ఆంధ్రప్రదేశ్ రాజాధాని అమరావతిలో నూతనంగా నిర్మిస్తున్న హైకోర్టు భవనాలను జనవరి ఒకటో తేదీ నాటికల్లా సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని పర్యటనకు వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, ఇతర న్యాయమూర్తులను విజయవాడలోని హోటల్ గేట్‌వేలో ముఖ్యమంత్రి, మంత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చంద్రబాబు విలేఖరులతో మాట్లాడుతూ శాశ్వత సచివాలయం ఎదురుగా నిర్మించే ఐకానిక్ టవర్‌లో చేపట్టిన హైకోర్టు భవన నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు నోటిఫికేషన్ జారీచేస్తే హైకోర్టును హైదరాబాద్ నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీజే వివరించారని తెలిపారు.

highcourt 19112018 2

నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు సీఆర్డీఏ అధికారులు హైకోర్టు జడ్జిలు, సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, తదితరులతో సంప్రదింపులు జరుపుతూ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ముందుగా జిల్లా కోర్టు భవన నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. క్వార్టర్లను ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నివాస భవనాల పట్ల న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్రంలో సీబీఐ తనిఖీలకు ప్రభుత్వ అనుమతి కోరాల్సి రావటంపై విలేఖరులు ప్రస్తావించగా దేశంలో ఎన్నడూ లేనివిధంగా సీబీఐ భ్రష్టుపట్టిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

highcourt 19112018 3

అలాంటప్పుడు రాష్ట్ర అధికారాలను ఆ సంస్థకు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. సీబీఐ కంటే రాష్ట్రంలో మన వ్యవస్థల పనితీరే మెరుగ్గా ఉందని కితాబిచ్చారు. ఏసీబీ, తదితర సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల అధికారాలను కేంద్రానికి ఎలా అప్పగిస్తామని ఆయన ప్రశ్నించారు. సీబీఐ అధికారుల మధ్య గొడవలతో పాటు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చారన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయని, అవన్నీ తేలాల్సి ఉందన్నారు. మన రాష్ట్రంలో వ్యవస్థలే బెటర్‌గా ఉన్నప్పుడు మనవాటిని మనమే ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే సీబీఐకి అనుమతిని రద్దు చేశామన్నారు.

జాతీయ స్థాయిలో బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. బీజేపీ యేతర పార్టీలతో ఏర్పాటు కానున్న ప్రత్యామ్నాయ పొత్తుల పై చంద్రబాబు, మమతా బెనర్జీ సమాలోచనలు జరపనున్నారు. ఇందులోభాగంగా ఇప్పటికే ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు కుమారస్వామి, విజయన్, జమ్మూకాశ్మీర్‌లోని నేషనల్ ఫ్రంట్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే అధినేత స్టాలిన్, జేడీయూ అధినేత శరద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి, తదితరులతో కీలక సమావేశాలు నిర్వహించి ఎన్డీఏ అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రాల అధికారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు, తదితర అంశాలపై బాబు చర్చించారు.

cbn 19112018 2

అయితే తాజాగా సిబిఐ కి నో ఎంట్రీ పై, చంద్రబాబు నిర్నయం తీసుకోవటం, వెంటనే మమత కూడా తమ రాష్ట్రంలో అదే నిర్ణయం తీసుకోవటంతో, ఈ భేటీ పై మరింత ఫోకస్ వచ్చింది. జాతీయ మీడియా కూడా, ఇరువురి భేటీ పై ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇద్దరూ కలిసి సిబిఐ పై, ఇతర కేంద్ర సంస్థల పై ఎలాంటి నిర్ణయం చెప్తారో అని మీడియా కూడా ఎదురు చూస్తుంది. మమతతో భేటీ అనంతరం జనవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరోసారి కేంద్రంపై ప్రచ్ఛన్న పోరాటానికి ఇప్పటికే ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే పార్లమెంట్ చివరి సమావేశాలు కానున్నందున బీజేపీ యేతర పార్టీల మద్దతు కూడగట్టి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హక్కుల అంశాలపై కేంద్రాన్ని ఆయన ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు. దీనికితోడు రాష్ట్రాలకు ఉన్న అధికారాలు, విధులను తిరగేస్తున్నారు.

