ప్రధాని నరేంద్ర మోదీ ప్రవర్తన దేశంలో అనేక సమస్యలకు దారి తీసిందని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. మోదీ, అమిత్‌షా ఇద్దరూ కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. గహ్లోత్‌తో భేటీలో దేశ రాజకీయాలతో పాటు తమ ఉమ్మడి అజెండాను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై కీలకంగా చర్చించారు. శనివారం సాయంత్రం అమరావతిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌తో భేటీ అనంతరం వారిద్దరూ కలిసి సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. తొలుత చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీబీఐ, ఈడీ వంటి వ్యవస్థలు నిబంధనల్ని పాటించడంలేదన్నారు.

asudddin 10112018 2

ప్రమాదంలో పడిన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను కాపాడి వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి నాయకులపై ఉందన్నారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ అవినీతిలో కూరుకుపోయే పరిస్థతి ఏర్పడిందని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాదే బాధ్యతన్నారు. ఆర్బీఐ కూడా స్వయంప్రతిపత్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈడీ, ఐటీ వ్యవస్థలను ప్రత్యర్థులపై కక్షసాధింపులకు, రాజకీయ లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్ద నోట్ల రద్దుతో సాధించిందేమీ లేదన్నారు. నోట్ల రద్దును స్వార్థం కోసమే చేశారు కాబట్టే ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బుల కోసం ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన దారుణపరిస్థితి ఏర్పడిందన్నారు.

asudddin 10112018 3

దేశంలో ఇప్పుడు రెండే కూటములు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఒకటి బీజేపీ అనుకూల కూటమి అయితే.. రెండోది బీజేపీ వ్యతిరేక కూటమి అని పేర్కొన్నారు. ఎవరు ఏ కూటమిలో ఉంటారో పార్టీలు ఆలోచించుకోవాలన్నారు. కలిసి నడుద్దామని కేసీఆర్‌ను కోరినా.. ముందుకు రాలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏ కూటమిలో ఉంటుందో తేల్చుకోవాలన్నారు. తమతో చేతులు కలుపుతారో, లేదో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయించుకోవాలని అన్నారు. మహాకూటమిలో చేరని పార్టీలన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నట్టేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో అన్ని పార్టీలతో సమావేశమై.. ప్రతి అంశంపై చర్చిస్తామన్నారు. అప్పుడే కూటమిపై స్పష్టత వస్తుందన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే రాజకీయంగా కలిసి నడవడం కుదరదని అన్నారు.

అసెంబ్లీకి రాడు.. పార్లమెంట్ కు పంపించడు.. ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యమంటే, నేను సియం అయిపోతున్నాను, అప్పుడు చేస్తున్ను అంటాడు.. పాదయాత్ర అంటూ సంవత్సరం నుంచి సాగ దీస్తూ, శుక్రవారం కోర్ట్ కి పోయి, ఒక రోజు రెస్ట్ తీసుకుని, ఎదో అలా అలా టైం సాగదీస్తూ, కాలం గడుపుతున్న జగన్ మోహన్ రెడ్డికి, ప్రజలలో పూర్తిగా సానుకూలత పోయింది. జగన్ కు ఉన్న ఒకే ఒక్క అర్హత, వైఎస్ఆర్ కొడుకుగా గుర్తింపు.. 2014లోనే ఆ సెంటిమెంట్ పోయింది. 2014 నుంచి ప్రతిపక్ష నేతగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ప్రజల సమస్యలతో ఏ మాత్రం సంబంధాలు లేకుండా, తాను చెయ్యాలి అనుకున్న పాదయాత్ర చేస్తూ, వెళ్ళిపోతున్నాడు. చివరకు తుఫాను లాంటి విపత్తులు వచ్చినా, అటు వైపు తొంగి చూడటం లేదు.

