తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు కూకట్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించారు. ప్రజా కూటమి తరుపున ఆయన ఈ రోజు కూకట్‌పల్లిలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు పోటెత్తారు. ఈ ప్రజలను చూసిన కడుపు మంటో ఏమో కాని, చంద్రబాబు స్పీచ్ మొదలు పెట్టిన అయిదు నిమషాల తరువాత, అక్కడకు టీఆర్ఎస్ కూకట్‌పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు సంబంధించిన ప్రచార వాహనం వచ్చింది. ఆ వాహనాన్ని చూసిన టీడీపీ కార్యకర్తలంతా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చెయ్యగా, చంద్రబాబుకలుగ చేసుకుని, వద్దు తమ్ముళ్లూ..ఏం చెయ్యొద్దు వదిలేయండి అన్నారు. వాళ్ళే వెళ్ళిపోతారు వాళ్ళని ఏమి అనద్దు, వదిలెయ్యండి అని అన్నారు.

kukatapalli 011122018 2

అంతేకాకుండా ఆయన(మాధవరం కృష్ణారావు) కూడా టీడీపీ నుంచి గెలిచి, టీడీపీకే ద్రోహం చేసి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన మనిషేనని, ఆయన గురించి కూడా మనం చెప్పుకుందాం అంటూ చంద్రబాబు అన్నారు. అయితే చంద్రబాబు మాటలకు అక్కడున్న కార్యకర్తలందరూ ఉత్తేజంగా కేరింతలు కొట్టారు. చంద్రబాబు ప్రసంగిస్తూ, ‘సైబరాబాద్‌ నా మానస పుత్రిక’ అని అన్నారు. సైబరాబాద్‌ నగరాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టానని గుర్తుచేశారు. సైబరాబాద్‌ నిర్మాణంలో కేసీఆర్‌, కేటీఆర్‌ పాత్ర లేదని చెప్పారు. అలాగే టీడీపీ హయాంలోనే హైదరాబాద్‌లో ఉద్యోగాలు కల్పించామని వివరించారు. తానెందుకొచ్చానో ఈ సభలు చూస్తే టీఆర్‌ఎస్‌ నేతలకు అర్థమవుతుందన్నారు. కేసీఆర్‌ గుండెళ్లో రైళ్లు పరుగెత్తించాలని పిలుపు ఇచ్చారు.

kukatapalli 011122018 3

మీ గుండెల్లో నాకున్న స్థానాన్ని ఎవరూ తొలగించలేరన్నారు. ఈ గడ్డపైనే ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని తెలిపారు. మోదీ, అమిత్‌షా దేశాన్ని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. మా హైదరాబాద్‌కు... మీ అహ్మదాబాద్‌కు పోలికా? అని అడిగారు. మోదీ, అమిత్‌షా దేశాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ధ్వజమెత్తారు. రెండు రాష్ట్రాలకు ప్రధాని మోదీ అన్యాయం చేశారని వివరించారు. అందుకోసమే దేశం కోసం టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌కు కోడికత్తి పార్టీ మద్దతిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. బెదిరింపులకు దిగుతున్నారని, బెదిరిస్తే భయపడేది లేదన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 10 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. స్వార్థం కోసం పార్టీ మారారని మండిపడ్డారు. రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతాల్లో టీడీపీ పౌరుషం చూపిద్దాం... మోసం చేసినవాళ్లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నందమూరి ఆడబిడ్డను ఆఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

నిన్నటి నుంచి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తుంది. అది కూడా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ. నిన్న లగడపాటి రాజగోపాల్ తిరుపతి దర్శనానికి వెళ్లి బయటకు రాగానే మీడియా చుట్టుముట్టింది. తెలంగాణా విషయం అడగగా, నేను ఇప్పుడే చెప్పను అని చెప్పారు, కాని బలవంతంగా వాళ్ళు అడగగా, లగడపాటి మాట్లాడుతూ, ఈ సారి ఒక 8 మంది వరకు ఇండిపెండెంట్లు గెలుస్తారు అంటూ చెప్పారు. ప్రతి రోజు కేసీఆర్ నేను వంద సీట్లు గెలుస్తా అని ఎలా చెప్పారో, అలాగే లగడపాటి కూడా చెప్పారు. నేను సర్వే చేసాను, ఇది దాని రిజల్ట్ అని చెప్పలేదు. నా అభిప్రాయం ఇది అంటూ, అందరూ చెప్పినట్టే చెప్పారు. ఇక్కడే తెరాస వాళ్ళు సెల్ఫ్ గోల్స్ వెయ్యటం మొదలు పెట్టారు.

