పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట, ఎదో సినిమా డైలాగ్లులాగా ఉంటాయి. అప్పటికప్పుడు, తన ఫాన్స్ ని రంజింప చేసామా అనేలా ఉంటాయి కాని, ఎక్కడా రియాలిటీకి దగ్గరగా ఉండవు. ప్రతి సందర్భం, తన జీవితంలో జరిగింది అంటూ కధ అల్లేస్తూ ఉంటారు. వాళ్ళ ఫాన్స్ అదే నిజం అనుకుని, ఊహా లోకంలో విహరిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజగా, ఏకంగా అంబానీని ఆంధ్రాకు పిలిపించి గ్యాస్ సంగతి తెల్చేస్తా అంటూ ప్రకటన చేసారు. తాను సియం అవ్వగానే, అంబానీలను రాష్ట్రానికి పిలిచి కోనసీమకు అండగా ఉండాలని కోరతానని అన్నారు.

pk 27112018 2

అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో సోమవారం జరిగిన రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన వివిధ అంశాలపై తన విజ్ఞాన ప్రదర్సన చేసారు. మిగతా పార్టీల్లా పార్టీఫండ్‌ ఇస్తే లొంగిపోయే పార్టీ జనసేన కాదని, ఇక్కడ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రకృతి వనరులను దోచుకుపోతూ ఉంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. సియం అవ్వగానే, అంబానీని ఆంధ్రాకు పిలిపిస్తా అని, ఆయనతో అన్నీ మాట్లాడతానని అన్నారు. నాకు వీళ్ళ నుంచి పార్టీ ఫండ్ అవసరం లేదు, వాళ్ళ సంగతి నేను చూస్తా అని పవన్ అన్నారు.

pk 27112018 3

అవినీతి, దోపిడీని అరికట్టాలని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. రైతుల కష్టాలను తీర్చడం లో జనసేన అగ్రతాంబూలం ఇస్తుందన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడటానికి ఇక్కడకు రాలేదని, వినడానికి వచ్చానని ఆయన పేర్కొన్నారు. తానూ రెండు సెంట్లలో వరి పందిస్తున్నా అని చెప్పగానే, రైతులు అవాక్కయ్యారు. రెండు సెంట్లలో వరి పండించటం ఏంటో అని బుర్ర గోక్కున్నారు. ఇక్కడే పవన్ ఎంత నిజాయతీగా మాట్లాడుతున్నారో తెలిసిపోతుందని అనుకుంటున్నారు. ఏదేమైనా, అంబానీని ఆంధ్రాకు పిలిపించి తెల్చేస్తా అని పవన్ చెప్తుంటే, కేఏ పాల్ ట్రంప్ తో మాట్లాడి, ఏపికి పెట్టుబడులు తెస్తా అని చెప్పినట్టే ఉంది. బెస్ట్ అఫ్ లక్ పవన్..

హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో టీఆర్‌ఎస్‌ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సభ.. జనం లేక వెలవెలబోయింది. వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి లక్షా యాభైవేల మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. జనం మధ్యాహ్నం మూడు గంటలకే సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రయత్నం చేశారు. అయితే సభ కోసం ప్రజలు రావడానికి ఆసక్తి చూపలేదు.. వరంగల్‌ పశ్చిమ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాస్యం వినయభాస్కర్‌, ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేశారు.

meeting 27112018

పోలీసులు మూసిన గేట్లను తెరిచి ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ వరంగల్‌ - హైదరాబాద్‌ ప్రధాన రహదారి మీద ఉన్న ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మెయిన్‌ గేట్‌, రోహిణి ఆస్పత్రి పరిసరాల్లోనే జనం సేద తీరారు. సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలు సైతం కళాకారులు పాటలు పాడుతున్నపుడు మాత్రమే ఆసక్తి కనబరిచారు. నేతలు మాట్లాడడం మొదలు పెట్టగానే సభా ప్రాంగణం నుంచి లేచి వెళ్ళడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన నేతలు మరోసారి కళాకారుల ఆట- పాట కొనసాగించారు. కాస్తా ఆలస్యంగా వచ్చిన జానపద గాయకురాలు మంగ్లీ తన ఆటా- పాటలతో సభను ఆదుకున్నది. పాటలు పాడుతూ ఉత్సాహపరచడంతో జనం వెళ్లిపోకుండా ఉన్నారు.

