విజయవాడ నుంచి సింగపూర్‌కు డిసెంబరు 4నుంచి విమాన సర్వీసులు నడపనున్నట్టు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. శుక్రవారం విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్‌ గిరి మధుసూదనరావుకు క్లియరెన్స్‌ రిపోర్టు ఇవ్వడంతో పాటు సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేపట్టింది. తొలుత వెబ్‌పోర్టల్‌లో రూ.8,112గా ఉన్న ప్రారంభ ధర గంట తర్వాత రూ.7,508కి తగ్గింది. విజయవాడ నుంచి 180సీట్లతో కూడిన ఎయిర్‌బస్‌ 320, 321 నాన్‌స్టాప్‌ విమాన సర్వీసును అందుబాటులోకి తేనుంది. మంగళ, గురువారాల్లో సాయంత్రం 6.40గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే విమానం తెల్లవారుజామున 2గంటలకు సింగపూర్‌ చేరుకుంటుంది.

singapore 27102018 2

ఏడాదిన్నర కిందట గన్నవరం విమానాశ్రయానికి కేంద్రం అంతర్జాతీయ హోదాను కల్పించింది. ఆరు నెలల్లో అంతర్జాతీయ సర్వీసులు గాలిలోకి లేస్తాయని ప్రకటించారు. కానీ.. అనేక ఆటంకాలను దాటి ఇన్నాళ్లకు అంతర్జాతీయ కలను సాకారం చేసుకునే రోజొచ్చింది. ఈనెల 25నే సింగపూర్‌కు తొలి సర్వీసును నడపాలని అధికారులు భావించినా.. కస్టమ్స్‌ అనుమతుల జాప్యంతో వాయిదా పడింది. డిసెంబర్‌ 4వ తేదీకి వాయిదా వేశారు. ఇండిగో తన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసుకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాన్ని ఆరంభించింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు నాలుగున్నర గంటల్లో చేరిపోయేలా శీతాకాల షెడ్యూల్‌ను ఇండిగో ప్రకటించింది.

singapore 27102018 3

విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్లేందుకు, అటు నుంచి వచ్చేందుకు వారంలో రెండు రోజులు అక్కడ, ఇక్కడ అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోనికి వచ్చాయి. రూ.18వేల లోపే సింగపూర్‌కు వెళ్లి వచ్చేందుకు టిక్కెట్‌ ధరలు అందుబాటులో ఉన్నాయి. సింగపూర్‌కు విమాన సర్వీసును డిసెంబర్‌ 4 నుంచి నడపనున్నట్టు ఇండిగో సంస్థ క్లియరెన్స్‌ ఇచ్చి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేపట్టడంతో గత అర్థ సంవత్సరకాలంగా నెలకొన్న ప్రతిష్ఠంబన ఎట్టకేలకు వీడింది. అంతర్జాతీయ హోదా వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా, విదేశానికి విమానం ఎగరలేదన్న అపప్రద కూడా తొలగిపోయింది. సింగపూర్‌కు విమాన సర్వీసు బుకింగ్‌ కాగానే మనవాళ్ళు ఉత్సాహంతో బుకింగ్‌ చేసుకుంటున్నారు. వాస్తవానికి సింగపూర్‌ కంటే దుబాయ్‌కు మన దగ్గర నుంచి డిమాండ్‌ బాగా ఉంది. దుబాయ్‌కు కూడా విమాన సర్వీసు నడపాలన్న ఆలోచనతో ఏడీసీఎల్‌ ఉండటంతో ఈ సర్వీసుపై కూడా ఆశలు కలుగుతున్నాయి.

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. శనివారం ఉదయం హస్తినకు బయల్దేరి వెళ్లిన ఆయన తొలుత తెదేపా ఎంపీలతో ఏపీ భవన్‌లో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబుతో లోక్‌తంత్రిక్‌ జనతాదళ్‌ వ్యవస్థాపకుడు శరద్‌ యాదవ్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సమావేశమయ్యారు. జాతీయ సమస్యలపై మరియు ప్రస్తుతం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశత్వ పాలనపై చర్చించారు. దేశ ప్రజలందరూ కలిసి రాజ్యాంగాన్ని కాపాడాలని సూచించారు.

cbn delhi 27102018 2

మరి కాసేపట్లో, జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాతోనూ కాసేపట్లో సీఎం భేటీ కానున్నారు. అనంతరం ఈ మధ్యాహ్నం 3 గంటలకు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడతారు. ఏపీకి కేంద్రం మొండిచేయి చూపడం, విభజన చట్టం పెండింగ్‌ అంశాలతో పాటు ఏపీలోని రాజకీయ పరిణామాలు, తెదేపా లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులను చంద్రబాబు ప్రస్తావించనున్నారు. రఫేల్‌ అంశంతో పాటు సీబీఐ వ్యవహారాలపైనా మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ‘డెమోక్రసీ ఇన్‌ డేంజర్‌.. టార్గెట్‌ ఏపీ’ పేరుతో సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

cbn delhi 271020183

చంద్రబాబుని కలిసిన తరువాత, కేజ్రివాల్ ట్వీట్, చేసారు. "Had a gud meeting wid Sh Chandrababu Naidu ji. Sh Sharad Yadav ji was also present for a while. Discussed national issues. Present BJP govt is a threat to the nation n to the Constitution. People across India will need to join hands to save India n the Constitution"

