ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నానని, అయితే జరిగిన విధానమే ఎవరికైనా సందేహం కలిగించేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని విపక్ష నేతలు చేసిన విమర్శలపై మండిపడ్డారు. జగన్‌పై ఆయన సొంత పార్టీ కార్యకర్త దాడికి పాల్పడితే దానిని అడ్డుపెట్టుకొని అనేక శక్తులు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహించారు. గురువారం రాత్రి చంద్రబాబు మీడియాతో ఈ అంశంపై మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. మునుపెన్నడూ లేనట్లుగా కఠిన స్వరం వినిపించారు. నేను కేంద్రంతో పోరాడుతున్నాని, అందరితో కలిసి కుట్రలు పన్ని, ఏకంగా రాష్ట్రాన్నే నాశనం చెయ్యాలని చూస్తున్నారు, నేను నేను భయపడటం లేదు, రాష్ట్రం కోసం సిద్ధపడుతున్నా,ఎన్ని కుట్రలు చేసిన నేను రెడీ అని చంద్రబాబు అన్నారు.

ready 26102018 2

‘దాడి జరిగింది వైకాపా అధ్యక్షుడిపై .. చేసింది ఆ పార్టీ వీరాభిమాని.. ఘటన జరిగిన ప్రాంతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో.. నెపం తెలుగుదేశంపై వేస్తారా? ఇదేం దుర్మార్గం..! తమాషాలాడుతున్నారా? మీ ఆటలు నా దగ్గర సాగవు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..’ అని తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. ‘విమానాశ్రయంలో కేంద్ర ప్రభుత్వ బలగాల భద్రత ఉంటుంది.. దాడి జరిగిన వెంటనే వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. ఇక్కడ మాత్రం సాయంత్రం 4.30 గంటలకు ఫిర్యాదు ఇచ్చారు.. అప్పటికీ దాడికి ఉపయోగించిన చిన్న కత్తిని స్వాధీనం చేయలేదు. కొంత సమయం దగ్గర పెట్టుకుని తర్వాత తెచ్చి ఇచ్చారు. దీనికి ఫొరెన్సిక్‌ పరీక్ష ఎలా సాధ్యమవుతుంది?’ అని ప్రశ్నించారు. ‘జరిగిన దాడి మెడికో లీగల్‌ కేసు. కేసున్నా, లేకున్నా సంఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలి. జగన్‌ మాత్రం బాధ్యతా రాహిత్యంగా విమానంలో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు’ అని చంద్రబాబు విమర్శించారు.

ready 2610201 3

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విమానాశ్రయంలో ఘటన జరిగింది. దానికి మా బాధ్యత ఉండదు. కానీ, విశాఖలో వంద మంది వైసీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేశారు. పులివెందులలో ఫ్లెక్సీలు తగలబెట్టారు. విశాఖలో క్రికెట్‌ పోటీలు జరుగుతున్నాయి. ఫిన్‌టెక్‌ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. వారందరూ తిరిగి వెళ్లే సమయంలో ఇవన్నీ చేశారు. ఇటువంటి సంఘటనలు సృష్టించడం దేనికి? ఈ రాష్ట్రానికి ఎవరూ రాకుండా చేయాలని ప్రయత్నమే కదా?’’ అని నిలదీశారు. ఎవరో భయపెడితే తాను భయపడేవాడిని కానని, దేనిని ఎలా ప్రతిఘటించి నిలబడాలో బాగా తెలిసిన వాడినని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. కేంద్రంలో బీజేపీ నుంచి విడిపోగానే కుట్రలు మొదలయ్యాయన్నారు. ‘‘మేం బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఐటీ దాడులు లేవు. హోదా కోసం పోరాటం మొదలుపెట్టగానే అన్నీ మొదలయ్యాయి. జీవీఎల్‌ నుంచి జగన్‌ వరకూ... కేసీఆర్‌ నుంచి పవన్‌ వరకూ మాపై కమ్ముకొస్తున్నారు. వారు చేసే తప్పులు వారికే ఎదురు తిరుగుతాయి. ప్రజలు రోజూ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపకపోవచ్చు. కానీ, మనసులో ఉంచుకొంటారు. తగిన సమయంలో తీర్పు చెబుతారు’’ అని స్పష్టం చేశారు.

వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ప్రతిపక్ష నేత జగన్‌‌పై దాడి నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీకి ఫోన్ చేయడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నేరుగా డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. ఏమైనా వివరాలు కావాల్సి ఉంటే నేరుగా తనకు చేయాలి, కానీ డీజీపీకి ఎలా చేస్తారని చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలిసారి తాను గవర్నర్‌పై స్పందిస్తున్నానని చెప్పారు. అసలు గవర్నర్‌ పాత్ర ఏమిటి? పరుధులు ఏంటి ? ఏమి చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పాలనలో వేలుపెట్టే అధికారం గవర్నర్‌కు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో గవర్నర్‌ వ్యవస్థపైనే పోరాడామని గుర్తు చేశారు. ఎవరి తరపున ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసని, ఢిల్లీ స్క్రిప్టు ఇక్కడ అమలు చేయాలనుకుంటే కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

govenmer 26102018 2

‘‘నేను ఎప్పుడూ గవర్నర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నా. జగన్‌పై ఆయన పార్టీ కార్యకర్త దాడి చేసిన ఘటన జరిగి ఒక గంట కూడా గడవక ముందే గవర్నర్‌ రాష్ట్ర డీజీపీకి ఫోన్‌ చేశారు. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీకి ఆయన ఎలా ఫోన్‌ చేస్తారు? ఆయన ఏం అడిగినా రాష్ట్ర ప్రభుత్వాన్ని... నన్ను అడగాలి. నాతో మాట్లాడాలి. మా నుంచి సమాచారం తీసుకోవాలి. నేరుగా అధికారులకు ఫోన్‌ చేసి సమాచారం తీసుకొనే అధికారం ఆయనకు లేదు. ముఖ్యమంత్రిగా నా అనుభవం ఇప్పటికి పద్నాలుగేళ్లు! ఎవరి అధికారాల పరిధి ఏమిటో నాకు తెలుసు."

govenmer 26102018 3

"మేం ప్రతి వ్యవస్థను గౌరవిస్తాం. కానీ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కిందా లేదు. కేంద్రం, రాష్ట్రం రెండూ వేటికి అవి స్వతంత్ర అధికార పరిధి కలిగిన ప్రభుత్వాలు. ఎవరి అధికారాలు... పరిధులు వాటికి ఉన్నాయి. రిమోట్‌ కంట్రోల్‌తో మమ్మల్ని పరిపాలించలేరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్‌ తన పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తే సీనియర్‌ రాజకీయవేత్తగా తన లాంటి వాడు కూడా ప్రశ్నించకపోతే మరెవరు ప్రశ్నిస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు." ఢిల్లీ స్క్రిప్టును రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తే కుదరదని అన్నారు. గవర్నర్ పై చంద్రబాబు ఇంత ఆగ్రహం వ్యక్తం చెయ్యటంతో, పరిస్థితులు ఎలా మారతాయో అనే ఆసక్తి నెలకొంది.

వైసీపీ అధినేత, ప్రతిపక్ష వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో, కోడి కత్తితో గుచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోనే అపోలో డాక్టర్ చేత ఫస్ట్ ఎయిడ్ ఇప్పించారు. జగన్ షర్టు మీద కూడా, ఒక చోట కొంచెం రక్తం ఉండటం చూసాం. వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, జగన్ కు 0.5 cm length & 0.5 cm depth ఉన్న గాయం అయ్యింది. ఫస్ట్ ఎయిడ్ చేసిన వెంటనే, జగన్ హైదరాబాద్ వెళ్లారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లారు. తరువాత కొంచెం సేపటకి మళ్ళీ ఇంటి నుంచి హాస్పిటల్ కు వెళ్లారు. ఇదంతా జరగటానికి దాదాపుగా 4-5 గంటల సమయం పట్టింది.

firstaid 25102018 2

అయితే వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో 0.5 cm ఉన్న దెబ్బ, హైదరాబాద్ లో హాస్పిటల్ కి చేరేసరికి 9 కుట్లు అయ్యే గాయం అయ్యింది. అంతేనా దీనికి మరలా ICU & 24 గంటల అబ్సెర్వేషన్, గంట గంటకు హెల్త్ బులిటెన్ అంటూ హడావిడి చేస్తున్నారు. చొక్కాకి చిల్లు పడలేదు కాని, చర్మానికి తొమ్మిది కుట్లు పడ్డాయి అంటూ, సాక్షి టీవీ హడావిడి చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారో, ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారో వారికే తెలియాలి. దెబ్బ తగిలిన తరువాత కూడా, జగన్ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ నిటారుగా నడుస్తూ చక్కగా వైజాగ్ నుంచి వెళ్లారు.

