ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను మార్చేస్తున్నాం, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచమే తమ వైపు చూస్తుంది అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన డబ్బా అంతా తప్పు అని తేలిపోయింది. నాడు-నేడు, ఫీజు రీయింబర్స్-మెంట్, విద్యా దీవెన, చిక్కీ, ఇంగ్లీష్ మీడియం అంటూ ఊదరగొట్టారు. అయితే సరిగ్గా ఇక్కడే, అసలు బండారం బయట పడింది. ఈ రోజు పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఆ ఫలితాలు చూసి షాక్ అయ్యారు ఏపి ప్రజలు. గత 15 ఏళ్ళుగా 90 శాతం పైగా ఉత్తీర్ణత వచ్చింది. చంద్రబాబు హాయంలో కూడా 4.48 శాతం ఉత్తీర్ణత ఉండేది.. అయితే ఇప్పుడు జగన్ రెడ్డి హయాంలో 67.26 శాతానికి పడిపోయింది. 6.22 లక్షల మంది పరీక్షలు రాస్తే, 4,14,281 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన మొదటి రెండేళ్ళు కరోనాతో, అందరినీ పాస్ చేసారు. ఇప్పుడు పరీక్షలు పెడితే పరిస్థితి ఇది. నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో, నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. ఆ దిగజారిన ర్యాంకింగ్స్ చూస్తేనే, ఇప్పుడు ఏపి పరిస్థితి ఇలా ఎందుకు అయ్యిందో అర్ధం అవుతుంది. ఇప్పటికైనా అనవసర ఆర్భాటాలు కాకుండా, ప్రభుత్వం ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని, విశ్లేషణ చేసి, తప్పు సరిదిద్దుకోవాలి.
news
విజయవాడ వచ్చిన జేపీ నడ్డా.. నడ్డా ప్రసంగం విని, జనసేన శ్రేణులు షాక్...
ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈ రోజు విజయవాడలో బీజేపీ శ్రేణులతో, దాదాపుగా గంట సేపు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ భవిష్యత్తు వ్యూహాల పై చర్చించారు. అయితే గంట సేపు మాట్లాడిన జేపీ నడ్డా, జనసేన నేతలకు, పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితమే, పవన్ కళ్యాణ్ పొత్తులు గురించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటు వంటి, ఎన్నికల్లో ఏ విధంగా పొత్తులు ఉంటాయి అనేది స్పష్టం చేస్తూ, బీజేపీతోనే తమ ప్రయాణం అని చెప్పారు. అలాగే జనసేన నేతలకు కూడా, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ ని ప్రకటించాలని కోరారు. అయితే ఈ రోజు విజయవాడలో బీజేపీ భవిష్యత్తు వ్యూహం పై , జేపీ నడ్డా, జనసేనతో పొత్తు విషయం పై బీజేపీ శ్రేణులకు స్పష్టం చేస్తారని అందరూ భావించారు. అయితే గంట పాటు మాట్లాడిన నడ్డా, జనసేన ప్రస్తావన చేయలేదు. కనీసం పవన్ కళ్యాణ్ పేరు కూడా తలవలేదు. జనసేన-బీజేపీ పొత్తు గురించి ఎక్కడా మాట్లాడక పోవటంతో, జనసేన శ్రేణులు షాక్ తిన్నాయి. పవన్ సియం అభ్యర్ధిత్వం కాకపోయినా, పొత్తు గురించి అయినా నడ్డా మాట్లాడతారని చెప్పినా, నడ్డా మాత్రం, ఎక్కడా కనీసం పవన్ కళ్యాణ్ పేరు గురించి కూడా ప్రస్తావన చేయకపోవటంతో, జనసేన శ్రేణులు షాక్ తిన్నాయి.
