సామాన్య ప్రజలకేమో, కూటి కోసం కోటి పాట్లు... రాజకీయ నాయకులకేమో, ఓట్ల కోసం, కోటి పాట్లు... తెలంగాణాలో అయ్య కేసీఆరే ఏమో ఒక పక్క ఆంధ్రోళ్ళని అమ్మనా బూతులు తిడతాడు, కొడుకేమో వెళ్లి అదే ఆంధ్రోళ్ళకు వెన్న పూస్తాడు. ఇదే సందర్భంలో కూకట్‌పల్లికి వచ్చి, అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిస్కట్ వేస్తున్నాడు కేటీఆర్. చంద్రబాబుని కావాలని తిట్టటం లేదని, మాకు ఆయన పై ద్వేషం లేదని, కేవలం రాజకీయంగానే విమర్శలు చేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాతే, తెలుగు వారికి గుర్తింపు వచ్చిందని చెప్పారు. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత, ఎవరి బ్రతుకు వాళ్ళం బ్రతుకుతున్నామని, చంద్రబాబు మా దగ్గరకు వచ్చి, తెలుగు వారు అందరూ కలిసి ఉందాం అని మాతో పొత్తుకు వస్తే కూడా, ఇదే చెప్పమని చెప్పారు కేటీఆర్.

ktr 29102018 2

మరో పక్క ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పై కూడా కేసీఆర్ బిస్కట్ వేసే ప్రయత్నం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని నిర్మించుకోవాలని అక్కడి ప్రభుత్వం తలంచిందని, ఇందులో భాగంగా రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులను, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానించిందని గుర్తుచేశారు. ఆ సందర్భంగా అమరావతి నిర్మాణానికి రూ.100 కోట్లు ప్రకటించాలని మంత్రివర్గం సమ్మతితో కేసీఆర్ నిర్ణయించారని కేటీఆర్ వెల్లడించారు. సంతోషంగా అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లారని, అక్కడ ఆయనకు సాదర స్వాగతం లభించిందన్నారు. శంకుస్థాపన సందర్భంగా ఏపీ ప్రభుత్వం బహిరంగ సభను ఏర్పాటు చేసిందని, ఆ సభలో కేసీఆర్‌ను తొలుత ప్రసంగించాల్సిందిగా కోరారని గుర్తుచేశారు.

ktr 29102018 3

అప్పటికే వంద కోట్లు ప్రకటించాలని నిర్ణయంతో ఉన్న కేసీఆర్.. తొలుత కేంద్రం ఏం ఇస్తుందో తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి సెక్రెటరీని సంప్రదించారని చెప్పారు. ఏపీకి ప్రధాని ఎంత ప్రకటిస్తున్నారని అడగగా మట్టి, నీళ్లు మాత్రమేనని వారి నుంచి సమాధానం వచ్చిందన్నారు. దీంతో చేసేదేమీ లేక.. కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు. ఒకవేళ తాను వంద కోట్లు ప్రకటించి.. ప్రధాని మోదీ ప్రకటించకపోతే వివాదం రాజుకుంటుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు కేటీఆర్ వివరించారు. ఇదంతా అక్కడ ఉన్న ఆంధ్రా వాళ్ళని మంచి చేసుకోవటానికి కేటీఆర్ చెప్పారు. అయితే ఇంత విశాల హృదయం ఉన్న కేసీఆర్, ఆంధ్రా కరెంటు బాకీలు అయిన 5 వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు ? ఉమ్మడి ఆస్తుల విభజన గురించి ఎందుకు ఒక్క మాట మాట్లాడటం లేదు ? అమరావతి పై ఎందుకు హేళన చేస్తున్నారు ? ఇవన్నీ ప్రజలు మర్చిపోతారని కేటీఆర్ భావన అనుకుంటా. సరే డిసెంబర్ 11 దాక ఎదురు చూడండి.