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం అనేక ఇబ్బందులు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క ఐటి దాడులు, మరో పక్క రాజకీయ కుట్రలు, ఇలా అన్ని వైపుల నుంచి, వస్తున్నారు. వీటి పై చంద్రబాబు స్పందించారు. నిన్న జరిగిన కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలు మాట్లాడుతూ, కేంద్రం చేస్తున్న ఇబ్బందులు చెప్పుకొచ్చారు. మనకు రావాల్సిన హక్కులు అడుగుతుంటే, ఇలా చేస్తున్నారని, కుట్రలు చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. వైజాగ్ ని టార్గెట్ చేస్తూ, వందల మంది ఐటి అధికారులు వచ్చారని, వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టే కుట్రలో భగంగా ఇవన్నీ చేస్తున్నారని అన్నారు.

moditarget 27102018

ఒక పక్క ఫిన్ టెక్ సదస్సు, ఒక పక్క క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ప్రపంచం ఫోకస్ ఇక్కడ ఉన్న టైంలో, కావాలని కుట్ర పన్ని, ఐటి దాడులు చేసారు. ఇక్కడ ఎదో జరుగుతుందని, అందరి ఫోకస్ వైజాగ్ మీద పెట్టారు, అందరి ఫోకస్ ఈ సిటీ మీద ఉండగా, కోడి కత్తి డ్రామా ఆడారు అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. వీళ్ళు ఇక్కడితో ఆగారు, ఇంకా చాలా చేస్తారు, నేను అన్నటికీ సిద్ధపడుతున్నా అని అన్నారు. వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ పోలవరం పై పడింది. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా, పనులు జరుగుతున్నాయి అని కసితో, నవయుగ పై ఐటి దాడులు చేసారు అని చంద్రబాబు అన్నారు.

moditarget 27102018

నవయుగ లాభాల కోసం పనులు చేయడం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి మంచిదనే ఉద్దేశంతో నవయుగ నష్టాలొచ్చిననా పనిచేస్తోందని చెప్పారు. జనవనరులశాఖ సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ ‘‘నవయుగ వంటి సంస్థ పై దాడులు చేస్తే వారికి ఎటువంటి ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోగలం. దీని వల్ల పోలవరం పనులకు ఆటంకం కలగకూడదని భావిస్తున్నాం. పోలవరం పనులపై ముందుకు వెళ్లాలనేదే మా ఆకాంక్ష. ఐటీ దాడులు చేసి అందరినీ భయపెట్టాలని చూస్తున్నారు. దీనివల్ల ప్రాజెక్టుకు ఏం ఇబ్బంది వస్తుందో తెలియదు’’ అని చంద్రబాబు ఆరోపించారు.

డీజీపీ ఆర్పీ ఠాకూర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దళవాయి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని పోలీసు అసోసియేషన్‌ తరఫున ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. సంఘటన జరిగినప్పుడు లభించిన సాక్ష్యాధారాలను బట్టి వాస్తవాలు పోలీసులు చట్టబద్ధంగా వెలుగులోకి తీసుకువస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో డీజీపీపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చట్ట ప్రకంగా వెళ్తామని వార్నింగ్ ఇచ్చారు.

vsreddy 27102018 2

డీజీపీ పరీక్షలు రాస్తూ ఉంటే ఆయన చిట్టీలు అందించారా అని ప్రశ్నించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విజయసాయి డీజీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ‘డీజీపీ.. టీడీపీ కార్యకర్తవా? కాపీ కొట్టి ఐపీఎస్‌ పాసయ్యావా?’ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్‌పై జరిగిన దాడిమీద స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన వ్యక్తి జగన్‌కు అభిమానిగా పేర్కొంటూ.. ఉద్దేశపూర్వకంగా అతను దాడి చేయలేదని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. డీజీపీకి మతి భ్రమించినట్టుందని వ్యాఖ్యానించారు.

vsreddy 27102018 3

మరో పక్క ఏపీ పోలీసులపై ప్రతిపక్ష నేత జగన్‌కు నమ్మకం లేదనడం దురదృష్టకరమని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వ్యాఖ్యానించారు. జగన్‌ పై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించిందన్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతోందని తెలిపారు. జగన్‌ పోలీసులకు సహకరించకుండా.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం దురదృష్టకరమన్నారు. ఒక పక్క విజయసాయి రెడ్డి డీజీపీని అలా అంటుంటే, జగన్ ఏపి పోలీసుల్ని ఇలా అంటున్నారని అన్నారు. జగన్‌ విశాఖలో వైద్యం చేయించుకోకుండా హైదరాబాద్‌ ఎందుకు వెళ్లారు?అని అడిగారు. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేస్తే గవర్నర్ స్పందించలేదన్నారు. అలాంటిది జగన్‌పై దాడి జరిగిన వెంటనే గవర్నర్.. డీజీపీకి ఫోన్ చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read