సెలవులో వెళ్లిన సీబీఐ మాజీ చీఫ్‌ అలోక్‌ వర్మ ఇంటి వద్ద, ఈ రోజు ఉదయం కలకలం రేగింది. అలోక్ వర్మ ఇంటి దగ్గర నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలోని ఆయన ఇంటి చుట్టూ సంచరిస్తుండటంతో భద్రతా సిబ్బంది వారిని బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు వీరిని ధీరజ్‌ కుమార్‌, అజయ్‌ కుమార్‌, ప్రశాంత్‌, వినీత్‌ కుమార్‌ గుప్తాగా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా తాము నిఘా వర్గాలకు (ఇంటిలిజెన్స్‌ బ్యూరో) చెందిన అధికారులమని వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించుకోనున్నారు.

ib 25102108 1

అయితే అలోక్ వర్మ వైపు ఉన్న వాళ్ళు చెప్పిన ప్రకారం, అలోక్ వర్మపై ఈ ఉదయం హత్యాయత్నానికి చేసిన ప్లాన్ విఫలమైందని, నలుగురు వ్యక్తులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐడీ కార్డులతో వచ్చి, అలోక్ వర్మ నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా, వారిపై సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి వారిని ఆపుతూ ఉండగానే, ఈ నలుగురూ, పలాయనం చిత్తగించేందుకు ప్రయత్నించారని, అక్కడే ఉన్న ఇతర సిబ్బంది, జవాన్లు, వారిని అడ్డగించి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. అలోక్ వర్మ ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకోగా, నిందితులను రోడ్డుపై పట్టుకుని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి.

ib 25102108 1

కాగా, అంతర్గత పోరు నేపథ్యంలో అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్థానాలను ప్రభుత్వం బుధవారం సెలవుపై పంపిన విషయం తెలిసిందే. వీరి స్థానంలో తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావును నియమించారు. సీబీఐ ప్రతిష్ఠను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. తనను అక్రమంగా తొలగించారంటూ సుప్రీంకోర్టులో అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. మరో పక్క, మోడీ ఎంతో భయపడుతున్నారని, అలోక్ వర్మ దగ్గర మోడీ గుట్టు అంతా ఉందని, అందుకే ఇంటలిజెన్స్ ను పంపించి, అలోక్ వర్మ ప్రతి కదిలక తెలుసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ డీఎస్సీ కొంచెం ఆలస్యమైన విషయం వాస్తవమే అని అన్నారు. అయితే ఎక్కువమందికి ప్రయోజనం కలిగేలా డీఎస్సీ ఉండాలని తెలిపారు. రేపు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టెట్ కమ్ టీఆర్‌టీ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. నవంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల వయో పరిమితి రెండేళ్లకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల వయో పరిమితి 49 ఏళ్లకు, జనరల్‌ కేటగిరీలో 42 నుంచి 44 ఏళ్లకు పొడిగించారు.

dsc 25102018 2

మొత్తం 7325 పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఇందులో పాఠశాల విద్యాశాఖకు 4341, మోడల్‌ స్కూల్స్‌కు 909, మున్సిపల్‌ స్కూళ్లకు 1100, గిరిజన సంక్షేమ పాఠశాలకు 800, ఏపీఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలలకు 175 పోస్టులు ఉంటాయి. కాగా.. ఈ 7325 పోస్టుల్లో 3666 ఎస్జీటీ, 1625 స్కూల్‌ అసిస్టెంట్‌, 452 లాంగ్వేజ్‌ పండిట్‌, 441 పీఈటీ, 556 టీజీటీ, 429 పీజీటీ, 77 ప్రిన్సిపాల్‌, 79 డ్రాయింగ్‌, డాన్స్‌ పోస్టులు ఉన్నాయి.

dsc 25102018 3

డీఎస్సీ షెడ్యూల్ వివరాలు: నవంబర్‌ 1 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ.. నవంబర్‌ 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక... నవంబర్‌ 29 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు.. నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు.. డిసెంబర్‌ 6, 11, 12, 13న డీఎస్సీ పరీక్షలు.. డిసెంబర్‌ 6, 11 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ రాత పరీక్ష (నాన్‌ లాంగ్వేజెస్‌).. డిసెంబర్‌ 12, 13 న పీజీ టీచర్స్‌ రాత పరీక్ష.. డిసెంబర్‌ 14, 26న టీచర్స్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ప్రిన్సిపల్స్‌ రాతపరీక్ష.. డిసెంబర్‌ 17న పీఈటీ, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌ అండ్‌ ఆర్ట్స్‌ , డ్రాయింగ్‌ రాత పరీక్ష... డిసెంబర్‌ 27న లాంగ్వేజ్‌ పండిట్స్‌ రాతపరీక్ష... డిసెంబర్‌ 28 నుంచి 2019 జనవరి 2 వరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ రాతపరీక్ష... నవంబర్‌ 1 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం..