cbn 19112018 3

కాగా మమతతో బాబు భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయం, ఐదు రాష్ట్రాల్లో జగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ యేతర పక్షాల విజయావకాశాలు, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీపై వ్యతిరేక పవనాలు, తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నట్లు తెలిసింది. తెలంగాణలో సోమవారంతో నామినేషన్ల ఘట్టం ముగియనున్న నేపథ్యంలో ఒకవైపు రాష్ట్రంలో పొత్తులు, అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చిస్తూనే, మరోవైపు జాతీయ స్థాయి నేతలతో వరుస భేటీలు నిర్వహించాలనే యోచనతో చంద్రబాబు ముందుకెళుతున్నారు.

తెలంగాణాలో ఎన్నికల జరుగుతంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్. అసలు ఇప్పటి వరకు చంద్రబాబు తెలంగాణా ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు కదా, అసలు హైదరాబాద్ లోనే అడుగు పెట్టలేదు కదా, అయినా ఎందుకు ఫిర్యాదు చేసరానుకుంటున్నారా ? ఇక్కడే ఉండండి అసలు విషయం. చంద్రబాబు పేరు చెప్తే చాలు కేసీఆర్ వణికి పోతున్నాడు. చంద్రబాబు అంటే ఎదో అనుకుని, అది ఒక పార్టీనా, దానికి 0.01 శాతం ఓట్లు కూడా లేవు, అలాంటి పార్టీ గురించి మాకెందుకు అంటూ, చెప్పిన కేసీఆర్, చంద్రబాబు రోజుకి ఒక దెబ్బ తీస్తుంటే, తట్టుకోలేక, కక్కలేక మింగలేక, ఇబ్బంది పడుతున్నారు. ఆ చిరాకులో, పబ్లిక్ మీటింగ్లలోనే బూతులు తిడుతున్నాడు.

ec 18112018 2

మరి కంప్లైంట్ ఇచ్చి, ఎన్నికల కమిషన్ ఆక్షన్ తెస్సుకోవాల్సింది, ఇలా బూతులు తిట్టే వారి మీద కాని, తన పని తాను చేసుకు పోతున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కాదు కాదా. ఇంతకీ టీఆర్ఎస్ భయం ఏంటో తెలుసా ? చంద్రబాబు తెలుగు చానల్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ప్రకటనలు ఇస్తున్నారంట. ఆయన ఇచ్చుకుంటే వీళ్ళకు వచ్చిన బాధ ఏంటో మరి ? మా పోటీ గుజరాత్ లాంటి రాష్ట్రాలతో కాని, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రమా మాతో పోటీకి అన్న కేసీఆర్, ఇప్పుడు ఎందుకు ఏపి అంటే అంత బాధ పడుతున్నారో మరి. తన ఎంపీ వినోద్ కుమార్ చేత ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేపించారు. చంద్రబాబు పార్టీ ఇక్కడ కూడా పోటీ చేస్తున్నందన ఆ ప్రకటనలను నిలువరించాలని ఈసీని కోరారు.

ec 18112018 3

అయితే, మనకు ఉన్న చానల్స్ అన్నీ రెండు రాష్ట్రాల్లో వస్తాయి. దాన్ని ఎలా నిలువరిస్తారు ? ఎవరి రాష్ట్ర ప్రగతి గురించి, సంక్షేమం గురించి వాళ్ళు వేసుకుంటారు. ఇక్కడ తెరాస బాధ ఏంటి అంటే, ఇక్కడ చంద్రబాబు 5 లక్షల ఇల్లు కట్టి అవి చూపిస్తున్నాడు, మరి తెలంగాణా ప్రజలు మా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏవి అంటే ఏమి చెప్తాడు ? అందుకని భయం... ఇక్కడ చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందేలా చేస్తున్నారు, మరి ఇవన్నీ నువ్వు ఎందుకు చెయ్యటం లేదని తెలంగాణా ప్రజలు అడుగుతారని కేసీఆర్ భయం. ఇప్పటికే వాళ్ళ పార్టీ అభ్యర్ధులు కనిపిస్తే చాలు, నువ్వు ఏమి చేసావని నీకు ఓట్లు వెయ్యాలి అని తరిమి తరిమి కొడుతున్నారు తెలంగాణా ప్రజలు, మళ్ళీ ఇక్కడ చంద్రబాబు అన్నీ చేసేస్తున్నాడని తెలంగాణా ప్రజలకు తెలిస్తే, ఎక్కడ ఇబ్బందో అని, ఏపి ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి, ఎన్నికలు అయ్యేదాకా చూపించ వద్దు అని ఫిర్యాదు చేసారు.

