రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 151 సీట్లు ఉన్నాయి, తమకు తిరిగు లేదు అంటూ ఎగురుతున్న వైసీపీ పార్టీ, ప్రజల పై అనేక భారాలు మోపింది. ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, వ్యవసాయం దెబ్బతింది, మహిళలకు భద్రత లేదు, చివరకు రోడ్లు వేయటం కూడా రావటం లేదు. అప్పులు చేస్తే కానీ రోజు గడవని పరిస్థితి. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ, బాదుడే బాదుడు అనే కర్యకరమం పెట్టింది. ఈ కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది. చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమలో చేసిన పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఇక తరువాత వచ్చిన మహానాడు అన్నిటి కంటే హైలైట్. తెలుగుదేశం పార్టీ కూడా, అంత మంది వస్తారాని ఊహించలేదు. ఈ స్థాయిలో జగన్ పై వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి. మహానాడు మంచి కిక్ ఇవ్వటంతో, తెలుగుదేశం శ్రేణులు మంచి ఊపులో ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు మరో కిక్ ఇస్తుంది టైమ్స్ అఫ్ ఇండియా సర్వే. జగన్ పరిపాలన పై టైమ్స్ అఫ్ ఇండియా సర్వే చేయగా, అన్ని రంగాల్లో, జగన్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసారు. పరిపాలన, అవినీతి, మూడు రాజధానులు, స్థానిక ఎమ్మల్యేల పని తీరు, అభివృద్ధి, అప్పులు, ఎవరికి ఓటు వేస్తారు, ఇలా ప్రతి దాంట్లో జగన్ కు వ్యతిరేకంగా, టిడిపికి అనుకులంగా సర్వే ఫలితాలు వచ్చాయి. టైమ్స్ అఫ్ ఇండియా లాంటి దాంట్లోనే, జగన్ కు వ్యతిరేకత చూపించారు అంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
news
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో, దిమ్మ తిరిగే వాస్తవం.. పోలీసులు పై అనుమానాలు..
దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హ-త్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని ఈ రోజు రాజమండ్రి కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు. ఈ రోజు తో ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా పూర్తవుతుంది. అయితే ఈ రోజు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ని, ఈ రోజు రాజమండ్రి కి సంబంధించిన SC , ST అట్రాసిటి కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. అయితే SC , ST అట్రాసిటి కోర్టుకు సంభందించిన న్యాయమూర్తి విధి నిర్వహణలో భాగంగా అమలాపురం వెళ్లినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో అనంత బాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు హాజరు పరుస్తారా లేదా అనేదిఉత్కంఠగా మారింది. అయితే ఇప్పటి వరకు అనంతబాబుని, పోలీసులు కస్టడీకి తీసుకోక పోవటం, అందరినీ ఆశ్చర్య పరిచింది. చిన్న చిన్న కేసులకు కూడా కస్టడీకి తీసుకునే పోలీసులు, అనంతబాబుని ఎందుకు కస్టడీకి తీసుకోలేదు అనేది ఎవరికీ అంతు బట్టటం లేదు. మరో పక్క అనంతబాబు, ఇప్పటికే బెయిల్ పిటీషన్ వేసారు. మరి ఈ బెయిల్ వద్దు అని, పోలీసులు వాదిస్తారో లేదో చూడాలి.
టిడిపి నేత గౌతు శిరీష సిఐడి విచారణలో ట్విస్ట్ ఇచ్చిన ఏపి పోలీసులు...
మహానాడు సక్సెస్ తో, టిడిపి నేతలను టార్గెట్ చేస్తుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. వరుస పెట్టి నోటీసులు ఇస్తున్న సిఐడి పోలీసులు, ఇప్పుడు తెలుగుదేశం నేత గౌతు శిరీషను టార్గెట్ చేసారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారు అంటూ, గౌతు శిరీషకు సిఐడి నోటీసులు ఇచ్చి, ఈ రోజు విచారణకు రావలసిందిగా నోటీసులు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే ఈ రోజు శ్రీకాకుళం నుంచి అమరావతి వచ్చిన గౌతు శిరీష, ముందుగా, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకొని, అక్కడ నుంచి టిడిపి నేతలతో కలిసి డీజీపీ ఆఫీస్ కు వెళ్లారు. అయితే గౌతు శిరష రాకతో ఎలాంటి ఆవంచనీయ ఘటనలు జరగకుండా, డీజీపీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. అయితే టిడిపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని వారిని అడ్డుకున్నారు. శిరీషను మాత్రమే లోపలకు అనుమతి ఇచ్చారు. అయితే అనూహ్యంగా గౌతు శిరీష డీజీపీ ఆఫీస్ కి కాకుండా, గుంటూరులో ఉన్న సిఐడి ఆఫీస్ కు రావాలని, గౌతు శిరీషకు పోలీసులు సమాచారం ఇచ్చారు. భద్రతా కారణాల వల్ల, అక్కడకు రావాలని కోరారు. తమకు నోటీసుల్లో డీజీపీ ఆఫీస్ అని చెప్పారని, గుంటూరు రావాలి అంటే, మరో నోటీస్ ఇవ్వాలని, గౌతు శిరీష న్యాయవాది తేల్చి చెప్పారు. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ లోనే శిరీష ఉండటంతో, పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.
విజయవాడలో రెచ్చిపోయిన మంత్రి జోగి రమేష్ అనుచరులు...
భవానిపురంలోని పున్నమి హోటల్లో మంత్రి జోగి రమేష్ అనుచరుల టూరిజం శాఖ అధికారులపై దా-డి-కి పాల్పడారు. మంత్రి అనుచరులు విజయవాడ భవానీపురంలో ఉన్న పున్నమి హోటల్లో ఫొటో షూట్ తీస్తుండగా అక్కడకు వచ్చిన టూరిజం శాఖ అధికారులు , ఫొటో షూట్ కు పర్మిషన్ లేదని చెప్పటంతో మంత్రి వర్గీయులు అధికారుల పై తిరగాబడ్డారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ, అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా వారిపై దా-డి చేసారు. దీనితో భవానిపురం పోలీస్ స్టేషన్ లో టూరిజం శాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే మంత్రి జోగి రమేష్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చూపిస్తారో, లేక వదిలేస్తారో చూడాలి.