meeting 27112018

రాత్రి 7.10 గంటలకు వేదికపైకి కేసీఆర్‌ చేరుకున్నారు. సభ ఆలస్యం అయినా జనం రాలేదు. ఉన్న జనం కాస్త, సభ లేట్ కావటంతో జనం తిరుగుముఖం పట్టారు. దీంతో సీఎం మాట్లాడుతున్న సమయంలో సభా ప్రాంగణంలో కుర్చీలుగా ఖాళీగా కనిపించాయి. అక్కడ వచ్చిన ప్రజలకు తాను చేసిన పనులు వివరించారు కేసీఆర్, రైతుల కోసం రైతు భీమా, రైతుబంధు పథకం తీసుకొచ్చామని తెలిపారు. నెల రోజుల్లో మిషన్‌భగీరథ పనులు పూర్తవుతాయని కేసీఆర్ వెల్లడించారు. అలాగే డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా త్వరలోనే కట్టేస్తాం అని చెప్పి, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే సభ లేట్ అవ్వటంతోనే, ప్రజలు లేరని, తెరాస వర్గాలు సమర్ధించుకున్నాయి.

 

మన ప్రధాన మంత్రి మోడీ గారు, ఏమి చేసినా నాటకీయత ఉంటుంది. అదే ఆయన్ను 2014లో ప్రధానిని కూడా చేసిందనుకోండి. ఎన్నికల సమయంలో మన మోడీ గారి లోపల ఉన్న, ఈ నాటకీయత పదింతలు బయటకు వస్తుంది. ఆయన తల్లితో ఫోటో షూట్లు వస్తాయి.. నేను తక్కువ కులం వాడిని అని చెప్పుకుంటారు. నన్ను చంపటానికి కాంగ్రెస్, పాకిస్తాన్ తో కలిసింది అని చెప్తారు. ఇలా అనేక విధాలుగా ఆయన ప్రచారం ఉంటుంది. ఇక ఎక్కడికి వెళ్తే అక్కడ సెంటిమెంట్ తో ఆడుకుంటారు. ఇప్పుడు తెలంగాణా ఎన్నికల సమీపిస్తున్న వేళ, రాక రాక తెలంగాణా గడ్డ మీద అడుగు పెడుతున్నారు. మాములుగా వేరే రాష్ట్రం అయితే, ఈ పాటికి ఒక 20 సార్లు అయినా వచ్చి ప్రచారం చేసే వారు.

modi 27112018

కాని, ఇక్కడ కేసీఆర్ తో ఉన్న రహస్య స్నేహంతో, ఎదో మొక్కుబడిగా ప్రచారం చెయ్యటానికి ఎట్టకేలక తెలంగాణా వస్తున్నారు. వచ్చే ముందు ఆయన తెలుగులో ట్వీట్ చేసారు. నేడు నిజామాబాద్‌, మహబూబ్‌నగర్ ఎన్నికల ర్యాలీలో తాను పాల్గొంటున్నానని, ఈ సభ కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా విజయం సాధించేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ‘నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ మన తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను... మొదట నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్‌నగర్‌లో మీతో నా భావాలు పంచుకొంటాను.. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడానికి మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులను కోరుకుంటున్నాను. NM Mobile app ద్వారా ఈ ర్యాలీ విశేషాలను నిరంతరం చూడండి’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