lagadaati 01122018

రెండు నెలల క్రితం లగడపాటి సర్వేలో తెరాస గెలుస్తుంది అంటే చంకలు గుద్దుకున్న కేసీఆర్, నిన్నటి నుంచి మాత్రం లగడపాటి పై మండి పడుతున్నారు. నిజానికి లగడపాటి తెరాస ఓడిపోతుంది అని ఎక్కడా చెప్పలేదు. కాని కేసీఆర్ నిన్న బహిరంగ సభలో, ఆడెవడో సన్నాసి సర్వే అంటూ వస్తున్నాడు అంటూ, తిట్ల దండకం అందుకున్నాడు. ఈ రోజు తెరాస వాళ్ళు, లగడపాటి పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. వారం రోజుల్లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసేలా లగడపాటి వ్యాఖ్యలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎన్నికల సమన్వయ కమిటీ తరపున దండె విఠల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా వ్యాఖ్యలు చేయడం ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని, ఈ వ్యాఖ్యలను టీవీల్లో ప్రసారం చేశారని అన్నారు. అయితే ఇది సర్వే కాదు, తన అభిప్రాయం ఆయన చెప్పారు. అలాగైతే, వంద సీట్లు గెలుస్తాం అంటున్న కేసీఆర్ పైన కూడా చర్యలు తీసుకోవాలి కదా ?

lagadaati 01122018

మరో పక్క, తెలంగాణ ఎన్నికల్లో పది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తారని ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. లగడపాటి.. చంద్రబాబుకు సీక్రెట్ ఏజెంటా ఏంటీ? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లగడపాటి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. అసలు లగడపాటి తిరుపతిలో ఇండిపెండెంట్లు 8 మంది గెలుస్తారు అని చెప్తే, దానికి హరీష్ రావుకు భయం ఎందుకు ? ఈ మాత్రం దానికే లగడపాటి, చంద్రబాబు సీక్రెట్ ఏజెంట్ అయిపోతాడా ? మరో పక్క కేటీఆర్, చంద్రబాబు అంతు చూస్తున్నాం అంటాడు. అసలు ఇంత చిన్న విషయం పట్టుకుని నిన్నటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎందుకు ఇలా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ, వాళ్ళ బలహీనత వాళ్ళే బయట పెట్టుకుంటారు ? ఒక్క లగడపాటి కోసం, ఫ్యామిలీ ఫ్యామిలీ నిన్నటి నుంచి ఇంతలా టెన్షన్ పడుతుంది.

మన రాష్ట్రంలో ఒక బ్యాచ్ ఉంటుంది. కేవలం చంద్రబాబు చేసి ప్రతి పనిని కోర్ట్ కు వెళ్లి అడ్డుపడి, పని లేట్ అయ్యేలా చెయ్యటం. జగన్ పార్టీలో అయితే, ఏకంగా ఒక ఎమ్మెల్యేనే ఆ పని పై ఉంటాడు. ఇలాంటి కోవలో వ్యక్తే, చివరకు శ్రీవారి గుడి పై కూడా అభ్యంతరం చెప్తూ కోర్ట్ కు వెళ్లి, చీవాట్లు తిన్నాడు. అమరావతిలో శ్రీవారి గుడి నిర్మించాలాని ప్రభుత్వం టిటిడి కలిసి నిర్ణయం తీసుకున్నాయి. అమరావతిలో టిటిడి నిధులతో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మిస్తే తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. 7 నక్షత్రాల హోటల్‌, మద్యం దుకాణాలను నిర్మించడం లేదు కదా? అని వ్యాఖ్యానించింది.

ttd 01122018 2

అమరావతి పరిధిలోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో రూ.150 కోట్ల తితిదే నిధులతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి చర్యలు ప్రారంభం అయ్యాయని, దీనిని అడ్డుకోవాలంటూ తిరుపతి నివాసి పి.నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ ప్రాంతంలో ఎకరా భూమి విలువ రూ.23.10 లక్షలు ఉంటే.. ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాల్ని తితిదేకు అధికారులు కేటాయించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. దీనిని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.

ttd 01122018 3

ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మించాలని ఏపీ ముఖ్యమంత్రి 2014సెప్టెంబరులో తితిదేకు సూచిస్తే.. 2018 నవంబర్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వ్యాజ్యం దాఖలు చేయడం ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. దేవాలయం నిర్మాణంపై పురోగతి ఉంటుందని గుర్తుచేసింది. ఇప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇది ప్రజాహితం కోసం వేసిన వ్యాజ్యంగా లేదని ప్రచారం కోసం వేసిన దానిలా ఉందని ఘాటు వ్యాఖ్య చేసింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ.10 లక్షల భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అంతిమంగా జరిమానా విధించకుండా కేవలం వ్యాజ్యాన్ని కొట్టేసింది.