జగన్ పై కోడి కత్తి దాడి, కామెడీ అవ్వటంతో, దీన్ని కొంచెం సీరియస్ చేసి, ఏపిలో అసలు శాంతి బధ్రతలు లేవు అని ప్రొజెక్ట్ చెయ్యటానికి వైసీపీ రెడీ అయ్యింది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ భారీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో శాంతిభద్రతలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అందువల్ల రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్‌తో ఆ పార్టీ పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా వైసీపీ నేతల బృందం కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసింది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గతంలో రాజీనామా చేసిన ఐదుగురు లోక్‌సభ ఎంపీలు హోం మంత్రితో సమావేశమయ్యారు.

ycp 29102018

ఈ నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్‌ పై జరిగిన కోడి కత్తి దాడి పై విచారణ జరిపించాలని, ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని జగన్‌తో సహా ఆ పార్టీ నేతలంతా పదేపదే రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్‌ మీద దాడి ఘటనపై కేంద్రసంస్థలతో దర్యాప్తు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు తమ పరిధిలోకి రాదని సీఎం చంద్రబాబు అన్నారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంలేని సంస్థ ద్వారా దాడిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకంలేదనే విషయాన్ని రాజ్‌నాథ్‌తో వివరించిన వైసీపీ నేతలు చెప్పారు. తమ విన్నపాల పట్ల రాజ్ నాథ్ సానుకూలంగా స్పందించారని... జగన్ కేసును పరిశీలిస్తానని చెప్పారని తెలిపారు.

ycp 29102018

ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రపతి రాజ్‌నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ కోరినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే అపాయింట్‌మెంట్‌పై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇవాళ సాయంత్రం లేదా మంగళవారం రాష్ట్రపతితో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తేవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టే దిశగా నేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు వినికిడి. జగన్‌పై జరిగిన దాడి ఘటనపై సీఎస్‌ఎఫ్ చూసుకుంటుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వైసీపీ మాత్రం దాడి ఘటనను ఏపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు వైసీపీ నేతలు ఢిల్లీలోనే మకాం వేసి కేంద్రమంత్రులు, ఇతర నేతలను కలిసి ఇదే అంశాన్ని వారి దృష్టికి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం.

కోడి కత్తితో గుచ్చించుకున్న తరువాత, జగన్ మోహన్ రెడ్డి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడ 0.5 cm గాయానికి, 9 కుట్లు వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోడి కత్తి గుచ్చుడు గురించి, విచారణ నిమిత్తం, విశాఖ పోలీసులు, తెలంగాణా వెళ్లి, అక్కడ జగన్ మోహన్ రెడ్డి వాంగ్మూలం కోసం ప్రయత్నం చేయగా, నేను ఆంధ్రా పోలీసులని నమ్మను, తెలంగాణా పోలీసులని మాత్రమే నమ్ముతాను అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, జగన్ నంచి నుంచి వాగ్మూలం తీసుకోవలసి ఉందని విశాఖ పోలీసు కమిషనర్‌ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. అందుకే తమ వద్ద హాజరుకావాలని సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద ఆయనకు నోటీసులు అందజేశామని వెల్లడించారు. ఇదే విషయంతో రిజిస్టర్ పోస్టులో, జగన్ కు నోటీస్ పంపించనట్టు చెప్పారు.

jagan 291020181 2

దాడిచేసిన నిందితుడు శ్రీనివాసరావును ఆదివారం ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్లో ఏడు గంటలు విచారించిన అనంతరం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వం నియమించిన సిట్‌ అధికారులు హైదరాబాద్‌ వెళ్లి జగన్‌ వాగ్మూలం తీసుకునేందుకు నోటీసు ఇచ్చి ప్రయత్నిస్తే ఆయన నిరాకరించారు. అదే విషయాన్ని రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచాం. విచారణకు జగన్‌ స్వయంగా లేదా ఆయన ప్రతినిధి ద్వారా హాజరై వాగ్మూలం ఇవ్వాలని కోరుతూ రిజిస్టర్‌ పోస్టు ద్వారా మరోసారి నోటీసు పంపించాం. అప్పటికీ నిరాకరిస్తే.. న్యాయపరంగా ఏం చేయాలన్న దానిపై పరిశీలిస్తాం’ అని చెప్పారు. ఈ ఘటనపై సిట్‌తోపాటు ఆరు ప్రత్యేక బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నాయన్నారు. శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న తొలిరోజే ఆదివారం సుమారు ఏడు గంటల పాటు విచారించామన్నారు.

