వైఎస్ వివేక కేసులో, గత రెండు రోజులుగా సిబిఐ వేగం పెంచింది. గత కొన్ని రోజులుగా సిబిఐ విచారణ మందగించింది. అయితే, గత రెండు రోజులుగా మళ్ళీ సిబిఐ విచారణ మొదలు అయ్యింది. ఈ సారి సిబిఐ వేగంగా పావులు కదుపుతుంది. ఈ రోజు సిబిఐ బృందాలు కడప నుంచి పులివెందుల వెళ్ళాయి. అయితే ఇది రొటీన్ విచారణ అని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా ఈ రోజు సిబిఐ, జగన మోహన్ రెడ్డి ఇంటికి, వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి పరిశీలన చేయటంతో, అందరూ షాక్ తిన్నారు. ముందుగా పులివెందులలో వైఏ వివేకా ఇంటిని సిబిఐ పరిశీలించింది. ఒక సర్వేయర్ ని కూడా సిబిఐ వెంట తీసుకుని వెళ్ళింది. అక్కడ ఫోటోలు, వీడియోలు తీసిన సిబిఐ, అక్కడ నుంచి అనూహ్యంగా జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళింది. అది జగన్ మోహన్ రెడ్డి అధికారిక క్యాంప్ కార్యాలయం కూడా. తరువాత ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. మొత్తంగా జగన్ మోహన్ రెడ్డి ఇంటికి, అవినాష్ రెడ్డి ఇంటిని కూడా సిబిఐ కొలతలు వేసి, అలాగే వీడియో రికార్డింగ్ కూడా చేసింది. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి ఇంటిని కూడా ఇప్పుడు సిబిఐ విచారణలోకి తీసుకోవటం, ఎవరికీ అంతు పట్టటం లేదు. ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు వస్తాయో, అవి బయట పడతాయో లేదో చూడాలి మరి.
news
కేవలం రూ.5 లక్షల కోసం, ఫూల్ అయిన జగన్... వైరల్ అవుతున్న వీడియో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అప్పుల్లో, ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందో తెలిసిందే. ప్రతి వారం ఆర్బిఐ దగ్గర అప్పులకు వెళ్ళటం, అలాగే వివిధ ఖాతాల్లో ఉన్న డబ్బులు మళ్లించటం, కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులు లాగేయటం, ఇలా రకరకాల విన్యాసాలు ప్రభుత్వం చేస్తుంది. అయితే సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటి వచ్చింది. ఇప్పటికే పీకలు లోతు కష్టాల్లో ఉన్న ప్రభుత్వం, చాలా మంది కాంట్రాక్టర్ లకు బిల్లు చెల్లించటం లేదు. వారు మొత్తం, కోర్టులకు వెళ్ళటం, కోర్టులు ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేయటం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ కష్టాలు నుంచి బయటకు రావటానికి, ప్రభుత్వం ఒక ఎత్తు వేసింది. అయితే అది రివర్స్ అయి, జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసి, జగన్ నే ఫూల్ ని చేసింది. బాపట్ల జలవనరుల శాఖ ఒక టెండర్ విడుదల చేస్తూ, మేము డబ్బులు ఉన్నప్పుడే ఇస్తాం, కోర్టుకు వెళ్ళకూడదు అని ఒక షరతు పెట్టింది. అయితే, దీని గురించి టిడిపి అధికార ప్రతినిధి వివరిస్తూ చెప్పిన వీడియో వైరల్ అవ్వటంతో, జగన్ నవ్వుల పాలు అయ్యారు. ఆ వీడియోలో చెప్పింది ఏంటి అంటే, ఆ టెండర్ పిలిచింది, గడ్డి పీకటం కోసం, అది కేవలం రూ.5 లక్షల టెండర్. అంటే రూ.5 లక్షలకు ప్రభుత్వం ఎలా ఇబ్బంది పడుతుందో తెలుస్తుంది. అయితే ఆ రూ.5 లక్షల కోసం చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ జగన్ పరువు పోయింది.
10thలో అంత మంది ఫెయిల్ అవ్వటానికి కారణం, చంద్రబాబు అంట... మైండ్ ఉందా విజయసాయి ?
నిన్న ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా, గత 20 ఏళ్ళలో లేని విధంగా, దారుణంగా పాస్ పెర్సెంటేజ్ పడిపోయింది. దీని పైన జగన్ మోహన్ రెడ్డి పై అనేక విమర్శలు వస్తున్నాయి. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి అని విమర్శలు వస్తున్నాయి. కొత్త టీచర్లను తీసుకోకపోవటం, ఉన్న టీచర్లను మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేయటం, విద్యా ప్రమాణాలు పెంచకుండా, రంగులు వేయటం పైనే శ్రద్ధ పెట్టటం, ఇలా అనేక కారణాలు, దీనికి కారణం అయ్యాయి. అయితే ప్రభుత్వం, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోకుండా, పదవ తరగతి ఫలితాలు అలా రావటానికి చంద్రబాబు కారణం అంటూ టిడిపి మీద తోసేసింది. విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ, నారాయణ స్కూల్ లో పేపర్ లీక్ చేసి, టిడిపి రాద్ధాంతం చేయటం వల్లే, పిల్లలు ఒత్తిడికే లోనయి, 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు అంటూ, విజయసాయి రెడ్డి చెప్పిన కారణంతో అందరూ అవాక్కయ్యారు. అసలు విజయసాయి రెడ్డికి మైండ్ పని చేస్తుందా లేదా అని కామెంట్లు పెడుతున్నారు.
ఈ రోజు జగన్ గుంటూరు సభకు, జనాలను తోలుకుపోవటానికి, వైసీపీ పాట్లు..
ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ వాహన సేవ మిత్రా పధకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అయితే గత జగన్ మోహన్ రెడ్డి మీటింగ్లలో ప్రజలు లేక పోవటం, వచ్చిన జనాలు కూడా గేట్లు తోసేసి మారీ పారిపోవటం, అలాగే మొన్న జరిగిన మంత్రులు బస్సు యాత్రలో కూడా ప్రజలు లేకపోవటంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలెర్ట్ అయ్యింది. గతంలో వీడియోలు, ఫోటోలు వైరల్ అవ్వటంతో, ఇప్పుడు మళ్ళీ వైసీపీ అలెర్ట్ అయ్యింది. గుంటూరు జగన్ సభకు, భారీ జన సమీకరణ చేయటానికి, అధికారాన్ని వాడుకుంటుంది వైసీపీ. గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న డ్వాక్రా మహిళలను తోలుకు రావటానికి, అధికారులకు టార్గెట్ పెట్టారు. ఒక్కో అధికారి 500 నుంచి వెయ్యి మంది వరకు, తోలుకు రావాలి అనేది టార్గెట్. దీనికి సంబంధించి, ఆడియోలు వైరల్ అయ్యాయి. టార్గెట్ పెట్టి మరీ, డ్వాక్రా మహిళలను తోలుకు రావాలని టార్గెట్ పెడుతూ, ఒక వేళ తీసుకుని రాకపోతే చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అలాగే జగన్ గుంటూరు పర్యటన నేపధ్యంలో, మొత్తం రోడ్డు బ్లాక్ చేసి, బ్యారికేడ్ లు పెట్టారు.