రయ్యిరయ్యిమంటూ.. రెక్కలు విప్పుకొంటూ... పడుతూ లేస్తూ.. ఓసారి ఉన్న పళంగా నీటిలోకి ప్రవేశిస్తూ.. మరోసారి హఠాత్తుగా పైకి ఎగురుతూ.. అబ్బో.. ఆశ్చర్యపోయే ఎన్నో రకాల విన్యాసాలకు కృష్ణాతీరం వేదికైంది. స్పీడ్‌ బోట్లలోని పవర్‌ను చూపిస్తూ.. గాలితో పోటీపడుతూ.. మునుపెన్నడూ ప్రత్యక్షంగా తిలకించని జల అద్భుతాలను కళ్ల ముందు ఆవిష్కరించింది. తొమ్మిది దేశాలకు చెందిన రేసర్లు.. 250 కిలోమీటర్ల స్పీడ్‌ బోట్లలో దూసుకెళ్తుంటే.. అలలు అలాఅలా ఎగసిపడగా, కృష్ణాజలమే కాదు.. ఒడ్డున ఉన్న జనం కూడా పులకించిపోయారు. మూడు రోజులపాటు ఫ్‌1హెచ్‌2వో పవర్‌ బోటింగ్‌ రేసుల అమరావతి వాసులని అలరించాయి. మోతెక్కిపోయే మోటార్‌ సౌండ్‌తో.. 250 కిలోమీటర్ల వేగంతో నీళ్లల్లో దూసుకుపోతున్న పవర్‌ బోట్లను చూడటానికి రెండు కళ్లు చాల్లేదు.

manoj 18112018 2

అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే, లక్షల మంది ప్రజలతో పాటు, విపక్ష నాయకులు కూడా ఈ బోటు రేస్ ఎంజాయ్ చేసారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శలు చేసిన పలువురు నేతలు కూడా రేసులకు మైమరచిపోయారు. ఘాట్ల వద్ద మెట్లపైనే కూర్చుని రేసర్ల మెరుపు వేగాన్ని ఆస్వాదించారు. సీపీఐ కార్పొరేటర్‌ గాదె ఆదిలక్ష్మి, మంగళగిరిలో నివాసముంటున్న పలువు రు నాన్‌ పొలిటికల్‌ జేఏసీ నేతలు కూడా రేసుల మజాను కాదనలేకపోయారు. తిరిగివెళ్తూ వారివారి ఆనందాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలను నగరానికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సఫలీకృతుడయ్యారని, ప్రతిభను ఒప్పుకోవడంలో తప్పులేదని అభినందించారు.

manoj 18112018 3

ఈ రోజు జరిగిన ఫైనల్స్ తరువాత చంద్రబాబు విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయాన మాట్లాడుతూ, జల క్రీడలకు సంబంధించి ప్రకాశం బ్యారేజీ అద్భుతమైన ప్రాంతంగా అభివర్ణించారు. అందుకే ఇక్కడ ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. విజయవాడ వేదికగా అద్భుతమైన కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన రాష్ట్ర పర్యాటక శాఖను అభినందించారు. పోటీల నిర్వహణ ద్వారా అమరావతి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియజెప్పామని సీఎం వ్యాఖ్యానించారు. ఫార్ములా1 పోటీలు ఇక నుంచి ఏటా విజయవాడలో నిర్వహించాలని ఫార్ములా1 హెచ్2వో సంస్థను కోరారు. అద్భుతమైన నదీ తీరం, సుందరమైన ప్రకృతి మన సొంతమని చంద్రబాబు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read