jagan 291020181 3

శ్రీనివాసరావు విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నప్పటికీ అతడు చెప్పివన్నీ నిజమేనని తాము విశ్వసించడం లేదన్నారు. దాడికి కారణంతోపాటు వెనుక ఎవరైనా ఉన్నారా అనేదానిపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని వివరించారు. ఆదివారం శ్రీనివాసరావుతోపాటు రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌, శ్రీనివాసరావుకు లేఖ రాయడంలో సహకరించిన విజయలక్ష్మి, రేవతీపతి, రెస్టారెంట్‌లో పనిచేస్తున్న రమాదేవి సహా 12 మందిని విచారించామని తెలిపారు. విజయలక్ష్మి, రేవతీపతి చేతిరాత సరిపోలిందన్నారు. అంతేకాకుడా ఆ లేఖను శ్రీనివాసరావు చెబితే తాము రాసినట్లు ఇద్దరూ అంగీకరించారని వెల్లడించారు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్న వైసీపీ నేతలకు కూడా నోటీసు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరామన్నారు. శ్రీనివాసరావుకు ముమ్ముడివరం ఆంధ్రాబ్యాంకు, విజయా బ్యాంకు, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల్లో ఖాతాలు ఉన ్నట్లు గుర్తించామని.. వాటికి సంబంధించిన లావాదేవీల సమాచారం సోమవారం తమ చేతికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం గుంటూరులో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. టీడీపీ నేత, ఎల్వీఆర్‌ క్లబ్‌ కార్యదర్శి కోవెలమూడి రవీంద్ర ఇంట్లో తనిఖీలు చేపట్టారు. రవీంద్ర ఇల్లు, కార్యాలయంతో పాటు అతిథి గృహంలోనూ సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 కార్లలో వచ్చిన ఐటీ అధికారులు రవీంద్రకు చెందిన పలు దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రవీంద్ర గ్యాస్‌, పెట్రోల్‌ బంకులు నిర్వహిస్తున్నారు. గత పదిరోజుల క్రితం జిల్లాలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఇప్పుడు ఏకంగా టీడీపీ మద్దతు దారుల కార్యాలయాలపై సోదాలు చేపట్టింది. తొలుత వ్యాపార సంస్థలపై దాడులు చేసిన అధికారులు, రెండో విడతలో టీడీపీ మద్దతుదారులు, వారి వ్యాపారసంస్థలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

it 29102018 2

సాయంత్రంలోపు మరొకొందరు టీడీపీ సానుభూతిపరుల పై ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం, మరో మారు, పెద్ద ఎత్తున అధికారులు, అమరావతి చేరుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ సారి ముసుకులో గుద్దులాట లేకుండా, డైరెక్ట్ గా తెలుగుదేశం నాయకుల పై విరుచుకుపడనున్నట్టు తెలుస్తుంది. మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వాయించటం, మాయవతిని కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేలా చేసి, బీజేపీకి రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో దెబ్బ వెయ్యటానికి చంద్రబాబు వ్యూహం పారిన నేపధ్యంలో, మోడీ-షా, ఇక చంద్రబాబు పై డైరెక్ట్ యుద్ధం చేయ్యనున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే, ఈ రోజు రాష్ట్రంలో మరోసారి ఐటి దాడులు జరుగుతున్నాయి. ఈ సారి, డైరెక్ట్ గా తెలుగుదేశం నేతలనే టార్గెట్ చేస్తున్నారు.

it 29102018 3

మూడు రోజుల క్రితం, పోలవరం పనులు చేస్తున్న నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎన్‌ఈసీఎల్‌) కార్యాలయాల్లో సోదాలు చేసారు. ఈ కంపెనీ నిర్వహిస్తున్న నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం ఓడరేవులో అధికారులు తనిఖీ చేశారు. గత ఏడాది ఈ ఓడరేవు నుంచి విదేశాలకు ఖనిజాలు, ఇతర సరకులు భారీగా ఎగుమతి అయ్యాయి. తిరుపతి నుంచి వచ్చిన ఆదాయపన్ను శాఖ సహాయ సంచాలకులతోపాటు ముగ్గురు అధికారులు ఇక్కడ పరిశీలించారు. విశాఖ ద్వారకానగర్‌లో ఉన్న నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ కార్యాలయానికి కూడా వెళ్లి ప్రాజెక్టుల రికార్డులను తనిఖీ చేశారు. తెలంగాణలోనూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉన్న నవయుగ కార్యాలయంలో కూడా దాడులు జరిగాయి. అయితే అక్కడ చివరంగా ఏమన్నా దొరికాయా అనే విషయం మాత్రం ఐటి అధికారులు చెప్పకుండా వెళ్ళిపోయారు.

Advertisements

Latest Articles

Most Read