మాట్లాడాడు. ఇప్పటికి నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్లకోసారి భార్యలను మారుస్తారు. పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి. నిత్య పెళ్లికొడుకులా నాలుగేళ్ళ కొసరి భార్యలను మార్చడం మగతనమా అని అడుగుతున్నా. ఆయన రెండో భార్య రేణు దేశాయ్ మేము కలిసి ఉండగానే వేరే ఆవిడతో సంసారం చేసి పిల్లాడిని ఇంటికి తీసుకోచ్చాడని మీడియాలో చెప్పారు. అటువంటి ఆడపడచును ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారని వారి కార్యకర్తలు వేధిస్తుంటే వేడుక చూసాడు ఈ పెద్ద మనిషి,” అన్నారు జగన్.

jagan 03122018 3

“ఈయన్ని ఎవరైనా అంటే వారి ఇంట్లోని ఆడవారిపై సోషల్ మీడియాలో దారుణంగా విమర్శిస్తారు. ఒకపక్క ల్యాండ్ పోలింగ్ కు వ్యతిరేకం అంటూ చంద్రబాబు బినామీ లింగమనేని దగ్గర ఆయనని కాపాడటానికి 20 5 కోట్ల భూమిని 20 లక్షలకే తీసుకుని నీతులు చెప్తాడు. ఈయన సినిమా అజ్ఞ్యాతవాసికి ఏ సినిమాకు ఇవ్వని రాయతీలు చంద్రబాబు నాయుడు ఇస్తే ఆయనకు ఏమీ కనపడవు. చంద్రబాబు చేసిన ప్రతీ అన్యాయానికి నాలుగున్నర ఏళ్లగా భాగస్వామిగా ఉండి ఇప్పుడు వ్యతిరేకం అయినట్టు నాటకాలు ఆడుతున్నాడు. దీనికి స్క్రిప్టు డైరెక్షన్ చంద్రబాబు అయితే లింగమనేని నిర్మాత. నేను అవినీతిపరుడని అంటున్నావు. నువ్వు చూసావా నేను అవినీతి చెయ్యడం?,” అని తీవ్ర ఆరోపణలు చేసారు జగన్.

కేసీఆర్ కు రేవంత్ ఫోబియా పట్టుకుంది.. సియం సీటు తరువాత, రేవంత్ ఉంటే తనకు ఎమ్మల్యే పదవి కూడా దక్కదని, రేవంత్ ను, తనకున్న అధికారాలతో ముప్పుతిప్పలు పెడుతున్నాడు కేసీఆర్. మొన్న సెక్యూరిటీ తగ్గించి, రేవంత్ ని చంపేస్తాం అంటూ లీక్లు ఇచ్చి, రేవంత్ ని కొడంగల్ నుంచి బయటకు రాకుండా చేసారు. ఈ రోజు ఏకంగా తలుపులు బద్దలగొట్టి, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా, ఇష్టం వచ్చినట్టు ఇంట్లో విధ్వంసం సృష్టించి, రేవంత్ ను ఈడ్చుకెళ్ళారు. సీఎం కేసీఆర్‌ నేడు కొడంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను అడ్డుకునేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని ఈసీకి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. రేవంత్‌ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, కొడంగల్‌ బంద్‌కు పిలుపునిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

revanth 04122018 2

ఈసీ ఆదేశాలతో ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కొడంగల్‌ పోలీసు స్టేషన్‌లో రేవంత్‌పై కేసు నమోదు చేసినట్లు అదనపు డీజీపీ జితేందర్‌ తెలిపారు. రేవంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయం కూడా తెలపడం లేదని రేవంత్ భార్య ఆందోళన చెందుతుంది. ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు వచ్చినట్లు రేవంత్ అనుచరులు తెలుపుతున్నారు. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఆదేశాలతో రేవంత్‌ రెడ్డి పై రెండు కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. కాగా రేవంత్‌రెడ్డిని ఇతర నియోజకవర్గాల్లో తిరగకుండా అడ్డుకొనేందుకే అధికారపక్షం ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇప్పటికే బొమ్మరాస్‌పేటలో నేడు సాయంత్రం వరకు 144 సెక్షన్ విదించిన విషయం తెలిసిందే.

revanth 04122018 3

అయితే రేవంత్ మాత్రం, "అల్లర్లకు దొర స్కెచ్ ఇది... పోలీసుల మొహరింపు మధ్య పోలింగుకు కుట్ర ఇది.. కార్యకర్తలారా... ఆవేశం వద్దు... అప్రమత్తంగా ఉండండి... ఆగ్రహావేశాలతో కేసీఆర్ ట్రాప్ లో పడవద్దు...సంయమనంగా వ్యవహరిద్దాం... ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ది చెబుదాం..." అంటూ అరెస్ట్ చేస్తున్న సమయంలో నినాదాలు చేస్తూ వెళ్లారు. మరో పక్క, పోలీసులు అరెస్ట్ చేసి ఎటు తీసుకుని పోతున్నారో చెప్పక పోవటంతో, రేవంత్ సిబ్బంది పోలీస్ వాహనాలని ఫాలో చేస్తుంటే, రేవంత్ కార్ ని గుద్ది పక్కకు తోసేసి, రేవంత్ కార్ తాళాలు తీసుకుని పోలీసులు వెళ్లిపోయారని, రేవంత్ సిబ్బంది చెప్తున్నారు. అర్దరాత్రి అరెస్ట్ లు , తన చానల్స్ లో దొంగ సర్వేలు, ఇలా అనేక విధాలుగా కేసీఆర్ తన ఓటమిని ముందే ఒప్పుకుంటున్నారు. ఇంత దారుణంగా, ఎప్పుడూ జరగలేదేమో, కనీసం ఇంట్లో ఆడవాళ్ళూ ఉన్నారని కూడా సోయ లేకుండా, తలుపులు విరగొట్టి, ఇలా చేయటంతో కేసీఆర్ సాధించేది ఏమి ఉండదు.

Advertisements

Latest Articles

Most Read