 

 

రాష్ట్రంలో మరోసారి ఐటీదాడులు జరుగుతాయన్న సమాచారం తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖపట్నంలో రేపు భారీగా ఐటీ దాడులు జరిగే అవకాముందని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు విశాఖ నగరానికి చేరుకున్నారని, వారంతా వివిధ హోటళ్లలో బసచేసినట్లు సమాచారం. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ఐటీ అధికారులు వివిధ మార్గాల నుంచి విశాఖ చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని కీలక నేతలు, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలపై ఐటీ శాఖ అధికారులు దృష్టి పడినట్టు తెలుస్తోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి దాడులకు సిద్ధంగా ఉండాలని టీమ్ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చినట్లుగా తెలియవచ్చింది.

it 241020018 2

అయితే ఈ దాడులు జరుగుతున్న సందర్భం చూస్తే, మన రాష్ట్రం పై, ఢిల్లీ పెద్దలు ఎంత కక్ష కట్టారో అర్ధమవుతుంది. తెలుగుదేశం నాయకులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. అమరావతి, తిరుపతి, వైజాగ్ నగరాలని, చంద్రబాబు ఒక పధ్ధతి ప్రకారం అభివృద్ది వైపు పరుగులు పెట్టిస్తుంటే, మోడీ కావాలనే టార్గెట్ చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ టైములో, మోడీ నజర్ విశాఖపట్నం పై పడటానికి కారణం చెప్తూ, "విశాఖపట్నం కి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది...ఫింటెక్ రంగంలో ప్రపంచంలోనే 4వ ఉత్తమ వేదిక గా విశాఖ ఎదిగింది. ఐటీ కంపెనీలు అన్ని విశాఖకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశమే మోడీకి నచ్చలేదు. ఎలా ఆయినా అలజడి సృష్టించాలి...విశాఖ కి వస్తున్న వారిని భయబ్రాంతులకు గురిచేయ్యాలి, విశాఖపట్నం కి వస్తున్న కంపెనీలు అన్ని గుజరాత్ కి తరలించాలి అనే కుట్ర తో విశాఖపట్నం పై టార్గెట్ పెట్టాడు మోడీ" అంటూ ఓ సీనియర్ మంత్రి వాపోయారు.

it 241020018 3

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫింటెక్ ఫెస్టివల్ ఒక పక్క, మరో పక్క ఇండియా,వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో విశాఖ ని కొట్టాలి అని మోడీ ఆదేశించారు. దింతో విశాఖలో 20 ఐటీ బృందాలు దిగాయి..ఇతర రాష్ట్రాల బృందాలను కూడా విశాఖకి పంపారు మోడీ. అంతర్జాతీయ ప్రతినిధులు విశాఖ లో ఉన్న సమయంలోనే ఐటీ దాడుల వార్తలు వచ్చి...వారంతా ఆంధ్రప్రదేశ్ కి వచ్చే ఆలోచన విరమించుకోవాలి...అందరూ గుజరాత్ వెళ్లాలి అనేది మోడీ గారి ఆలోచన" అంటూ ఆ సీనియర్ మంత్రి చెప్పుకొచ్చారు. మొత్తానికి, విశాఖలో రేపు ఐటి వాళ్ళు ఏమి చేస్తారో చూడాలి.

ఏపీలో మరోసారి భారీగా తనిఖీలు చేసేందుకు ఐటీ శాఖ సన్నద్ధమైందనే వార్తలు నిన్నటి నుంచి హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ టార్గెట్ గా ఐటి అధికారులు రంగంలోకి దిగారు. విశాఖలో ఇప్పటికే తనిఖీలు ప్రారంభంకాగా, విజయవాడ, గుంటూరు, నెల్లూరులోనూ సోదాలు చేసేందుకు ఐటీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. విశాఖలోని ఎంవీపీ కాలనీలోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి సుమారు 50 వాహనాల్లో అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాలకు తనిఖీల నిమిత్తం బయలుదేరి వెళ్లారు. దువ్వాడ సెజ్‌లోని పలు గోదాముల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు లాజిస్టిక్‌ రంగంలో భారీ కంపెనీగా ఉన్న టీజీఐలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ సంస్థ తెలంగాణ తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ బంధువులకు చెందినదిగా తెలుస్తోంది.

it 241020018 2

మరో పక్క ట్రాన్స్‌వరల్డ్‌ బీచ్‌ శాండ్‌ కంపెనీలో సోదాలు జరుపుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలోనే వేచి ఉన్న మరికొన్ని బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసేందుకు కాసేపట్లో బయలుదేరనున్నాయి. ఆర్థికంగా, పారిశ్రామికంగా విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందిన విశాఖ నగరంలో కొందరు పన్ను సరిగా చెల్లించడం లేదన్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ శాఖాధికారులు దాడులు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఐటీ దాడుల ప్రచారం వివిధ రాజకీయ పక్షాల్లో కీలకంగా ఉన్నవారిలోనూ అలజడి రేపుతోంది.

it 241020018 3

మరో పక్క ఐటి దాడులకి వస్తున్న అధికారులు, ఏపిలో ముందుగానే ఎలా తెలుస్తుందో అని ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు, ఎక్కడ దాడులకు వెళ్లినా విషయాన్ని రహస్యంగా ఉంచే అధికారులు, ఏపికి వచ్చినప్పుడు మాత్రం ముందే బయటపడిపోయారు. ఐటీ అధికారులు బస చేసేందుకు హోటల్స్ లో ముందే గదులు బుక్ కాగా, వాటిలోకి అధికారులు వెళుతున్న వేళ, హోటళ్ల సిబ్బంది గుర్తింపు కార్డులు చూపాలని కోరడంతోనే వాళ్లు ఐటీ అధికారులన్న విషయం బయటకు వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు వచ్చి మకాం వేశారన్న వార్త పలు హోటళ్ల సిబ్బంది నుంచే బయటకు పొక్కినట్టు తెలుస్తోంది. మరో పక్క పెద్ద ఎత్తున ఇలా రావటం కూడా, స్టేట్ ఇంటలిజెన్స్ పసిగట్టేస్తుందని, అతి తక్కువ మంది వస్తే ఎవరికీ తెలియదని, కాని పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, ఇలా వందల మంది వెళ్ళాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read