firstaid 25102018 3

అయితే హైదరాబాద్ హాస్పిటల్ లో చేరగానే మాత్రం, మంచానికి అడ్డం పడి, కళ్ళు మూసేసారు. దీంతో సాక్షి ఎమోషనల్ డ్రామా మొదలు పెట్టింది. జగన్ కు ఆపరేషన్ జరిగిందని, 9 కుట్లని, 24 గంటల అబ్సెర్వేషన్లో ఉంటే కాని చెప్పలేమని, స్పెషల్ డాక్టర్స్ వస్తున్నారని, ఇలా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. అయితే, భుజానికి గాయమైతే న్యూరో డాక్టర్లు ఏం చేస్తారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇలాంటి గాయాలకు వెళ్లాల్సింది అపోలోకో, మరో జనరల్ డాక్టర్ దగ్గరకో అయితే, జగన్ మాత్రం సిటీ న్యూరో సెంటర్ కు వెళ్లారు. ఈ హాస్పిటల్ కడపకు చెందిన వారిదని, జగన్ బంధువులుదని తెలుస్తుంది. మొత్తానికి, ఇలా రక్తి కట్టిస్తున్నారు. రేపు అయినా పాపం జగన్ ని ఇంటికి పంపిస్తారో, లేక మెరుగైన వైద్యం కోసం, అమెరికా పంపించాలి అంటారో.

ఇష్టం వచ్చినట్టు, స్వతంత్రంగా పని చేస్తున్న వ్యవస్థల్లో, తలదూర్చి, వ్యవస్థలను నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ఈ రోజు సుప్రీంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను అర్ధ రాత్రి హడావుడిగా విధుల నుంచి తప్పించినప్పటికీ సుప్రీంకోర్టు ఎంత వరకు ఆమోదిస్తుందన్న అనుమానం ఇప్పుడు బీజేపీ నేతలను తొలిచేస్తోంది. మంగళవారం అర్ధరాత్రి మొదలైన నాటకీయ పరిణామాలకు కొనసాగింపుగా అన్నట్లు గురువారం ఉదయం సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ ఇంటి వద్ద కలకలం చెలరేగింది. అక్కడ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)కి చెందిన నలుగురు సిబ్బంది తచ్చాడుతూ కనిపించడం మరో దుమారానికి దారితీసింది. అర్ధరాత్రి వేళ తన అధికారాలను ఉపసంహరించి, సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

cbi 24102018 1

దీనిపైనే అందరి కళ్లూ కేంద్రీకృతమయ్యాయి. ఈ నేపథ్యంలో సీబీఐ అధికార ప్రతినిధి నిన్న హడావిడిగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సీబీఐ డైరెక్టర్‌గా వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌గా అస్థానా కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. వారిని పదవుల నుంచి తొలగించలేదని, కొత్తగా నియమితులైన నాగేశ్వరరావుకు డైరెక్టర్‌ బాధ్యతలే అప్పగించామని, హోదా ఇవ్వలేదంటూ తేల్చిచెప్పారు. సీబీఐలో ముసలంపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శల వాడిని పెంచారు. మరోవైపు సీబీఐలోని పలువురు అధికారులపై ప్రత్యేక బృందం(సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని గురువారం ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

cbi 24102018 1

ఈ రోజు సుప్రీం విచారణ పై, దాదాపు రెండు దశాబ్దాల క్రితం వినీత్ నారాయణ్ కేసులో ఎదురైన అనుభవమే ఎక్కడ ఎదురవుతుందోనని బీజేపీ నేతలు భయపడుతున్నారు. ఆ కేసులో కేంద్రానికి మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు సీబీఐలో రాజకీయ జోక్యాన్ని నిరోధించాలని తీర్పు ఇచ్చింది. అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ సీబీఐ డైరెక్టర్‌కు పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా రెండేళ్ల పదవీ కాలాన్ని నిర్ణయించింది. అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉండడంతో బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. అలోక్ వర్మ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం నిజానికి 1997 నాటి సుప్రీం తీర్పుకు పూర్తిగా వ్యతిరేకమైనది. వర్మను పక్కనపెట్టినప్పుడు కొలీజియం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయం నేడు కోర్టులో ప్రస్తావనకు వస్తే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

Advertisements

Latest Articles

Most Read