modi 27112018

అయితే ప్రధాని మోడీ గారికి, ఇన్నాళ్ళకు అయినా తెలుగు గుర్తుకువచ్చినందుకు, తెలుగు ప్రజలు సంతోష పడుతున్నారు. ఉగాది కి మరచి పోయిన తెలుగు , సంక్రాంతికి గుర్తు రాని తెలుగు నేడు ఎన్నికల వేళ గుర్తొచ్చిందని, నిజంగానే మన దేశం లో ఎన్నికలు పెద్ద పండగలే అంటున్నారు. గతంలో అన్ని పండుగలకి వాళ్ళ భాషల్లో ట్వీట్ చేసే మోడీ గారు, తెలుగులో మాత్రం మనకు ఉగాదికి, సంక్రాంతికి గుర్తుకు రాలేదు. ఎన్నికల వేళ, తెలుగు ప్రజలు, తెలుగు భాష మన ప్రధాని గారికి గుర్తుకు వచ్చాయి. ఏదైనా ఇప్పుడు మీటింగ్లో కూడా, తెలుగులో మొదలు పెట్టి, ఎన్టీఆర్ పేరు చెప్పి, ఇక్కడ సెంటిమెంట్ తో పడేయటానికి రెడీ అయ్యారు. చూద్దాం, తెలంగాణా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో.

ఆయన ప్రపంచ పఠంలో పెట్టిన ప్రాంతం అది. ఏకంగా సైబెరాబాద్ అనే ఒక సిటీని సృష్టించి, హైదరాబాద్ కే కాదు, ఏకంగా తెలంగాణా రాష్ట్రానికే గుండెకాయ చేసారు. కాని, అక్కడ వికృత రాజకీయ క్రీడలో, ఆయన పై ద్వేషం నింపేలా కుట్రలు చేసి, దాదాపుగా సఫలీకృతం అయ్యారు. ఇప్పుడు దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత మొదటి సారి, అక్కడ బహిరంగ సభలో పాల్గునటానికి చంద్రబాబు వెళ్తున్నారు. గత నెల రోజులుగా కేసీఆర్ చంద్రబాబుని తిడుతున్న బూతులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తెలంగాణా ప్రజలకు ఏం సందేశం ఇస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ప్రజాకూటమి విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 28న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

cbn 27112018 2

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రో.కోదండరాంతోపాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షు డు ఎల్‌ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు ఈ సభకు హాజరవుతున్నారు. ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. మధ్యాహ్నం 2.30 గం టల సమయంలో రాహుల్‌గాంధీ, చంద్రబాబు నాయుడు వేర్వేరు హెలీకాప్టర్లలో రాబోతున్నారు. సర్ధార్‌ పటేల్‌ స్టేడియంలో ల్యాండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

cbn 27112018 3

జాతీయస్థాయిలో బీజేపీయేతర లౌకిక శక్తులు ఏకమవుతున్న నేపథ్యంలో రాహుల్‌, చంద్రబాబు నాయుడు కలిసి మొదటి బహిరంగసభలో పాల్గొనబోతు న్నారు. ఉమ్మడి ఖమ్మంతోపాటు పొరుగున ఉన్న వరంగల్‌, నల్గొండ ఉమ్మడి జిల్లాల ప్రజలను కూడా ఈ సభకు భారీగా తరలించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ కోసం ప్రత్యేకంగా ఎక్కడా బహిరంగసభలు నిర్వహించలేదు. హైదరాబాద్‌లోనే పార్టీ సమావేశాలకు పరిమితమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో ప్రచారం చేశారు. హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఏ ఒక్క జిల్లాలోనూ చంద్రబాబు ప్రచారం చేయలేదు. ఖమ్మంలో మొదటిసారి చంద్రబాబు తెలంగాణ టీడీపీ కోసం బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల ప్రస్తావనతోపాటు తెలంగాణలో ప్రజాకూటమి పాత్ర గురిచి వివరించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్న నేపథ్యంలో.. చంద్రబాబు ప్రచారానికి వస్తుండడం ఆసక్తికరంగా మారింది.

Advertisements

Latest Articles

Most Read