మాట తప్పను, మడమ తిప్పను. ఇది జగన్ చెప్పే మాట. అలాగే నా మ్యనిఫెసో ఖురాన్, బైబుల్, భగవత్ గీత.. ఇలాంటి మాటలు చెప్పి, ప్రజలను నమ్మించి , జగన్ మోహన్ రెడ్డి మోసం చేసారు. పాదయాత్రలో డైరీలకు డైరీలు రాసి హామీలు ఇచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత, కేవలం ఒక కాగితమే తన మ్యానిఫెస్టో అని జగన్ చెప్తున్నారు. పోనీ ఆ ఒక పేజీ మ్యానిఫెస్టో అయినా జగన్ చేస్తున్నారా అంటే, అది కూడా మోసమే. ఇలాంటి ఒక అతి పెద్ద మోసం, ఇప్పుడు బయట పడింది. అది చూసి ప్రజలు కూడా జగన్ ఇంతటి మోసగాడా అని అనుకునే స్థాయి వరకు వెళ్ళింది. మద్య నిషేధం అని నవరత్నాలలో ఒక రాత్నంగా పెట్టిన జగన్, ఆ రత్నాన్ని నకిలీ రత్నం చేసి పడేసారు. మద్య నిషేధం కాదు, మా లిక్కర్ ఆదాయం డబుల్ అయ్యిందని చెప్పి, ఆ ఆదాయం చూపించి, ఏకంగా రూ.8 వేల కోట్ల అప్పు తెచ్చుకున్నారు. మద్య నిషేధం, మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి, ఆడ వాళ్ళను మోసం చేసి, మా రాష్ట్రంలో మేము మద్యం బాగా అమ్ముతాం, ఆ ఆదాయం చూసి, డబ్బులు ఇవ్వండి అంటూ, ఏకంగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు, దారుణమైన రోడ్డులు గురించి, ఏపిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే మన అద్భుతం గురించి పక్క రాష్ట్రాల వారికి కూడా తెలిసిపోతూ, మనల్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. నెల రోజుల క్రితం, కేటీఆర్ మన పరువు తీసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఉండదు, వాళ్లకు సరైన రోడ్డులు ఉండవు అంటూ హేళనగా మాట్లాడిన వీడియో పిచ్చ వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెలంగాణా నుంచి మరో మంత్రి, మన ఆంధ్రప్రదేశ్ ను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. గతంలో హరీష్ రావు, జగన్ మోహన్ రెడ్డి మోటార్లకు మీటర్లు పెట్టే విషయం పై, జగన్ ను హేళన చేస్తూ మాట్లాడే వారు. అయితే ఇప్పుడు హరీష్ రావు ఏపిలో రైతులకు కనీసం కరెంటు ఇవ్వటం లేదని చెప్పి, జగన్ పరువు తీసారు. ఈ మధ్య తాను తిరుమల కాలి నడకన వెళ్లానని, అక్కడ చాలా మంది ఆంధ్రప్రదేశ్ రైతులు, తమకు కరెంటు లేదని, కనీసం ఏడు గంటలు కూడా, ఒకే దఫాలో ఇవ్వటం లేదని, కరెంటు కోతలు ఉన్నాయని చెప్పారు అంటూ, ఆంధ్రప్రదేశ్ లో జగన్ అసమర్ధత గురించి తెలిపేలా చెప్పుకొచ్చారు.

గన్నవరంలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. అనూహ్యంగా ఇది ఒకే పార్టీలో జరుగుతున్న తంతు కావటం విశేషం. గన్నవరం ఎమ్మెల్యే వంశీ, తెలుగుదేశం పార్టీలో గెలిచి, కేసులు భయంతో, వైసీపీలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి అక్కడ అప్పటికే ఉన్న దుట్టా రామచంద్రరావు వర్గం, అలాగే యార్లగడ్డ వర్గం, వంశీ రాకను వ్యతిరేకిస్తూ, వంశీకి సహకరించకుండా వస్తున్నారు. ఈ మధ్య ఏమైందో, ఏమి భరోసా వచ్చిందో కానీ, వంశీ హడావిడి చేస్తున్నాడు. సొంత పార్టీ నేతల పైనే విమర్శలు చేస్తున్నాడు. అటు నుంచి దుట్టా, యార్లగడ్డ వర్గం కూడా తగ్గేది లేదని రెచ్చిపోతున్నారు. అధిష్టానం పిలిచి ఇరు వర్గాలకీ రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా, అది వర్క్ ఔట్ అవ్వలేదు. వ్యవహారం ముదిరి వార్నింగ్ లు ఇచ్చుకునే వరుకు వెళ్ళింది. పొలిటకల్ హీట్ వేడెక్కటంతో, వంశీకి భద్రత పెంచారు. గడప గడపకు కార్యక్రమంలో తిరిగే సమయంలో, వంశీకి 25 మంది పోలీసులతో ప్రత్యేక పహారా ఏర్పాటు చేసారు. అయితే ఎక్కడైనా ప్రత్యర్ధి పార్టీలు గొడవ పడితే ఇలాంటి సందర్భం ఉంటుంది, ఇక్కడ వెరైటీగా, వాళ్ళు వాళ్ళు కొట్టుకుని, ఇక్కడ వరకు వచ్చారు.

వాట్సాప్‌, ఈ రోజుల్లో అందరి చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ లో, కచ్చితంగా ఉండే యాప్. పేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టా, యూట్యూబ్ లాంటివి లేకపోయినా, వాట్సాప్‌ మాత్రం అందరి వద్దా ఉంటుంది. పల్లెటూరుల్లో కూడా, ప్రతి ఒక్కరి ఇది వాడుతూ ఉంటారు. రాజకీయ పార్టీలు కూడా దీన్ని వాడుతూ ఉంటాయి కానీ, చాలా పరిమితంగా వాడతాయి. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఒక అద్భుతమైన ప్లాన్ వచ్చింది. వాట్సాప్‌ తో ఒప్పందం చేసుకుని, తమ ప్రభుత్వ సంక్షేమ పధకాలు, మరింతగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలని ప్లాన్ వేసి, వాట్సాప్‌ తో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరి ఫోన్ కైనా, జగన్ ఏ మెసేజ్ అయినా, వీడియో అయినా, పంపించవచ్చు. ఒకేసారి కోటి మందికి అయినా పంపించే వీలు ఉంటుంది. అయితే ఈ ఒప్పందం పై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్తున్నాయి. దీని వెనుక కుట్ర ఉందని, ప్రభుత్వం పేరుతో రాజకీయ ప్రచారం చేసుకుంటారని, ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనల్లో కూడా ప్రతిపక్షాలను, మీడియాను తిడుతూ ఇస్తున్న ప్రకటనలు గుర్తు చేస్తున్నారు. తమ పార్టీ లాభం కోసం వాట్సాప్‌ వాడే కుట్ర జగన్ మోహన్ రెడ్డి పన్నారని, దీని పై న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read