jagana 10112018 2

సొంత మీడియాలో డబ్బా కొట్టుడు తప్ప, ఎక్కడా జగన్ టాపిక్ అనే మాటే లేదు. బీజేపీకి పూర్తిగా సరెండర్ అవ్వటం, కేసుల కోసం, విజయసాయి రెడ్డి చేత ఊడిగం చేపియ్యటం, అమిత్ షా ఏది ఆడమంటే, అది ఆడటంతో, ప్రజల్లో మరీ పలుచన అయిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ కొంచెం ఆక్టివ్ అయిన తరువాత, మరీ సోయలో కూడా లేకుండా పోయాడు. దీంతో జగన్ మోహన్ రెడ్డి కోడి కత్తి డ్రామాకు తెర లేపాడు. అది కూడా పెద్ద ఫ్లాప్ షో అయ్యింది. రెండు రోజుల మాట్లాడుకున్న ప్రజలు, జగన్ మోహన్ రెడ్డి డ్రామాలు అర్ధమై పోయి, కోడి కత్తి గురించి పట్టించుకోవటం కూడా మానేశారు. చివరకు కోడి కత్తితో గుచ్చించుకున్నా, పాపం జగన్ మోహన్ రెడ్డికి, రావాల్సిన మైలేజి రాలేదు.

jagana 10112018 3

దీంతో ఇప్పుడు జగన మోహన్ రెడ్డి ఫ్యామిలీ డ్రామాకు తెర లేపారు. 2012లో తన అరెస్ట్ జరిగినప్పుడు నుంచి, తను బెయిల్ మీద బయటకు వచ్చే దాకా, ఎలాంటి ఫ్యామిలీ డ్రామా నడిచిందో, ఇప్పుడు మళ్ళీ అలాంటి డ్రామాకు తెర లేపారు. వైఎస్ జగన్ తల్లి, విజయమ్మ రేపు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. జగన్ పై కోడి కత్తి దాడి, తరువాత టిడిపి నాయకులు చేసిన ర్యాగింగ్ సహా పలు అంశాల పై విజయమ్మ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మిగతా కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి, చివరకు తన ఇంట్లో వాళ్ళ చేత, మళ్ళీ 4 ఏళ్ళ తరువాత రాజకీయాలు మాట్లాడించనున్నారు. చంద్రబాబు పై విమర్శలు, కొడుకు పై సెంటిమెంట్ పిండించే డైలాగులతో, ఆదివారం పూట విజయమ్మ టీవీల ముందు ప్రత్యక్షం కానున్నారు. పాపం, జగన్ వేసిన ఈ ఐడియా అయినా వర్క్ అవుట్ అవుతుందో లేదో..

బీజేపీ పై యుద్ధం ప్రకటించారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. జాతీయ స్థాయిలో దూకుడు పెంచుతూ.. బీజేపీయేతర పార్టీల కూటమి కట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నెల రోజులుగా రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన టీడీపీ అధినేత.. ఒక్కో పార్టీని యాంటీ బీజేపీ ట్రాక్‌పైకి తీసుకొస్తున్నారు. దీంతో నెల రోజులుగా చంద్రబాబు సోషల్ మీడియా ఫాలోయింగ్ తెగ పెరిగిపోతోందంట. ముఖ్యంగా కూటమి ప్రయత్నాలు ప్రారంభించాక ఫాలోయింగ్ పెరిగిపోయింది. గత నెల రోజులుగా 18వేలమంది కొత్తగా చంద్రబాబు ట్విట్టర్అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు.

aadhar 26092018 3

ఇక ఫేస్‌బుక్ విషయానికొస్తే.. 90వేలమంది కొత్త ఫాలోవర్లు. చంద్రబాబుకు (@ncbn)కు మొత్తంగా.. ట్విట్టర్‌లో 4.08మిలియన్ల ఫాలోవర్లు.. ఫేస్‌బుక్‌లో 14,87,189మంది నెటిజన్లు ఉన్నారు. సీఎం హోదాలో ఉన్న బాబు (@APCMO) ఫేస్‌బుక్ అకౌంట్‌ను 1,88,940మంది ఫాలోవర్లు.. ట్విట్టర్ ఖాతాను 4,09,866మంది ఫాలో అవుతున్నారు. అది కూడా.. చంద్రబాబు యాంటీ బీజేపీ కూటమి ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుంచి.. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందంటున్నారు సీఎంవో అధికారులు.

