విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తితో జగన్ ను గుచ్చిన ఘటన పై వైసీపీ అధినేత జగన్ స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ బృందంలో అదనపు డీసీపీ మహేంద్రపాత్రుడు, ఏసీపీ నాగేశ్వరరావు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయితే సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు జగన్ వద్దకు వెళ్ళగా, జగన్ వారికి షాక్ ఇచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే ముందు జగన్ స్టేట్మెంట్ను రికార్డు చేయాలని సిట్ బృందం భావించింది. కానీ.. ఏపీ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. ఏపీ పోలీసుల పై తనకు నమ్మకం లేదని స్పష్టం చేసిన జగన్.. తెలంగాణ పోలీసులైన సమస్య లేదని చెప్పినట్టు తెలిసింది.
అయితే జగన్ నాకు ఏపి పోలీసులు వద్దు, కేవలం తెలంగాణా పోలీసులే కావలి అని చెప్పటంతో, జగన్ కు ఏపి పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఆంధ్రా అసెంబ్లీ మీద జగన్ కు నమ్మకం ఉండదు, ఆంధ్రా రాజధాని అమరావతి పై నమ్మకం ఉండదు. ఆంధ్రా పోలీసుల పై నమ్మకం ఉండదు, కాని ఆంధ్రాలో సియం పోస్ట్ మాత్రం కావలి. 12 జిల్లాల్లో, 3 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు, నువ్వు తెలంగాణావాడి వైనా, ప్రతి వారం హైదరాబాద్ నీ ఇంటికి వెళ్లి వస్తున్నా, ఆంధ్రా పోలీసులు మాత్రం, నీ మీద ఈగ కూడా వాలనివ్వలేదు. అలాంటి ఆంధ్రా పోలీసులని, నీ స్వార్ధ రాజకీయం కోసం, నమ్మకం లేదని చెప్తావా జగన్ ?
జగన్, నువ్వు ఆంద్రప్రదేశ్ ని అవమానిస్తున్నావు..నీకు చంద్రబాబు తో శతృత్వం ఉంటే ఉంచుకో, అది మీ ఇద్దరి మధ్య రాజకీయ ప్రత్యర్ధి గా చూస్తాం. కానీ, మా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క మాట అవమానకరంగా మాట్లాడితే అస్సలు సహించేది లేదు, ఆంధ్రప్రదేశ్ ని అభిమానించలేని, అవమానిస్తున్న నీకు ఆంద్రప్రదేశ్ సియం అయ్యే అర్హత ఉందో లేదో ఒకసారి ఆలోచించుకో జగన్. ఆంధ్రాలో ఎటువంటి ఇబ్బంది అడ్డంకులు లేకుండా వ్యాపారాలు చేసుకుంటావు, ఆంధ్రాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేస్తావు, చివరకు ఆంధ్రా కి ముఖ్యమంత్రి ని అవుతాను అంటావు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. నీ క్లారిటీ నీకు ఉంటే వారి క్లారిటీ వాళ్ళకి ఉంది. సరైన సందర్భంలో అన్నిటికీ సమాధానం చెప్తారు.