మన ఖర్మకి అందరూ ఇలాంటి వాళ్ళే తగులుతున్నారు. మన ఏపిలో వచ్చి ఒక హైదరాబాద్ సినిమా ఆయన తిరుగుతూ, ఏమంటున్నాడో వింటున్నాంగా, నేను ఓడిపోయినా పరవాలేదు, కాని చంద్రబాబు మాత్రం గెలవకూడదు అంటూ శపధం చేసి హంగామా చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా ఆ హైదరాబాద్ లో ఉన్న మంత్రే, తమ ఓటమికి చంద్రబాబు బాధ్యత అంటూ, యుద్ధం జరిగే వారం ముందే డిసైడ్ అయిపోయాడు. మేము ఓడిపోతున్నాం, చంద్రబాబు మా కొంప ముంచేసాడు, అందుకే చంద్రబాబుని వదలం, ఏపి రాజకీయాల్లో మేము కాలు పెడతాం, చంద్రబాబు అంతు చూస్తాం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కేటీఆర్..

ktr 01122018

వేలు కాకపోతే మొత్తం మొండెం దూర్చు , నువ్వు నీ అయ్యా ఎంతగా ఆయనను తిడితే నాలుగు ఓట్లు ఎక్కువే పడతాయే తప్ప ఒక్క ఓటు కూడా తగ్గదు అని ఏపి ప్రజలు అంటున్నారు. తెలుగుదేశానికి జండా మోసే కార్యకర్త లేడు , తెలుగుదేశం చచ్చిన పాము ఇంకా ఏం చంపుతాము అని ప్రగల్భాలు పలికిన తండ్రి,కొడుకులు ఇద్దరూ ఇప్పుడు, 95 సీట్లలో పోటీ పడే కాంగ్రెస్ ని ఒదిలేసి, 14 సీట్లలో పోటీ పడే తెలుగుదేశం మీద పడి ఏడవడం, చంద్రబాబు వల్లే మేము ఓడిపోతున్నాం అని ఎన్నికల వారం ముందే తెలుసుకుని, చంద్రబాబు నీ అంతు చూస్తాం అని ఓపెన్ గా చెప్తున్నారు.

ktr 01122018

నువ్వు అంతు చూస్తా ఉంటే ఆయన, ఆయన్ను నమ్ముకున్న ఏపి ప్రజలు చూస్తూ ఉంటారు మరి. 14 సీట్లలో పోటీ చేసే తెలుగుదేశాన్ని చూసి ఆగం ఆగం అయిపోతిరి మీ కల్వకుంట్ల కుటుంభం , అదే బాబుగారు తెలంగాణా అంతా తిరిగుంటే, అయ్యా కొడుకులు కూడా సెంకరమాన్యాలు పట్టే వాళ్లు... నాలుగు ఇంగ్లీష్ మాటలు చెప్పి, సేల్ఫీలు దిగినందుకే నీకు అంత పొగరు ఉంటే కేటీఆర్, ఆయన కట్టిన భవనాలు తెలంగాణా యువత బంగారు భవిష్యత్తు కోసం ఇచ్చాయి కాబట్టే, ఆయన వచ్చి మీ బండారం మొత్తం తెలంగాణా ప్రజల మందు ఉంచుతున్నారు. చంద్రబాబు చెప్పింది విని, నువ్వు చెప్పేది విని, ప్రజలు తీర్పు ఇస్తున్నారు... ముందు మీది మీరు ఏడవండి....మాది తర్వాత ఏడవచ్చు... ఎలాగూ మీ రహస్య స్నేహితులు, జగన్, పవన్, బీజేపీ ఉన్నారుగా, నీ ఇంకో కాలు పెట్టినంత మాత్రాన, చంద్రబాబుకి ఏమి కాదులే...

Advertisements

Latest Articles

Most Read