aadhar 26092018 3

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2009 నుంచి చంద్రబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ ఏడాది జూన్ నాటికి ట్విట్టర్ ఫాలోవర్లు సంఖ్య 4 మిలియన్లకు చేరగా.. ఇప్పుడు అది 4.08మిలియన్లకు పెరిగింది. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ట్విట్టర్‌లో 4 మిలియన్ ఫాలోవర్లు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. తనకు మద్దతు తెలుపుతూ.. సూచనలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు తన ట్విట్టర్‌లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను తెలుగులో ట్వీట్ చేస్తున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేసేప్పుడు మాత్రం ఇంగ్లీష్‌ ఉపయోగిస్తున్నారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురించి తెలియని వారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ల అక్రమ ఆస్థుల కేసులు విచారించిన వ్యక్తిగా మంచి పేరు ఉంది. సిబిఐలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని, ప్రస్తుతం రాజకీయాల వైపు నడుస్తున్న లక్ష్మీనారాయణ, ఏబీఎస్ ఛానల్ లో, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే, సీబీఐ విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తే పరిస్థితి నెలకొందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి లపై నమోదయిన కేసులను విచారించేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదని వెల్లడించారు.

abn 10112018 2

ఈ రెండు కేసుల విచారణతో తన ఇమేజ్ అమాంతం పెరిగిందని వ్యాఖ్యానించారు. తన అసలు పేరు వీవీ లక్ష్మీ నారాయణ కన్నా జేడీ లక్ష్మీ నారాయణగానే తాను ఎక్కువ ఫేమస్ అయ్యానని పేర్కొన్నారు. రహస్యంగా బెయిల్ కోసం తనకు డబ్బు ఆఫర్ చేసేంత ధైర్యం జగన్, గాలి జనార్ధనరెడ్డికి లేదని లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయాలతో ముడిపడిఉన్న ఈ కేసుల విచారణ సందర్భంగా తనకు ఎలాంటి ఇబ్బందులు రాలేదనీ, ఒకవేళ ఒత్తిడి వచ్చినా తప్పుకునేవాడిని కాదని తెలిపారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. కోర్టుల్లో సీబీఐ దాఖలు చేస్తున్న కేసులు వీగిపోవడం, అంతర్గత కుమ్ములాటలు చూస్తుంటే సంస్థ విశ్వసనీయత దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు.

abn 10112018 3

తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు చెప్పాగానే చాలామంది.. ‘ఎందుకయ్య బురదలోకి దిగుతావు?’ అని ప్రశ్నించినట్లు జేడీ తెలిపారు. దీంతో తాను స్పందిస్తూ..‘మనం బురద అని దిగకుంటే ఆ బురద ఇంకా కంపు కొడుతుంది. మంచివాళ్ల మౌనం దేశానికి ప్రమాదకరం. మంచి చేయాలన్న తపన ఉంది. ఓపిక ఉంది. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా’ అని జవాబిచ్చినట్లు వెల్లడించారు. భావసారూప్యమున్నవాళ్లు ఎవరైనా రాగలిగితే వాళ్లతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేశానన్నారు. ఎవరూ రాకపోతే స్వతంత్రంగా ముందుకెళ్తాని, ఇబ్బందేమీ లేదన్నారు. చాలెంజ్‌గా ముందుకు వెళ్లడం తానకెప్పుడూ ఇష్టమని, అసాధ్యమేమీ కాదనే అభిప్రాయాలున్నాయని వివరించారు.

Advertisements

Latest Articles

Most Read