ఒక మంత్రిగా ఉంటూ, తాడేపల్లి ప్యాలెస్ లో చేసిన ఫేక్ ట్వీట్ వేసి, ఏమి తెలియనట్టు డిలీట్ చేసావా అని అడుగుతున్నాడు. సిగ్గు వదిలేసి, మంత్రులే ఫేక్ చేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చేసే ఫేక్ అందరికీ తెలిసిందే. ఫేక్ పునాదుల మీద పుట్టి, ఫేక్ చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇలా ఫేక్ చేయటానికి , పేటీయం బ్యాచ్ ని పెట్టుకుని, సోషల్ మీడియాలో బ్రతికేస్తూ ఉంటుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసి చూపించటం, ఈ పేటీయం బ్యాచ్ స్పెషల్. వీళ్ళకు డైరెక్ట్ రాజకీయం చేయటం రాదు. అసలు వీళ్ళు ఏమైనా చేస్తే కదా చెప్పుకోవటానికి, అందుకే వేరే వాళ్ళ పైన కూడా ఫేక్ చేసి, మాతో పాటు వాళ్ళు కూడా పనికి మాలిన వాళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. మొన్నటి వరకు ఈ ఫేక్ లను ఈ పేటీయం బ్యాచ్ చేసే వాళ్ళు, అయితే ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మకపోవటంతో, ఇలా ఫేక్ చేయటానికి మంత్రులు కూడా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ పొత్తుల పై చేసిన వ్యాఖ్యల పై, దేవినేని ఉమా, పవన్ ని తిట్టినట్టుగా ఓక ఫేక్ క్రియేట్ చేసి, అంబటి ట్వీట్ చేసి, దేవినేని ఉమా ఈ ట్వీట్ వేసాడు అని, పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. అది మార్ఫింగ్. దీంతో తెలుగుదేశం పార్టీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. అయ్యన్నపాత్రుడు, ట్వీట్ చేస్తూ అంబటిని తిట్టారు. టిడిపి ఆఫిషియల్ పేజిలో కూడా తిట్టారు. అంబటి మాత్రం, సిగ్గు లేకుండా, ఇంకా ఆ ట్వీట్ ఇప్పటికీ అలాగే ఉంచారు. మంత్రులే ఫేక్ చేస్తుంటే, ఏమి చేస్తాం ?
అమిత్ షా తో, జగన్ చర్చలు లీక్... ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారిన జగన్ కోరిక...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. మరో రెండేళ్ళు ఎన్నికలకు ఉన్నా, ఇప్పటి నుంచే హీట్ పెరిగింది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో ఫెయిల్ అవ్వటం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటం, అలాగే అప్పులకు కూడా జగన్ ఇబ్బంది పడుతూ ఉండటంతో, జగన్ పూర్తిగా చేతులు ఎత్తేసారు. కేవలం మీడియాతో, సోషల్ మీడియాతో షో చేస్తూ వస్తున్నారు. ప్రజలు కూడా జగన్ ఎప్పుడు దిగిపోతారా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, ముందస్తు ఎన్నికల వార్తలు జోరు అందుకున్నాయి. ముందస్తు ఎన్నికలు మరో ఏడాదిలో వచ్చేస్తాయని, ఈ విధంగా చేస్తే ప్రజా వ్యతిరేకత కొంత తప్పించుకోవచ్చని జగన్ ప్లాన్. ఇదే విషయం పై గత వారం ఢిల్లీ పర్యటనలో, అమిత్ షా ని కలిసిన సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డి అడిగారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తాము ముందస్తు ఎన్నికలకు వెళ్తామని, జగన్ అమిత్ షాని కోరినట్టు తెలుస్తుంది. ముందస్తు ఎన్నికలకు సహకారం అందించాలని అమిత్ షా ని కోరారట. ఇదే విషయం అమిత్ షా మరో కేంద్ర మంత్రి దగ్గర ప్రస్తావించగా, ఆ కేంద్ర మంత్రి ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలను అడగటం, ఆ ఎంపీలు బయటకు చెప్పటంతో, జగన్ ముందస్తు ప్లాన్ నిజమే అని, ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది